30 జూన్, 2015

969. సవితా, सविता, Savitā

ఓం సవిత్రే నమః | ॐ सवित्रे नमः | OM Savitre namaḥ

సర్వలోకస్య జనకః సవితేత్యుచ్యతే హరిః తండ్రిగా సర్వలోకమును జనింపజేయు సర్వలోకైక జనకుడుగాన ఆ హరి సవితా అని చెప్పబడును.

:: శ్రీమద్రామాయణే యుద్ధకాణ్డే సప్తోత్తరశతతమస్సర్గః (ఆదిత్య హృదయ స్తోత్రమ్) ::
ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ ।
సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః ॥ 10 ॥

ఇతడు అదితి పుత్రుడు (ఆదిత్యః) జగత్సృష్టికి కారకుడు (సవితా) జనులు తమ తమ విధులను నిర్వర్తించుటకు ప్రేరణను ఇచ్చువాడు (సూర్యః) లోకోపకారము కొరకు ఆకాశమున సంచరించుచుండెడివాడు (ఖగః) వర్షముల ద్వారమున జగత్తును పోషించెడివాడు (పూషా) తన కిరణములచే లోకములను ప్రకాశింపజేయువాడు (గభస్తిమాన్‍) బంగారు వన్నెతో తేజరిల్లుచుండువాడు (సువర్ణసదృశః) అద్భుతముగా ప్రకాశించుచుండువాడు (భానుః) బ్రహ్మాండముల ఉత్పత్తికి బీజమైనవాడు (హిరణ్యరేతాః) చీకట్లను తొలగించుచు దివాసమయమున ప్రాణులను కార్యనిమగ్నులను కావించువాడు (దివాకరః).

सर्वलोकस्य जनकः सवितेत्युच्यते हरिः / Sarvalokasya janakaḥ savitetyucyate Hariḥ Since Lord Hari is the progenitor of all worlds, He is called Savitā.

:: श्रीमद्रामायणे युद्धकाण्डे सप्तोत्तरशततमस्सर्गः (आदित्य हृदय स्तोत्रम्) ::
आदित्यः सविता सूर्यः खगः पूषा गभस्तिमान् ।
सुवर्णसदृशो भानुः हिरण्यरेता दिवाकरः ॥ १० ॥

Śrīmad Rāmāyaṇa Book 6, Chapter 107 (Āditya Hr̥daya Stotra)
Ādityaḥ savitā sūryaḥ khagaḥ pūṣā gabhastimān,
Suvarṇasadr̥śo bhānuḥ hiraṇyaretā divākaraḥ. 10.

An off-spring of Aditi (आदित्यः/Ādityaḥ), the Progenitor of all (सविता/Savitā), Surya the sun-god and the Provocator of acts in people (सूर्यः/Sūryaḥ), the Courser in the sky (खगः/Khagaḥ), the Nourisher of all with rain (पूषा/Pūṣā), the One who illuminates the worlds (गभस्तिमान्/Gabhastimān), the Possessor of golden rays (सुवर्णसदृशः/Suvarṇasadr̥śaḥ), the Brilliant (भानुः/Bhānuḥ), having golden seed whose energy constitutes the seed of the universe  (हिरण्यरेताः/Hiraṇyaretāḥ) and the Maker of the day (दिवाकरः/Divākaraḥ).

भूर्भुवस्स्वस्तरुस्तारस्सविता प्रपितामहः ।
यज्ञो यज्ञपतिर्यज्वायज्ञाङ्गोयज्ञवाहनः ॥ १०४ ॥

భూర్భువస్స్వస్తరుస్తారస్సవితా ప్రపితామహః ।
యజ్ఞో యజ్ఞపతిర్యజ్వాయజ్ఞాఙ్గోయజ్ఞవాహనః ॥ 104 ॥

Bhūrbhuvassvastarustārassavitā prapitāmahaḥ,
Yajño yajñapatiryajvāyajñāṅgoyajñavāhanaḥ ॥ 104 ॥

29 జూన్, 2015

968. తారః, तारः, Tāraḥ

ఓం తారాయ నమః | ॐ ताराय नमः | OM Tārāya namaḥ

సంసారసాగరం విష్ణుస్తారయన్ తార ఉచ్యతే ।
ప్రణవప్రతిపాద్యత్వాద్ వా తార ఇతి కీర్త్యతే ॥

తన అనుగ్రహముతో జీవులను సంసార సాగరమునుండి దాటించును. లేదా తారః అనునది ప్రణవమునకు మరియొకపేరు. పరమాత్మ ప్రణవ రూపుడును, ప్రణవముచే చెప్పబడువాడును కనుక తారః అని చెప్పబడును.

338. తారః, तारः, Tāraḥ

संसारसागरं विष्णुस्तारयन् तार उच्यते ।
प्रणवप्रतिपाद्यत्वाद् वा तार इति कीर्त्यते ॥

Saṃsārasāgaraṃ viṣṇustārayan tāra ucyate,
Praṇavapratipādyatvād vā tāra iti kīrtyate.

By His grace He helps devotees cross the ocean of worldly existence. Or Tāraḥ also means Praṇava i.e., Oṃkāra. Since the Lord is Praṇava Himself and is also indicated by it, Tāraḥ is an apt name.

338. తారః, तारः, Tāraḥ

भूर्भुवस्स्वस्तरुस्तारस्सविता प्रपितामहः ।
यज्ञो यज्ञपतिर्यज्वायज्ञाङ्गोयज्ञवाहनः ॥ १०४ ॥

భూర్భువస్స్వస్తరుస్తారస్సవితా ప్రపితామహః ।
యజ్ఞో యజ్ఞపతిర్యజ్వాయజ్ఞాఙ్గోయజ్ఞవాహనః ॥ 104 ॥

Bhūrbhuvassvastarustārassavitā prapitāmahaḥ,
Yajño yajñapatiryajvāyajñāṅgoyajñavāhanaḥ ॥ 104 ॥

28 జూన్, 2015

967. భూర్భువఃస్వస్తరుః, भूर्भुवःस्वस्तरुः, Bhūrbhuvaḥsvastaruḥ

ఓం భుర్భువః స్వస్తరవే నమః | ॐ भुर्भुवः स्वस्तरवे नमः | OM Bhurbhuvaḥ svastarave namaḥ

భూర్భువస్వస్సమాఖ్యాని త్రయీసారాణి యాని చ ।
త్రిణి వ్యాహృతిరూపాణి శుక్రాణ్యాహుర్హి బాహ్యృచాః ॥
యత్రైర్హోమాదినా విష్ణుస్తరై ప్లవతేఽథవా ।
జగత్రయతి తద్భూర్భువస్వస్తరురుచ్యతే ॥
భూర్భువస్వర్నామ లోకత్రయ సంసారభూరుహః ।
భూర్భువస్వస్తరురితి ప్రోచ్యతే కేశవో బుధైః ॥
భూర్భువస్వరాఖ్యలోకత్రయమేతద్ధి వృక్షవత్ ।
వ్యాప్య విష్ణుస్తిష్ఠతీతి భూర్భువస్వస్తరుః స్మృతః ॥

'భూః,' 'భువః,' 'స్వహః' అను మూడు వ్యాహృతుల రూపముగలవియు, వేదత్రయ సారభూతములును అగు పవిత్ర బీజ భూత శబ్ద రూప తత్త్వములైన శుక్రములను అధ్యయమున చెప్పుచున్నారు. ఆ మూడు వ్యాహృతుల చేతను జగత్ త్రయము హోమాదికములను ఆచరించుచు సంసార సాగరమున మునుగక ఈద కలుగుచున్నది. ఆవలి వొడ్డును చేరుచున్నది. ఆ మూడు వ్యాహృతులకును, వాని అర్థములకును కూడ మూల భూత తత్త్వము కావున పరమాత్మునకు 'భూర్భువఃస్వస్తరుః' అను నామము సముచితమై ఉన్నది.

:: మనుస్మృతి తృతీయోఽధ్యాయః ::
అగ్నౌ ప్రాస్తాఽఽహుతిః సమ్య గాదిత్య ముపతిష్ఠతే ।
ఆదిత్యా సృష్టిర్ వృష్టే రన్నం తతః ప్రజాః ॥ 76 ॥

అగ్నియందు విధివిధానుసారముగ ప్రక్షిప్తమయిన ఆహుతి ఆదిత్యుని సన్నిధిని చేరియుండును. అట్లు ఆహుతిని గ్రహించిన సూర్యుని వలన వర్షము కురియుచున్నది. వర్షము వలన అన్నము ఉత్పన్నమగుచున్నది. అన్నము వలన ప్రజలు, ప్రాణులు ఉత్పత్తినొందుచు వృద్ధినందుచు ఉన్నారు.

లేదా 'భూర్భువః' అను లోకత్రయ రూపమగునది సంసార వృక్షము. అదియు వస్తు తత్త్వమున పరమాత్మునియందు ఆరోపితమగుటచే పరమాత్ముని కంటె వేరు కాదు.

లేదా 'భూర్భువః స్వః' అను లోకత్రయమును వృక్షమువలె వ్యాపించియున్నవాడు పరమాత్ముడు అని కూడ చెప్పవచ్చును.

