31 జన, 2015

819. సిద్ధః, सिद्धः, Siddhaḥ

ఓం సిద్ధాయ నమః | ॐ सिद्धाय नमः | OM Siddhāya namaḥ


అనన్యాధీన సిద్ధిత్వాత్ సిద్ధ ఇత్యుచ్యతే హరిః ఇతరుల ఆధీనమునందు లేని - తన అధీనస్థమేయగు - కార్య సిద్ధిని పొందియుండువాడు. ఎంతటి కార్యమునైనను అనన్యాపేక్షముగా, స్వతంత్రముగా నెరవేర్చగలవాడు పరమాత్ముడు.

97. సిద్ధః, सिद्धः, Siddhaḥ



अनन्याधीन सिद्धित्वात् सिद्ध इत्युच्यते हरिः / Ananyādhīna siddhitvāt siddha ityucyate hariḥ Ever existent without dependence on others.

97. సిద్ధః, सिद्धः, Siddhaḥ

सुलभस्सुव्रतस्सिद्धश्शत्रुजिच्छत्रुतापनः ।
न्यग्रोधोदुम्बरोऽश्वत्थश्‍चाणूरान्ध्रनिषूदनः ॥ ८८ ॥

సులభస్సువ్రతస్సిద్ధశ్శత్రుజిచ్ఛత్రుతాపనః ।
న్యగ్రోధోదుమ్బరోఽశ్వత్థశ్‍చాణూరాన్ధ్రనిషూదనః ॥ 88 ॥

Sulabhassuvratassiddhaśśatrujicchatrutāpanaḥ,
Nyagrodhodumbaro’śvatthaśˈcāṇūrāndhraniṣūdanaḥ ॥ 88 ॥

30 జన, 2015

818. సువ్రతః, सुव्रतः, Suvrataḥ

ఓం సువ్రతాయ నమః | ॐ सुव्रताय नमः | OM Suvratāya namaḥ


యశ్శోభనం వ్రతయతి భుఙ్క్తే విష్ణుర్హిభోజనాత్ ।
నివర్తత ఇతి వా స సువ్రతః ప్రోచ్యతే బుధైః ॥

వ్రతము అను శభ్దమునకు భుజించుట, భుజించుటను విరమించుట అను రెండు అర్థములు కలవు. చక్కగా వ్రతమును పాటించు జీవులును పరమాత్మ స్వరూపులే.



यश्शोभनं व्रतयति भुङ्क्ते विष्णुर्हिभोजनात् ।
निवर्तत इति वा स सुव्रतः प्रोच्यते बुधैः ॥

Yaśśobhanaṃ vratayati bhuṅkte viṣṇurhibhojanāt,
Nivartata iti vā sa suvrataḥ procyate budhaiḥ.

Suvrataḥ is He who is of excellent vows or enjoys eminently or ceases from enjoyment as the occasion may demand.

सुलभस्सुव्रतस्सिद्धश्शत्रुजिच्छत्रुतापनः ।
न्यग्रोधोदुम्बरोऽश्वत्थश्‍चाणूरान्ध्रनिषूदनः ॥ ८८ ॥

సులభస్సువ్రతస్సిద్ధశ్శత్రుజిచ్ఛత్రుతాపనః ।
న్యగ్రోధోదుమ్బరోఽశ్వత్థశ్‍చాణూరాన్ధ్రనిషూదనః ॥ 88 ॥

Sulabhassuvratassiddhaśśatrujicchatrutāpanaḥ,
Nyagrodhodumbaro’śvatthaśˈcāṇūrāndhraniṣūdanaḥ ॥ 88 ॥

29 జన, 2015

817. సులభః, सुलभः, Sulabhaḥ

ఓం సులభాయ నమః | ॐ सुलभाय नमः | OM Sulabhāya namaḥ


భక్త్యాసమర్పితైర్లభ్య పత్రపుష్పఫలాదిభిః ।
సుఖేన లభ్యత ఇతి విష్ణుస్సులభ ఉచ్యతే ॥

సుఖముగా పొందబడువాడు. భక్తిమాత్ర సమర్పితములగు పత్ర పుష్పాదులచేతనే సుఖముగా లభించుచున్నాడు.

