31 జులై, 2015

1000. సర్వప్రహరణాయుధః, सर्वप्रहरणायुधः, Sarvapraharaṇāyudhaḥ

ఓం సర్వప్రహరణాయుధాయ నమః | ॐ सर्वप्रहरणायुधाय नमः | OM Sarvapraharaṇāyudhāya namaḥ


కేవలమ్ ప్రహరణాన్యాయుధాన్యస్తేతి సర్వప్రహరణాయుధః ।
ఆయుధత్వేనాప్రసిద్దాన్యపి కరజాదీన్యస్యాయుధాని భవన్తీతి ॥

కేవలము ఇవి (శంఖము, నందకి అను ఖడ్గము, చక్రము, శాఙ్గము అను ధనుస్సు, కౌమోదకి అను గద, రథాంగము) మాత్రమే ఈతని ఆయుధములు అని నియమము లేదు. దెబ్బకొట్టుటకు ఉపయోగపడునవి ఎన్ని యుండునో అన్నియు ఈతని ఆయుధములే అగును. దీనిచే ఆయుధములుగా ప్రసిద్ధములుగానుండని కరజములు అనగా గోళ్ళు మొదలగునవియు నరసింహావతారమునందు వలెనే ఈతని ఆయుధములే అగుచుండును.

అన్తే సర్వ ప్రహరణాయుధ ఇతి వచనం సత్యసఙ్కల్పత్వేన సర్వేశ్వరత్వం దర్శయితుమ్ । 'ఏష సర్వేశ్వరః' ఇతి శ్రుతేః ॥

విశేషము: అంతమున 'సర్వప్రహరణాయుధః' - 'ఏ ప్రహరణమయినను ఈతనికి ఆయుధమేయగును' అని చెప్పుట పరమాత్ముడు 'సత్యసంకల్పుడు' - 'ఏది తాను సంకల్పించునో అది ఆచరించు శక్తి కలవాడు' అని చూపుటకే 'ఏష సర్వేశ్వరః' - 'ఈతడు సర్వేశ్వరుడు, సర్వకార్యకరణ శక్తుడు' అను శ్రుతి ఇచట ప్రమాణము.

ద్విర్వచనం సమాప్తిం ద్యోతయతి ద్విర్వచనము అనగా 'సర్వప్రహరణ' శబ్దమును రెండుమారులుచ్చరించుట సమాప్తిని తెలుపుచున్నది.

ఓఙ్కారశ్చ మఙ్గలార్థః, ఓఙ్కారశ్చాథశబ్దశ్చ ద్వావేతౌ బ్రహ్మణః పురా ।
కణ్ఠం భిత్త్వా వినిర్యాతౌ తస్మాన్మాన్మాఙ్గలికావుభఊ ఇతి వచనాత్ ॥


సహస్ర నామాంతమున ఉచ్చరించబడిన 'ఓం నమః'లోని ఈ 'ఓం'కారము శుభార్థవాచకము. "'ఓం'కారమును, 'అథ' శబ్దమును - ఈ రెండును అతి ప్రాచీన కాలమునందే బ్రహ్మదేవుని కంఠమును భేదించి అతి స్పష్టముగా వెలుపలికి వచ్చియుండెను. అందువలననే ఈ రెండును శుభార్థ ప్రతిపాదకములు" అను వచనము ఈ విషయమున ప్రమాణము.

అన్తే 'నమః' ఇత్యుక్త్యా పరిచరణం కృతవాన్ ।
'భూయిష్టాం తే నమౌక్తిం విధేమ' ఇతి మన్త్రవర్ణాత్ ॥

అంతమున 'నమః' అని పలికి పరిచరణమును అనగా పూజను చేసినారు. "నీకు మాటి మాటికి 'నమో' వచనమును పలికి పూజ చేయుదుము" అను శ్రుతి వచనము ఇందు ప్రమాణము.