भूर्भुवस्वस्समाख्यानि त्रयीसाराणि यानि च ।
त्रिणि व्याहृतिरूपाणि शुक्राण्याहुर्हि बाह्यृचाः ॥
यत्रैर्होमादिना विष्णुस्तरै प्लवतेऽथवा ।
जगत्रयति तद्भूर्भुवस्वस्तरुरुच्यते ॥
भूर्भुवस्वर्नाम लोकत्रय संसारभूरुहः ।
भूर्भुवस्वस्तरुरिति प्रोच्यते केशवो बुधैः ॥
भूर्भुवस्वराख्यलोकत्रयमेतद्धि वृक्षवत् ।
व्याप्य विष्णुस्तिष्ठतीति भूर्भुवस्वस्तरुः स्मृतः ॥

Bhūrbhuvasvassamākhyāni trayīsārāṇi yāni ca,
Triṇi vyāhr̥tirūpāṇi śukrāṇyāhurhi bāhyr̥cāḥ.
Yatrairhomādinā Viṣṇustarai plavate’thavā,
Jagatrayati tadbhūrbhuvasvastarurucyate.
Bhūrbhuvasvarnāma lokatraya saṃsārabhūruhaḥ,
Bhūrbhuvasvastaruriti procyate keśavo budhaiḥ.
Bhūrbhuvasvarākhyalokatrayametaddhi vr̥kṣavat,
Vyāpya viṣṇustiṣṭhatīti bhūrbhuvasvastaruḥ smr̥taḥ.

'Bhūḥ,' 'Bhuvaḥ' and 'Svahaḥ' are known as the three vyāhr̥tis i.e., three potent sounds. They are pure and the essence of the Vedas. By means of these three and the oblations in the sacrificial fires, one crosses the three worlds. Since paramātma is the root essence of these three vyāhr̥ti, He is aptly addressed as Bhūrbhuvaḥsvastaruḥ.

:: मनुस्मृति तृतीयोऽध्यायः ::
अग्नौ प्रास्ताऽऽहुतिः सम्य गादित्य मुपतिष्ठते ।
आदित्या सृष्टिर् वृष्टे रन्नं ततः प्रजाः ॥ ७६ ॥

Manusmr̥ti Chapter 3
Agnau prāstā’’hutiḥ samya gāditya mupatiṣṭhate,
Ādityā sr̥ṣṭir vr̥ṣṭe rannaṃ tataḥ prajāḥ. 76.

The oblation devoutly made into the sacrificial fire reaches the sun, from the sun arises rain; from the rain - food and from food all beings are born and sustained.

Or 'Bhūrbhuvaḥ' is indicative of the threefold samsāra vr̥ķa i.e., tree indicative of the three worlds. Since it verily is attributable to the paramātma, it cannot be thought of being separate from Him.

Or since He envelops the three worlds indicated by 'Bhūrbhuvaḥ svaḥ,' He is Bhūrbhuvaḥsvastaruḥ.
 
भूर्भुवस्स्वस्तरुस्तारस्सविता प्रपितामहः ।
यज्ञो यज्ञपतिर्यज्वायज्ञाङ्गोयज्ञवाहनः ॥ १०४ ॥

భూర్భువస్స్వస్తరుస్తారస్సవితా ప్రపితామహః ।
యజ్ఞో యజ్ఞపతిర్యజ్వాయజ్ఞాఙ్గోయజ్ఞవాహనః ॥ 104 ॥

Bhūrbhuvassvastarustārassavitā prapitāmahaḥ,
Yajño yajñapatiryajvāyajñāṅgoyajñavāhanaḥ ॥ 104 ॥

27 జూన్, 2015

966. జన్మమృత్యుజరాతిగః, जन्ममृत्युजरातिगः, Janmamr̥tyujarātigaḥ

ఓం జన్మమృత్యుజరాతిగాయ నమః | ॐ जन्ममृत्युजरातिगाय नमः | OM Janmamr̥tyujarātigāya namaḥ

నసన్తి జన్మాది వికారాషట్ ఇతిహేతుతః ।
నజాయతేమ్రియతే వా విపశ్చిదితి మన్త్రతః ॥
జన్మమృత్యుజరాతిగః ఇత్యచ్యుతః సుకీర్తితః ॥

జననమును, మరణమును, వార్ధక్యమును అతిక్రమించి పోవుచు అమృతత్వమును చేరియున్నది జన్మమృత్యుజరాతిగః. పుట్టుక, ఉనికి, వృద్ధి, మార్పు, క్షయము, నాశము అను ఆరును ఉనికి కల పదార్థములకు ఉండు వికారములు. ఆత్మ మాత్రము ఉనికి కలదే అయి యుండియు ఈ ఆరు వికారములకును పాత్రము కాదు కనుక జన్మమృత్యుజరాతిగః.

:: కఠోపనిషత్ ప్రథమాధ్యాయే ద్వితీయా వల్లి ::
న జాయతే మ్రియతేవా విపశ్చిత్ నాయఙ్కుతశ్చి న్న బభూవ కశ్చిత్ ।
అజో నిత్యః శాశ్వతోఽయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే ॥ 18 ॥

ఉనికిని ఎరింగిన ఈ ఆత్మ తత్త్వము జన్మించదు, మరణించదు, దేనినుండియు అది ఉద్భవించలేదు. దాని నుండి ఏదియు ఉద్భవించలేదు. జన్మలేనిది, నిత్యమైనది, శాశ్వతమైన అది తన దేహము హత్య గావించబడినపుడు తాను చంపబడుటలేదు.

नसन्ति जन्मादि विकाराषट् इतिहेतुतः ।
नजायतेम्रियते वा विपश्चिदिति मन्त्रतः ॥
जन्ममृत्युजरातिगः इत्यच्युतः सुकीर्तितः ॥

Nasanti janmādi vikārāṣaṭ itihetutaḥ,
Najāyatemriyate vā vipaściditi mantrataḥ.
Janmamr̥tyujarātigaḥ ityacyutaḥ sukīrtitaḥ.

He who transcends the six modifications indicated by the words 'is born,' 'exists,' 'grows,' 'changes,' 'decays' and 'dies' is He who goes beyond birth, death and the intervening states of existence is Janmamr̥tyujarātigaḥ.

:: कठोपनिषत् प्रथमाध्याये द्वितीया वल्लि ::
न जायते म्रियतेवा विपश्चित् नायङ्कुतश्चि न्न बभूव कश्चित् ।
अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे ॥ १८ ॥

Kaṭhopaniṣat Chapter 1, Canto 2
Na jāyate mriyatevā vipaścit nāyaṅkutaści nna babhūva kaścit,
Ajo nityaḥ śāśvato’yaṃ purāṇo na hanyate hanyamāne śarīre. 18.

The intelligent Self is neither born nor does It die. It did not originate from anything, nor did anything originate from It. It is birthless, eternal, undecaying and ancient. It is not injured even when the body is killed.

प्रमाणं प्राणनिलयः प्राणभृत् प्राणजीवनः ।
तत्त्वं तत्त्वविदेकात्मा जन्ममृत्युजरातिगः ॥ १०३ ॥

ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః ।
తత్త్వం తత్త్వవిదేకాత్మా జన్మమృత్యుజరాతిగః ॥ 103 ॥

Pramāṇaṃ prāṇanilayaḥ prāṇabhr̥t prāṇajīvanaḥ,
Tattvaṃ tattvavidekātmā janmamr̥tyujarātigaḥ ॥ 103 ॥

26 జూన్, 2015

965. ఏకాఽఽత్మా, एकाऽऽत्मा, Ekā’’tmā

ఓం ఏకాత్మనే నమః | ॐ एकात्मने नमः | OM Ekātmane namaḥ

ఏకశ్చాసౌ హరిరాత్మా చేత్యేకాత్మేతి కథ్యతే ।
ఆత్మా వా ఇదమేక ఏవాగ్ర ఆసీదితి శ్రుతేః ॥

"ఆదియందు ఈ దృశ్యమాన ప్రపంచమంతయు ఒకే ఒక ఆత్మతత్త్వముగా నుండెను" అను ఐత్తరేయ ఉపనిషద్ వాక్యము, "సర్వ విషయములను అనుభవమున పొందును, సర్వ విషయానుభవములను గ్రహించుని, సర్వ భోగ్య విషయములను తినును, అంతటను అన్ని కాలములయందును ఎడతెగని ఉనికి దీనికి కలదు - అని అర్థమును తెలుపు ఆప్నోతి, ఆదత్తే, అత్తి, అతతి అను వ్యుత్పత్తులకు యోగ్యమగు తత్త్వము కావున, ఆత్మకు 'ఆత్మ' అను వ్యవహారము ఏర్పడియున్నది" అను స్మృతి వచనమును ఇచ్చట ప్రమాణములు. ఇన్ని అర్థములను తనయందు వర్తింపజేసికొనగలుగునది పరమాత్ముడు మాత్రమే.