:: శ్రీ గరుడ మహాపురాణము ఆచారకాణ్డము 227వ అధ్యాయము ::
పత్రేషు పుష్పేషు ఫలేషు తోయే
    ష్వక్రితలభ్యేషు సదైవసత్సు ।
భక్త్యైకలభ్యే పురుషే పురాణే
    ముక్త్యై కథం న క్రియతే ప్రయత్నః ॥ 33 ॥


కొనకనే లభ్యములగు పత్రములును, పుష్పములును, ఫలములును, జలములును ఉండగా, వానిని అర్పించుట చేతనే, కేవల భక్తిచే లభ్యుడగు శాశ్వత పురాణ పురుషుడు (విష్ణువు) ఉండగా - ముక్తికై ప్రయత్నము ఎట్లు చేయబడకయున్నది?



भक्त्यासमर्पितैर्लभ्य पत्रपुष्पफलादिभिः ।
सुखेन लभ्यत इति विष्णुस्सुलभ उच्यते ॥

Bhaktyāsamarpitairlabhya patrapuṣpaphalādibhiḥ,
Sukhena labhyata iti viṣṇussulabha ucyate.

He who can easily be attained by mere offerings of leaves, flower and fruits - offered with pure devotion alone.

:: श्रीगरुडमहापुराण आचारकाण्ड अध्याय २२७ ::
पत्रेषु पुष्पेषु फलेषु तोये
    ष्वक्रितलभ्येषु सदैवसत्सु ।
भक्त्यैकलभ्ये पुरुषे पुराणे
    मुक्त्यै कथं न क्रियते प्रयत्नः ॥ ३३ ॥


Śrī Garuḍa Mahāpurāṇa ācāra kāṇḍa chapter 227 
Patreṣu puṣpeṣu phaleṣu toye
    Ṣvakritalabhyeṣu sadaivasatsu,
Bhaktyaikalabhye puruṣe purāṇe
    Muktyai kathaṃ na kriyate prayatnaḥ. 33.

When leaves, flowers and fruits are always available without any cost, why is not endeavor made for salvation by propitiating the ancient Puruṣa with them? He can be attained by devotion alone!

सुलभस्सुव्रतस्सिद्धश्शत्रुजिच्छत्रुतापनः ।
न्यग्रोधोदुम्बरोऽश्वत्थश्‍चाणूरान्ध्रनिषूदनः ॥ ८८ ॥

సులభస్సువ్రతస్సిద్ధశ్శత్రుజిచ్ఛత్రుతాపనః ।
న్యగ్రోధోదుమ్బరోఽశ్వత్థశ్‍చాణూరాన్ధ్రనిషూదనః ॥ 88 ॥

Sulabhassuvratassiddhaśśatrujicchatrutāpanaḥ,
Nyagrodhodumbaro’śvatthaśˈcāṇūrāndhraniṣūdanaḥ ॥ 88 ॥

28 జన, 2015

816. సర్వతోముఖః, सर्वतोमुखः, Sarvatomukhaḥ

ఓం సర్వతోముఖాయ నమః | ॐ सर्वतोमुखाय नमः | OM Sarvatomukhāya namaḥ


సర్వతోఽక్షి శిరోముఖమితి భగవదుక్తితః ।
సర్వతోముఖ ఇతి స విష్ణురేవాభిధీయతే ॥

అన్ని వైపులకును ముఖములు ఎవనికి కలవో అట్టివాడు సర్వతోముఖుడు.

