30 ఏప్రి, 2015

908. చక్రీ, चक्री, Cakrī

ఓం చక్రిణే నమః | ॐ चक्रिणे नमः | OM Cakriṇe namaḥ


సమస్తలోకరక్షార్థం మనస్తత్త్వాత్మకం సుదర్శనాఖ్యం చక్రం ధత్త ఇతి చక్రీ చక్రము ఈతనికి కలదు. సమస్త లోక రక్షార్థము మనస్తత్త్వ రూపమగు సుదర్శనమను పేరు కల చక్రమును ధరించువాడు కనుక విష్ణునకు చక్రీ అను నామము కలదు.

:: శ్రీ విష్ణుమహాపురాణే ప్రథమాంశే ద్వావింశోఽధ్యాయః ::
చలస్వరూపమత్యన్తం జవేనాన్తరితానిలమ్ ।
చక్రస్వరూపం చ మనో ధత్తే విష్ణుః కరే స్థితమ్ ॥ 71 ॥

చలించు స్వభావము కలదియు, తన అత్యంతవేగముచే వాయువును కూడ క్రిందుపరచునదియు, చక్రస్వరూపము కలదియు అగు మనసును - విష్ణువు తన కరమునందు ధరించుచున్నాడు.



समस्तलोकरक्षार्थं मनस्तत्त्वात्मकं सुदर्शनाख्यं चक्रं धत्त इति चक्री / Samastalokarakṣārthaṃ manastattvātmakaṃ sudarśanākhyaṃ cakraṃ dhatta iti cakrī He wields the discus known as Sudarśana of the nature of the mind for the protection of all the worlds.

:: श्री विष्णुमहापुराणे प्रथमांशे द्वाविंशोऽध्यायः ::
चलस्वरूपमत्यन्तं जवेनान्तरितानिलम् ।
चक्रस्वरूपं च मनो धत्ते विष्णुः करे स्थितम् ॥ ७१ ॥

Viṣṇu Purāṇa - Part 1, Chapter 22
Calasvarūpamatyantaṃ javenāntaritānilam,
Cakrasvarūpaṃ ca mano dhatte viṣṇuḥ kare sthitam. 71.

Viṣṇu holds in His hands the Cakra or discus representing the unsteady mind, swifter than the wind.

अरौद्रः कुण्डली चक्री विक्रम्यूर्जितशासनः ।
शब्दातिगश्शब्दसहश्शिशिरश्शर्वरीकरः ॥ ९७ ॥

అరౌద్రః కుణ్డలీ చక్రీ విక్రమ్యూర్జితశాసనః ।
శబ్దాతిగశ్శబ్దసహశ్శిశిరశ్శర్వరీకరః ॥ 97 ॥

Araudraḥ kuṇḍalī cakrī vikramyūrjitaśāsanaḥ,
Śabdātigaśśabdasahaśśiśiraśśarvarīkaraḥ ॥ 97 ॥

29 ఏప్రి, 2015

907. కుణ్డలీ, कुण्डली, Kuṇḍalī

ఓం కుణ్డలినే నమః | ॐ कुण्डलिने नमः | OM Kuṇḍaline namaḥ


శేషరూపభాక్ కుణ్డలీ సహస్రంశుమణ్డలోపమకుణ్డలధారణాద్వా; యద్ధా సాఙ్ఖ్యయోగాత్మకే కుణ్డలే మకరాకారే అస్య స్త ఇతి కుణ్డలీ కుండలములు ఈతనికి కలవు. అవి ఎట్టివి?

1. 'కుండలీ' అను పదము వాడుకలో సర్పమును చెప్పును. విష్ణువు శేష రూపధారి కనుక కుండలీ.

2. సూర్యమండలమును పోలిన కుండలములు ధరించినవాడు కనుక కుండలీ.

3. సాంఖ్యము, యోగము అను దర్శనముల రూపమున ఉండు కుండలములు మకరపు ఆకృతి కలవి. అవి ఈతనికి కలవు కనుక కుండలీ.



शेषरूपभाक् कुण्डली सहस्रंशुमण्डलोपमकुण्डलधारणाद्वा; यद्धा साङ्ख्ययोगात्मके कुण्डले मकराकारे अस्य स्त इति कुण्डली / Śeṣarūpabhāk kuṇḍalī sahasraṃśumaṇḍalopamakuṇḍaladhāraṇādvā; yaddhā sāṅkhyayogātmake kuṇḍale makarākāre asya sta iti kuṇḍalī The One with Kuṇḍalas or ear ornaments. Which kind?