एकश्चासौ हरिरात्मा चेत्येकात्मेति कथ्यते ।
आत्मा वा इदमेक एवाग्र आसीदिति श्रुतेः ॥

Ekaścāsau harirātmā cetyekātmeti kathyate,
Ātmā vā idameka evāgra āsīditi śruteḥ.

He is one and Ātma vide the śruti 'this ātmā was one only at the beginning.' "That which pervades, that which receives, that which enjoys the objects and that which exists always is called the Ātman."

प्रमाणं प्राणनिलयः प्राणभृत् प्राणजीवनः ।
तत्त्वं तत्त्वविदेकात्मा जन्ममृत्युजरातिगः ॥ १०३ ॥

ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః ।
తత్త్వం తత్త్వవిదేకాత్మా జన్మమృత్యుజరాతిగః ॥ 103 ॥

Pramāṇaṃ prāṇanilayaḥ prāṇabhr̥t prāṇajīvanaḥ,
Tattvaṃ tattvavidekātmā janmamr̥tyujarātigaḥ ॥ 103 ॥

25 జూన్, 2015

964. తత్త్వవిత్, तत्त्ववित्, Tattvavit

ఓం తత్త్వవిదే నమః | ॐ तत्त्वविदे नमः | OM Tattvavide namaḥ

వేత్తి తత్త్వస్వరూపం యో యథావత్ స హి తత్త్వవిత్ ।
ఇతి విష్ణురేవోక్తో వేదాన్తార్థవిశారదైః ॥

పరతత్త్వ స్వరూపమయిన తన తత్త్వమును ఉన్నదానిని ఉన్నవిధమున ఎరిగినవాడు కనుక విష్ణువు తత్త్వవిత్.

वेत्ति तत्त्वस्वरूपं यो यथावत् स हि तत्त्ववित् ।
इति विष्णुरेवोक्तो वेदान्तार्थविशारदैः ॥

Vetti tattvasvarūpaṃ yo yathāvat sa hi tattvavit,
Iti viṣṇurevokto vedāntārthaviśāradaiḥ.

Since He knows the penultimate Truth i.e., his svarūpa or nature, as it is - He is called Tattvavit.

प्रमाणं प्राणनिलयः प्राणभृत् प्राणजीवनः ।
तत्त्वं तत्त्वविदेकात्मा जन्ममृत्युजरातिगः ॥ १०३ ॥

ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః ।
తత్త్వం తత్త్వవిదేకాత్మా జన్మమృత్యుజరాతిగః ॥ 103 ॥

Pramāṇaṃ prāṇanilayaḥ prāṇabhr̥t prāṇajīvanaḥ,
Tattvaṃ tattvavidekātmā janmamr̥tyujarātigaḥ ॥ 103 ॥

24 జూన్, 2015

963. తత్త్వం, तत्त्वं, Tattvaṃ

ఓం తత్త్వాయ నమః | ॐ तत्त्वाय नमः | OM Tattvāya namaḥ

పరమార్థతస్సతత్త్వం సత్యం తథ్యం తథామృతమ్ ।
పరమార్థసతస్తస్య బ్రహ్మణో వాచకా ఇమే ॥

తథ్యం, అమృతం, సత్యం, పరమార్థసతత్త్వం అను ఇట్టి అన్ని పదములును ఏకార్థవాచకములు అనగా ఒకే అర్థమును కలిగి, దేశకాల వస్తు పరిచ్ఛేదము లేకుండ ఉనికిని పొందియుండు బ్రహ్మ తత్త్వమును తెలుపు పదములు.

परमार्थतस्सतत्त्वं सत्यं तथ्यं तथामृतम् ।
परमार्थसतस्तस्य ब्रह्मणो वाचका इमे ॥

Paramārthatassatattvaṃ satyaṃ tathyaṃ tathāmr̥tam,
Paramārthasatastasya brahmaṇo vācakā ime.

The words tathyaṃ, amr̥taṃ, satyaṃ and paramārthasatattvaṃ - all are synonymous that imply the transcendental phenomenon which cannot be divided into/by time, territory and material i.e., Brahman.

प्रमाणं प्राणनिलयः प्राणभृत् प्राणजीवनः ।
तत्त्वं तत्त्वविदेकात्मा जन्ममृत्युजरातिगः ॥ १०३ ॥

ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః ।
తత్త్వం తత్త్వవిదేకాత్మా జన్మమృత్యుజరాతిగః ॥ 103 ॥

Pramāṇaṃ prāṇanilayaḥ prāṇabhr̥t prāṇajīvanaḥ,
Tattvaṃ tattvavidekātmā janmamr̥tyujarātigaḥ ॥ 103 ॥

23 జూన్, 2015

962. ప్రాణజీవనః, प्राणजीवनः, Prāṇajīvanaḥ

ఓం ప్రాణజీవాయ నమః | ॐ प्राणजीवाय नमः | OM Prāṇajīvāya namaḥ

ప్రాణినో జీవయన్ ప్రాణనామభిః పవనైర్హరిః ।
ప్రాణజీవన ఇత్యుక్తో వేదాన్తార్థవిశారదైః ॥

ప్రాణములు అను పేరు కల ప్రాణ, అపానాది వాయువుల ద్వారమున ప్రాణులను జీవింపజేయుచున్నవాడు కనుక ఆ హరి ప్రాణజీవనః.

:: కఠోపనిషత్ ద్వితీయాధ్యాయము, 2వ వల్లి ::
న ప్రాణేన నాఽపానేన మర్త్యో జీవతి కశ్చన ఇతరేణ తు జీవన్తి యస్మిన్నేతా వుపాశ్రితౌ ॥ 5 ॥

మర్త్యుడు ఏ ఒక్కడును ప్రాణవాయువుచే గాని, అపానవాయువుచే గాని జీవించుటలేదు. ఏ తత్త్వమునందు ఈ రెండును సన్నిహితములై ఆశ్రయమును పొంది యున్నవో, అట్టి మరియొక (పరమాత్ముని) తత్త్వముచే మాత్రమే జీవించుచున్నాడు.

प्राणिनो जीवयन् प्राणनामभिः पवनैर्हरिः ।
प्राणजीवन इत्युक्तो वेदान्तार्थविशारदैः ॥

Prāṇino jīvayan prāṇanāmabhiḥ pavanairhariḥ,
Prāṇajīvana ityukto vedāntārthaviśāradaiḥ.

By the prāṇas i.e., life forces, He makes the creatures live.

:: कठोपनिषत् द्वितीयाध्याय, २ वल्लि ::
न प्राणेन नाऽपानेन मर्त्यो जीवति कश्चन इतरेण तु जीवन्ति यस्मिन्नेता वुपाश्रितौ ॥ ५ ॥

Kaṭhopaniṣat Chapter 2, Canto 2
Na prāṇena nā’pānena martyo jīvati kaścana itareṇa tu jīvanti yasminnetā vupāśritau. 5.

Not by prāṇa, not by apāna does the mortal live; but the life forces are brought together by another one (Paramātma) upon which these two depend.

प्रमाणं प्राणनिलयः प्राणभृत् प्राणजीवनः
तत्त्वं तत्त्वविदेकात्मा जन्ममृत्युजरातिगः ॥ १०३ ॥

ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః
తత్త్వం తత్త్వవిదేకాత్మా జన్మమృత్యుజరాతిగః ॥ 103 ॥

Pramāṇaṃ prāṇanilayaḥ prāṇabhr̥t prāṇajīvanaḥ,
Tattvaṃ tattvavidekātmā janmamr̥tyujarātigaḥ ॥ 103 ॥

22 జూన్, 2015

961. ప్రాణభృత్, प्राणभृत्, Prāṇabhr̥t

ఓం ప్రాణభృతే నమః | ॐ प्राणभृते नमः | OM Prāṇabhr̥te namaḥ

పోషయన్నన్నరూపేణ ప్రాణాన్ స ప్రాణభృద్ధరిః అన్న రూపమున తానుండి ప్రాణములను నిలుపుచు పోషించుచునుండును కనుక ప్రాణభృత్‍.

पोषयन्नन्नरूपेण प्राणान् स प्राणभृद्धरिः / Poṣayannannarūpeṇa prāṇān sa prāṇabhr̥ddhariḥ Through and as food, He sustains the prāṇās or life forces - so Prāṇabhr̥t.

