24 నవం, 2012

21. నారసింహవపుః, नारसिंहवपुः, Nārasiṃhavapuḥ

ఓం నారసింహవపుషే నమః | ॐ नारसिंहवपुषे नमः | OM Nārasiṃhavapuṣe namaḥ


నరస్య ఇమే నారాః నరునకు సింహమునకు సంబంధించు అవయవములు ఏ శరీరము (వపువు) నందు కనబడుచుండునో అట్టి వపువు ఎవనికి కలదో అట్టివాడు.

భాగవతసారముగా పేరొందిన శ్రీమన్నారాయణీయమునందలి 25వ దశకమునందు, మేల్పతూర్ నారాయణ భట్టాత్రివారు దర్శించిన నృసింహరూపము.

:: శ్రీమన్నారాయణీయం - 25వ దశకము ::
ఉత్సర్పద్వలిభంగభీషణహనుం హ్రస్వస్థవీయస్తరగ్రీవం పీవరదోశ్శతోద్గతనఖక్రూరాంశుదూరోల్బణమ్ ।
వ్యోమోల్లంఘి ఘనాఘనోపమఘనప్రధ్వానవిర్ధావిత స్పర్ధాలుప్రకరం నమామి భవతస్తన్నారసింహం వపుః ॥ 4 ॥


స్వామీ! అట్టహాసము చేసినపుడు నీ చెక్కిళ్ళు (గండ భాగము) ముడుతలు పడుచున్నవి. నీ కంఠభాగము పొట్టిగానుండి దృఢముగానున్నది. బాగుగా పుష్టిగలిగియున్న నీ హస్తములయొక్క గోళ్ళు మిక్కిలి వాడియై మహా భయంకరముగా ఉన్నవి. నీ శరీరము ఆకాశమునంటుకొనుచున్నట్లు చాలా ఎత్తుగానున్నది. నీ అట్టహాసము భయంకరమైన మేఘగర్జనమువలె ఉండి శత్రువులను తరిమితరిమి కొట్టుచున్నది. ప్రభూ! అట్టి నీ నృసింహ రూపమునకు నేను భక్తితో నమస్కరింతును.



One in whom the bodies of a man and a lion are combined. The reference is to the incarnation of man-lion form of Viṣṇu known as Nr̥siṃha.

Melpathur Narayana Bhattathiri who epitomized 18,000 splendid verses of Śrīmadbhāgavata into Śrīmannārāyaṇīyaṃ with 1036 verses, described the form of Nr̥siṃha in the 25th canto asunder.

Śrīmannārāyaṇīyaṃ - 25th Canto
Utsarpadvalibhaṃga-bhīṣaṇahanuṃ
    hrasvasthavīyastara-grīvaṃ
pīvaradośśatodgata-nakha
    krūrāṃśudūrolbaṇam,
Vyomollaṃghi-ghanāghanopamaghana
    pradhvānavirdhāvita -
spardhāluprakaraṃ namāmi -
    bhavatastannārasiṃhaṃ vapuḥ. (4)

Your cheeks were made terrifying by the lines formed by wrinkles when You roared, with a short but stout neck, with a hundred mighty arms with outstretching claws shining and instilling fear, with a tumultuous roar like that of thunder originating in dense clouds, which drives away repeatedly hordes of enemies, Your such manifestation in the form of a Narasiṃha (man-lion), I humbly and devoutly salute.
 
योगो योगविदां नेता प्रधानपुरुषेश्वरः ।
नारसिंहवपु श्श्रीमान् केशवः पुरुषोत्तमः ॥ 3 ॥

యోగో యోగవిదాం నేతా ప్రధానపురుషేశ్వరః ।
నారసింహవపు శ్శ్రీమాన్ కేశవః పురుషోత్తమః ॥ 3 ॥

Yogo yogavidāṃ netā pradhānapuruṣeśvaraḥ ।
Nārasiṃhavapu śśrīmān keśavaḥ puruṣottamaḥ ॥ 3 ॥

23 నవం, 2012

20. ప్రధానపురుషేశ్వరః, प्रधानपुरुषेश्वरः, Pradhānapuruṣeśvaraḥ

ఓం ప్రధానపురుషేశ్వరాయ నమః | ॐ प्रधानपुरुषेश्वराय नमः | OM Pradhānapuruṣeśvarāya namaḥ