1. The word 'Kuṇḍalī' means a serpent. Since Lord Viṣṇu is of the form of śeṣa or serpent, He is called Kuṇḍalī.

2. He has ear ornaments resembling the sun and hence Kuṇḍalī.

3. Philosophies like sāṅkhya and yoga, which are considered to be of the shape of makara or fish, are His ear ornaments.

अरौद्रः कुण्डली चक्री विक्रम्यूर्जितशासनः ।
शब्दातिगश्शब्दसहश्शिशिरश्शर्वरीकरः ॥ ९७ ॥

అరౌద్రః కుణ్డలీ చక్రీ విక్రమ్యూర్జితశాసనః ।
శబ్దాతిగశ్శబ్దసహశ్శిశిరశ్శర్వరీకరః ॥ 97 ॥

Araudraḥ kuṇḍalī cakrī vikramyūrjitaśāsanaḥ,
Śabdātigaśśabdasahaśśiśiraśśarvarīkaraḥ ॥ 97 ॥

28 ఏప్రి, 2015

906. అరౌద్రః, अरौद्रः, Araudraḥ

ఓం అరౌద్రాయ నమః | ॐ अरौद्राय नमः | OM Araudrāya namaḥ


కర్మ రౌద్రమ్ రాగశ్చ రౌద్రః కోపశ్చ రౌద్రః యస్య రౌద్రత్రయం నాస్తి అవాప్తసర్వకామత్వేన రాగద్వేషాదేరభావాత్ అరౌద్రః రౌద్రము లేదా ఉగ్రమగు కర్మాచరణము కాని, 'ఇవి నాకు సుఖము కలిగించునవి కావున నేను పొందవలయును' అను తలంపు అగు రౌద్రపూరితమగు రాగము కాని, రౌద్రమగు కోపము - ఈ మూడు రౌద్ర త్రయమును ఎవనియందు లేవో అట్టివాడు భగవానుడు శ్రీ విష్ణువు. అన్ని కోరికల ఫలములను పొందియున్నవాడగు అవాప్త సర్వకాముడు కావున అతని యందు రాగము, ద్వేషము, కోపము మొదలగునవి ఉండుటకు అవకాశము లేదు. అవి రౌద్రములుగా ఉండు అవకాశము మొదలే లేదు.



कर्म रौद्रम् रागश्च रौद्रः कोपश्च रौद्रः यस्य रौद्रत्रयं नास्ति अवाप्तसर्वकामत्वेन रागद्वेषादेरभावात् अरौद्रः / Karma raudram rāgaśca raudraḥ kopaśca raudraḥ yasya raudratrayaṃ nāsti avāptasarvakāmatvena rāgadveṣāderabhāvāt araudraḥ Action is wild, attachment is passionate and anger is violent. He in whom these three kinds of fierceness do not exist by reason of His being of all fulfilled desires and as He is not moved by attachment, aversion etc., He is Araudraḥ.

अरौद्रः कुण्डली चक्री विक्रम्यूर्जितशासनः ।
शब्दातिगश्शब्दसहश्शिशिरश्शर्वरीकरः ॥ ९७ ॥

అరౌద్రః కుణ్డలీ చక్రీ విక్రమ్యూర్జితశాసనః ।
శబ్దాతిగశ్శబ్దసహశ్శిశిరశ్శర్వరీకరః ॥ 97 ॥

Araudraḥ kuṇḍalī cakrī vikramyūrjitaśāsanaḥ,
Śabdātigaśśabdasahaśśiśiraśśarvarīkaraḥ ॥ 97 ॥

27 ఏప్రి, 2015

905. స్వస్తిదక్షిణః, स्वस्तिदक्षिणः, Svastidakṣiṇaḥ

ఓం స్వస్తిదక్షిణాయ నమః | ॐ स्वस्तिदक्षिणाय नमः | OM Svastidakṣiṇāya namaḥ


స్వస్తిరూపేణ దక్షతే వర్ధతే, స్వమ్తి దాన్తుం సమర్థ ఇతి వా స్వస్తిదక్షిణః । అథవా దక్షిణశబ్ద ఆశుకారిణి వర్తతే; శీఘ్రం స్వస్తి దాతుమ్ అయమేవ సమర్థ ఇతి, యస్య స్మరణాదేవ సిధ్యన్తి సర్వసిద్దయః ॥

1. శుభకర రూపముతో వర్ధిల్లుచు నిరంతరము కొనసాగుచు ఉండువాడు.

2. శుభములను ఇచ్చుటకు శక్తి కలవాడు.

3. 'దక్షిణ' శబ్దమునకు 'శీఘ్రకారీ' అనగా శీఘ్రముగా పనిని చేయువాడు అను అర్థమును కలదు. ఏ భగవానుని స్మరించినంత మాత్రముననే సర్వసిద్ధులు సిద్ధించునో అట్టివాడు శ్రీ మహా విష్ణువు కావున 'స్వస్తి దక్షిణః' అనగా శీఘ్రముగా శుభములను ఇచ్చుటకు సమర్థుడు అను అర్థమును చెప్పవచ్చును.

:: శ్రీ విష్ణు పురాణే పఞ్చమాంశే సప్తదశోఽధ్యాయః ::
స్మృతే సకల కల్యాణ భాజనం యత్ర జాయతే ।
పురుష స్త మజం నిత్యం వ్రజామి శరణం హరిమ్ ॥ 18 ॥

ఎవరు స్మరించబడినంతనే జీవుడు సకల శుభములకును పాత్రము అగునో, అట్టి జన్మరహితుడును, నిత్యుడును, స్వయం సిద్ధుడును, శాశ్వతుడును అగు హరిని రక్షకునిగా శరణమును పొందుచున్నాను.

