4 సెప్టెం, 2013

305. వ్యక్తరూపః, व्यक्तरूपः, Vyaktarūpaḥ

ఓం వ్యక్తరూపాయ నమః | ॐ व्यक्तरूपाय नमः | OM Vyaktarūpāya namaḥ


వ్యక్తరూపః, व्यक्तरूपः, Vyaktarūpaḥ
వ్యక్తం రూపం భవత్యస్య స్థూలరూపేణ యోగినామ్ ।
స్వయంప్రకాశమానత్వాద్ వ్యక్తరూప ఇతీర్యతే ॥

ఆయా అవతారములలో స్థూల రూపముతో వ్యక్తమగు, స్పష్టముగా గోచరించు వాడు. లేదా స్వయం ప్రకాశమానుడు కావున యోగులకు వ్యక్తమగు రూపము కలవాడు.

:: పోతన భాగవతము తృతీయ స్కంధము ::
సీ. అనఘాత్మా! మఱి భవదవతార గుణకర్మ ఘనవిడంబన హేతుకంబు లయిన

రమణీయమగు దాశరథి వసుదేవ కుమారాది దివ్యనామంబు లోలి

వెలయంగ మనుజులు వివశాత్ములై యవసానకాలంబున సంస్మరించి

జన్మ జన్మాంతర సంచిత దురితంబుఁ బాసి కైవల్యసంప్రాప్తు లగుదు
తే. రట్టి దివ్యావతారంబు లవధరించు, నజుఁడవగు నీకు మ్రొక్కెద ననఘచరిత!

చిరశుభాకార! నిత్యలక్ష్మీవిహార! భక్తమందార! దుర్భవ భయవిదూర! (304)

స్వామీ! నీవు పరమపవిత్రుడవు! సచ్చరిత్రుడవు! శాశ్వతమైన దివ్యమంగళ స్వరూపం కలవాడవు! ఎల్లప్పుడూ లక్ష్మీదేవితో కూడి సంచరించేవాడవు. భక్తులకు కల్పవృక్షం వంటి వాడవు. దుర్భరమైన సంసార భయాన్ని దూరంగా పోగొట్టేవాడవు. నీ అవతారాలకూ, సద్గుణాలకూ, సత్కార్యాలకూ, మహదాశయాలకూ కారణమైనవీ, మనోహరమైనవీ అయిన "దాశరథి", "వాసుదేవా"ది దివ్యనామాలను మనుష్యులు తమ తుది ఘడియల్లో స్మరించి, జన్మజన్మాలలో కూడబెట్టుకొన్న పాపాలను పొగొట్టుకొని మోక్షం పొందుతారు. జన్మలేనివాడవై కూడా అటువంటి దివ్యావతారాలలో జన్మించే నీకు మ్రొక్కుతున్నాను.



Vyaktaṃ rūpaṃ bhavatyasya sthūlarūpeṇa yoginām,
Svayaṃprakāśamānatvād vyaktarūpa itīryate.

व्यक्तं रूपं भवत्यस्य स्थूलरूपेण योगिनाम् ।
स्वयंप्रकाशमानत्वाद् व्यक्तरूप इतीर्यते ॥

His form is perceived when He assumes a concrete shape. Or being self-luminous, He is visible to the Yogis or learned men.

Śrīmad Bhāgavata - Canto 10, Chapter 10
Kr̥ṣṇa kr̥ṣṇa mahāyogiṃstvamādyaḥ puruṣaḥ paraḥ,
Vyaktāvyaktamidaṃ viśvaṃ rūpaṃ te brāhmaṇā viduḥ. (29)

:: श्रीमद्भागवते दशमस्कन्धे पूर्वार्धे दशमोऽध्यायः ::
कृष्ण कृष्ण महायोगिंस्त्वमाद्यः पुरुषः परः ।
व्यक्ताव्यक्तमिदं विश्वं रूपं ते ब्राह्मणा विदुः ॥ २९ ॥

O Lord Kṛṣṇa! Lord Kṛṣṇa! Your opulent mysticism is inconceivable. You are the supreme, original person, the cause of all causes, immediate and remote, and You are beyond this material creation. Learned brāhmaṇas know that You are everything and that this cosmic manifestation, in its gross and subtle aspects, is Your form.

युगादिकृद्युगावर्तो नैकमायो महाशनः ।
अदृश्योव्यक्तरूपश्च सहस्रजिदनन्तजित् ॥ ३३ ॥

యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశనః ।
అదృశ్యోవ్యక్తరూపశ్చ సహస్రజిదనన్తజిత్ ॥ ౩౩ ॥

Yugādikr̥dyugāvarto naikamāyo mahāśanaḥ ।
Adr̥śyovyaktarūpaśca sahasrajidanantajit ॥ 33 ॥

3 సెప్టెం, 2013

304. అదృశ్యః, अदृश्यः, Adr̥śyaḥ

ఓం అదృశ్యాయ నమః | ॐ अदृश्याय नमः | OM Adr̥śyāya namaḥ


అదృశ్యః, अदृश्यः, Adr̥śyaḥ

సర్వేషాం బుద్ధీంద్రియాణాం నోఽగమ్యోఽదృశ్య ఇతీర్యతే కనబడువాడు కాదు. బుద్ధికినీ, సకల జ్ఞానేంద్రియముల చేతను చేరరానివాడు.