ప్రధానం చ పురుషశ్చ ప్రధాన పురుషౌ; ప్రధాన పురుషయోః ఈశ్వరః - ప్రధాన పురుషేశ్వరః అని విగ్రహవాక్యము. ప్రధానం అనగా 'ప్రకృతి' అనబడు 'మాయ'. 'పురుషః' అనగా జీవుడు. ఆ ఇద్దరకును ఈశ్వరుడు అనగా వారిని తమ వ్యాపారములందు ప్రవర్తిల్లుజేయువాడు 'ప్రధానపురుషేశ్వరుడు'.

:: శ్వేతాశ్వతరోపనిషద్ - 16వ అధ్యాయం ::
స విశ్వకృద్ విశ్వవిదాత్మయోనిర్జ్ఞః కాలకాలో గుణీ సర్వవిద్యః ।
ప్రధానక్షేత్రజ్ఞపతిర్గుణేశః సంసారమోక్షస్థితిబన్ధహేతుః ॥ 16 ॥


విశ్వముయొక్క సృష్టి, లయ, స్థితి కారకుడూ, ఆత్మయోని (స్వయంభూ) చైతన్య స్వరూపుడూ, కాలకాలుడూ, కారుణ్యమూర్తీ, అన్ని విద్యలకూ ఆలవాలమైనవాడున్నూ, ప్రకృతీ మరియూ జీవాత్మలకు ప్రభువూ, త్రిగుణాలకు ఈశ్వరుడు (అతీతుడు) అయిన ఆతండు ఈ సంసారమును సాగించుటకు, దానినుండి మోక్షమునందుటకు, దానిలో చిక్కుకొనుటకు కారణభూతుడు.

ఈ 'ప్రధానపురుషేశ్వరః' నామము యొక్క అర్థమును వివరించునది శ్రీమభగవద్గీతలోని క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము. అధ్యాయములోని మొదటి శ్లోకము అర్జునుని ప్రశ్న.

అర్జున ఉవాచ :-
ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞ మేవ చ
ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞాననం జ్ఞేయం చ కేశవ 1

ఓ కృష్ణా! ప్రకృతిని, పురుషుని, క్షేత్రమును, క్షేత్రజ్ఞుని, జ్ఞానమును, జ్ఞేయమును (తెలియదగినదియగు పరమాత్మను) - వీనినన్నిటిని గూర్చి తెలిసికొనగోరుచున్నాను.



The Master of Pradhāna, otherwise known as Prakr̥ti and Māya, as well as of Puruṣa or Jīva.

Śvetāśvataropaniṣad - Chapter 6
Sa viśvakr̥d viśvavidātmayonirjñaḥ kālakālo guṇī sarvavidyaḥ,
Pradhānakṣetrajñapatirguṇeśaḥ saṃsāramokṣasthitibandhahētuḥ. (16)

He who is the support of both the unmanifested Prakr̥ti and the Jīva, who is the Lord of the three guṇas and who is the cause of bondage, existence and Liberation from Saṃsara, is verily the Creator of the universe, the Knower, the inmost Self of all things and their Source − the omniscient Lord, the Author of time, the Possessor of virtues, the Knower of everything.

Chapter 13 of Śrīmabhagavadgīta is with detailed explanation answering Arjunā's inquiry about Prakr̥ti (nature), Puruṣa (the enjoyer), Kṣētra, (the field), Kṣētrajña (its knower), and Jñāna (knowledge) and Jñēya (object of knowledge). This Chapter about knowledge of the aspects 'Nature and Soul' is a full-blown explanation to the divine name of 'Pradhānapuruṣeśvaraḥ.'