प्रमाणं प्राणनिलयः प्राणभृत् प्राणजीवनः ।
तत्त्वं तत्त्वविदेकात्मा जन्ममृत्युजरातिगः ॥ १०३ ॥

ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః ।
తత్త్వం తత్త్వవిదేకాత్మా జన్మమృత్యుజరాతిగః ॥ 103 ॥

Pramāṇaṃ prāṇanilayaḥ prāṇabhr̥t prāṇajīvanaḥ,
Tattvaṃ tattvavidekātmā janmamr̥tyujarātigaḥ ॥ 103 ॥

21 జూన్, 2015

960. ప్రాణనిలయః, प्राणनिलयः, Prāṇanilayaḥ

ఓం ప్రాణనిలయాయ నమః | ॐ प्राणनिलयाय नमः | OM Prāṇanilayāya namaḥ

యత్ర ప్రాణా ఇన్ద్రియాణి నిలీయన్తే హరావుత ।
తత్పరతన్త్రతయా వా దేహస్యైతస్య ధారకాః ॥
ప్రాణాపానాదయస్తస్మిన్ నిలీయన్తే హరావితి ।
వా ప్రాణనిలయః ప్రోక్తో విష్ణుర్వేదవిశరదైః ॥
యః ప్రాణితీతి స జీవః పరే పుంసి నిలీయతే ।
ప్రాణోవేత్యథవా ప్రాణాన్ జీవానపి చ సంహరన్ ॥
ఇతి వా ప్రాణనిలయ ఇతి విష్ణుస్సమీర్యతే ॥

ప్రాణములు అనగా ఇంద్రియములు - ఎవనికి పరతంత్రములగుచు ఎవనియందు మిక్కిలిగా లయమును పొందుచున్నవో అట్టి జీవుడు 'ప్రాణనిలయః' అనబడును. అట్టి జీవుడు వాస్తవమున పరమాత్మునితో అభిన్నుడే! దేహమును నిలిపి పట్టు ప్రాణాపానాది ప్రాణములు ఎవనికి పరతంత్రములై ఎవనియందు మిక్కిలిగా లయమందుచున్నవో అట్టి జీవుడు ప్రాణనిలయః అనబడును.

ప్రాణధారణ చేయును కావున 'ప్రాణః' అనగా జీవుడు. అట్టి ప్రాణము లేదా జీవుడు ఎవనియందు మిక్కిలిగా లయమును, ఏకత్వమును పొందునో అట్టి పరమపురుషుడు, పరమాత్ముడు ప్రాణనిలయః అనబడును. ప్రాణములను, ఇంద్రియములను, ప్రాణాపానాదికమును, జీవులను - తనయందు ఉపసంహరించుకొనును కావున పరమాత్మునకు 'ప్రాణనిలయః' అను నామము సరిపడియున్నది.

यत्र प्राणा इन्द्रियाणि निलीयन्ते हरावुत ।
तत्परतन्त्रतया वा देहस्यैतस्य धारकाः ॥
प्राणापानादयस्तस्मिन् निलीयन्ते हराविति ।
वा प्राणनिलयः प्रोक्तो विष्णुर्वेदविशरदैः ॥
यः प्राणितीति स जीवः परे पुंसि निलीयते ।
प्राणोवेत्यथवा प्राणान् जीवानपि च संहरन् ॥
इति वा प्राणनिलय इति विष्णुस्समीर्यते ॥

Yatra prāṇā indriyāṇi nilīyante harāvuta,
Tatparatantratayā vā dehasyaitasya dhārakāḥ.
Prāṇāpānādayastasmin nilīyante harāviti,
Vā prāṇanilayaḥ prokto viṣṇurvedaviśaradaiḥ.
Yaḥ prāṇitīti sa jīvaḥ pare puṃsi nilīyate,
Prāṇovetyathavā prāṇān jīvānapi ca saṃharan.
Iti vā prāṇanilaya iti viṣṇussamīryate.

Prāṇas or life forces are the senses. They are sustained in the jīva i.e., living being as they are extra-dependent. In the ultimate analysis, the jīva, hence, is identical with Brahman. So the jīva is Prāṇanilayaḥ.

Prāṇa, apāna and such life forces are the supports of the body. They merge in Him; so Prāṇanilayaḥ.

Breathe stands for prāṇa, the jīva. That merges in the supreme person who is, thus, called Prāṇanilayaḥ.

The Paramātma annihilates the prāṇas and jīvas. So He is aptly called Prāṇanilayaḥ - the refuge or resting place of life forces.

प्रमाणं प्राणनिलयः प्राणभृत् प्राणजीवनः ।
तत्त्वं तत्त्वविदेकात्मा जन्ममृत्युजरातिगः ॥ १०३ ॥

ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః ।
తత్త్వం తత్త్వవిదేకాత్మా జన్మమృత్యుజరాతిగః ॥ 103 ॥

Pramāṇaṃ prāṇanilayaḥ prāṇabhr̥t prāṇajīvanaḥ,
Tattvaṃ tattvavidekātmā janmamr̥tyujarātigaḥ ॥ 103 ॥

20 జూన్, 2015

959. ప్రమాణమ్, प्रमाणम्, Pramāṇam

ఓం ప్రమాణాయ నమః | ॐ प्रमाणाय नमः | OM Pramāṇāya namaḥ

స్వయం ప్రమా ప్రమితిస్సంవిత్ప్రమాణమితీర్యతే ।
శ్రీచక్రపాణిః ప్రజ్ఞానం బ్రహ్మేతి శ్రుతివాక్యతః ॥

ఏది కలదో అదియే ఉత్తమమగు జ్ఞానము. అదియే స్వతఃసిద్ధమగు యథార్థానుభవాత్మక జ్ఞానము. దానినే ఇచట 'ప్రమాణమ్‍' అనగా ప్రకృష్టమయిన జ్ఞానము అను శబ్దముచే చెప్పియున్నారు. ఈ విషయమున 'ప్రజ్ఞానం బ్రహ్మ' (ఐత్తరేయ ఉపనిషత్ 3.5.3) - 'ప్రకృష్టమయిన జ్ఞానమే బ్రహ్మతత్త్వము' అను శ్రుతి ప్రమాణము.

:: విష్ణు పురాణే ప్రథమాంశే ద్వితీయోఽధ్యాయః ::
జ్ఞానస్వరూపమత్యన్త నిర్మలం పరమార్థతః ।
తమేవార్థస్వరూపేణ భ్రాన్తిదర్శనతః స్థితమ్ ॥ 6 ॥

పరమార్థమున వస్తుస్థితిలో జ్ఞానమాత్ర స్వరూపుడును, అత్యంత నిర్మలుడును, భ్రాంతి జ్ఞానముచే అవిద్యావశమున పదార్థ స్వరూపముననున్నవాడును అగు ఆ పరమాత్ముని నమస్కరించెదను.

428. ప్రమాణమ్, प्रमाणम्, Pramāṇam

स्वयं प्रमा प्रमितिस्संवित्प्रमाणमितीर्यते ।
श्रीचक्रपाणिः प्रज्ञानं ब्रह्मेति श्रुतिवाक्यतः ॥

Svayaṃ pramā pramitissaṃvitpramāṇamitīryate,
Śrīcakrapāṇiḥ prajñānaṃ brahmeti śrutivākyataḥ.

Pramiti is samvit or knowledge and is self-effulgent and self-certifying. It is Pramāṇam or authority vide 'प्रज्ञानं ब्रह्म / Prajñānaṃ brahma' (Aittareya upaniṣat 3.5.3) - "Wisdom is Brahman."

:: विष्णु पुराणे प्रथमांशे द्वितीयोऽध्यायः ::
ज्ञानस्वरूपमत्यन्त निर्मलं परमार्थतः ।
तमेवार्थस्वरूपेण भ्रान्तिदर्शनतः स्थितम् ॥ ६ ॥

Viṣṇu Purāṇa - Part 1, Chapter 2
Jñānasvarūpamatyanta nirmalaṃ paramārthataḥ,
Tamevārthasvarūpeṇa bhrāntidarśanataḥ sthitam. 6.

In reality, the nature of knowledge is unblemished. By illusory sight, it takes forms of various objects.

428. ప్రమాణమ్, प्रमाणम्, Pramāṇam

प्रमाणं प्राणनिलयः प्राणभृत् प्राणजीवनः ।
तत्त्वं तत्त्वविदेकात्मा जन्ममृत्युजरातिगः ॥ १०३ ॥

ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః ।
తత్త్వం తత్త్వవిదేకాత్మా జన్మమృత్యుజరాతిగః ॥ 103 ॥

Pramāṇaṃ prāṇanilayaḥ prāṇabhr̥t prāṇajīvanaḥ,
Tattvaṃ tattvavidekātmā janmamr̥tyujarātigaḥ ॥ 103 ॥

19 జూన్, 2015

958. పణః, पणः, Paṇaḥ

ఓం పణాయ నమః | ॐ पणाय नमः | OM Paṇāya namaḥ

ప్రణతిర్వ్యవహారార్థస్తం కుర్వన్ పణ ఉచ్యతే ।
పుణ్యాని సర్వకర్మాణి పణం సఙ్గృహ్య యచ్ఛతి ॥
తత్ఫలమధికారిభ్య ఇతి లక్షణయా హరిః ।
పణ ఇత్యుచ్యతే సద్భిర్విద్వద్భిః శ్రుతిపారగైః ॥

'పణ' ధాతువునకు 'వ్యవహారము', 'వ్యవహరించుట' అను అర్థములు కలవు. పరమాత్ముడు వ్యవహరించుచున్నాడు.

'సర్వాణి రూపాణి విచిత్య ధీరో - నామాని కృత్వాఽభివదన్ యదాస్తే' (తైత్తిరీయ ఆరణ్యకము 3.12) - 'విచారణశీలుడగు పరమ పురుషుడు దృశ్య ప్రపంచమునందలి సకల రూపములను విచారణ చేసి, వానికి నామములను అనగా ఆయా అర్థములను చెప్పదగు శబ్దములను ఏర్పరచి వానితో లోకమున వ్యవహరించుచు ఉన్నాడు - అనునది ఏది కలదో!' అను శ్రుతి ఇందు ప్రమాణము.