స్మరణా దేవ కృష్ణస్య పాపసఙ్ఘాతపఞ్జరం ।
శతధా భేద మాయాతి గిరిర్వ్రజహతోయథా ॥

కృష్ణుని స్మరణ మాత్రము వలననే పాపముల రాశి అను పంజరము వజ్రపు దెబ్బ తినిన పర్వతమువలె నూరు చెక్కలుగా బ్రద్దలగుచున్నది.

ఈ మొదలగు వచనములను బట్టి పై అర్థము సమర్థింపబడుచున్నది.



स्वस्तिरूपेण दक्षते वर्धते, स्वम्ति दान्तुं समर्थ इति वा स्वस्तिदक्षिणः । अथवा, दक्षिणशब्द आशुकारिणि वर्तते; शीघ्रं स्वस्ति दातुम् अयमेव समर्थ इति, यस्य स्मरणादेव सिध्यन्ति सर्वसिद्दयः ॥

Svastirūpeṇa dakṣate vardhate, svamti dāntuṃ samartha iti vā svastidakṣiṇaḥ, athavā, dakṣiṇaśabda āśukāriṇi vartate; śīghraṃ svasti dātum ayameva samartha iti.

1. He who grows in the form of svasti i.e., auspiciousness.

2. He who is efficient in conferring svasti i.e., auspiciousness.

3. The word dakṣiṇaḥ is applied to one who does action quickly. Lord Śrī Mahā Viṣṇu alone is able to confer svasti quickly; for by mere devout thought of Him are realized all siddhis vide the below.

:: श्री विष्णु पुराणे पञ्चमांशे सप्तदशोऽध्यायः ::
स्मृते सकल कल्याण भाजनं यत्र जायते ।
पुरुष स्त मजं नित्यं व्रजामि शरणं हरिम् ॥ १८ ॥

Śrī Viṣṇu Purāṇa Section 5, Chapter 17
Smr̥te sakala kalyāṇa bhājanaṃ yatra jāyate,
Puruṣa sta majaṃ nityaṃ vrajāmi śaraṇaṃ harim. 18.

I always seek refuge in Hari the unborn - who when remembered, becomes the source from which all auspiciousness flows.

स्मरणा देव कृष्णस्य पापसङ्घातपञ्जरं ।
शतधा भेद मायाति गिरिर्व्रजहतोयथा ॥

Smaraṇā deva kr̥ṣṇasya pāpasaṅghātapañjaraṃ,
Śatadhā bheda māyāti girirvrajahatoyathā.

By remembrance alone of Kr̥ṣṇa, the totality of sins is split into hundredfold like a mountain struck by vajra (Indra's thunderbolt weapon).

सनात्सनातनतमः कपिलः कपिरप्ययः ।
स्वस्तिदस्स्वस्तिकृत् स्वस्ति स्वस्तिभुक् स्वस्तिदक्षिणः ॥ ९६ ॥

సనాత్సనాతనతమః కపిలః కపిరప్యయః ।
స్వస్తిదస్స్వస్తికృత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః ॥ 96 ॥

Sanātsanātanatamaḥ kapilaḥ kapirapyayaḥ,
Svastidassvastikr̥t svasti svastibhuk svastidakṣiṇaḥ ॥ 96 ॥

26 ఏప్రి, 2015

904. స్వస్తిభుక్, स्वस्तिभुक्, Svastibhuk

ఓం స్వస్తిభుజే నమః | ॐ स्वस्तिभुजे नमः | OM Svastibhuje namaḥ


తదేవ భుక్తం ఇతి స్వస్తిభుక్ స్వస్తిని, శుభమును అనుభవించును కనుక స్వస్తిభుక్. భక్తానాం మఙ్గలం స్వస్తి భునక్తీతి వా స్వస్తిభుక్ లేదా భక్తుల స్వస్తిని, శుభమును రక్షించును కనుక స్వస్తిభుక్ అని కూడ చెప్పవచ్చును.



तदेव भुक्तं इति स्वस्तिभुक् / Tadeva bhuktaṃ iti svastibhuk Since He is the enjoyer of svasti or auspiciousness, He is called Svastibhuk. भक्तानां मङ्गलं स्वस्ति भुनक्तीति वा स्वस्तिभुक् / Bhaktānāṃ maṅgalaṃ svasti bhunaktīti vā svastibhuk or He protects the auspiciousness of His devotees hence Svastibhuk.

सनात्सनातनतमः कपिलः कपिरप्ययः ।
स्वस्तिदस्स्वस्तिकृत् स्वस्ति स्वस्तिभुक् स्वस्तिदक्षिणः ॥ ९६ ॥

సనాత్సనాతనతమః కపిలః కపిరప్యయః ।
స్వస్తిదస్స్వస్తికృత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః ॥ 96 ॥

Sanātsanātanatamaḥ kapilaḥ kapirapyayaḥ,
Svastidassvastikr̥t svasti svastibhuk svastidakṣiṇaḥ ॥ 96 ॥