योगो योगविदां नेता प्रधानपुरुषेश्वरः
नारसिंहवपु श्श्रीमान् केशवः पुरुषोत्तमः ॥ 3 ॥

యోగో యోగవిదాం నేతా ప్రధానపురుషేశ్వరః
నారసింహవపు శ్శ్రీమాన్ కేశవః పురుషోత్తమః ॥ 3 ॥

Yogo yogavidāṃ netā pradhānapuruṣeśvaraḥ
Nārasiṃhavapu śśrīmān keśavaḥ puruṣottamaḥ ॥ 3 ॥

22 నవం, 2012

19. యోగవిదాం నేతా, योगविदां नेता, Yogavidāṃ netā

ఓం యోగవిదాం నేత్రే నమః | ॐ योगविदां नेत्रे नमः | OM Yogavidāṃ netre namaḥ


యోగం విందతే యోగమును విచారణ చేయుదురు. యోగం విందతి యోగమును ఎరుగుదురు. యోగం విందతి యోగమును పొందుదురు. ఇట్టివారు యోగ విదులు. 'నేతా' - ఒక చోటినుండి మరియొక చోటికి లేదా ముందునకు తీసుకొనిపోవువాడు.

యోగ విదుల యోగక్షేమములను ముందునకు కొనిపోవువాడు కావున యోగవిదాం నేతాః అని విష్ణువు పిలువబడుచున్నాడు.

:: భగవద్గీత - రాజవిద్యా రాజగుహ్య యోగము ::
అనన్యాశ్చిన్తయన్తో మాం యే జనాః పర్యుపాసతే ।
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ ॥ 22 ॥


ఎవరు ఇతర భావములు లేనివారై నన్ను గూర్చి చింతించుచు ఎడతెగక ధ్యానించుచున్నారో, ఎల్లప్పుడు నాయందే నిష్ఠగల్గియుండు అట్టివారి యోగక్షేమములను నేను వహించుచున్నాను.

ఇది గీతలో చాలముఖ్యమైన శ్లోకము. దాదాపు గీతయొక్క మధ్యభాగమున నుండుటవలన ఇది గీతారత్నమాలయందు మధ్యమణియై హృదయస్థానము నలంకరించుచున్నది. ఈ శ్లోకముద్వారా భగవానుడు అభయమొసంగినారు. నిరంతరము తాము పరమాత్మ చింతనచేయుచుండుచో, తమయొక్క అవసరములను తీర్చువారెవరని భక్తులు శంకించుదురేమోయని తలంచి 'ఆ పనిని నేనే వహించెదనని' భగవానుడు ఇచట సెలవిచ్చిరి. లేని శుభము వచ్చుట యోగము. వచ్చిన శుభము తగ్గకుండుట క్షేమము. ఈ ప్రకారముగ భక్తుల యోగక్షేమములను తాను 'యోగవిదాం నేత'యై వహించెదనని భగవానుడు హామీనిచ్చెను.



Yoga vindate contemplates on yoga. Yogaṃ vindati practices yoga. Yogaṃ vindati attains yoga. (Please refer to the description of previous divine name of 'Yogaḥ' to understand the meaning of Yoga. In this context, the word 'Yoga' is not to be interpreted as the form of physical exercise/practice as most of us know it as.)

Bhagavad Gitā - Chapter 9
Ananyāścintayanto māṃ ye janāḥ paryupāsate,
Teṣāṃ nityābhiyuktānāṃ yogakṣemaṃ vahāmyaham.
(22)

Those persons who, becoming non-different from Me and meditative, worship Me everywhere, for them, who are ever attached to Me, I arrange for securing what they lack and preserving what they have.

Does not the Lord surely arrange for securing what they lack and protecting what they have even in case of other devotees? This is true. He does arrange for it. But the difference lies in this: Other who are devotees make their own efforts as well for their own sake, to arrange for securing what they lack and protecting what they have. On the contrary, those who have realized non-duality do not make any effort to arrange for themselves the acquisition of what they have. Indeed, they desire nothing for themselves, in life or in death. They have taken refuge only in the Lord. Therefore the Lord Himself arranges to procure what they do not have and protect what they have got.

The Leader of those that know Yoga is the Lord Viṣṇu in the form of Yogavidāṃ netā.