:: శ్రీమద్భగవద్గీత క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగము ::
సర్వతః పాణిపాదం తత్సర్వతోఽక్షి శిరోముఖమ్ ।
సర్వతః శ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి ॥ 14 ॥

బ్రహ్మము అంతటను చేతులు, కాళ్ళు గలదియు; అంతటను కన్నులు, తలలు, ముఖములు గలదియు, అంతటను చెవులు గలదియునయి ప్రపంచమునందు సమస్తమును వ్యాపించుకొనియున్నది.



सर्वतोऽक्षि शिरोमुखमिति भगवदुक्तितः ।
सर्वतोमुख इति स विष्णुरेवाभिधीयते ॥

Sarvato’kṣi śiromukhamiti bhagavaduktitaḥ,
Sarvatomukha iti sa viṣṇurevābhidhīyate.

He who has faces in all directions is Sarvatomukhaḥ.

That which has hands and feet everywhere, which has eyes, faces and mouths everywhere, which has ears everywhere, exists in creatures by pervading them all.

कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनोऽनिलः ।
अमृतांशोऽमृतवपुस्सर्वज्ञस्सर्वतोमुखः ॥ ८७ ॥

కుముదః కున్దరః కున్దః పర్జన్యః పావనోఽనిలః ।
అమృతాంశోఽమృతవపుస్సర్వజ్ఞస్సర్వతోముఖః ॥ 87 ॥

Kumudaḥ kundaraḥ kundaḥ parjanyaḥ pāvano’nilaḥ,
Amr̥tāṃśo’mr̥tavapussarvajñassarvatomukhaḥ ॥ 87 ॥

27 జన, 2015

815. సర్వజ్ఞః, सर्वज्ञः, Sarvajñaḥ

ఓం సర్వజ్ఞాయ నమః | ॐ सर्वज्ञाय नमः | OM Sarvajñāya namaḥ


సర్వం జానాతి యో విష్ణుస్స సర్వజ్ఞ ఇతీర్యతే ।
యస్సర్వజ్ఞస్సర్వవిదిత్యాదిశ్రుతిసమీరణాత్ ॥

సర్వమును, సర్వముయగు ఆత్మ తత్త్వమును స్వస్వరూపమున తానే ఎరిగియుండువాడు. సర్వమును అఖిల విశ్వములయందలి ప్రతీ అంశమును ఎరుగువాడు. 'యః సర్వజ్ఞః సర్వవిత్' (ముణ్డకోపనిషత్ 1.1.9) - 'ఏ పరమాత్ముడు సామాన్య రూపమున సర్వమును ఎరిగినవాడో విశేష రూపమునను సర్వమును ఎరిగిన వాడో' అను శ్రుతి వచనము ఇందులకు ప్రమాణము.



सर्वं जानाति यो विष्णुस्स सर्वज्ञ इतीर्यते ।
यस्सर्वज्ञस्सर्वविदित्यादिश्रुतिसमीरणात् ॥

Sarvaṃ jānāti yo viṣṇussa sarvajña itīryate,
Yassarvajñassarvavidityādiśrutisamīraṇāt.

He who knows everything, knowledge of all pervading ātman. The Omniscient vide the śruti 'यः सर्वज्ञः सर्ववित्  / Yaḥ sarvajñaḥ sarvavit' (Muṇḍakopaniṣat 1.1.9) - He who is omniscient and knows all.

कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनोऽनिलः ।
अमृतांशोऽमृतवपुस्सर्वज्ञस्सर्वतोमुखः ॥ ८७ ॥

కుముదః కున్దరః కున్దః పర్జన్యః పావనోఽనిలః ।
అమృతాంశోఽమృతవపుస్సర్వజ్ఞస్సర్వతోముఖః ॥ 87 ॥

Kumudaḥ kundaraḥ kundaḥ parjanyaḥ pāvano’nilaḥ,
Amr̥tāṃśo’mr̥tavapussarvajñassarvatomukhaḥ ॥ 87 ॥