'ధన్యం తదేవ లగ్నం తన్నక్షత్రం తదేవ పుణ్యమహః ।
కరణస్య చ సా సిద్ధిర్యత్ర హరిః ప్రాఙ్నమస్క్రియతే ' ఇతి చ ॥

'ఏ క్రియాచరణమునందు మొదటగా హరి నమస్కరించబడునో ఆ క్రియను ఆరంభించిన సమయమున ఉండు లగ్నమే ధన్యము. ఆ నక్షత్రమును, ఆ దినమును పుణ్యకరములు. అట్లు ఆచరించబడిన కరణమునకును ఆ హరి నామ స్మరణమే సిద్ధి కలిగించునదియగును' అనియు చెప్పబడినది.

ప్రాగిత్యుప లక్షణమ, అన్తేఽపి నమస్కారస్య శిష్టైరాచరణాత్ । నమస్కార ఫలం ప్రాగేవ దర్శితమ్ ॥

ఇందుకు 'ప్రాక్‍' అనగా ఆరంభమునందు 'మొదటగా అనుట' క్రియాచరణమునకు అవధిగా మాత్రము తీసికొనవలెను. అవధిరూప క్షణమును గుర్తింపజేయునదిగా గ్రహించవలెను. అనగా క్రియ ఆరంభమగుటకు ముందరి కాలమున చేసినట్లే ముగిసిన తరువాత కూడ భగవన్నమస్కారము చేయవలెనని చెప్పినట్లయినది.  కావుననే క్రియాంతమునందును నమస్కారము చేయుట శిష్టులచే ఆచరించబడుచు కనబడుచున్నది. నమస్కారము వలన కలుగు ఫలము ఇంతకు ముందే ఉపోద్ఘాతమున చెప్పబడియున్నది.

:: శ్రీమహాభారతే శాన్తిపర్వణి రాజధర్మానుశాసనపర్వణి సప్తచత్వారింశోఽధ్యాయః ::
ఏకోఽపి కృష్ణస్య కృతః ప్రణామో
    దశాశ్వమేధావభృథేన తుల్యః ।
దశాశ్వమేధీ పునరేతి జన్మ
    కృష్ణప్రణామీ న పునర్భవాయ ॥ 92 ॥

కృష్ణుని విషయమున చేయబడిన ఒక నమస్కారమయినను పది అశ్వమేధయాగములను సమగ్రముగా ఆచరించి అవభృథస్నానము చేయుటతో సమానము. కాని పది అశ్వమేధములను ఆచరించినవాడు వాని వలన లభించు ఫలములను అనుభవించుట ముగిసిన తరువాత మరల జన్మమునొందును. కృష్ణుని నమస్కరించినవాడు మాత్రము మరల జన్మమునొందవలసిన పనియుండదు.

:: శ్రీమహాభారతే శాన్తిపర్వణి రాజధర్మానుశాసనపర్వణి సప్తచత్వారింశోఽధ్యాయః ::
అసతీపుష్పశఙ్కాశం పీతవాససమచ్యుతమ్ ।
యే నమస్యన్తి గోవిన్దం న తేషాం విద్యతే భయమ్ ॥ 90 ॥

నల్ల అవిసి పూవులవంటి దేహచ్ఛాయ కలవాడును పచ్చని పట్టువస్త్రమును ధరించిన వాడును తన స్థితినుండి ఎన్నడును తొలగనివాడును తన్నాశ్రయించినవారినెన్నడును చెడనీయనివాడును అగు గోవిందుని ఎవరు నమస్కరింతురో వారికెన్నడును భయముండదు.

లోకత్రయాధిపతిమప్రతిమప్రభావ
    మీషత్ప్రణమస్య శిరసా ప్రభవిష్ణుమీశమ్ ।
జన్మాన్తరప్రలయకల్పసహస్రజాత
    మాశు ప్రశాన్తిముపయాతి నరస్య పాపమ్ ॥ ఇతి ॥

లోకత్రయాధిపతియు సాటిలేని ప్రభావము కలవాడును సర్వసమర్థుడును ఈశుడును అగు నారయణుని ఉద్దేశించి కొంచెముగనైన శిరస్సుతో నమస్కరించినచో వేయి కల్పములయు వేయి ప్రళయములయు కాల పరిమాణమున నరునకు కలుగు వేలకొలది జన్మములయందు సంభవించునంత పాపము కూడ శీఘ్రముగా ప్రశాంతినందును.