వ. మఱియు జవనిక మఱుపున నాట్యంబు సలుపు నటుని చందంబున మాయా యవనికాంతరాళంబున నిలువంబడి నీ మహిమచేఁ బరమహంసలు వివృతరాగద్వేషులు నిర్మలాత్ములు నయిన మునులకు నదృశ్యమానుండవై పరిచ్ఛిన్నుండవు గాని నీకు మూఢదృక్కులు గుటుంబవంతులు నగు మాకు నెట్లు దర్శనీయుండ వయ్యెదు? శ్రీకృష్ణ! వాసుదేవ! దేవకీనందన! నందగోపకుమార! గోవింద! పంకజనాభ! పద్మమాలికాలంకృత! పద్మలోచన! పద్మసంకాశ చరణ! హృషీకేశ! భక్తియోగంబునం జేసి నమస్కరించెద నవధరింపుము. (187)

తెరచాటున వర్తించే నటునిలాగా మాయ అనే యవనిక మాటున వర్తించే నీ మహిమ అగోచరమైనది. పరమహంసలూ, రాగద్వేషరహితులూ అయిన మునీశ్వరులు సైతం దర్శింపలేని పూర్ణపురుషుడవైన నిన్ను సంసార నిమగ్నులమూ, జ్ఞానహీనులమూ అయిన మా వంటివారం ఎలా చూడగలుగుతాము? శ్రీకృష్ణ! వాసుదేవ! దేవకీనందన! నందగోపకుమార! గోవింద! పంకజనాభ! పద్మమాలా విభూషణా! పద్మనయనా! పద్మసంకాశ చరణ! హృషీకేశ! భక్తిపూర్వకమైన నా ప్రణామాలు పరిగ్రహించు! నా విన్నపం మన్నించు.



Sarveṣāṃ buddhīṃdriyāṇāṃ no’gamyo’dr̥śya itīryate / सर्वेषां बुद्धींद्रियाणां नोऽगम्योऽदृश्य इतीर्यते He who cannot be known or conceived; neither by buddhi i.e., intellect nor by jñānendriyas or the sensory organs.

Śrīmad Bhāgavata - Canto 8, Chapter 5
Avikriyaṃ satyamanantamādyaṃ guhāśayaṃ niṣkalamapratarkyam,
Mano’grayānaṃ vacasāniruktaṃ namāmahe devavaraṃ vareṇyam. (26)

:: श्रीमद्भागवते अष्टमस्कन्धे पञ्चमोऽध्यायः ::
अविक्रियं सत्यमनन्तमाद्यं गुहाशयं निष्कलमप्रतर्क्यम् ।
मनोऽग्रयानं वचसानिरुक्तं नमामहे देववरं वरेण्यम् ॥ २६ ॥

O Supreme Lord, O changeless, unlimited supreme truth. You are the origin of everything. Being all-pervading, You are in everyone's heart and also in the atom. You have no material qualities. Indeed, You are inconceivable. The mind cannot catch You by speculation, and words fail to describe You. You are the supreme master of everyone, and therefore You are worshipable for everyone. We offer our respectful obeisances unto You.

युगादिकृद्युगावर्तो नैकमायो महाशनः ।
अदृश्योव्यक्तरूपश्च सहस्रजिदनन्तजित् ॥ ३३ ॥

యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశనః ।
అదృశ్యోవ్యక్తరూపశ్చ సహస్రజిదనన్తజిత్ || ౩౩ ||

Yugādikr̥dyugāvarto naikamāyo mahāśanaḥ ।
Adr̥śyovyaktarūpaśca sahasrajidanantajit ॥ 33 ॥

2 సెప్టెం, 2013

303. మహాఽశనః, महाऽशनः, Mahā’śanaḥ

ఓం మహాఽశనాయ నమః | ॐ महाऽशनाय नमः | OM Mahā’śanāya namaḥ


మహాఽశనః, महाऽशनः, Mahā’śanaḥ

యస్యాస్తి మహదశనం స మహాశన ఉచ్యతే ।
యః కల్పంతేఽఖిలం విశ్వం గ్రసతి ప్రభురచ్యుతః ॥

కల్పాంతము నందు పరమాత్మ సర్వమును మ్రింగివేయును కావున ఇతడు ఆరగించునది గొప్పపరిమాణము కల ఆహారము.