పుణ్య కర్మములను అన్నిటిని పణముగా అనగా వెలగా తీసికొని వారి వారి అధికారమునకు తగిన ఫలములను ప్రదానము చేయును అను అర్థమున లక్షణావృత్తిచే పరమాత్ముని 'పణః' అనవచ్చును.

प्रणतिर्व्यवहारार्थस्तं कुर्वन् पण उच्यते ।
पुण्यानि सर्वकर्माणि पणं सङ्गृह्य यच्छति ॥
तत्फलमधिकारिभ्य इति लक्षणया हरिः ।
पण इत्युच्यते सद्भिर्विद्वद्भिः श्रुतिपारगैः ॥

Praṇatirvyavahārārthastaṃ kurvan paṇa ucyate,
Puṇyāni sarvakarmāṇi paṇaṃ saṅgr̥hya yacchati.
Tatphalamadhikāribhya iti lakṣaṇayā hariḥ,
Paṇa ityucyate sadbhirvidvadbhiḥ śrutipāragaiḥ.

Paṇati is used in the sense of worldly dealings. He does them; He causes the worldly activities to take place - so Paṇaḥ vide the śruti 'Sarvāṇi rūpāṇi vicitya dhīro - nāmāni kr̥tvā’bhivadan yadāste' (Taittirīya āraṇyaka 3.12) - 'He, the wise One remains creating the various forms and giving names to them.'

All meritorious activities are paṇam. He who collectively confers the fruits to their adhikāris or the ones who are entitled - is, by a figure of speech, called Paṇaḥ.

आधारनिलयोऽधाता पुष्पहासः प्रजागरः ।
ऊर्ध्वगस्सत्पथाचारः प्राणदः प्रणवः पणः ॥ १०२ ॥

ఆధారనిలయోఽధాతా పుష్పహాసః ప్రజాగరః ।
ఊర్ధ్వగస్సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః ॥ 102 ॥

Ādhāranilayo’dhātā puṣpahāsaḥ prajāgaraḥ,
Ūrdhvagassatpathācāraḥ prāṇadaḥ praṇavaḥ paṇaḥ ॥ 102 ॥

18 జూన్, 2015

957. ప్రణవః, प्रणवः, Praṇavaḥ

ఓం ప్రణవాయ నమః | ॐ प्रणवाय नमः | OM Praṇavāya namaḥ

ఓఙ్కారః ప్రణవో నామ వాచకః పరమాత్మనః ।
తదభేదోపచారేణ స ప్రణవ ఇతీర్యతే ॥

ప్రణవమనేది పరమాత్మను చెప్పు ఓంకారము. ఆ శబ్దమునకును, ఆ శబ్దముచే చెప్పబడు పరమాత్మునకును అభేదమును వ్యవహారమునకై ఆరోపించి గ్రహించుటచేత పరమాత్ముడే 'ప్రణవః' అనబడును.

409. ప్రణవః, प्रणवः, Praṇavaḥ

ओङ्कारः प्रणवो नाम वाचकः परमात्मनः ।
तदभेदोपचारेण स प्रणव इतीर्यते ॥

Oṅkāraḥ praṇavo nāma vācakaḥ paramātmanaḥ,
Tadabhedopacāreṇa sa praṇava itīryate.

Praṇava is Omkāra (ॐ) signifying the Paramātman. Being non-different from it, He is Praṇavaḥ.

409. ప్రణవః, प्रणवः, Praṇavaḥ

आधारनिलयोऽधाता पुष्पहासः प्रजागरः ।
ऊर्ध्वगस्सत्पथाचारः प्राणदः प्रणवः पणः ॥ १०२ ॥

ఆధారనిలయోఽధాతా పుష్పహాసః ప్రజాగరః ।
ఊర్ధ్వగస్సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః ॥ 102 ॥

Ādhāranilayo’dhātā puṣpahāsaḥ prajāgaraḥ,
Ūrdhvagassatpathācāraḥ prāṇadaḥ praṇavaḥ paṇaḥ ॥ 102 ॥

17 జూన్, 2015

956. ప్రాణదః, प्राणदः, Prāṇadaḥ

ఓం ప్రాణదాయ నమః | ॐ प्राणदाय नमः | OM Prāṇadāya namaḥ

మృతాన్ పరీక్షిత్ ప్రభృతిన్ జీవయన్ ప్రాణదో హరిః మృతినొందిన పరీక్షిదాదులకు ప్రాణములను ఇచ్చినవాడు కనుక ప్రాణదః.

65. ప్రాణదః, प्राणदः, Prāṇadaḥ 
321. ప్రాణదః, प्राणदः, Prāṇadaḥ
408. ప్రాణదః, प्राणदः, Prāṇadaḥ

मृतान् परीक्षित् प्रभृतिन् जीवयन् प्राणदो हरिः / Mr̥tān parīkṣit prabhr̥tin jīvayan prāṇado hariḥ Since Lord Hari brought back to life the likes of Parīkṣit and others who died - by giving them life, He is called Prāṇadaḥ.

65. ప్రాణదః, प्राणदः, Prāṇadaḥ 
321. ప్రాణదః, प्राणदः, Prāṇadaḥ
408. ప్రాణదః, प्राणदः, Prāṇadaḥ

आधारनिलयोऽधाता पुष्पहासः प्रजागरः ।
ऊर्ध्वगस्सत्पथाचारः प्राणदः प्रणवः पणः ॥ १०२ ॥

ఆధారనిలయోఽధాతా పుష్పహాసః ప్రజాగరః ।
ఊర్ధ్వగస్సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః ॥ 102 ॥

Ādhāranilayo’dhātā puṣpahāsaḥ prajāgaraḥ,
Ūrdhvagassatpathācāraḥ prāṇadaḥ praṇavaḥ paṇaḥ ॥ 102 ॥

16 జూన్, 2015

955. సత్పథాచరః, सत्पथाचरः, Satpathācaraḥ

ఓం సత్పథాచారాయ నమః | ॐ सत्पथाचाराय नमः | OM Satpathācārāya namaḥ

శ్రీవిష్ణురాచరతి యత్ సతాం కర్మాణి సత్పథాన్ ।
స తస్మాత్ సత్పథాచార ఇతి విష్ణుస్సమీర్యతే ॥

సత్పురుషుల మార్గములను, సత్పురుషులు ఆచరించు కర్మములను ఆచరించి చూపువాడు సత్పథాచారః.

श्रीविष्णुराचरति यत् सतां कर्माणि सत्पथान् ।
स तस्मात् सत्पथाचार इति विष्णुस्समीर्यते ॥

Śrīviṣṇurācarati yat satāṃ karmāṇi satpathān,
Sa tasmāt satpathācāra iti viṣṇussamīryate.

The actions performed and path chosen by great men is Satpathāḥ. The One who sets an example by performing such actions and treading such path is Satpathācaraḥ.

आधारनिलयोऽधाता पुष्पहासः प्रजागरः ।
ऊर्ध्वगस्सत्पथाचारः प्राणदः प्रणवः पणः ॥ १०२ ॥

ఆధారనిలయోఽధాతా పుష్పహాసః ప్రజాగరః ।
ఊర్ధ్వగస్సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః ॥ 102 ॥

Ādhāranilayo’dhātā puṣpahāsaḥ prajāgaraḥ,
Ūrdhvagassatpathācāraḥ prāṇadaḥ praṇavaḥ paṇaḥ ॥ 102 ॥

15 జూన్, 2015

954. ఊర్ధ్వగః, ऊर्ध्वगः, Ūrdhvagaḥ

ఓం ఉర్ధ్వగాయ నమః | ॐ उर्ध्वगाय नमः | OM Urdhvagāya namaḥ

సర్వేషాముపరితిష్ఠన్నూర్థ్వగః ప్రోచ్యతే హరిః అందరికంటెను, అన్నిటికంటెను పైన ఉండువాడు కనుక హరి ఊర్ధ్వగుడు అని చెప్పబడును.

सर्वेषामुपरितिष्ठन्नूर्थ्वगः प्रोच्यते हरिः / Sarveṣāmuparitiṣṭhannūrthvagaḥ procyate Hariḥ Since Lord Hari is stands high above anyone and anything, He is called Ūrdhvagaḥ.

आधारनिलयोऽधाता पुष्पहासः प्रजागरः ।
ऊर्ध्वगस्सत्पथाचारः प्राणदः प्रणवः पणः ॥ १०२ ॥

ఆధారనిలయోఽధాతా పుష్పహాసః ప్రజాగరః ।
ఊర్ధ్వగస్సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః ॥ 102 ॥

Ādhāranilayo’dhātā puṣpahāsaḥ prajāgaraḥ,
Ūrdhvagassatpathācāraḥ prāṇadaḥ praṇavaḥ paṇaḥ ॥ 102 ॥

14 జూన్, 2015

953. ప్రజాగరః, प्रजागरः, Prajāgaraḥ

ఓం ప్రజాగరాయ నమః | ॐ प्रजागराय नमः | OM Prajāgarāya namaḥ

నిత్యప్రబుద్ధరూపత్వాత్ ప్రకర్షేణాస్య జాగృతేః ।
ప్రజాగర ఇతిప్రోక్తో విష్ణుః శ్రుతివిశారదైః ॥

స్వభావసిద్ధముగానే జ్ఞానమును పొందియుండి జ్ఞానాత్మక స్వరూపము కలవాడు కావున - 'మిక్కిలి మెలకువతో నుండువాడు' అను అర్థమున - ప్రజాగరః అనబడును.