योगो योगविदां नेता प्रधानपुरुषेश्वरः ।
नारसिंहवपु श्श्रीमान् केशवः पुरुषोत्तमः ॥ 3 ॥

యోగో యోగవిదాం నేతా ప్రధానపురుషేశ్వరః ।
నారసింహవపు శ్శ్రీమాన్ కేశవః పురుషోత్తమః ॥ 3 ॥

Yogo yogavidāṃ netā pradhānapuruṣeśvaraḥ ।
Nārasiṃhavapu śśrīmān keśavaḥ puruṣottamaḥ ॥ 3 ॥

21 నవం, 2012

18. యోగః, योगः, Yogaḥ

ఓం యోగాయ నమః | ॐ योगाय नमः | OM Yogāya namaḥ


జ్ఞానేంద్రియాణి సర్వాణి నిరుధ్య మనసా సహా ।
ఏకత్వభావనా యోగః క్షేత్రజ్ఞపరమాత్మనో ॥


సర్వ జ్ఞానేంద్రియములను ఇంద్రియ విషయములను ఆయా సంకల్పముల చేయుచు వాని వలన కలుగు అనుభవములను జీవునకు అందజేయు మనస్సును కూడ తమ తమ వ్యాపారములయందు ప్రవర్తిల్లనీయక నీరోధించి క్షేత్రజ్ఞ (జీవాత్మ) పరమాత్మలకు ఏకత్వమను భావన చేయుట యోగము అని తాత్పర్యము.

:: భగవద్గీత - సాఙ్ఖ్య యోగము ::
యోగస్థః కురు కర్మాణి సఙ్గం త్వక్త్వా ధనంజయ ।
సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే ॥ 48 ॥


ఓ అర్జునా! నీవు యోగనిష్ఠయందుండి, సంగమును త్యజించి, కార్యము ఫలించినను, ఫలించకపోయినను సమానముగ నున్నవాడవై కర్మలను జేయుము. అట్టి సమత్వబుద్ధియే యోగమనబడును.

యోగమనగా నేమి? కార్యము యొక్క సిద్ధి, అసిద్ధులయందు సమభావము గలిగియుండుటయే యోగమని ఇట పేర్కొనబడినది. మనస్సు - ఆత్మలయొక్క కలయికయే యోగము. జీవ పరమాత్మలయొక్క సంయోగమే యోగము. అట్టి యోగస్థితియందే ఈ నిర్వికారసమస్థితి ఉదయించును. గావున దానికిన్ని యోగమను పేరిచట పెట్టబడెను. కావున యోగమునందుండి అనగా ఆత్మయందు నిలుకడగలిగి దృశ్యముతో సంగమును త్యజించి ఫలముయొక్క ప్రాప్తాప్రాప్తములందు సమభావముగల్గి కార్యములను జేయమని భగవానుడు ఆనతిచ్చుచున్నాడు.

అట్టి యోగముచే పొందబడదగువాడు కావున విష్ణుడును 'యోగః' అనబడును.


Jñānēṃdriyāṇi sarvāṇi nirudhya manasā sahā,
ēkatvabhāvanā yōgaḥ kṣētrajñaparamātmanō.

The contemplation of the unity of the Jivātma and the Paramātmā, with the organs of knowledge and the mind withheld, is Yoga.

Bhagavad Gita - Chapter 2
Yogasthaḥ kuru karmāṇi saṅgaṃ tvaktvā dhanañjaya,
Siddhyasiddhyoḥ samo bhūtvā samatvaṃ yoga ucyatē.
(48)

By being established in Yoga, O Dhanañjaya, undertake actions, casting off attachment and remaining equipoised in success and failure. Such equanimity is called Yoga.

What is Yoga? Yoga means to concentrate the mind upon the Supreme by controlling the ever-disturbing senses. Undertake actions for pleasing God, but not for propitiating Him to become favourable towards you casting off attachment, in the form, 'God will be pleased with me.' This should be done equipoised in success and failure - even in the success characterized by the attainment of Knowledge that arises from the purification of the mind when one performs actions without hankering for the results and in the failure that arises from its opposite.

He (Viṣṇu) is the Yoga because he is to be reached by means of it.