:: పోతన భాగవతము - తృతీయ స్కంధము ::
తే. యోగమాయా విదూరుఁడై యుగసహస్ర, కాలపర్యంత మఖిలలోకములు మ్రింగి
     పేర్చి మఱికాల శక్త్యుబృంహితమును, సమత సృష్టి క్రియా కలాపములఁ దగిలి. (273)
క. తన జఠరము లోపలఁ దాఁ, చిన లోక నికాయముల సృజించుటకును సా
     ధనమగు సూక్ష్మార్థము మన, సున గని కాలానుగత రజోగుణ మంతన్‍. (274)

యోగమాయకు కూడా దూరంగా వెయ్యియుగాల పర్యంతం సమస్తలోకాలను తన కడుపులో దాచుకొని వెలుగొందుతూ ఆ పైన కాలమూ శక్తీ చక్కగా అభివ్యక్తం కాగా సమత్వం వహించి సృష్టికార్యం నిర్వహించటానికి ఆసక్తుడైనాడు. తన కడుపులో దాచుకొని ఉన్న సకలలోకాలనూ తిరిగి సృష్టించాడానికి ఉపకరణమైన సూక్ష్మపదార్థాన్ని మనస్సులో భావించి, కాలానుగుణంగా రజోగుణాన్ని పుట్టించాడు.



Yasyāsti mahadaśanaṃ sa mahāśana ucyate,
Yaḥ kalpaṃte’khilaṃ viśvaṃ grasati prabhuracyutaḥ.

यस्यास्ति महदशनं स महाशन उच्यते ।
यः कल्पंतेऽखिलं विश्वं ग्रसति प्रभुरच्युतः ॥

At the end of a kalpa, He swallows everything (all devouring). As His eating is big, He is Mahā’śanaḥ.

युगादिकृद्युगावर्तो नैकमायो महाशनः
अदृश्योव्यक्तरूपश्च सहस्रजिदनन्तजित् ॥ ३३ ॥

యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశనః
అదృశ్యోవ్యక్తరూపశ్చ సహస్రజిదనన్తజిత్ ॥ ౩౩ ॥

Yugādikr̥dyugāvarto naikamāyo mahāśanaḥ
Adr̥śyovyaktarūpaśca sahasrajidanantajit ॥ 33 ॥

1 సెప్టెం, 2013

302. నైకమాయః, नैकमायः, Naikamāyaḥ

ఓం నైకమాయాయ నమః | ॐ नैकमायाय नमः | OM Naikamāyāya namaḥ


నైకమాయః, नैकमायः, Naikamāyaḥ

బహ్వీర్మాయాః ప్రవహతః ఏకా మాయా న విద్యతే ।
ఇతి విష్ణుర్నైకమాయ ఇతి సంప్రోచ్యతే బుధైః ॥

ఇతనికి ఒకే మాయ కాదు ఉన్నది. అనేకములగు మాయా శక్తులను వహించుచున్నవాడు గనుక విష్ణువు నైకమాయః.



Bahvīrmāyāḥ pravahataḥ ekā māyā na vidyate,
Iti viṣṇurnaikamāya iti saṃprocyate budhaiḥ.

बह्वीर्मायाः प्रवहतः एका माया न विद्यते ।
इति विष्णुर्नैकमाय इति संप्रोच्यते बुधैः ॥


His māyā i.e., illusory energy is not one! But He wields many māyās; hence He is Naikamāyaḥ.

युगादिकृद्युगावर्तो नैकमायो महाशनः ।
अदृश्योव्यक्तरूपश्च सहस्रजिदनन्तजित् ॥ ३३ ॥

యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశనః ।
అదృశ్యోవ్యక్తరూపశ్చ సహస్రజిదనన్తజిత్ ॥ ౩౩ ॥

Yugādikr̥dyugāvarto naikamāyo mahāśanaḥ ।
Adr̥śyovyaktarūpaśca sahasrajidanantajit ॥ 33 ॥

31 ఆగ, 2013

301. యుగావర్తః, युगावर्तः, Yugāvartaḥ

ఓం యుగావర్తాయ నమః | ॐ युगावर्ताय नमः | OM Yugāvartāya namaḥ


కాలాత్మనా వర్తయతి కృతాదీని యుగాని యః ।
సయుగావర్త ఇత్యుక్తః విద్వద్భిః పురుషోత్తమః ॥

కాలరూపుడుగా కృతయుగాది యుగములను మరల మరల తిరిగివచ్చునట్టు ప్రవర్తిల్లజేయును గావున ఆ పురుషోత్తముడు యుగావర్తః.



Kālātmanā vartayati kr̥tādīni yugāni yaḥ,
Sayugāvarta ityuktaḥ vidvadbhiḥ puruṣottamaḥ.

कालात्मना वर्तयति कृतादीनि युगानि यः ।
सयुगावर्त इत्युक्तः विद्वद्भिः पुरुषोत्तमः ॥

Since Lord Puruṣottama as the Time, causes the repetition of the four Yugas beginning with Kr̥ta yuga.

युगादिकृद्युगावर्तो नैकमायो महाशनः ।
अदृश्योव्यक्तरूपश्च सहस्रजिदनन्तजित् ॥ ३३ ॥

యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశనః ।
అదృశ్యోవ్యక్తరూపశ్చ సహస్రజిదనన్తజిత్ ॥ ౩౩ ॥

Yugādikr̥dyugāvarto naikamāyo mahāśanaḥ ।
Adr̥śyovyaktarūpaśca sahasrajidanantajit ॥ 33 ॥