नित्यप्रबुद्धरूपत्वात् प्रकर्षेणास्य जागृतेः ।
प्रजागर इतिप्रोक्तो विष्णुः श्रुतिविशारदैः ॥

Nityaprabuddharūpatvāt prakarṣeṇāsya jāgr̥teḥ,
Prajāgara itiprokto viṣṇuḥ śrutiviśāradaiḥ.

Being ever of the nature of knowledge, He is always exceedingly awake and hence known as Prajāgaraḥ.

आधारनिलयोऽधाता पुष्पहासः प्रजागरः
ऊर्ध्वगस्सत्पथाचारः प्राणदः प्रणवः पणः ॥ १०२ ॥

ఆధారనిలయోఽధాతా పుష్పహాసః ప్రజాగరః
ఊర్ధ్వగస్సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః ॥ 102 ॥

Ādhāranilayo’dhātā puṣpahāsaḥ prajāgaraḥ,
Ūrdhvagassatpathācāraḥ prāṇadaḥ praṇavaḥ paṇaḥ ॥ 102 ॥

13 జూన్, 2015

952. పుష్పహాసః, पुष्पहासः, Puṣpahāsaḥ

ఓం పుష్పహాసాయ నమః | ॐ पुष्पहासाय नमः | OM Puṣpahāsāya namaḥ

ముకులాత్మనా స్థితానాం పుష్పాణాం హాసనాత్ ప్రభోః ।
విశ్వాత్మనా వికాసో యత్ పుష్పహాసస్తదీర్యతే ॥

ప్రపంచరూపమున ఈతని వికాసము మొగ్గలుగా ఉన్న పుష్పముల నగవు వికాసము వంటిది. మొదట అతి సూక్ష్మరూపముగా ఉన్న పూమొగ్గ పుష్పముగా వికాసమునందినట్లు పరమాత్ముడు అవ్యక్తతా స్థితినుండి ప్రపంచరూపమున వికాసమునొందును.

मुकुलात्मना स्थितानां पुष्पाणां हासनात् प्रभोः ।
विश्वात्मना विकासो यत् पुष्पहासस्तदीर्यते ॥

Mukulātmanā sthitānāṃ puṣpāṇāṃ hāsanāt prabhoḥ,
Viśvātmanā vikāso yat puṣpahāsastadīryate.

He blossoms as the world like buds blossom. Initially as a bud, which is imperceptible, blossoms into a flower, the paramātma develops into the shape and form of the world from an subtle state.

आधारनिलयोऽधाता पुष्पहासः प्रजागरः ।
ऊर्ध्वगस्सत्पथाचारः प्राणदः प्रणवः पणः ॥ १०२ ॥

ఆధారనిలయోఽధాతా పుష్పహాసః ప్రజాగరః ।
ఊర్ధ్వగస్సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః ॥ 102 ॥

Ādhāranilayo’dhātā puṣpahāsaḥ prajāgaraḥ,
Ūrdhvagassatpathācāraḥ prāṇadaḥ praṇavaḥ paṇaḥ ॥ 102 ॥

12 జూన్, 2015

951. ధాతా, धाता, Dhātā

ఓం ధాత్రే నమః | ॐ धात्रे नमः | OM Dhātre namaḥ

స్వాత్మనైవ ధృతస్యాస్య నాన్యో ధాతా యతోఽస్తితత్ ।
అధాతేత్యుచ్యతే విష్ణుర్విద్వద్భిః శ్రుతిపారగైః ॥
నద్యృతశ్చేతి సమాసాంసోనిత్యవిధిరిష్యతే ।
ఇతి కప్రత్యయాభావః పరిభాషేన్దుశేఖరాత్ ॥
సంహారసమయే సర్వాః ప్రజా ధయతి వా హరిః ।
ఇతి ధాతేతి సమ్ప్రోక్తో విష్ణుః శ్రుతివిశారదైః ॥

తనకు తానుగా తన చేతనే నిలుపబడియున్నవాడగుటచే ఈ పరమాత్మునకు ధాత అనగా ధరించువాడు మరియొకడు లేడు కనుక అధాత.

ఇచ్చట 'సద్యృతశ్చ' (పాణిని 5.4.153) అను సూత్రముచే సమాసాంతమున 'కప్‍' ప్రత్యయము రావలసియుండగా 'సమాసాంతవిధిరనిత్యః' - 'సమాసాంత కార్య విధానము తప్పక ప్రవర్తించవలసినది కాదు' అను పరిభాషచే అది రాలేదు. కప్ ప్రత్యయము వచ్చియుండినచో 'అధాతృకః' ఐయుండెడిది.

లేదా ధాతా అను విభాగమునైన చేయవచ్చును. ప్రళయకాలమున సర్వ ప్రాణులను త్రాగివేయును కనుక ధాతా.

स्वात्मनैव धृतस्यास्य नान्यो धाता यतोऽस्तितत् ।
अधातेत्युच्यते विष्णुर्विद्वद्भिः श्रुतिपारगैः ॥
नद्यृतश्चेति समासांसोनित्यविधिरिष्यते ।
इति कप्रत्ययाभावः परिभाषेन्दुशेखरात् ॥
संहारसमये सर्वाः प्रजा धयति वा हरिः ।
इति धातेति सम्प्रोक्तो विष्णुः श्रुतिविशारदैः ॥

Svātmanaiva dhr̥tasyāsya nānyo dhātā yato’stitat,
Adhātetyucyate viṣṇurvidvadbhiḥ śrutipāragaiḥ.
Nadyr̥taśceti samāsāṃsonityavidhiriṣyate,
Iti kapratyayābhāvaḥ paribhāṣenduśekharāt.
Saṃhārasamaye sarvāḥ prajā dhayati vā hariḥ,
Iti dhāteti samprokto viṣṇuḥ śrutiviśāradaiḥ.

Being supported by Himself He has no other dhātā i.e., outside support and hence Adhātā.

Or at the time of dissolution, He dhārayati or carries or dhayati i.e., drinks or consumes, cause dissolution of all beings. This is explanation for Dhātā.

आधारनिलयोऽधाता पुष्पहासः प्रजागरः ।
ऊर्ध्वगस्सत्पथाचारः प्राणदः प्रणवः पणः ॥ १०२ ॥

ఆధారనిలయోఽధాతా పుష్పహాసః ప్రజాగరః ।
ఊర్ధ్వగస్సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః ॥ 102 ॥

Ādhāranilayo’dhātā puṣpahāsaḥ prajāgaraḥ,
Ūrdhvagassatpathācāraḥ prāṇadaḥ praṇavaḥ paṇaḥ ॥ 102 ॥

11 జూన్, 2015

950. ఆధారనిలయః, आधारनिलयः, Ādhāranilayaḥ

ఓం ఆధారనిలయాయ నమః | ॐ आधारनिलयाय नमः | OM Ādhāranilayāya namaḥ

పృథివ్యాదీనాం పఞ్చభూతానామాధారాణామాధారత్వాత్ ఆధారనిలయః ప్రాణులకును, ఇత్రర ద్రవ్యములకును ఆశ్రయములగు పృథివ్యాది పంచభూతములకు నిలయము, ఆధారభూతుడును కనుక పరమాత్మకు ఆధారనిలయః అను నామము.

पृथिव्यादीनां पञ्चभूतानामाधाराणामाधारत्वात् आधारनिलयः / Pr̥thivyādīnāṃ pañcabhūtānāmādhārāṇāmādhāratvāt Ādhāranilayaḥ Being the support of the supports of the earth and elements, He is Ādhāranilayaḥ i.e., the resting place of supports.

आधारनिलयोऽधाता पुष्पहासः प्रजागरः ।
ऊर्ध्वगस्सत्पथाचारः प्राणदः प्रणवः पणः ॥ १०२ ॥

ఆధారనిలయోఽధాతా పుష్పహాసః ప్రజాగరః ।
ఊర్ధ్వగస్సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః ॥ 102 ॥

Ādhāranilayo’dhātā puṣpahāsaḥ prajāgaraḥ,
Ūrdhvagassatpathācāraḥ prāṇadaḥ praṇavaḥ paṇaḥ ॥ 102 ॥

10 జూన్, 2015

949. భీమపరాక్రమః, भीमपराक्रमः, Bhīmaparākramaḥ

ఓం భీమపరాక్రమాయ నమః | ॐ भीमपराक्रमाय नमः | OM Bhīmaparākramāya namaḥ

అసురాదీనాం భయహేతుః పరాక్రమోఽస్యావతారేష్వితి భీమపరాక్రమః ఆయా అవతారములయందు అసురులు మొదలగువారికి భయహేతువగు పరాక్రమము ఎవనికి కలదో అట్టివాడు భీమపరాక్రమః.