ఇతి నామ్నాం దశమం శతం వివృతమ్ ఇట్లు ఇంతవరకును పది వందల నామములు వివరించబడినవి.

యదక్షరపదభ్రష్టం మాత్రాహీనన్తుయద్భవేత్ ।
తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోఽస్తుతే ॥

అక్షరములును, పదములును పొరబాటున తప్పుగ వ్రాసినను, మాత్రలను చేర్చుట మరచినను తత్ఫలితముగా కలుగు దోషములను ఉపశమింపజేసి మమ్మనుగ్రహింపుమని ఆ నారాయణుని వేడుకొందును.



केवलम् प्रहरणान्यायुधान्यस्तेति सर्वप्रहरणायुधः ।
आयुधत्वेनाप्रसिद्दान्यपि करजादीन्यस्यायुधानि भवन्तीति ॥

Kevalam praharaṇānyāyudhānyasteti sarvapraharaṇāyudhaḥ,
Āyudhatvenāprasiddānyapi karajādīnyasyāyudhāni bhavantīti.

There is no rule that only these (conch, sword, discus, bow, club) are His weapons. He has all kinds of offensive weapons. Even finger nails that are not famous as weapons  are also included. So, He has all kinds of weapons of offense at His disposal.

अन्ते सर्व प्रहरणायुध इति वचनं सत्यसङ्कल्पत्वेन सर्वेश्वरत्वं दर्शयितुम् । 'एष सर्वेश्वरः' इति श्रुतेः ॥ / Ante sarva praharaṇāyudha iti vacanaṃ satyasaṅkalpatvena sarveśvaratvaṃ darśayitum, 'eṣa sarveśvaraḥ' iti śruteḥ The reference to Sarvapraharaṇāyudhaḥ at the end is intended to indicate that He is the Lord of all, to fulfill His purposes vide the śruti 'He is the Lord of all'.

द्विर्वचनं समाप्तिं द्योतयति / Dvirvacanaṃ samāptiṃ dyotayati Repetition of the last Name shows the completion of Sahasranāma.

ओङ्कारश्च मङ्गलार्थः, ओङ्कारश्चाथशब्दश्च द्वावेतौ ब्रह्मणः पुरा ।
कण्ठं भित्त्वा विनिर्यातौ तस्मान्मान्माङ्गलिकावुभऊ इति वचनात् ॥

Oṅkāraśca maṅgalārthaḥ, oṅkāraścāthaśabdaśca dvāvetau brahmaṇaḥ purā,
Kaṇṭhaṃ bhittvā viniryātau tasmānmānmāṅgalikāvubhaū iti vacanāt.

Omkāra has the meaning of auspiciousness. "'Om' and 'atha' both these came out of the throat of Brahman at the beginning. Therefore they both stand for auspiciousness."

अन्ते 'नमः' इत्युक्त्या परिचरणं कृतवान् ।
'भूयिष्टां ते नमौक्तिं विधेम' इति मन्त्रवर्णात् ॥

Ante 'namaḥ' ityuktyā paricaraṇaṃ kr̥tavān,
'Bhūyiṣṭāṃ te namauktiṃ vidhema' iti mantravarṇāt.

By traditionally saying namaḥ at the end, prostration is indicated. "To thee we submit our word 'prostration' at the end."

'धन्यं तदेव लग्नं तन्नक्षत्रं तदेव पुण्यमहः ।
करणस्य च सा सिद्धिर्यत्र हरिः प्राङ्नमस्क्रियते ' इति च ॥

'Dhanyaṃ tadeva lagnaṃ tannakṣatraṃ tadeva puṇyamahaḥ,
Karaṇasya ca sā siddhiryatra hariḥ prāṅnamaskriyate ' iti ca.

