30 జూన్, 2015

969. సవితా, सविता, Savitā

ఓం సవిత్రే నమః | ॐ सवित्रे नमः | OM Savitre namaḥ


సర్వలోకస్య జనకః సవితేత్యుచ్యతే హరిః తండ్రిగా సర్వలోకమును జనింపజేయు సర్వలోకైక జనకుడుగాన ఆ హరి సవితా అని చెప్పబడును.

:: శ్రీమద్రామాయణే యుద్ధకాణ్డే సప్తోత్తరశతతమస్సర్గః (ఆదిత్య హృదయ స్తోత్రమ్) ::
ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ ।
సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః ॥ 10 ॥

ఇతడు అదితి పుత్రుడు (ఆదిత్యః) జగత్సృష్టికి కారకుడు (సవితా) జనులు తమ తమ విధులను నిర్వర్తించుటకు ప్రేరణను ఇచ్చువాడు (సూర్యః) లోకోపకారము కొరకు ఆకాశమున సంచరించుచుండెడివాడు (ఖగః) వర్షముల ద్వారమున జగత్తును పోషించెడివాడు (పూషా) తన కిరణములచే లోకములను ప్రకాశింపజేయువాడు (గభస్తిమాన్‍) బంగారు వన్నెతో తేజరిల్లుచుండువాడు (సువర్ణసదృశః) అద్భుతముగా ప్రకాశించుచుండువాడు (భానుః) బ్రహ్మాండముల ఉత్పత్తికి బీజమైనవాడు (హిరణ్యరేతాః) చీకట్లను తొలగించుచు దివాసమయమున ప్రాణులను కార్యనిమగ్నులను కావించువాడు (దివాకరః).



सर्वलोकस्य जनकः सवितेत्युच्यते हरिः / Sarvalokasya janakaḥ savitetyucyate Hariḥ Since Lord Hari is the progenitor of all worlds, He is called Savitā.

:: श्रीमद्रामायणे युद्धकाण्डे सप्तोत्तरशततमस्सर्गः (आदित्य हृदय स्तोत्रम्) ::
आदित्यः सविता सूर्यः खगः पूषा गभस्तिमान् ।
सुवर्णसदृशो भानुः हिरण्यरेता दिवाकरः ॥ १० ॥

Śrīmad Rāmāyaṇa Book 6, Chapter 107 (Āditya Hr̥daya Stotra)
Ādityaḥ savitā sūryaḥ khagaḥ pūṣā gabhastimān,
Suvarṇasadr̥śo bhānuḥ hiraṇyaretā divākaraḥ. 10.

An off-spring of Aditi (आदित्यः/Ādityaḥ), the Progenitor of all (सविता/Savitā), Surya the sun-god and the Provocator of acts in people (सूर्यः/Sūryaḥ), the Courser in the sky (खगः/Khagaḥ), the Nourisher of all with rain (पूषा/Pūṣā), the One who illuminates the worlds (गभस्तिमान्/Gabhastimān), the Possessor of golden rays (सुवर्णसदृशः/Suvarṇasadr̥śaḥ), the Brilliant (भानुः/Bhānuḥ), having golden seed whose energy constitutes the seed of the universe  (हिरण्यरेताः/Hiraṇyaretāḥ) and the Maker of the day (दिवाकरः/Divākaraḥ).

भूर्भुवस्स्वस्तरुस्तारस्सविता प्रपितामहः ।
यज्ञो यज्ञपतिर्यज्वायज्ञाङ्गोयज्ञवाहनः ॥ १०४ ॥

భూర్భువస్స్వస్తరుస్తారస్సవితా ప్రపితామహః ।
యజ్ఞో యజ్ఞపతిర్యజ్వాయజ్ఞాఙ్గోయజ్ఞవాహనః ॥ 104 ॥

Bhūrbhuvassvastarustārassavitā prapitāmahaḥ,
Yajño yajñapatiryajvāyajñāṅgoyajñavāhanaḥ ॥ 104 ॥