असुरादीनां भयहेतुः पराक्रमोऽस्यावतारेष्विति भीमपराक्रमः / Asurādīnāṃ bhayahetuḥ parākramo’syāvatāreṣviti bhīmaparākramaḥ The valor in all His incarnations is the cause of great fear to asuras and others which is why He is called Bhīmaparākramaḥ.

अनादिर्भूर्भुवो लक्ष्मीस्सुवीरो रुचिरांगदः ।
जननो जनजन्मादिर्भीमो भीमपराक्रमः ॥ १०१ ॥

అనాదిర్భూర్భువో లక్ష్మీస్సువీరో రుచిరాంగదః ।
జననో జనజన్మాదిర్భీమో భీమపరాక్రమః ॥ 101 ॥

Anādirbhūrbhuvo lakṣmīssuvīro rucirāṃgadaḥ,
Janano janajanmādirbhīmo bhīmaparākramaḥ ॥ 101 ॥

9 జూన్, 2015

948. భీమః, भीमः, Bhīmaḥ

ఓం భీమాయ నమః | ॐ भीमाय नमः | OM Bhīmāya namaḥ

భయహేతుత్వాత్  భీమః భయమును కలిగించువాడు భీమః.

:: కఠోపనిషత్ ద్వితీయాధ్యాయము 6వ వల్లి ::
యదిదం కిం చ జగ త్సర్వం ప్రాణ ఏజతి నిస్సృతం ।
మహద్భయం వజ్రముద్యతం య ఏతద్విదురమృతాస్తే భవన్తి ॥ 2 ॥

ప్రాణము వంటి ఈ ఆత్మనుండియే ప్రపంచమంతయు ఆవిర్భవించుచు దానియందు చలించుచున్నది. పైకెత్తిన వజ్రాయుధమువలె ఆత్మ గొప్ప భయమును కలిగించును. ఈ ఆత్మను తెలిసికొనినవారు జనన మరణ రహితులగుదురు.

भयहेतुत्वात्  भीमः / Bhayahetutvāt  Bhīmaḥ The One who causes fear is Bhīmaḥ.

:: कठोपनिषत् द्वितीयाध्यायमु ६व वल्लि ::
यदिदं किं च जग त्सर्वं प्राण एजति निस्सृतं ।
महद्भयं वज्रमुद्यतं य एतद्विदुरमृतास्ते भवन्ति ॥ २ ॥

Kaṭhopaniṣat Part II, Canto III
Yadidaṃ kiṃ ca jaga tsarvaṃ prāṇa ejati nissr̥taṃ,
Mahadbhayaṃ vajramudyataṃ ya etadviduramr̥tāste bhavanti. 2.

All this universe that there is, emerges and moves because there is the supreme Brahman which is a great terror like an uplifted thunderbolt. Those who know this become immortal.

अनादिर्भूर्भुवो लक्ष्मीस्सुवीरो रुचिरांगदः ।
जननो जनजन्मादिर्भीमो भीमपराक्रमः ॥ १०१ ॥

అనాదిర్భూర్భువో లక్ష్మీస్సువీరో రుచిరాంగదః ।
జననో జనజన్మాదిర్భీమో భీమపరాక్రమః ॥ 101 ॥

Anādirbhūrbhuvo lakṣmīssuvīro rucirāṃgadaḥ,
Janano janajanmādirbhīmo bhīmaparākramaḥ ॥ 101 ॥

8 జూన్, 2015

947. జనజన్మాదిః, जनजन्मादिः, Janajanmādiḥ

ఓం జనజన్మాదయే నమః | ॐ जनजन्मादये नमः | OM Janajanmādaye namaḥ

జనస్య జనిమతో జన్మ ఉద్భవః తస్యాదిః మూలకారణమితి జనజన్మాదిః జననమునకు అనగా పుట్టుకగల ప్రాణికి సంబంధించిన జన్మమునకు, ఉద్భవమునకు ఆది మరియు మూల కారణము అగువాడు జనజన్మాదిః.

जनस्य जनिमतो जन्म उद्भवः तस्यादिः मूलकारणमिति जनजन्मादिः / Janasya janimato janma udbhavaḥ tasyādiḥ mūlakāraṇamiti Janajanmādiḥ Since He is the primeval cause and root of birth of creatures, He is called Janajanmādiḥ.

अनादिर्भूर्भुवो लक्ष्मीस्सुवीरो रुचिरांगदः ।
जननो जनजन्मादिर्भीमो भीमपराक्रमः ॥ १०१ ॥

అనాదిర్భూర్భువో లక్ష్మీస్సువీరో రుచిరాంగదః ।
జననో జనజన్మాదిర్భీమో భీమపరాక్రమః ॥ 101 ॥

Anādirbhūrbhuvo lakṣmīssuvīro rucirāṃgadaḥ,
Janano janajanmādirbhīmo bhīmaparākramaḥ ॥ 101 ॥

7 జూన్, 2015

946. జననః, जननः, Jananaḥ

ఓం జననాయ నమః | ॐ जननाय नमः | OM Jananāya namaḥ

జన్తూన్ జనయన జననః; ల్యుడ్విధై బహులగ్రహణాత్కర్తరి ల్యుట్ ప్రత్యయః ప్రయోగవచనాదివత్ ప్రాణులను జనింపజేయును. 
 
ల్యుట్ ప్రత్యయమును విధించు ప్రసంగములో పాణిని 'కృత్యల్యుటోబహులమ్‍' అను సూత్రమున బహుపదమును గ్రహించుటచేత ఇచట 'జనీ-ప్రాదుర్భావే' అను ధాతువునుండియు కర్త్రర్థమున ల్యుట్ ప్రత్యయము వచ్చి జన్ + ల్యుట్ = జన్ + అన = జననః అయినది. ఇది 'ప్రయోగవచనః' మొదలగు చోటులందు క్రర్తర్థమున ల్యుట్ ప్రత్యయ్ము వచ్చుటవంటిదేయని తెలియదగును.

जन्तून् जनयन जननः / Jantūn janayana jananaḥ He creates all beings; so Jananaḥ.

अनादिर्भूर्भुवो लक्ष्मीस्सुवीरो रुचिरांगदः ।
जननो जनजन्मादिर्भीमो भीमपराक्रमः ॥ १०१ ॥

అనాదిర్భూర్భువో లక్ష్మీస్సువీరో రుచిరాంగదః ।
జననో జనజన్మాదిర్భీమో భీమపరాక్రమః ॥ 101 ॥

Anādirbhūrbhuvo lakṣmīssuvīro rucirāṃgadaḥ,
Janano janajanmādirbhīmo bhīmaparākramaḥ ॥ 101 ॥

6 జూన్, 2015

945. రుచిరాఙ్గదః, रुचिराङ्गदः, Rucirāṅgadaḥ

ఓం రుచిరాఙ్గదాయ నమః | ॐ रुचिराङ्गदाय नमः | OM Rucirāṅgadāya namaḥ

రుచిరే కల్యాణే అఙ్గదే అస్యేతి రుచిరాఙ్గదః రుచిరములు అనగా మనోహరములును, శుభకరములును అగు భుజకీర్తులు అను ఆభరణములు ఈతనికి కలవు. మనోహరములగు అంగములును, అవయవములును లేదా మనోహరమగు అంగము, శరీరము కలవాడు అని కూడ చెప్పవచ్చును.

रुचिरे कल्याणे अङ्गदे अस्येति रुचिराङ्गदः / Rucire kalyāṇe aṅgade asyeti rucirāṅgadaḥ He who has handsome and auspicious armlets. It can also be understood as the One who is with handsome and auspicious limbs and body.

अनादिर्भूर्भुवो लक्ष्मीस्सुवीरो रुचिराङ्गदः
जननो जनजन्मादिर्भीमो भीमपराक्रमः ॥ १०१ ॥

అనాదిర్భూర్భువో లక్ష్మీస్సువీరో రుచిరాఙ్గదః
జననో జనజన్మాదిర్భీమో భీమపరాక్రమః ॥ 101 ॥

Anādirbhūrbhuvo lakṣmīssuvīro rucirāṅgadaḥ,
Janano janajanmādirbhīmo bhīmaparākramaḥ ॥ 101 ॥

5 జూన్, 2015

944. సువీరః, सुवीरः, Suvīraḥ

ఓం సుధీరాయ నమః | ॐ सुधीराय नमः | OM Sudhīrāya namaḥ

శోభనా వివిధా ఈరా గతయో యస్య సః సువీరః ।
శోభనం వివిధమ్ ఈర్తే ఇతి వా సువీరః ॥

శోభనములు, సుందరములు వివిధములును అగు ఈరములు అనగా గతులు, నడకలు ఎవనికి కలవో అట్టివాడు సువీరః. సుందరముగను, వివిధములుగను ప్రవర్తించును.

शोभना विविधा ईरा गतयो यस्य सः सुवीरः ।
शोभनं विविधम् ईर्ते इति वा सुवीरः ॥

Śobhanā vividhā īrā gatayo yasya saḥ suvīraḥ,
Śobhanaṃ vividham īrte iti vā suvīraḥ.