योगो योगविदां नेता प्रधानपुरुषेश्वरः ।
नारसिंहवपु श्श्रीमान् केशवः पुरुषोत्तमः ॥ 3 ॥

యోగో యోగవిదాం నేతా ప్రధానపురుషేశ్వరః ।
నారసింహవపు శ్శ్రీమాన్ కేశవః పురుషోత్తమః ॥ 3 ॥

Yogo yogavidāṃ netā pradhānapuruṣeśvaraḥ ।
Nārasiṃhavapu śśrīmān keśavaḥ puruṣottamaḥ ॥ 3 ॥

20 నవం, 2012

17. అక్షరః, अक्षरः, Akṣaraḥ

ఓం అక్షరాయ నమః | ॐ अक्षराय नमः | OM Akṣarāya namaḥ


ప్రపంచమున సమస్త దృశ్యపదార్థములున్ను కాలక్రమమున నశించిపోవుచున్నవి. అవి క్షరములు. నశింపని వస్తువొక్కటియే కలదు. అది దృగ్రూపమగు పరబ్రహ్మము. అది అక్షరము (న క్షరతి). నాశరహితమైనది. అది నిరతిశయ అక్షరస్వరూపము; నశింపనిది; దేశకాలాదులచే ఎన్నడూ పరిచ్ఛిన్నము కానిది.

న క్షరతి ఇతి అక్షరః - నశించడు; అతడే పరమాత్మ; [అశ్ + సర > అక్ + షర > అక్షరః; అశ - భోజనే లేదా అశూ - వ్యాప్తౌ - ధాతువులు]

శ్లోకమున 'క్షేత్రజ్ఞోఽక్షర ఏవ చ' అనుచు అవధారణార్థకమగు 'ఏవ' అని ప్రయోగించుటచే క్షేత్రజ్ఞునకును అక్షరునకును నడుమ పరమార్థమున (సత్యముగా) భేదములేదు. 'త త్వ మసి' - 'ఆ పరమాత్మ తత్వము నీవే.' అను శ్రుతి ఇందు ప్రమాణము. 'చ' (కూడ) అనుటచే ఆ ఇరువురకును వ్యవహారమున భేదము కలదనియు అట్టి లోక ప్రసిద్ధి ప్రామాణికముగా తీసుకొనదగదు కావున వాస్తవమున అభేదమే యనియు తెలియవలెను.

:: భగవద్గీత - అక్షరపరబ్రహ్మ యోగము ::
అక్షరం బ్రహ్మ పరమం స్వభావోఽధ్యాత్మముచ్యతే ।
భూతభావోద్భవకరో విసర్గః కర్మసంజ్ఞితః ॥ 3 ॥


సర్వోత్తమమైన (నిరతిశయమైన) నాశరహితమైనదే బ్రహ్మమనబడును. ప్రత్యగాత్మభావము ఆధ్యాత్మమని చెప్పబడును. ప్రాణికోట్లకు ఉత్పత్తిని గలుగజేయు త్యాగపూర్వకమైన క్రియ కర్మమను పేరు కలిగియున్నది.



Akṣaram means that which does not perish (Na Kṣarati), indestructible, infallible, imperishable and that which is beyond the perception of the senses.  The word Akṣaram is very significant because this material creation is subject to destruction but the Lord is above this material creation. He is the cause of all causes, and being so, He is superior to all the conditioned souls within this material nature as well as the material cosmic manifestation itself. He is therefore the all-great Supreme.

The word Akṣara is formed by adding the suffix 'sara' at the end of the root ''. Eva ca in the text show respectively that according to the great dictum 'Tat tvam asi' Kṣetrajñaḥ and Akṣara are identical metaphysically and that their difference is relevant only relatively.

Bhagavad Gita – Chapter 8
Akṣaraṃ brahma paramaṃ svabhāvo’dhyātmamucyate,
Bhūtabhāvodbhavakaro visargaḥ karmasaṃjñitaḥ. (3 )

The Immutable is the supreme Brahman; self-hood is said to be the entity present in the individual plane. By action is meant the offerings which bring about the origin of the existence of things.

पूतात्मा परमात्मा च मुक्तानां परमा गतिः ।
अव्ययः पुरुषस्साक्षी क्षेत्रज्ञोऽक्षर एव च ॥ 1 ॥

పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమా గతిః ।
అవ్యయః పురుషస్సాక్షీ క్షేత్రజ్ఞోఽక్షర ఏవ చ ॥ 2 ॥

Pūtātmā paramātmā ca muktānāṃ paramā gatiḥ ।
Avyayaḥ puruṣassākṣī kṣetrajño’kṣara ēva ca ॥ 2 ॥