29 జూన్, 2015

968. తారః, तारः, Tāraḥ

ఓం తారాయ నమః | ॐ ताराय नमः | OM Tārāya namaḥ


సంసారసాగరం విష్ణుస్తారయన్ తార ఉచ్యతే ।
ప్రణవప్రతిపాద్యత్వాద్ వా తార ఇతి కీర్త్యతే ॥

తన అనుగ్రహముతో జీవులను సంసార సాగరమునుండి దాటించును. లేదా తారః అనునది ప్రణవమునకు మరియొకపేరు. పరమాత్మ ప్రణవ రూపుడును, ప్రణవముచే చెప్పబడువాడును కనుక తారః అని చెప్పబడును.

338. తారః, तारः, Tāraḥ



संसारसागरं विष्णुस्तारयन् तार उच्यते ।
प्रणवप्रतिपाद्यत्वाद् वा तार इति कीर्त्यते ॥

Saṃsārasāgaraṃ viṣṇustārayan tāra ucyate,
Praṇavapratipādyatvād vā tāra iti kīrtyate.

By His grace He helps devotees cross the ocean of worldly existence. Or Tāraḥ also means Praṇava i.e., Oṃkāra. Since the Lord is Praṇava Himself and is also indicated by it, Tāraḥ is an apt name.

338. తారః, तारः, Tāraḥ

भूर्भुवस्स्वस्तरुस्तारस्सविता प्रपितामहः ।
यज्ञो यज्ञपतिर्यज्वायज्ञाङ्गोयज्ञवाहनः ॥ १०४ ॥

భూర్భువస్స్వస్తరుస్తారస్సవితా ప్రపితామహః ।
యజ్ఞో యజ్ఞపతిర్యజ్వాయజ్ఞాఙ్గోయజ్ఞవాహనః ॥ 104 ॥

Bhūrbhuvassvastarustārassavitā prapitāmahaḥ,
Yajño yajñapatiryajvāyajñāṅgoyajñavāhanaḥ ॥ 104 ॥

28 జూన్, 2015

967. భూర్భువఃస్వస్తరుః, भूर्भुवःस्वस्तरुः, Bhūrbhuvaḥsvastaruḥ

ఓం భుర్భువః స్వస్తరవే నమః | ॐ भुर्भुवः स्वस्तरवे नमः | OM Bhurbhuvaḥ svastarave namaḥ


భూర్భువస్వస్సమాఖ్యాని త్రయీసారాణి యాని చ ।
త్రిణి వ్యాహృతిరూపాణి శుక్రాణ్యాహుర్హి బాహ్యృచాః ॥
యత్రైర్హోమాదినా విష్ణుస్తరై ప్లవతేఽథవా ।
జగత్రయతి తద్భూర్భువస్వస్తరురుచ్యతే ॥
భూర్భువస్వర్నామ లోకత్రయ సంసారభూరుహః ।
భూర్భువస్వస్తరురితి ప్రోచ్యతే కేశవో బుధైః ॥
భూర్భువస్వరాఖ్యలోకత్రయమేతద్ధి వృక్షవత్ ।
వ్యాప్య విష్ణుస్తిష్ఠతీతి భూర్భువస్వస్తరుః స్మృతః ॥

'భూః,' 'భువః,' 'స్వహః' అను మూడు వ్యాహృతుల రూపముగలవియు, వేదత్రయ సారభూతములును అగు పవిత్ర బీజ భూత శబ్ద రూప తత్త్వములైన శుక్రములను అధ్యయమున చెప్పుచున్నారు. ఆ మూడు వ్యాహృతుల చేతను జగత్ త్రయము హోమాదికములను ఆచరించుచు సంసార సాగరమున మునుగక ఈద కలుగుచున్నది. ఆవలి వొడ్డును చేరుచున్నది. ఆ మూడు వ్యాహృతులకును, వాని అర్థములకును కూడ మూల భూత తత్త్వము కావున పరమాత్మునకు 'భూర్భువఃస్వస్తరుః' అను నామము సముచితమై ఉన్నది.