He whose various movements are auspicious is Suvīraḥ.

अनादिर्भूर्भुवो लक्ष्मीस्सुवीरो रुचिरांगदः ।
जननो जनजन्मादिर्भीमो भीमपराक्रमः ॥ १०१ ॥

అనాదిర్భూర్భువో లక్ష్మీస్సువీరో రుచిరాంగదః ।
జననో జనజన్మాదిర్భీమో భీమపరాక్రమః ॥ 101 ॥

Anādirbhūrbhuvo lakṣmīssuvīro rucirāṃgadaḥ,
Janano janajanmādirbhīmo bhīmaparākramaḥ ॥ 101 ॥

4 జూన్, 2015

943. లక్ష్మీః, लक्ष्मीः, Lakṣmīḥ

ఓం లక్ష్మై నమః | ॐ लक्ष्मै नमः | OM Lakṣmai namaḥ

అథవా, న కేవలమసౌ భూః భువః, లక్ష్మీః శోభా చేతి భువో లక్ష్మీః ।
అథవా, భూః భూలోకః; భువః భువర్లోకః; లక్ష్మీః ఆత్మవిద్యా
         'ఆత్మవిద్యా చ దేవి త్వమ్‌' ఇతి శ్రీస్తుతౌ ॥
భూమ్యన్తరిక్షయోః శోభేతి వా భూర్భువో లక్ష్మీః ॥

ఈతడు భూమికి ఆశ్రయము మాత్రమే కాదు, భూమికి 'లక్ష్మీ' అనగా శోభ కూడ ఈతడే. లేదా భూః అనగా భూలోకము; భువః అనగా భువర్లోకము లేదా అంతరిక్షలోకము. లక్ష్మీః అనగా ఆత్మవిద్య. 'ఆత్మవిద్యా చ దేవి! త్వమ్‍' - 'దేవీ! నీవు ఆత్మ విద్యయు అయియున్నావు' అని శ్రీ స్తుతియందు కలదు. ఇన్నియు పరమాత్ముని విభూతులే యని అర్థము. లేదా భూర్భువర్లోకములకును శోభ పరమాత్ముడే అని కూడ అర్థము చెప్పవచ్చును.

अथवा, न केवलमसौ भूः भुवः, लक्ष्मीः शोभा चेति भुवो लक्ष्मीः ।
अथवा, भूः भूलोकः; भुवः भुवर्लोकः; लक्ष्मीः आत्मविद्या
    'आत्मविद्या च देवि त्वम्‌' इति श्रीस्तुतौ ॥
भूम्यन्तरिक्षयोः शोभेति वा भूर्भुवो लक्ष्मीः ॥

Athavā, na kevalamasau bhūḥ bhuvaḥ, lakṣmīḥ śobhā ceti bhuvo lakṣmīḥ,
Athavā, bhūḥ bhūlokaḥ; bhuvaḥ bhuvarlokaḥ; lakṣmīḥ ātmavidyā
                     'Ātmavidyā ca devi tvamˈ' iti śrīstutau.
Bhūmyantarikṣayoḥ śobheti vā bhūrbhuvo lakṣmīḥ.

Not only is He splendor of the earth, but also splendor of bhuvar loka. Bhūḥ is bhūloka, bhuvaḥ is bhuvarloka, lakṣmīḥ is ātmavidya vide the śruti 'ātmavidyā ca devi tvam' - 'Devi! You are ātmavidya'

He is śobha or splendor of the earth and the sky; so Bhūrbhuvo Lakṣmīḥ.

अनादिर्भूर्भुवो लक्ष्मीस्सुवीरो रुचिरांगदः ।
जननो जनजन्मादिर्भीमो भीमपराक्रमः ॥ १०१ ॥

అనాదిర్భూర్భువో లక్ష్మీస్సువీరో రుచిరాంగదః ।
జననో జనజన్మాదిర్భీమో భీమపరాక్రమః ॥ 101 ॥

Anādirbhūrbhuvo lakṣmīssuvīro rucirāṃgadaḥ,
Janano janajanmādirbhīmo bhīmaparākramaḥ ॥ 101 ॥

3 జూన్, 2015

942. భూర్భువః, भूर्भुवः, Bhūrbhuvaḥ

ఓం భువోభువే నమః | ॐ भुवोभुवे नमः | OM Bhuvobhuve namaḥ

భూరాధారః; సర్వభూతాశ్రయత్వేన ప్రసిద్ధాయాభూమ్యా, భువోఽపి భూరితి భూర్భువః ఆధారమునకే ఆధారమైనవాడు. సర్వభూతములకును ఆశ్రయము, ఆధారముగా ప్రసిద్ధమగు భూమికిని ఈతడే ఆధారము, ఆశ్రయము కావున పరమాత్ముడు 'భూర్భువః' అనదగియున్నాడు.

'భూ' శబ్దమునకు ప్రథమావిభక్తిలో ఏకవచన రూపము 'భూః' దీనికే షష్ఠీవిభక్తిలో ఏకవచనరూపము 'భువః'

भूराधारः; सर्वभूताश्रयत्वेन प्रसिद्धायाभूम्या, भुवोऽपि भूरिति भूर्भुवः / Bhūrādhāraḥ; sarvabhūtāśrayatvena prasiddhāyābhūmyā, bhuvo’pi bhūriti bhūrbhuvaḥ Bhūḥ means support. Bhuvaḥ of the earth which is well known as the support of all beings; He is also splendor while being support of even the earth.

अनादिर्भूर्भुवो लक्ष्मीस्सुवीरो रुचिरांगदः ।
जननो जनजन्मादिर्भीमो भीमपराक्रमः ॥ १०१ ॥

అనాదిర్భూర్భువో లక్ష్మీస్సువీరో రుచిరాంగదః ।
జననో జనజన్మాదిర్భీమో భీమపరాక్రమః ॥ 101 ॥

Anādirbhūrbhuvo lakṣmīssuvīro rucirāṃgadaḥ,
Janano janajanmādirbhīmo bhīmaparākramaḥ ॥ 101 ॥

2 జూన్, 2015

941. అనాదిః, अनादिः, Anādiḥ

ఓం అనాదయే నమః | ॐ अनादये नमः | OM Anādaye namaḥ

అనాదిః కారణమస్య న విద్యత ఇతి అనాదిః; సర్వకారణత్వాత్ పరమాత్ముడు తానే సర్వకారణుడు కావున ఈతనికి ఆది ఏదియు లేదు. కార్యముకంటే ముందే దాని కారణముండును. పరమాత్ముడు స్వయం సిద్ధ తత్త్వమే కాని కార్య వస్తువు అనగా సృజింపబడినవాడు కాదు. కావున ఈతడే కార్య రూపమగు జగత్తునందలి మొట్టమొదటి తత్త్వమునకు ఆదిభూతుడును కాని ఇతని కంటె ముందేదియునుండదు.

अनादिः कारणमस्य न विद्यत इति अनादिः; सर्वकारणत्वात् / Anādiḥ kāraṇamasya na vidyata iti anādiḥ; sarvakāraṇatvāt Since He is the cause of everything there is none that precedes Him. There is no ādi or cause for Him as He is the cause of all; so Anādiḥ.

अनादिर्भूर्भुवो लक्ष्मीस्सुवीरो रुचिरांगदः ।
जननो जनजन्मादिर्भीमो भीमपराक्रमः ॥ १०१ ॥

అనాదిర్భూర్భువో లక్ష్మీస్సువీరో రుచిరాంగదః ।
జననో జనజన్మాదిర్భీమో భీమపరాక్రమః ॥ 101 ॥

Anādirbhūrbhuvo lakṣmīssuvīro rucirāṃgadaḥ,
Janano janajanmādirbhīmo bhīmaparākramaḥ ॥ 101 ॥

1 జూన్, 2015

940. దిశః, दिशः, Diśaḥ

ఓం దిశాయ నమః | ॐ दिशाय नमः | OM Diśāya namaḥ

సమస్తానాం కర్మణాం ఫలాని దిశాన్ వేదాత్మనా దిశః వేదరూపమున తానుండుచు సమస్తములగు కర్మ ఫలమును వైదిక కర్మలను ఆచరించువారికి ఇచ్చును కనుక దిశః.

समस्तानां कर्मणां फलानि दिशान् वेदात्मना दिशः / Samastānāṃ karmaṇāṃ phalāni diśān vedātmanā diśaḥ In the form of Vedas, since He gives the fruits of actions, He is called Diśaḥ.

अनन्तरूपोऽनन्तश्रीर्जितमन्युर्भयापहः ।
चतुरश्रो गभीरात्मा विदिशो व्यादिशो दिशः ॥ १०० ॥

అనన్తరూపోఽనన్తశ్రీర్జితమన్యుర్భయాపహః ।
చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః ॥ 100 ॥

Anantarūpo’nantaśrīrjitamanyurbhayāpahaḥ,
Caturaśro gabhīrātmā vidiśo vyādiśo diśaḥ ॥ 100 ॥