31 జన, 2014

454. జ్ఞానముత్తమమ్‌, ज्ञानमुत्तमम्‌, Jñānamuttamam

ఓం జ్ఞానముత్తమాయ నమః | ॐ ज्ञानमुत्तमाय नमः | OM Jñānamuttamāya namaḥ

జ్ఞానముత్తమ మిత్యేతన్నామైకం సవిశేషణమ్ ।
జ్ఞానం ప్రకృష్టమజన్యమనవచ్ఛిన్నమేవ చ ॥
సర్వస్య సాధకతమం బ్రహ్మైవ జ్ఞానముత్తమమ్ ।
సత్యం జ్ఞానమనంతమిత్యాది శ్రుతి సమీరణాత్ ॥

ఉత్తమమగు జ్ఞానము అను సవిశేషణము అగు ఒకే నామము. ఉత్తమము అనగా జనించునది కానిదీ, స్వభావసిద్ధమూ, అనవచ్ఛిన్నమూ, అవధులు లేనిదీ, ప్రతీ ఒక్కరికి పరమాత్మ సాక్షాత్కార రూప సిద్ధి విషయమున అత్యంత సాధకము అయిన ప్రకృష్టమూ, చాలా గొప్పది అగు జ్ఞానము అని అర్థము. అట్టి నిర్మల జ్ఞానము పరమాత్మ స్వరూపమే! 'సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మ' (తైత్తిరీయోపనిషత్ - 2.1) 'బ్రహ్మ తత్త్వము అసత్యము కానిదీ, జడము కానిదీ, అంతము లేనిది అయిన అనవధిక నిత్య జ్ఞాన చక్రము' అను శ్రుతి వచనము ఇచ్చట ప్రమాణము.

Jñānamuttama mityetannāmaikaṃ saviśeṣaṇam,
Jñānaṃ prakr̥ṣṭamajanyamanavacchinnameva ca.
Sarvasya sādhakatamaṃ brahmaiva jñānamuttamam,
Satyaṃ jñānamanaṃtamityādi śruti samīraṇāt.

ज्ञानमुत्तम मित्येतन्नामैकं सविशेषणम् ।
ज्ञानं प्रकृष्टमजन्यमनवच्छिन्नमेव च ॥
सर्वस्य साधकतमं ब्रह्मैव ज्ञानमुत्तमम् ।
सत्यं ज्ञानमनंतमित्यादि श्रुति समीरणात् ॥

This is a Name with an adjective. He is jñāna or knowledge that is the most superior, produced by no one because it has been ever existent, unlimited and which is most efficacious for all. That uttama jñāna is Brahma vide the śruti 'Satyaṃ jñāna manantaṃ brahma / सत्यं ज्ञान मनन्तं ब्रह्म' (Taittirīyopaniṣat - 2.1) Brahman is Truth, Knowledge, and Infinite.

यज्ञ इज्यो महेज्यश्च क्रतुस्सत्रं सतां गतिः ।
सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् ॥ ४८ ॥

యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతుస్సత్రం సతాం గతిః ।
సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమమ్ ॥ ౪౮ ॥

Yajña ijyo mahejyaśca kratussatraṃ satāṃ gatiḥ ।
Sarvadarśī vimuktātmā sarvajño jñānamuttamam ॥ 48 ॥

30 జన, 2014

453. సర్వజ్ఞః, सर्वज्ञः, Sarvajñaḥ

ఓం సర్వజ్ఞాయ నమః | ॐ सर्वज्ञाय नमः | OM Sarvajñāya namaḥ

సర్వశ్చ జ్ఞశ్చ సర్వజ్ఞ ఇదం సర్వమితి శ్రుతేః ఈతడు సర్వము తానైనవాడును, జ్ఞుడు అనగా ఎరుక గలవాడు లేదా ఎరుకయే తానయిన వాడును. 'సర్వం య దయ మాత్మా' (బృహదారణ్యకోపనిషత్ 2.4.6) 'ఏదియున్నదో అదియెల్ల ఆత్మతత్త్వమే' అను శ్రుతి ఇందు ప్రమాణము.