:: మనుస్మృతి తృతీయోఽధ్యాయః ::
అగ్నౌ ప్రాస్తాఽఽహుతిః సమ్య గాదిత్య ముపతిష్ఠతే ।
ఆదిత్యా సృష్టిర్ వృష్టే రన్నం తతః ప్రజాః ॥ 76 ॥

అగ్నియందు విధివిధానుసారముగ ప్రక్షిప్తమయిన ఆహుతి ఆదిత్యుని సన్నిధిని చేరియుండును. అట్లు ఆహుతిని గ్రహించిన సూర్యుని వలన వర్షము కురియుచున్నది. వర్షము వలన అన్నము ఉత్పన్నమగుచున్నది. అన్నము వలన ప్రజలు, ప్రాణులు ఉత్పత్తినొందుచు వృద్ధినందుచు ఉన్నారు.

లేదా 'భూర్భువః' అను లోకత్రయ రూపమగునది సంసార వృక్షము. అదియు వస్తు తత్త్వమున పరమాత్మునియందు ఆరోపితమగుటచే పరమాత్ముని కంటె వేరు కాదు.

లేదా 'భూర్భువః స్వః' అను లోకత్రయమును వృక్షమువలె వ్యాపించియున్నవాడు పరమాత్ముడు అని కూడ చెప్పవచ్చును.



भूर्भुवस्वस्समाख्यानि त्रयीसाराणि यानि च ।
त्रिणि व्याहृतिरूपाणि शुक्राण्याहुर्हि बाह्यृचाः ॥
यत्रैर्होमादिना विष्णुस्तरै प्लवतेऽथवा ।
जगत्रयति तद्भूर्भुवस्वस्तरुरुच्यते ॥
भूर्भुवस्वर्नाम लोकत्रय संसारभूरुहः ।
भूर्भुवस्वस्तरुरिति प्रोच्यते केशवो बुधैः ॥
भूर्भुवस्वराख्यलोकत्रयमेतद्धि वृक्षवत् ।
व्याप्य विष्णुस्तिष्ठतीति भूर्भुवस्वस्तरुः स्मृतः ॥

Bhūrbhuvasvassamākhyāni trayīsārāṇi yāni ca,
Triṇi vyāhr̥tirūpāṇi śukrāṇyāhurhi bāhyr̥cāḥ.
Yatrairhomādinā Viṣṇustarai plavate’thavā,
Jagatrayati tadbhūrbhuvasvastarurucyate.
Bhūrbhuvasvarnāma lokatraya saṃsārabhūruhaḥ,
Bhūrbhuvasvastaruriti procyate keśavo budhaiḥ.
Bhūrbhuvasvarākhyalokatrayametaddhi vr̥kṣavat,
Vyāpya viṣṇustiṣṭhatīti bhūrbhuvasvastaruḥ smr̥taḥ.

'Bhūḥ,' 'Bhuvaḥ' and 'Svahaḥ' are known as the three vyāhr̥tis i.e., three potent sounds. They are pure and the essence of the Vedas. By means of these three and the oblations in the sacrificial fires, one crosses the three worlds. Since paramātma is the root essence of these three vyāhr̥ti, He is aptly addressed as Bhūrbhuvaḥsvastaruḥ.

:: मनुस्मृति तृतीयोऽध्यायः ::
अग्नौ प्रास्ताऽऽहुतिः सम्य गादित्य मुपतिष्ठते ।
आदित्या सृष्टिर् वृष्टे रन्नं ततः प्रजाः ॥ ७६ ॥

Manusmr̥ti Chapter 3
Agnau prāstā’’hutiḥ samya gāditya mupatiṣṭhate,
Ādityā sr̥ṣṭir vr̥ṣṭe rannaṃ tataḥ prajāḥ. 76.

The oblation devoutly made into the sacrificial fire reaches the sun, from the sun arises rain; from the rain - food and from food all beings are born and sustained.

Or 'Bhūrbhuvaḥ' is indicative of the threefold samsāra vr̥ķa i.e., tree indicative of the three worlds. Since it verily is attributable to the paramātma, it cannot be thought of being separate from Him.

Or since He envelops the three worlds indicated by 'Bhūrbhuvaḥ svaḥ,' He is Bhūrbhuvaḥsvastaruḥ.
 
भूर्भुवस्स्वस्तरुस्तारस्सविता प्रपितामहः ।
यज्ञो यज्ञपतिर्यज्वायज्ञाङ्गोयज्ञवाहनः ॥ १०४ ॥

భూర్భువస్స్వస్తరుస్తారస్సవితా ప్రపితామహః ।
యజ్ఞో యజ్ఞపతిర్యజ్వాయజ్ఞాఙ్గోయజ్ఞవాహనః ॥ 104 ॥

Bhūrbhuvassvastarustārassavitā prapitāmahaḥ,
Yajño yajñapatiryajvāyajñāṅgoyajñavāhanaḥ ॥ 104 ॥

27 జూన్, 2015

966. జన్మమృత్యుజరాతిగః, जन्ममृत्युजरातिगः, Janmamr̥tyujarātigaḥ

ఓం జన్మమృత్యుజరాతిగాయ నమః | ॐ जन्ममृत्युजरातिगाय नमः | OM Janmamr̥tyujarātigāya namaḥ


నసన్తి జన్మాది వికారాషట్ ఇతిహేతుతః ।
నజాయతేమ్రియతే వా విపశ్చిదితి మన్త్రతః ॥
జన్మమృత్యుజరాతిగః ఇత్యచ్యుతః సుకీర్తితః ॥

జననమును, మరణమును, వార్ధక్యమును అతిక్రమించి పోవుచు అమృతత్వమును చేరియున్నది జన్మమృత్యుజరాతిగః. పుట్టుక, ఉనికి, వృద్ధి, మార్పు, క్షయము, నాశము అను ఆరును ఉనికి కల పదార్థములకు ఉండు వికారములు. ఆత్మ మాత్రము ఉనికి కలదే అయి యుండియు ఈ ఆరు వికారములకును పాత్రము కాదు కనుక జన్మమృత్యుజరాతిగః.

:: కఠోపనిషత్ ప్రథమాధ్యాయే ద్వితీయా వల్లి ::
న జాయతే మ్రియతేవా విపశ్చిత్ నాయఙ్కుతశ్చి న్న బభూవ కశ్చిత్ ।
అజో నిత్యః శాశ్వతోఽయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే ॥ 18 ॥

ఉనికిని ఎరింగిన ఈ ఆత్మ తత్త్వము జన్మించదు, మరణించదు, దేనినుండియు అది ఉద్భవించలేదు. దాని నుండి ఏదియు ఉద్భవించలేదు. జన్మలేనిది, నిత్యమైనది, శాశ్వతమైన అది తన దేహము హత్య గావించబడినపుడు తాను చంపబడుటలేదు.



नसन्ति जन्मादि विकाराषट् इतिहेतुतः ।
नजायतेम्रियते वा विपश्चिदिति मन्त्रतः ॥
जन्ममृत्युजरातिगः इत्यच्युतः सुकीर्तितः ॥

Nasanti janmādi vikārāṣaṭ itihetutaḥ,
Najāyatemriyate vā vipaściditi mantrataḥ.
Janmamr̥tyujarātigaḥ ityacyutaḥ sukīrtitaḥ.

He who transcends the six modifications indicated by the words 'is born,' 'exists,' 'grows,' 'changes,' 'decays' and 'dies' is He who goes beyond birth, death and the intervening states of existence is Janmamr̥tyujarātigaḥ.