Also, 'When Hari is prostrated to, that alone is auspicious lagna, auspicious nakshatra, holy day and proper karaṇa'.

प्रागित्युप लक्षणम, अन्तेऽपि नमस्कारस्य शिष्टैराचरणात् । नमस्कार फलं प्रागेव दर्शितम् ॥
Prāgityupa lakṣaṇam, ante’pi namaskārasya śiṣṭairācaraṇāt, namaskāra phalaṃ prāgeva darśitam.

prāk: in the beginning, is only indicative as namaskāra at the end also is observed by the learned. The fruit of namaskāra, prostration was shown at the beginning itself.

:: श्रीमहाभारते शान्तिपर्वणि राजधर्मानुशासनपर्वणि सप्तचत्वारिंशोऽध्यायः ::
एकोऽपि कृष्णस्य कृतः प्रणामो
    दशाश्वमेधावभृथेन तुल्यः ।
दशाश्वमेधी पुनरेति जन्म
    कृष्णप्रणामी न पुनर्भवाय ॥ ९२ ॥

Śrī Mahābhārata Book 12, Chapter 47
Eko’pi kr̥ṣṇasya kr̥taḥ praṇāmo
    Daśāśvamedhāvabhr̥thena tulyaḥ,
Daśāśvamedhī punareti janma
    Kr̥ṣṇapraṇāmī na punarbhavāya. 92.

One prostration to Kr̥ṣṇa properly done is equal to taking conclusive bath taken after completing aśāśvamedha vedic sacrifice. The man who has performed ten of these alone is born again after experiencing the resultant fruits. Whereas, He who has made prostration of Kr̥ṣṇa does not need to take birth again.

:: श्रीमहाभारते शान्तिपर्वणि राजधर्मानुशासनपर्वणि सप्तचत्वारिंशोऽध्यायः ::
असतीपुष्पशङ्काशं पीतवाससमच्युतम् ।
ये नमस्यन्ति गोविन्दं न तेषां विद्यते भयम् ॥ ९० ॥

Śrī Mahābhārata Book 12, Chapter 47
Asatīpuṣpaśaṅkāśaṃ pītavāsasamacyutam,
Ye namasyanti govindaṃ na teṣāṃ vidyate bhayam. 90.

Those who bow to Govinda, who is of the color of hemp flower and who is clad in yellow and is called Acyuta, have no fear.

लोकत्रयाधिपतिमप्रतिमप्रभाव
    मीषत्प्रणमस्य शिरसा प्रभविष्णुमीशम् ।
जन्मान्तरप्रलयकल्पसहस्रजात
    माशु प्रशान्तिमुपयाति नरस्य पापम् ॥ इति ॥

Lokatrayādhipatimapratimaprabhāva
    Mīṣatpraṇamasya śirasā prabhaviṣṇumīśam,
Janmāntarapralayakalpasahasrajāta
    Māśu praśāntimupayāti narasya pāpam. Iti.

By bowing a little with the head to the Lord of the three worlds, of matchless glory, the Supreme Ruler, a man's accumulated sins of thousands of previous lives are quickly annihilated.

इति नाम्नां दशमं शतं विवृतम् / Iti nāmnāṃ daśamaṃ śataṃ vivr̥tam Thus the ten hundred Names have been explained.

यदक्षरपदभ्रष्टं मात्राहीनन्तुयद्भवेत् ।
तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तुते ॥

Yadakṣarapadabhraṣṭaṃ mātrāhīnaṃtuyadbhavet,
Tatsarvaṃ kṣamyatāṃ deva nārāyaṇa namo’stute.

May the mistakes in the form of misspelled words caused by omission or inappropriate inclusion of letters, incorrect usage of vowels etc., be forgiven by the Lord Nārāyaṇa before whom I prostrate and submit.