Sarvaśca jñaśca sarvajña idaṃ sarvamiti śruteḥ / सर्वश्च ज्ञश्च सर्वज्ञ इदं सर्वमिति श्रुतेः He is the all and knower. So Sarvajñaḥ vide the śruti Sarvaṃ ya daya mātmā / सर्वं य दय मात्मा (Br̥hadāraṇyakopaniṣat / बृहदारण्यकोपनिषत् 2.4.6) All this - is the ātma.

यज्ञ इज्यो महेज्यश्च क्रतुस्सत्रं सतां गतिः ।
सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् ॥ ४८ ॥

యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతుస్సత్రం సతాం గతిః ।
సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమమ్ ॥ ౪౮ ॥

Yajña ijyo mahejyaśca kratussatraṃ satāṃ gatiḥ ।
Sarvadarśī vimuktātmā sarvajño jñānamuttamam ॥ 48 ॥

29 జన, 2014

452. విముక్తాఽఽత్మా, विमुक्ताऽऽत्मा, Vimuktā’’tmā

ఓం విముక్తాఽఽత్మనే నమః | ॐ विमुक्ताऽऽत्मने नमः | OM Vimuktā’’tmane namaḥ

స్వభావేనైవ విముక్తో యస్యాత్మా స్వయమేవ వా ।
విముక్తోఽసావితి హరిర్విముక్తాత్మేతి కథ్యతే ॥
కఠనామోపనిషది విముక్తశ్చ విముచ్యతే ।
ఇతి శ్రుతేర్మహావిష్ణుః పరమాత్మా సనాతనః ॥

ఏ సాధనముతో పనిలేకయే ముక్తినందినది అగు ఆత్మ ఎవనిదియో అట్టివాడు. ఇట్లు చెప్పుటచే అతనికి ఒక ఆత్మ అన్ని ప్రాణులకునువలె ఉన్నదని, ఆతడును మన అందరివలె ఒక ప్రాణియే అనియూ అర్థము వచ్చుచున్నందున, శాస్త్ర విరుద్ధమైన ఈ దోషమును పరిహరించ వలయునని మరియొక విధముగా అర్థము ఇట్లు చెప్పవచ్చును.

జీవులలోని ఆత్మ వస్తుతత్త్వమున విముక్తమే. బంధములు లేనిది. అయిననూ అజ్ఞానవశమున బంధములలో తానున్నదనుకొనుచు గురు, పరమేశ్వర అనుగ్రహమున అది తొలగి విముక్తుడగుచున్నాడు.

ఈ అర్థమున 'విముక్తశ్చ విముచ్యతే' (కఠోపనిషత్ 2-5-1) 'బంధములో ఉన్నాడను భ్రాంతి కలిగి దానిని వదిలించుకొని విముక్తుడగుచున్నాడు' అను శ్రుతి వచనము ఇచట ప్రమాణము.

Svabhāvenaiva vimukto yasyātmā svayameva vā,
Vimukto’sāviti harirvimuktātmeti kathyate.
Kaṭhanāmopaniṣadi vimuktaśca vimucyate,
Iti śrutermahāviṣṇuḥ paramātmā sanātanaḥ.

स्वभावेनैव विमुक्तो यस्यात्मा स्वयमेव वा ।
विमुक्तोऽसाविति हरिर्विमुक्तात्मेति कथ्यते ॥
कठनामोपनिषदि विमुक्तश्च विमुच्यते ।
इति श्रुतेर्महाविष्णुः परमात्मा सनातनः ॥

One who is naturally free. But this definition leads to a misinterpretation that even He is with a soul as like all of us. But since this is misleading, the interpretation needs to be looked at correctly as below.

The soul in all the beings is in reality without bonds. However, because of the illusion that is it bonded, seeking guidance from a capable teacher and by the mercy of Lord, it breaks free from this illusion and realizes its true free state.

The verses from Kaṭhopaniṣat (2.5.1) support this as 'Vimuktaśca vimucyate' meaning 'getting rid of the bonds, being naturally free, it becomes free'

यज्ञ इज्यो महेज्यश्च क्रतुस्सत्रं सतां गतिः ।
सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् ॥ ४८ ॥

యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతుస్సత్రం సతాం గతిః ।
సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమమ్ ॥ ౪౮ ॥

Yajña ijyo mahejyaśca kratussatraṃ satāṃ gatiḥ ।
Sarvadarśī vimuktātmā sarvajño jñānamuttamam ॥ 48 ॥

28 జన, 2014

451. సర్వదర్శీ, सर्वदर्शी, Sarvadarśī

ఓం సర్వదర్శినే నమః | ॐ सर्वदर्शिने नमः | OM Sarvadarśine namaḥ

సర్వేషాం ప్రాణినాం విష్ణుః పశ్యన్ సర్వం కృతాకృతమ్ ।
స్వాభావికేన బోధేన సర్వదర్శీతి కథ్యతే ॥

తన స్వభావ స్వరూపము అగు జ్ఞానముచే సకల ప్రాణుల కృతమును - వారిచే ఆచరించబడిన కర్మమును, తత్ఫలమును; అకృతము - పూర్వజన్మార్జిత కర్మముల ఫలమును, అదృష్టమును సర్వమును దర్శించువాడు. అంతటి శక్తిశాలి శ్రీ విష్ణువే!

Sarveṣāṃ prāṇināṃ viṣṇuḥ paśyan sarvaṃ kr̥tākr̥tam,
Svābhāvikena bodhena sarvadarśīti kathyate.

सर्वेषां प्राणिनां विष्णुः पश्यन् सर्वं कृताकृतम् ।
स्वाभाविकेन बोधेन सर्वदर्शीति कथ्यते ॥

By His inborn insight and abilities, He sees what is done and the result; as well as what has been done by a being in the past life and result of those actions.

यज्ञ इज्यो महेज्यश्च क्रतुस्सत्रं सतां गतिः ।
सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् ॥ ४८ ॥

యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతుస్సత్రం సతాం గతిః ।
సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమమ్ ॥ ౪౮ ॥

Yajña ijyo mahejyaśca kratussatraṃ satāṃ gatiḥ ।
Sarvadarśī vimuktātmā sarvajño jñānamuttamam ॥ 48 ॥

27 జన, 2014

450. సతాంగతిః, सतांगतिः, Satāṃgatiḥ

ఓం సతాంగతయే నమః | ॐ सतांगतये नमः | OM Satāṃgataye namaḥ

నాన్యాగతిర్ముముక్షూణాం హరిరేవ సతాంగతిః సజ్జనులకూ, ముముక్షువులకూ ఇతడే గమ్యమునూ, దానిని చేరుటకు మార్గమునూ అయియున్నాడు. మరియొక గతిలేదు కావున శ్రీమహావిష్ణువు 'సతాంగతిః' అనబడుచున్నాడు.

184. సతాంగతిః, सतांगतिः, Satāṃgatiḥ

Nānyāgatirmumukṣūṇāṃ harireva satāṃgatiḥ / नान्यागतिर्मुमुक्षूणां हरिरेव सतांगतिः One who is the destination as well as the path to the seekers of liberation. Since there is no other refuge, Lord Viṣṇu is 'Satāṃgatiḥ'.

184. సతాంగతిః, सतांगतिः, Satāṃgatiḥ

यज्ञ इज्यो महेज्यश्च क्रतुस्सत्रं सतांगतिः
सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् ॥ ४८ ॥

యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతుస్సత్రం సతాంగతిః
సర్వదర్శీ విముక్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమమ్ ॥ ౪౮ ॥

Yajña ijyo mahejyaśca kratussatraṃ satāṃgatiḥ
Sarvadarśī vimuktātmā sarvajño jñānamuttamam ॥ 48 ॥