:: कठोपनिषत् प्रथमाध्याये द्वितीया वल्लि ::
न जायते म्रियतेवा विपश्चित् नायङ्कुतश्चि न्न बभूव कश्चित् ।
अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे ॥ १८ ॥

Kaṭhopaniṣat Chapter 1, Canto 2
Na jāyate mriyatevā vipaścit nāyaṅkutaści nna babhūva kaścit,
Ajo nityaḥ śāśvato’yaṃ purāṇo na hanyate hanyamāne śarīre. 18.

The intelligent Self is neither born nor does It die. It did not originate from anything, nor did anything originate from It. It is birthless, eternal, undecaying and ancient. It is not injured even when the body is killed.

प्रमाणं प्राणनिलयः प्राणभृत् प्राणजीवनः ।
तत्त्वं तत्त्वविदेकात्मा जन्ममृत्युजरातिगः ॥ १०३ ॥

ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః ।
తత్త్వం తత్త్వవిదేకాత్మా జన్మమృత్యుజరాతిగః ॥ 103 ॥

Pramāṇaṃ prāṇanilayaḥ prāṇabhr̥t prāṇajīvanaḥ,
Tattvaṃ tattvavidekātmā janmamr̥tyujarātigaḥ ॥ 103 ॥

26 జూన్, 2015

965. ఏకాఽఽత్మా, एकाऽऽत्मा, Ekā’’tmā

ఓం ఏకాత్మనే నమః | ॐ एकात्मने नमः | OM Ekātmane namaḥ


ఏకశ్చాసౌ హరిరాత్మా చేత్యేకాత్మేతి కథ్యతే ।
ఆత్మా వా ఇదమేక ఏవాగ్ర ఆసీదితి శ్రుతేః ॥

"ఆదియందు ఈ దృశ్యమాన ప్రపంచమంతయు ఒకే ఒక ఆత్మతత్త్వముగా నుండెను" అను ఐత్తరేయ ఉపనిషద్ వాక్యము, "సర్వ విషయములను అనుభవమున పొందును, సర్వ విషయానుభవములను గ్రహించుని, సర్వ భోగ్య విషయములను తినును, అంతటను అన్ని కాలములయందును ఎడతెగని ఉనికి దీనికి కలదు - అని అర్థమును తెలుపు ఆప్నోతి, ఆదత్తే, అత్తి, అతతి అను వ్యుత్పత్తులకు యోగ్యమగు తత్త్వము కావున, ఆత్మకు 'ఆత్మ' అను వ్యవహారము ఏర్పడియున్నది" అను స్మృతి వచనమును ఇచ్చట ప్రమాణములు. ఇన్ని అర్థములను తనయందు వర్తింపజేసికొనగలుగునది పరమాత్ముడు మాత్రమే.



एकश्चासौ हरिरात्मा चेत्येकात्मेति कथ्यते ।
आत्मा वा इदमेक एवाग्र आसीदिति श्रुतेः ॥

Ekaścāsau harirātmā cetyekātmeti kathyate,
Ātmā vā idameka evāgra āsīditi śruteḥ.

He is one and Ātma vide the śruti 'this ātmā was one only at the beginning.' "That which pervades, that which receives, that which enjoys the objects and that which exists always is called the Ātman."

प्रमाणं प्राणनिलयः प्राणभृत् प्राणजीवनः ।
तत्त्वं तत्त्वविदेकात्मा जन्ममृत्युजरातिगः ॥ १०३ ॥

ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః ।
తత్త్వం తత్త్వవిదేకాత్మా జన్మమృత్యుజరాతిగః ॥ 103 ॥

Pramāṇaṃ prāṇanilayaḥ prāṇabhr̥t prāṇajīvanaḥ,
Tattvaṃ tattvavidekātmā janmamr̥tyujarātigaḥ ॥ 103 ॥