शङ्खभृन्नन्दकी चक्री शार्ङ्गधन्वा गदाधरः ।
रथांगपाणिरक्षोभ्यस्सर्वप्रहरणायुधः ॥ १०७ ॥

శఙ్ఖభృన్నన్దకీ చక్రీ శార్ఙ్గధన్వా గదాధరః ।
రథాంగపాణిరక్షోభ్యస్సర్వప్రహరణాయుధః ॥ 107 ॥

Śaṅkhabhr̥nnandakī cakrī śārṅgadhanvā gadādharaḥ,
Rathāṃgapāṇirakṣobhyassarvapraharaṇāyudhaḥ ॥ 107 ॥

3 కామెంట్‌లు:

  1. అజ్ఞాత1 ఆగ, 2015 9:10:00 PM

    విజయవంతంగా సహస్రనామాలు పూర్తిచేసిన సందర్భంగా శుభాభినందనలు.

    శ్రవణ్

    రిప్లయితొలగించండి
  2. సర్వప్రహరణాయుధః

    ఈ నామాన్ని వివరిస్తూ మీరు శ్రీవిశ్ణుభగవానునికి ఏది అవసరం ఐతే అది ఆయుధం కాగలదు, కేవలం చక్రాది పంచాయుధాలే కాక అని అన్నారు. సోదాహరణంగా చెప్పారు. బాగుంది. శంకరభాష్యాన్ని తెలుగులో చెప్పారు. చాలా సంతోషం.

    మరొక్క విశేషం కూడా ఉంది. సర్వప్రహరణాయుధః అంటే సర్వులను ప్రహరించే ఆయుధములు కలవాడు అని కూడా వ్యుత్పత్తి చెప్పవచ్చు. అంటే ఈయన ఆయధము యొక్క దెబ్బనుండి కాచుకొన గల మొనగాడు ఎవ్వడూ ఉండడని అర్థం. సర్వులు అన్నప్పుడు ధర్మగ్లానికరులైన రాక్షసాదులనే చెప్పుకోవాలి. వారిలో ఎవరైనా ఎన్ని ఎత్తులు వేసినా ఎన్ని వరాలు సంపాదించినా ఎంత శస్త్రాస్త్రసంపత్తి కలవారైనా సరే విష్ణువు చేతి ఆయుధాన్ని తప్పించుకొని ఎట్టిపరిస్థితిలోనూ బ్రతికిపోలేరు అని అర్థం. మరొక రహస్యం ఏమిటంటే ఆయుధం అనేది కేవలం భౌతికమైన శస్త్రాస్త్రవిశేషం కానవసరం లేదు - అది ఆయన ప్రయోగించే ఉపాయం కూడా కావచ్చును. మోహినీ అవతారమూ, వామనావతారమూ, బుధ్ధావతారమూ ఇందుకు సాక్ష్యాలు. కొంతవరకూ శ్రీనృసింహరామాద్యవతారములు కూడా. ఆయన సంకల్పం అమోఘం అచింత్యం కాబట్టి ఎవరికీ అది అంతుపట్టటం ప్రసక్తే లేదు - ఇక దుష్టులు తప్పించుకోవటం ఎక్కడ?

    ఇప్పుడు ఈ సర్వప్రహరణాయుధః అన్న నామం ద్విరుక్తం అవటం - అంటే రెండు మార్లు వరుసగా చెప్పటం - వెనుక ఉన్న అంతరార్థం ఏమిటంటే, ఒకపర్యాయం శ్రీహరి యొక్క ఆయుధభాహుళ్యాన్నీ మరొక పర్యాయం ఆ మహాత్ముని ప్రహరణశక్తినీ ఉటంకించటం అని కూడా మనం అనుకోవచ్చును.

    ఈ విష్ణు సహస్రనామస్తోత్రాన్ని మీరు ఇలా ఒక వ్రతంగా పూని బ్లాగులో ప్రచురించినందుకు అభినందనలు. అనంతపుణ్యప్రదమైనది విష్ణుస్మరణం. ఆ స్మరణానందం మాకూ నిత్యం కలిగించిన మీరు ధన్యులు.

    రిప్లయితొలగించండి
  3. బ్లాగు కర్త వివరములు తెలియచేయండి. యూధృఛకంగా భగవతానుగ్రహంగా నాకు ఈ బ్లాగు లభించింది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి