31 డిసెం, 2013

423. దక్షః, दक्षः, Dakṣaḥ

ఓం దక్షాయ నమః | ॐ दक्षाय नमः | OM Dakṣāya namaḥ

క్షిప్రం కరోతి కర్మాణి జగద్రూపేణ వర్ధతే ।
వేతి విష్ణుర్దక్ష ఇతి ప్రోచ్యతే విబుదోత్తమైః ॥

జగర్దూపమున వృద్ధినందుచున్నవాడు. సర్వకర్మములను శీఘ్రముగా ఆచరించును.

Kṣipraṃ karoti karmāṇi jagadrūpeṇa vardhate,
Veti viṣṇurdakṣa iti procyate vibudottamaiḥ.

क्षिप्रं करोति कर्माणि जगद्रूपेण वर्धते ।
वेति विष्णुर्दक्ष इति प्रोच्यते विबुदोत्तमैः ॥

As He grows in the form of the universe or because He does all actions quickly, He is Dakṣaḥ.

ऋतुस्सुदर्शनः कालः परमेष्ठी परिग्रहः ।
उग्रस्संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः ॥ ४५ ॥

ఋతుస్సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః ।
ఉగ్రస్సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః ॥ ౪౫ ॥

R̥tussudarśanaḥ kālaḥ parameṣṭhī parigrahaḥ ।
Ugrassaṃvatsaro dakṣo viśrāmo viśvadakṣiṇaḥ ॥ 45 ॥

30 డిసెం, 2013

422. సంవత్సరః, संवत्सरः, Saṃvatsaraḥ

ఓం సంవత్సరాయ నమః | ॐ संवत्सराय नमः | OM Saṃvatsarāya namaḥ

భూతాన్యస్మిన్ సంవసంతి హీతి సంవత్సరో హరిః సృష్టి స్థితి లయముల మూడిటియందును సకల భూతములును ఈతనియందు వసించును గనుక ఆ హరి సంవత్సరః అని సంబోధించబడును.

91. సంవత్సరః, संवत्सरः, Saṃvatsaraḥ

Bhūtānyasmin saṃvasaṃti hīti saṃvatsaro hariḥ / भूतान्यस्मिन् संवसंति हीति संवत्सरो हरिः All beings reside in Him and hence Lord Hari is called Saṃvatsaraḥ.

91. సంవత్సరః, संवत्सरः, Saṃvatsaraḥ

ऋतुस्सुदर्शनः कालः परमेष्ठी परिग्रहः ।
उग्रस्संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः ॥ ४५ ॥

ఋతుస్సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః ।
ఉగ్రస్సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః ॥ ౪౫ ॥

R̥tussudarśanaḥ kālaḥ parameṣṭhī parigrahaḥ ।
Ugrassaṃvatsaro dakṣo viśrāmo viśvadakṣiṇaḥ ॥ 45 ॥

29 డిసెం, 2013

421. ఉగ్రః, उग्रः, Ugraḥ

ఓం ఉగ్రాయ నమః | ॐ उग्राय नमः | OM Ugrāya namaḥ

సూర్యాదినామపి భయ హేతుత్వాదుగ్ర ఉచ్యతే ।
భీషోదేతి సూర్య ఇతి శ్రుతి వాక్య బలాద్ధరిః ॥

భయముగొలుపువాడు. సూర్యుడు మొదలగు వారిని కూడ భయమును కలిగించువాడు.

:: తైత్తిరీయోపనిషత్ - ఆనందవల్లి (బ్రహ్మానందవల్లి) ద్వితీయాధ్యాయః - అష్టమోఽనువాకః ::
భీషాఽస్మాద్వాతః పవతే । భీషోదేతి సూర్యః । భీషాఽస్మాదగ్నిశ్చేన్ద్రశ్చ । మృత్యుర్ధావతి పఞ్చమ ఇతి । ... (1)

వాయువు పరబ్రహ్మము భయము చేత వీచుచున్నది. సూర్యుడు సైతమూ పరబ్రహ్మము భయము వలన ఉదయించుచున్నాడు. పరబ్రహ్మము వలన భయముచేత అగ్నియు, ఇంద్రుడు, అయిదవవాడగు యముడును ప్రవర్తించుచున్నారు.

Sūryādināmapi bhaya hetutvādugra ucyate,
Bhīṣodeti sūrya iti śruti vākya balāddhariḥ.

सूर्यादिनामपि भय हेतुत्वादुग्र उच्यते ।
भीषोदेति सूर्य इति श्रुति वाक्य बलाद्धरिः ॥

One who is the cause of fear even to entities like Sun.

Taittirīya Upaniṣad - Ānandavalli (Brahmānandavalli) Section II - Chapter VIII
Bhīṣā’smādvātaḥ pavate , bhīṣodeti sūryaḥ , bhīṣā’smādagniścendraśca , mr̥tyurdhāvati pañcama iti , ... (1)

:: तैत्तिरीयोपनिषत् - आनंदवल्लि (ब्रह्मानंदवल्लि) द्वितीयाध्यायः - अष्टमोऽनुवाकः ::
भीषाऽस्माद्वातः पवते । भीषोदेति सूर्यः । भीषाऽस्मादग्निश्चेन्द्रश्च । मृत्युर्धावति पञ्चम इति । ... (१)

From Its (parabrahma) fear, the wind blows; from fear rises the sun, from the fear of It again Indra, Fire and the fifth i.e., death, proceed (to their respective duties).

ऋतुस्सुदर्शनः कालः परमेष्ठी परिग्रहः ।
उग्रस्संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः ॥ ४५ ॥

ఋతుస్సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః ।
ఉగ్రస్సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః ॥ ౪౫ ॥

R̥tussudarśanaḥ kālaḥ parameṣṭhī parigrahaḥ ।
Ugrassaṃvatsaro dakṣo viśrāmo viśvadakṣiṇaḥ ॥ 45 ॥

28 డిసెం, 2013

420. పరిగ్రహః, परिग्रहः, Parigrahaḥ

ఓం పరిగ్రహాయ నమః | ॐ परिग्रहाय नमः | OM Parigrahāya namaḥ

గృహ్యతే సర్వగతత్వాత్ పరితః శరణార్థిభిః ।
పరితో జ్ఞాయతే వేతి పరిగృహ్ణాతి వార్పితం ।
పుత్రపుష్పాదికం భక్తైరితి వాఽయం పరిగ్రహః ॥

పరమాత్ముడు తాను సర్వగతుడు కావున తన శరణము కోరువారిచేత అన్ని వైపులనుండియు ఆశ్రయించ బడుచున్నాడు. లేదా భక్తులచే అర్పించబడు పత్రపుష్పాదికమును స్వీకరించును.

Gr̥hyate sarvagatatvāt paritaḥ śaraṇārthibhiḥ,
Parito jñāyate veti parigr̥hṇāti vārpitaṃ,
Putrapuṣpādikaṃ bhaktairiti vā’yaṃ parigrahaḥ.

गृह्यते सर्वगतत्वात् परितः शरणार्थिभिः ।
परितो ज्ञायते वेति परिगृह्णाति वार्पितं ।
पुत्रपुष्पादिकं भक्तैरिति वाऽयं परिग्रहः ॥ 

Since He is all pervading, He is approached on all sides by those who take refuge in Him. Or as He is omnipresent, He receives offerings made by His devotees.

ऋतुस्सुदर्शनः कालः परमेष्ठी परिग्रहः
उग्रस्संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः ॥ ४५ ॥

ఋతుస్సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః
ఉగ్రస్సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః ॥ ౪౫ ॥

R̥tussudarśanaḥ kālaḥ parameṣṭhī parigrahaḥ
Ugrassaṃvatsaro dakṣo viśrāmo viśvadakṣiṇaḥ ॥ 45 ॥

27 డిసెం, 2013

419. పరమేష్ఠీ, परमेष्ठी, Parameṣṭhī

ఓం పరమేష్ఠినే నమః | ॐ परमेष्ठिने नमः | OM Parameṣṭhine namaḥ

పరమే స్వే మహిమ్నేవ ప్రకృష్టే హృదయాంబరే ।
స్థాతుం హి శీలమస్యేతి పరమేష్ఠ్యేష ఉచ్యతే ।
పరమేష్ఠీ విభ్రాజిత ఇతి వైదిక వాక్యతః ॥

ప్రకృష్టము అనగా పరమము లేదా చాలా గొప్పదియగు తన మహిమమునందు, మహాశక్తియందు హృదయాకాశమున నిలుచుట ఈతని శీలము. కావున 'పరమేష్ఠిన్‍' అనబడును. పరమేష్ఠీ విభ్రాజతే పరమేష్ఠిగా ఆ రూపమున శ్రేష్ఠముగా ప్రకాశించుచున్నాడు అను ఆపస్తంభ ధర్మ సూత్రము (1.23.2) ఇట ప్రమాణము.

Parame sve mahimneva prakr̥ṣṭe hr̥dayāṃbare,
Sthātuṃ hi śīlamasyeti parameṣṭhyeṣa ucyate,
Parameṣṭhī vibhrājita iti vaidika vākyataḥ.

परमे स्वे महिम्नेव प्रकृष्टे हृदयांबरे ।
स्थातुं हि शीलमस्येति परमेष्ठ्येष उच्यते ।
परमेष्ठी विभ्राजित इति वैदिक वाक्यतः ॥

He resides in His own eminence in the hr̥dayākāśa or the supreme ether (depths) of the heart; so Parameṣṭhī vide the mantra Parameṣṭhī vibhrājate / परमेष्ठी विभ्राजते from Āpastaṃbha dharma sūtra (1.23.2).

ऋतुस्सुदर्शनः कालः परमेष्ठी परिग्रहः ।
उग्रस्संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः ॥ ४५ ॥

ఋతుస్సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః ।
ఉగ్రస్సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః ॥ ౪౫ ॥

R̥tussudarśanaḥ kālaḥ parameṣṭhī parigrahaḥ ।
Ugrassaṃvatsaro dakṣo viśrāmo viśvadakṣiṇaḥ ॥ 45 ॥

26 డిసెం, 2013

418. కాలః, कालः, Kālaḥ

ఓం కాలాయ నమః | ॐ कालाय नमः | OM Kālāya namaḥ

సర్వం కలయతీత్యేష కాలః కలయతామహమ్ ।
ఇతి స్మృతేన భగవాన్ కాల ఇత్యుచ్యతే బుధైః ॥

ప్రతియొకదానిని గణన చేయును. గణనకు పాత్రమగునట్లు చేయును.

:: శ్రీమద్భగవద్గీత - విభూతి యోగము ::
ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహమ్ ।
మృగాణాం చ మృగేన్ద్రోఽహం వైనతేయశ్చ పక్షిణామ్ ॥ 30 ॥

నేను అసురులలో ప్రహ్లాదుడను. లెక్కపెట్టువారిలో కాలమును. మృగములలో మృగరాజగు సింహమును. పక్షులలో గరుత్మంతుడను అయియున్నాను.

Sarvaṃ kalayatītyeṣa kālaḥ kalayatāmaham,
Iti smr̥tena bhagavān kāla ityucyate budhaiḥ.

सर्वं कलयतीत्येष कालः कलयतामहम् ।
इति स्मृतेन भगवान् काल इत्युच्यते बुधैः ॥ 

He counts everything (to determine their duration of life). Makes everything subject to counting.

Śrīmad Bhagavad Gīta - Chapter 10
Prahlādaścāsmi daityānāṃ kālaḥ kalayatāmaham,
Mr̥gāṇāṃ ca mr̥gendro’haṃ vainateyaśca pakṣiṇām. 30.

:: श्रीमद्भगवद्गीत - विभूति योगमु ::
प्रह्लादश्चास्मि दैत्यानां कालः कलयतामहम् ।
मृगाणां च मृगेन्द्रोऽहं वैनतेयश्च पक्षिणाम् ॥ ३० ॥

Among the demons, I am Prahlāda. I am Time among reckoners of time. Among animals I am the Lion and among birds I am Garuḍa.

ऋतुस्सुदर्शनः कालः परमेष्ठी परिग्रहः ।
उग्रस्संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः ॥ ४५ ॥

ఋతుస్సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః ।
ఉగ్రస్సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః ॥ ౪౫ ॥

R̥tussudarśanaḥ kālaḥ parameṣṭhī parigrahaḥ ।
Ugrassaṃvatsaro dakṣo viśrāmo viśvadakṣiṇaḥ ॥ 45 ॥

25 డిసెం, 2013

417. సుదర్శనః, सुदर्शनः, Sudarśanaḥ

ఓం సుదర్శనాయ నమః | ॐ सुदर्शनाय नमः | OM Sudarśanāya namaḥ

సుదర్శనః, सुदर्शनः, Sudarśanaḥ

శోభనం నిర్వాణఫలం దర్శనం జ్ఞానమస్యహి ।
పద్మ పత్రాయతే స్య వీక్షణే దర్శనే శుభే ।
సుఖేన దృశ్యతే భక్తైర్వేతి విష్ణుః సుదర్శనః ॥

ఎవని దర్శనము అనగా జ్ఞానము మోక్షరూపఫలప్రదమో అట్టివాడు. ఏ పద్మ పత్రాలవంటి చల్లని చూపుగల కన్నుల దర్శనము శుభకరమో అట్టికన్నులు గలవాడు సుదర్శనుడు. భక్తులు తేలికగా దర్శింపగల ఆ విష్ణుదేవుడు సుదర్శనుడు.

Śobhanaṃ nirvāṇaphalaṃ darśanaṃ jñānamasyahi,
Padma patrāyate sya vīkṣaṇe darśane śubhe,
Sukhena dr̥śyate bhaktairveti viṣṇuḥ sudarśanaḥ.

शोभनं निर्वाणफलं दर्शनं ज्ञानमस्यहि ।
पद्म पत्रायते स्य वीक्षणे दर्शने शुभे ।
सुखेन दृश्यते भक्तैर्वेति विष्णुः सुदर्शनः ॥

Darśana, knowledge of Him leads to the auspicious fruit of liberation. So, He is Sudarśanaḥ. Or His darśana, eyes are auspicious which are like lotus petals. He is seen or realized easily by devotees, So Lord  Viṣṇu is Sudarśanaḥ.

ऋतुस्सुदर्शनः कालः परमेष्ठी परिग्रहः ।
उग्रस्संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः ॥ ४५ ॥

ఋతుస్సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః ।
ఉగ్రస్సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః ॥ ౪౫ ॥

R̥tussudarśanaḥ kālaḥ parameṣṭhī parigrahaḥ ।
Ugrassaṃvatsaro dakṣo viśrāmo viśvadakṣiṇaḥ ॥ 45 ॥

24 డిసెం, 2013

416. ఋతుః, ऋतुः, R̥tuḥ

ఓం ఋతవే నమః | ॐ ऋतवे नमः | OM R̥tave namaḥ

కాలాత్మనర్తుశబ్దేన లక్ష్యత ఇత్యృతుర్హరిః

- గతి - ప్రాపణయోః అనగా నడుచుట - చేరుట - చేర్చుట అను ధాతువునుండి ఋచ్ఛతి అనగా ముందునకు సాగును అను అర్థములో 'ఋతుః' అను శబ్దము ఏర్పడును. రెండు చాంద్రమాన మాసములతో ఏర్పడు పరిమిత కాలమును వాడుకలో ఋతుః అనుచున్నాము. ఆ పదములకు లక్షణావృత్తిచే కాలము అను అర్థము చెప్పుకొన్నచో కాల రూపుడుగా పరమాత్ముడు ఋతు శబ్దమునకు అర్థముగా అగుచున్నాడు.

Kālātmanartuśabdena lakṣyata ityr̥turhariḥ / कालात्मनर्तुशब्देन लक्ष्यत इत्यृतुर्हरिः

From the root - gati - prāpaṇayoḥ meaning progress - arrive - deliver R̥cchati i.e., with a meaning of moving forward, the word 'R̥tuḥ' is formed. The confined period between two lunar months is termed as R̥tuḥ or season. Hence in His aspect of Time or One who is of the nature of Kāla (time), He is signified by the word R̥tu (season); so R̥tuḥ.

ऋतुस्सुदर्शनः कालः परमेष्ठी परिग्रहः ।
उग्रस्संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः ॥ ४५ ॥

ఋతుస్సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః ।
ఉగ్రస్సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః ॥ ౪౫ ॥

R̥tussudarśanaḥ kālaḥ parameṣṭhī parigrahaḥ ।
Ugrassaṃvatsaro dakṣo viśrāmo viśvadakṣiṇaḥ ॥ 45 ॥

23 డిసెం, 2013

415. అధోక్షజః, अधोक्षजः, Adhokṣajaḥ

ఓం అధోక్షజాయ నమః | ॐ अधोक्षजाय नमः | OM Adhokṣajāya namaḥ

అధోభూతే హ్యక్షగణే ప్రత్యగ్రూపప్రవాహితే ।
జాయతే తస్య విజ్ఞానం తేనాధోక్షజ ఉచ్యతే ॥
ద్యౌరక్షం పృథివీ చాధః తయోర్యస్మాదజాయత ।
మధ్యే వైరాజరూపేణ ఇత్యధోక్షజ ఉచ్యతే ॥
అధో న క్షీయతే జాతు యస్మాత్తస్మాదధోక్షజః ।
ఇతి వ్యాసేన మునినా సూక్తేరుద్యోగ పర్వణి ॥

ఇంద్రియ సమూహము అంతర్ముఖముగా ప్రసరింపజేయబడగా, ఆ పరమాత్మ విషయకమయిన జ్ఞానము జనించును. కావున అతడు అధోక్షజః అనబడును. చిత్తము అంతర్ముఖమైనపుడు మాత్రమే సాధకునకు పరమాత్మ సాక్షాత్కారమగును.

ద్యుల్లోకము అక్షం అనబడును; పృథివి అధః అనబడును. ఆ రెంటి నడుమ పరమాత్ముడే విరాట్పురుష రూపమున ఆవిర్భవించెను. అందువలన అధః అక్ష అనబడు ద్యుపృథివులనడుమ జనించుటచే అధోక్షజః అనబడును.

ఎన్నడును తన స్థితినుండి క్రిందకి దిగజారి క్షయమునందనివాడు అని మహాభారత ఉద్యోగపర్వమున చెప్పబడిన వచనము ప్రమాణము.

Adhobhūte hyakṣagaṇe pratyagrūpapravāhite,
Jāyate tasya vijñānaṃ tenādhokṣaja ucyate.
Dyaurakṣaṃ pr̥thivī cādhaḥ tayoryasmādajāyata,
Madhye vairājarūpeṇa ityadhokṣaja ucyate.
Adho na kṣīyate jātu yasmāttasmādadhokṣajaḥ,
Iti vyāsena muninā sūkterudyoga parvaṇi.

अधोभूते ह्यक्षगणे प्रत्यग्रूपप्रवाहिते ।
जायते तस्य विज्ञानं तेनाधोक्षज उच्यते ॥
द्यौरक्षं पृथिवी चाधः तयोर्यस्मादजायत ।
मध्ये वैराजरूपेण इत्यधोक्षज उच्यते ॥
अधो न क्षीयते जातु यस्मात्तस्मादधोक्षजः ।
इति व्यासेन मुनिना सूक्तेरुद्योग पर्वणि ॥

Adhaḥ stands for the earth; akṣam is the sky; ja is to be born. He who incarnated as the Virāt Puruṣa extending from the earth to the sku is Adhokṣajaḥ.

Knowledge of Him arises only when the sense organs which always have the outwardly tendency are turned inward. Hence , He is said to be Adhokṣajaḥ.

He who does not decline. He is Adhokṣajaḥ because He undergoes no degeneration from His original nature vide the Udyoga parva of Mahā Bhārata.

वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवः पृथुः ।
हिरण्यगर्भश्शत्रुघ्नोव्याप्तो वायुरधोक्षजः ॥ ४४ ॥

వైకుణ్ఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః ।
హిరణ్యగర్భశ్శత్రుఘ్నోవ్యాప్తో వాయురధోక్షజః ॥ ౪౪ ॥

Vaikuṇṭhaḥ puruṣaḥ prāṇaḥ prāṇadaḥ praṇavaḥ pr̥thuḥ ।
Hiraṇyagarbhaśśatrughnovyāpto vāyuradhokṣajaḥ ॥ 44 ॥

22 డిసెం, 2013

414. వాయుః, वायुः, Vāyuḥ

ఓం వాయవే నమః | ॐ वायवे नमः | OM Vāyave namaḥ

వాయుః, वायुः, Vāyuḥ

వాతి గంధం కరోతీతి వాయు శబ్దేన బోధ్యతే ।
పుణ్యో గంధః పృథివ్యాం చేత్యచ్యుతః స్వయమీరణాత్ ॥

గంధమును ఏర్పరచును. తానే గంధముగా ఏర్పడును. కావున 'వా' అనుధాతువునుండి ఈ అర్థములో 'వాయుః' అను శబ్దము ఏర్పడును.

:: శ్రీమద్బగవద్గీత - విజ్ఞాన యోగము ::
పుణ్యో గన్ధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ ।
జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు ॥ 9 ॥

నేను భూమియందు సుగంధమును, అగ్నియందు ప్రకాశమును, సమస్తప్రాణులయందు ప్రాణమును, తాపసులయందు తపస్సును అయియున్నాను.

Vāti gaṃdhaṃ karotīti vāyu śabdena bodhyate,
Puṇyo gaṃdhaḥ pr̥thivyāṃ cetyacyutaḥ svayamīraṇāt.

वाति गंधं करोतीति वायु शब्देन बोध्यते ।
पुण्यो गंधः पृथिव्यां चेत्यच्युतः स्वयमीरणात् ॥

One who is the cause of smell. Blows; carries the smell.

Śrīmad Bagavad Gīta - Chapter 7
Puṇyo gandhaḥ pr̥thivyāṃ ca tejaścāsmi vibhāvasau,
Jīvanaṃ sarvabhūteṣu tapaścāsmi tapasviṣu. 9.

:: श्रीमद्बगवद्गीत - विज्ञान योग ::
पुण्यो गन्धः पृथिव्यां च तेजश्चास्मि विभावसौ ।
जीवनं सर्वभूतेषु तपश्चास्मि तपस्विषु ॥ ९ ॥

I am also the sweet fragrance in the earth; I am the brilliance in the fire and the life in all beings; and I am the austerity of the ascetics.

वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवः पृथुः ।
हिरण्यगर्भश्शत्रुघ्नोव्याप्तो वायुरधोक्षजः ॥ ४४ ॥

వైకుణ్ఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః ।
హిరణ్యగర్భశ్శత్రుఘ్నోవ్యాప్తో వాయురధోక్షజః ॥ ౪౪ ॥

Vaikuṇṭhaḥ puruṣaḥ prāṇaḥ prāṇadaḥ praṇavaḥ pr̥thuḥ ।
Hiraṇyagarbhaśśatrughnovyāpto vāyuradhokṣajaḥ ॥ 44 ॥

21 డిసెం, 2013

413. వ్యాప్తః, व्याप्तः, Vyāptaḥ

ఓం వ్యాప్తాయ నమః | ॐ व्याप्ताय नमः | OM Vyāptāya namaḥ

కారణత్వేన కార్యాణాం వ్యాపనాద్వ్యాప్త ఉచ్యతే కారణరూపుడై సర్వ కార్యములందును వ్యాపించిఉండును. ఏది దేని నుండి నిష్పన్నమగునో ఆ కార్యమునకు అది కారణము. ప్రతియొక కార్యమునందు కారణము వ్యాపించియుండును. పరమాత్మునివలన సర్వదృశ్య ప్రపంచమును జనించినదనగా అందంతటను పరమాత్ముడు వ్యాపించియున్నాడనుట సమంజసమే కదా!

Kāraṇatvena kāryāṇāṃ vyāpanādvyāpta ucyate / कारणत्वेन कार्याणां व्यापनाद्व्याप्त उच्यते One who permeates all effects as their cause. As the cause, pervades all effects.

वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवः पृथुः ।
हिरण्यगर्भश्शत्रुघ्नोव्याप्तो वायुरधोक्षजः ॥ ४४ ॥

వైకుణ్ఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః ।
హిరణ్యగర్భశ్శత్రుఘ్నోవ్యాప్తో వాయురధోక్షజః ॥ ౪౪ ॥

Vaikuṇṭhaḥ puruṣaḥ prāṇaḥ prāṇadaḥ praṇavaḥ pr̥thuḥ ।
Hiraṇyagarbhaśśatrughnovyāpto vāyuradhokṣajaḥ ॥ 44 ॥

20 డిసెం, 2013

412. శత్రుఘ్నః, शत्रुघ्नः, Śatrughnaḥ

ఓం శత్రుఘ్నాయ నమః | ॐ शत्रुघ्नाय नमः | OM Śatrughnāya namaḥ

యుగే యుగే విష్ణురేవ త్రిదశానామ్మహాత్మనామ్ ।
శత్రూన్ హంతీతి శత్రుఘ్న ఇతి శబ్దేన బోద్యతే ॥

ప్రతీ యుగములో దేవతల హవిస్సును అపహరించు రాక్షసుల జంపు విష్ణువు శత్రుఘ్నః అనబడును.

वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवः पृथुः ।
हिरण्यगर्भश्शत्रुघ्नोव्याप्तो वायुरधोक्षजः ॥ ४४ ॥

వైకుణ్ఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః ।
హిరణ్యగర్భశ్శత్రుఘ్నోవ్యాప్తో వాయురధోక్షజః ॥ ౪౪ ॥

Vaikuṇṭhaḥ puruṣaḥ prāṇaḥ prāṇadaḥ praṇavaḥ pr̥thuḥ ।
Hiraṇyagarbhaśśatrughnovyāpto vāyuradhokṣajaḥ ॥ 44 ॥

19 డిసెం, 2013

411. హిరణ్యగర్భః, हिरण्यगर्भः, Hiraṇyagarbhaḥ

ఓం హిరణ్యగర్భాయ నమః | ॐ हिरण्यगर्भाय नमः | OM Hiraṇyagarbhāya namaḥ

హిరణ్యగర్భసంభూతి కారణాండం హిరణ్మయమ్ ।
యస్య వీర్యాత్సమద్భూతం గర్భో భవతి సోఽచ్యుతః ।
హిరణ్యగర్భశబ్దేన ప్రోచ్యతే విబుధోత్తమైః ॥

హిరణ్యము అనగా హిరణ్మయము (బంగారుతోనైనది) అగు అండము ఏ పరమాత్ముని వీర్యమునుండి జనించెనో - ఆ హిరణ్మయాండము. ఈ పరమాత్ముని 'గర్భము' 'ఉదరస్థశిశువు' అగుచు 'సూత్రాత్మ' అనబడు హిరణ్యగర్భనామక సకల సూక్ష్మ శరీరాభిమాని చైతన్య సమష్టి తత్త్వపు పుట్టుకకు కారణము అయ్యెను. అందువలన హిరణ్యము ఎవని గర్భమో అట్టి ఆ పరమాత్మునకు హిరణ్యగర్భ అని వ్యవహారము.

वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवः पृथुः ।
हिरण्यगर्भश्शत्रुघ्नोव्याप्तो वायुरधोक्षजः ॥ ४४ ॥

వైకుణ్ఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః ।
హిరణ్యగర్భశ్శత్రుఘ్నోవ్యాప్తో వాయురధోక్షజః ॥ ౪౪ ॥

Vaikuṇṭhaḥ puruṣaḥ prāṇaḥ prāṇadaḥ praṇavaḥ pr̥thuḥ ।
Hiraṇyagarbhaśśatrughnovyāpto vāyuradhokṣajaḥ ॥ 44 ॥

18 డిసెం, 2013

410. పృథుః, पृथुः, Pr̥thuḥ

ఓం పృథవే నమః | ॐ पृथवे नमः | OM Pr̥thave namaḥ

పృథుః ప్రపంచరూపేణ విస్తృతత్వాజ్జగత్పతిః ప్రపంచరూపమున విస్తరిల్లును కావున విష్ణుడు 'పృథుః' అనబడును.

Pr̥thuḥ prapaṃcarūpeṇa vistr̥tatvājjagatpatiḥ / पृथुः प्रपंचरूपेण विस्तृतत्वाज्जगत्पतिः Since He has expanded Himself as the universe, He is Pr̥thuḥ.

वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवः पृथुः
हिरण्यगर्भश्शत्रुघ्नोव्याप्तो वायुरधोक्षजः ॥ ४४ ॥

వైకుణ్ఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః
హిరణ్యగర్భశ్శత్రుఘ్నోవ్యాప్తో వాయురధోక్షజః ॥ ౪౪ ॥

Vaikuṇṭhaḥ puruṣaḥ prāṇaḥ prāṇadaḥ praṇavaḥ pr̥thuḥ
Hiraṇyagarbhaśśatrughnovyāpto vāyuradhokṣajaḥ ॥ 44 ॥

17 డిసెం, 2013

409. ప్రణవః, प्रणवः, Praṇavaḥ

ఓం ప్రణవాయ నమః | ॐ प्रणवाय नमः | OM Praṇavāya namaḥ

ప్రణూయతేస్తూయత ఇత్యుచ్యతో హరిరీశ్వరః ।
ప్రణౌతీతి ప్రణవ ఓంకారోవిష్ణోర్హివాచకః ॥
స ప్రణవః ప్రణౌతీతి యస్తస్మాదోమితిశ్రుతేః ।
అథవా ప్రణమ్యత ఇత్యుచ్యతః ప్రణవఃస్మృతః ॥
ప్రణువంతీ హ వై వేదాస్తస్మాత్ ప్రణవ ఉచ్యతే ।
ఇతి సనత్కుమారస్య మునివర్యస్య వాక్యతః ॥

ప్ర అను ఉపసర్గతో కూడిన ణు - స్తుతౌ అను ధాతువు నుండి నిష్పన్నమైన ప్రణవ శబ్దము బాగుగా స్తుతింపబడు విష్ణువును బోధించును. ప్రణౌతీతి అను వ్యుత్పత్తితో పై ధాతువు నుండి కర్త్రర్థమున ఏర్పడిన ప్రణవ శబ్దము విష్ణువును స్తుతించు ఓంకారమును తెలుపును. 'నమస్కరించబడును' అను అర్థమున భగవానుడు 'ప్రణవః' అనబడును. ఈ లోకమునందు వేదములు ఆ పరమాత్ముని ప్రణమిల్లుచున్నవి అను సనత్కుమార వచనము ననుసరించియు ఈ విషయము సమర్థించబడుచున్నది.

Praṇūyatestūyata ityucyato harirīśvaraḥ,
Praṇautīti praṇava oṃkāroviṣṇorhivācakaḥ.
Sa praṇavaḥ praṇautīti yastasmādomitiśruteḥ,
Athavā praṇamyata ityucyataḥ praṇavaḥsmr̥taḥ.
Praṇuvaṃtī ha vai vedāstasmāt praṇava ucyate,
Iti sanatkumārasya munivaryasya vākyataḥ.

प्रणूयतेस्तूयत इत्युच्यतो हरिरीश्वरः ।
प्रणौतीति प्रणव ॐकारोविष्णोर्हिवाचकः ॥
स प्रणवः प्रणौतीति यस्तस्मादोमितिश्रुतेः ।
अथवा प्रणम्यत इत्युच्यतः प्रणवःस्मृतः ॥
प्रणुवंती ह वै वेदास्तस्मात् प्रणव उच्यते ।
इति सनत्कुमारस्य मुनिवर्यस्य वाक्यतः ॥

Is praised, so Praṇavaḥ. He is made obeisance to (from nam to bow). One who is praised or to whom prostration is made with Om. Sanatkumāra said 'As the Vedas make obeisance to Him, He is said to be Praṇava.

वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवः पृथुः ।
हिरण्यगर्भश्शत्रुघ्नोव्याप्तो वायुरधोक्षजः ॥ ४४ ॥

వైకుణ్ఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః ।
హిరణ్యగర్భశ్శత్రుఘ్నోవ్యాప్తో వాయురధోక్షజః ॥ ౪౪ ॥

Vaikuṇṭhaḥ puruṣaḥ prāṇaḥ prāṇadaḥ praṇavaḥ pr̥thuḥ ।
Hiraṇyagarbhaśśatrughnovyāpto vāyuradhokṣajaḥ ॥ 44 ॥

16 డిసెం, 2013

408. ప్రాణదః, प्राणदः, Prāṇadaḥ

ఓం ప్రాణదాయ నమః | ॐ प्राणदाय नमः | OM Prāṇadāya namaḥ

ప్రలయాదిషు యః ప్రాణాన్ ద్యతి ఖండయతీతి సః ।
విష్ణుః ప్రాణద ఇత్యుక్తో వేదవిద్యావిశారదైః ॥

ప్రళయాది సమయములందు ప్రాణుల ప్రాణములను ఖండించునుగనుక విష్ణుదేవుని ప్రాణదః అని విశారదులు కీర్తింతురు.

65. ప్రాణదః, प्राणदः, Prāṇadaḥ
321. ప్రాణదః, प्राणदः, Prāṇadaḥ

Pralayādiṣu yaḥ prāṇān dyati khaṃḍayatīti saḥ,
Viṣṇuḥ prāṇada ityukto vedavidyāviśāradaiḥ.

प्रलयादिषु यः प्राणान् द्यति खंडयतीति सः ।
विष्णुः प्राणद इत्युक्तो वेदविद्याविशारदैः ॥  

At the time of praḷaya or cosmic dissolution, Lord Viṣṇu cuts of the prāṇa or life of all beings and Hence He is called Prāṇadaḥ by the learned.

Śrīmad Bhāgavata - Canto 11, Chapter 3
Śtityudbhavapralayaheturheturasya
     Yatsvapna jāgarasuṣuptiṣu sadbahiśca,
Dehendriyāsuhr̥dayāni caranti yena
     Sañjīvitāni tadavehi paraṃ narendra. 35.

:: श्रीमद्भागवते एकादशस्कन्धे तृतीयोऽध्यायः ::
श्तित्युद्भवप्रलयहेतुर्हेतुरस्य
     यत्स्वप्न जागरसुषुप्तिषु सद्बहिश्च ।
देहेन्द्रियासुहृदयानि चरन्ति येन
     सञ्जीवितानि तदवेहि परं नरेन्द्र ॥ ३५ ॥

He is the cause of the creation, maintenance and destruction of this universe, yet He has no prior cause. He pervades the various states of wakefulness, dreaming and unconscious deep sleep and also exists beyond them. By entering the body of every living being as the Supersoul, He enlivens the body, senses, life airs and mental activities, and thus all the subtle and gross organs of the body begin their functions. Know that He is the Supreme.

65. ప్రాణదః, प्राणदः, Prāṇadaḥ
321. ప్రాణదః, प्राणदः, Prāṇadaḥ

वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवः पृथुः ।
हिरण्यगर्भश्शत्रुघ्नोव्याप्तो वायुरधोक्षजः ॥ ४४ ॥

వైకుణ్ఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః ।
హిరణ్యగర్భశ్శత్రుఘ్నోవ్యాప్తో వాయురధోక్షజః ॥ ౪౪ ॥

Vaikuṇṭhaḥ puruṣaḥ prāṇaḥ prāṇadaḥ praṇavaḥ pr̥thuḥ ।
Hiraṇyagarbhaśśatrughnovyāpto vāyuradhokṣajaḥ ॥ 44 ॥

15 డిసెం, 2013

407. ప్రాణః, प्राणः, Prāṇaḥ

ఓం ప్రాణాయ నమః | ॐ प्राणाय नमः | OM Prāṇāya namaḥ

 ప్రాణః, प्राणः, Prāṇaḥ

విష్ణుః క్షేత్రజ్ఞరూపేణ ప్రాణితి శ్రీధరో హరిః ।
ప్రాణాత్మనా చేష్టయన్వా ప్రాణ ఇత్యుచ్యతే బుధైః ॥

విష్ణుడే సర్వక్షేత్ర, శరీరములయందును క్షేత్రజ్ఞ రూపమున అనగా జీవుడుగా ప్రాణించుచు, శ్వాసించుచు ఉన్నాడు. ప్రాణరూపుడుగానుండుచు జీవులను ఆయా వ్యాపారములను చేష్టింపజేయుచున్నాడు. చేష్టాం కరోతి శ్వసనస్వరూపి (వి. పు) శ్వాస రూపమున ప్రాణుల చేష్టింపజేయుచున్నాడు.

66. ప్రాణః, प्राणः, Prāṇaḥ
320. ప్రాణః, प्राणः, Prāṇaḥ

Viṣṇuḥ kṣetrajñarūpeṇa prāṇiti śrīdharo hariḥ,
Prāṇātmanā ceṣṭayanvā prāṇa ityucyate budhaiḥ.

विष्णुः क्षेत्रज्ञरूपेण प्राणिति श्रीधरो हरिः ।
प्राणात्मना चेष्टयन्वा प्राण इत्युच्यते बुधैः ॥

As kṣetrajña He breathes. Assuming the form of prāṇa or life force, He makes the organs and limbs of various beings function. Ceṣṭāṃ karoti śvasanasvarūpi (Vi. Pu) / चेष्टां करोति श्वसनस्वरूपि (वि. पु) In the form of breath, He acts.

66. ప్రాణః, प्राणः, Prāṇaḥ
320. ప్రాణః, प्राणः, Prāṇaḥ

वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवः पृथुः ।
हिरण्यगर्भश्शत्रुघ्नोव्याप्तो वायुरधोक्षजः ॥ ४४ ॥

వైకుణ్ఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః ।
హిరణ్యగర్భశ్శత్రుఘ్నోవ్యాప్తో వాయురధోక్షజః ॥ ౪౪ ॥

Vaikuṇṭhaḥ puruṣaḥ prāṇaḥ prāṇadaḥ praṇavaḥ pr̥thuḥ ।
Hiraṇyagarbhaśśatrughnovyāpto vāyuradhokṣajaḥ ॥ 44 ॥

14 డిసెం, 2013

406. పురుషః, पुरुषः, Puruṣaḥ

ఓం పురుషాయ నమః | ॐ पुरुषाय नमः | OM Puruṣāya namaḥ

సర్వస్మాత్ పురాసదనాత్ సర్వపాపస్య సాదనాత్ ।
పురిశయనాద్వ హరిః బుధైః పురుష ఉచ్యతే ॥

ప్రతియొకదానికంటెను ముందుగానే చేరియున్నాడు. అన్నిటికంటె పూర్వుడు, ముందటివాడు అగుచునే సర్వపాపములను దహించెను.

స యత్పూర్వోఽస్మాత్సర్వస్మాత్సర్వా న్పాప్మన ఉఔష త్త్స్మాత్ పురుషః (బృ 3.4.1) ఆతడు ఈ దృశ్యమానము, కనబడుచున్నదియగు ప్రయొక దానికంటెను పూర్వుడు అగుచు తన తపముచే సర్వపాపములను దహించినందువలన తాను 'పురుషః'.

స వా అయం పురుషః సర్వాసు పూర్షు పురి శయః (బృ 4.5.18) ఆ ఈ ఆత్మ, పరమాత్మయే సర్వపుర, శరీరములయందును ఉండుచు పురుషః అనబడుచున్నాడు.

14. పురుషః, पुरुषः, Puruṣaḥ

Sarvasmāt purāsadanāt sarvapāpasya sādanāt,
Puriśayanādva hariḥ budhaiḥ puruṣa ucyate.

सर्वस्मात् पुरासदनात् सर्वपापस्य सादनात् ।
पुरिशयनाद्व हरिः बुधैः पुरुष उच्यते ॥

One who existed before everything. Or One who can efface all sins.

Sa yatpūrvo’smātsarvasmātsarvā npāpmana uauṣa ttsmāt puruṣaḥ (Br̥ 3.4.1) / स यत्पूर्वोऽस्मात्सर्वस्मात्सर्वा न्पाप्मन उऔष त्त्स्मात् पुरुषः (बृ ३.४.१) He existed before everything. He reduces all sins to ashes; so He is Puruṣaḥ.

Sa vā ayaṃ puruṣaḥ sarvāsu pūrṣu puri śayaḥ (Br̥ 4.5.18) / स वा अयं पुरुषः सर्वासु पूर्षु पुरि शयः (बृ ४.५.१८) He lies in all puras or bodies.

14. పురుషః, पुरुषः, Puruṣaḥ

वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवः पृथुः ।
हिरण्यगर्भश्शत्रुघ्नोव्याप्तो वायुरधोक्षजः ॥ ४४ ॥

వైకుణ్ఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః ।
హిరణ్యగర్భశ్శత్రుఘ్నోవ్యాప్తో వాయురధోక్షజః ॥ ౪౪ ॥

Vaikuṇṭhaḥ puruṣaḥ prāṇaḥ prāṇadaḥ praṇavaḥ pr̥thuḥ ।
Hiraṇyagarbhaśśatrughnovyāpto vāyuradhokṣajaḥ ॥ 44 ॥

13 డిసెం, 2013

405. వైకుంఠః, वैकुण्ठः, Vaikuṇṭhaḥ

ఓం వైకుంఠాయ నమః | ॐ वैकुण्ठाय नमः | OM Vaikuṇṭhāya namaḥ

వైకుంఠః, वैकुण्ठः, Vaikuṇṭhaḥ

గతేః ప్రతిహతిః కుంఠా వివిధాం తాం కరోతి యః ।
భూతాని జగదారంభే విశ్లిష్టాని పరస్పరం ॥
సంశ్లేషయన్ గతిం తేషాం ప్రతిబధ్నాతి యత్ హరిః ।
తతస్స వైకుంఠ ఇతి ప్రోచ్యతే విబుదోత్తమైః ॥

కుంఠః అనగా నడక. వివిధా కుంఠా - వికుంఠా వివిధమగు గతిప్రతిహతి అనగా నడకలో కలుగు ఆటంకము వికుంఠా అనబడును. వివిధమగు గతిప్రతిహతిని కలిగించు విష్ణువు వైకుంఠః అనబడును. ఏలయన ఆతడు సృష్టికి ముందు విడి విడిగా నుండిన భూతములను జగత్తు సృష్టి ఆరంభమున పరస్పరము కలిపినవాడగుచు వాని స్వతంత్రగమనమును ప్రతిబంధించుచున్నాడు.

విగతా కుంఠా యస్య సః వికుంఠః, వికుంఠః ఏవ వైకుంఠః అనియు వ్యుత్పత్తి. అనగా నడకలోని ఆటంకము ఎవనినుండి తొలగినదో ఆతడు వికుంఠుడు అనదగును. అదే యర్థమున 'అణ్' ప్రత్యయము వచ్చుటచే 'వికుంఠ' శబ్దమే వైకుంఠః అగుచున్నది.

:: శ్రీమహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మపర్వణి ద్విచత్వారింశదధికత్రిశతతమోఽధ్యాయః ::
మయా సంశ్లేషితా భూమిరద్భిర్వ్యోమ చ వాయునా ।
వాయుశ్చ తేజసా సార్ధం వైకుణ్ఠత్వం తతో మమ ॥ 80 ॥

నాచే భూమిజలములతోను, ఆకాశము వాయువుతోను, వాయువు అగ్నితోను కలిపివేయబడెను. దానివలననే నాకు వైకుంఠః అను నామముతో వ్యవహారము ఏర్పడెను.

Gateḥ pratihatiḥ kuṃṭhā vividhāṃ tāṃ karoti yaḥ,
Bhūtāni jagadāraṃbhe viśliṣṭāni parasparaṃ.
Saṃśleṣayan gatiṃ teṣāṃ pratibadhnāti yat hariḥ,
Tatassa vaikuṃṭha iti procyate vibudottamaiḥ.

गतेः प्रतिहतिः कुंठा विविधां तां करोति यः ।
भूतानि जगदारंभे विश्लिष्टानि परस्परं ॥
संश्लेषयन् गतिं तेषां प्रतिबध्नाति यत् हरिः ।
ततस्स वैकुंठ इति प्रोच्यते विबुदोत्तमैः ॥

Kuṇṭhaḥ / कुण्ठः means path. Vividhā kuṇṭhā - Vikuṇṭhā / विविधा कुण्ठा - विकुण्ठा The obstruction of path or natural inclinations is Vikuṇṭha. He who causes Vikuṇṭha is Vaikuṇṭhaḥ. During the creation of universe, obstructing their independent movement, He united the elements that had a tendency to get scattered at random. So, He is called Vaikuṇṭhaḥ.

Vigatā kuṭhā yasya saḥ vikuṭhaḥ, vikuṭhaḥ eva vaikuṭhaḥ / विगता कुंठा यस्य सः विकुंठः, विकुंठः एव वैकुंठः The word Vaikuṇṭhaḥ can also mean One who is without any limitation or opposing factor.

Mahābhārata Śānti Parva, Mokṣadharma Parva - Chapter 343
Mayā saṃśleṣitā bhūmiradbhirvyoma ca vāyunā,
Vāyuśca tejasā sārdhaṃ vaikuṇṭhatvaṃ tato mama. 80.

:: श्रीमहाभारते शान्तिपर्वणि मोक्षधर्मपर्वणि द्विचत्वारिंशदधिकत्रिशततमोऽध्यायः ::
मया संश्लेषिता भूमिरद्भिर्व्योम च वायुना ।
वायुश्च तेजसा सार्धं वैकुण्ठत्वं ततो मम ॥ ८० ॥

By Me was the earth united with waters, the ether with the air and air with fire. Hence being Vaikuṇṭha, the name Vaikuṇṭhaḥ pertained to Me.

वैकुण्ठः पुरुषः प्राणः प्राणदः प्रणवः पृथुः ।
हिरण्यगर्भश्शत्रुघ्नोव्याप्तो वायुरधोक्षजः ॥ ४४ ॥

వైకుణ్ఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః ।
హిరణ్యగర్భశ్శత్రుఘ్నోవ్యాప్తో వాయురధోక్షజః ॥ ౪౪ ॥

Vaikuṇṭhaḥ puruṣaḥ prāṇaḥ prāṇadaḥ praṇavaḥ pr̥thuḥ ।
Hiraṇyagarbhaśśatrughnovyāpto vāyuradhokṣajaḥ ॥ 44 ॥

12 డిసెం, 2013

404. ధర్మవిదుత్తమః, धर्मविदुत्तमः, Dharmaviduttamaḥ

ఓం ధర్మవిదుత్తమాయ నమః | ॐ धर्मविदुत्तमाय नमः | OM Dharmaviduttamāya namaḥ

ఆజ్ఞాభూతా హి యద్విష్ణోః శ్రుతయస్మృతయశ్చతత్ ।
సర్వధర్మవిదాంశ్రేష్ఠ ఇత్ ధర్మవిదుత్తమః ॥

ధర్మవేత్తలలోనెల్ల ఉత్తముడు. శ్రుతులును, స్మృతులును అన్నియును ఎవని ఆజ్ఞలుగా నున్నవో అట్టి పరమాత్మ ధర్మ్వవేత్తలందరిలో ఉత్తముడే కదా!

Ājñābhūtā hi yadviṣṇoḥ śrutayasmr̥tayaścatat,
Sarvadharmavidāṃśreṣṭha it dharmaviduttamaḥ.

आज्ञाभूता हि यद्विष्णोः श्रुतयस्मृतयश्चतत् ।
सर्वधर्मविदांश्रेष्ठ इत् धर्मविदुत्तमः ॥

He whose commands are śrutis and smr̥tis is alone the greates of those who knows dharmas; hence He is Dharmaviduttamaḥ.

रामो विरामो विरजो मार्गोनेयोनयोऽनयः ।
वीरश्शक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः ॥ ४३ ॥

రామో విరామో విరజో మార్గోనేయోనయోఽనయః ।
వీరశ్శక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదుత్తమః ॥ ౪౩ ॥

Rāmo virāmo virajo mārgoneyonayo’nayaḥ ।
Vīraśśaktimatāṃ śreṣṭho dharmo dharmaviduttamaḥ ॥ 43 ॥

11 డిసెం, 2013

403. ధర్మః, धर्मः, Dharmaḥ

ఓం ధర్మవిదుత్తమాయ నమః | ॐ धर्मविदुत्तमाय नमः | OM Dharmaviduttamāya namaḥ

ధారణాత్సర్వభూతానా మేషధర్మ ఇతి శ్రుతేః ।
ధరిమైరారాధ్యత ఇతి ధర్మ ఇత్యుచ్యతే హరిః ॥

ధరించువాడు. సర్వ భూతములను ధరించువాడు గావున ధర్మః అనదగియున్నాడు.

रामो विरामो विरजो मार्गोनेयोनयोऽनयः ।
वीरश्शक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः ॥ ४३ ॥

రామో విరామో విరజో మార్గోనేయోనయోఽనయః ।
వీరశ్శక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదుత్తమః ॥ ౪౩ ॥

Rāmo virāmo virajo mārgoneyonayo’nayaḥ ।
Vīraśśaktimatāṃ śreṣṭho dharmo dharmaviduttamaḥ ॥ 43 ॥

10 డిసెం, 2013

402. శక్తిమతాం శ్రేష్ఠః, शक्तिमतां श्रेष्ठः, Śaktimatāṃ śreṣṭhaḥ

ఓం శక్తిమతాం శ్రేష్ఠాయ నమః | ॐ शक्तिमतां श्रेष्ठाय नमः | OM Śaktimatāṃ śreṣṭhāya namaḥ

విరించాది శక్తిమతాం శక్తిమత్త్వాజ్జనార్దనః ।
విష్ణుః శక్తిమతాం శ్రేష్ఠ ఇతి సంకీర్త్యతే బుధైః ॥

శక్తిమంతులగు విరించాదుల కంటే అనగా చతుర్ముఖ బ్రహ్మ మొదలగువారికంటెను గొప్ప శక్తిగలవాడు. శక్తి గలవారిలోనెల్ల శ్రేష్ఠుడు.

Viriṃcādi śaktimatāṃ śaktimattvājjanārdanaḥ,
Viṣṇuḥ śaktimatāṃ śreṣṭha iti saṃkīrtyate budhaiḥ.

विरिंचादि शक्तिमतां शक्तिमत्त्वाज्जनार्दनः ।
विष्णुः शक्तिमतां श्रेष्ठ इति संकीर्त्यते बुधैः ॥

More powerful than powerful ones like Viriṃci or Brahma. Best amongst such.

रामो विरामो विरजो मार्गोनेयोनयोऽनयः ।
वीरश्शक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः ॥ ४३ ॥

రామో విరామో విరజో మార్గోనేయోనయోఽనయః ।
వీరశ్శక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదుత్తమః ॥ ౪౩ ॥

Rāmo virāmo virajo mārgoneyonayo’nayaḥ ।
Vīraśśaktimatāṃ śreṣṭho dharmo dharmaviduttamaḥ ॥ 43 ॥

9 డిసెం, 2013

401. వీరః, वीरः, Vīraḥ

ఓం వీరాయ నమః | ॐ वीराय नमः | OM Vīrāya namaḥ

వీరో విక్రమశాలిత్వాత్ విష్ణురేష త్రివిక్రమః అత్యంత విక్రమశాలియగు విష్ణువు వీరః.

Vīro vikramaśālitvāt viṣṇureṣa trivikramaḥ / वीरो विक्रमशालित्वात् विष्णुरेष त्रिविक्रमः Being valorous, Lord Viṣṇu is called Vīraḥ.

रामो विरामो विरजो मार्गोनेयोनयोऽनयः ।
वीरश्शक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः ॥ ४३ ॥

రామో విరామో విరజో మార్గోనేయోనయోఽనయః ।
వీరశ్శక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదుత్తమః ॥ ౪౩ ॥

Rāmo virāmo virajo mārgoneyonayo’nayaḥ ।
Vīraśśaktimatāṃ śreṣṭho dharmo dharmaviduttamaḥ ॥ 43 ॥

8 డిసెం, 2013

400. అనయః, अनयः, Anayaḥ

ఓం అనయాయ నమః | ॐ अनयाय नमः | OM Anayāya namaḥ

నాస్య నేతా విద్యతే ఇత్యనయః పరికీర్త్యతే ఈతనికి 'నయుడు' అనగా మోక్షమునకు కొనిపోవువాడు ఎవడును లేడు. ఈ పరమాత్ముడే 'నయః' అనగా మోక్షమునకు కొనిపోవువాడు. అటువంటి ఈతనిని మొక్షమునకు కొనిపోవువారు ఎటుల ఉండెదరు?

Nāsya netā vidyate ityanayaḥ parikīrtyate / नास्य नेता विद्यते इत्यनयः परिकीर्त्यते He who has no one to lead Him to salvation. As He himself is Nayaḥ, that is, One who leads to salvation, how can there be any other who can lead Him to salvation?

रामो विरामो विरजो मार्गोनेयोनयोऽनयः
वीरश्शक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः ॥ ४३ ॥

రామో విరామో విరజో మార్గోనేయోనయోఽనయః
వీరశ్శక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదుత్తమః ॥ ౪౩ ॥

Rāmo virāmo virajo mārgoneyonayo’nayaḥ
Vīraśśaktimatāṃ śreṣṭho dharmo dharmaviduttamaḥ ॥ 43 ॥

7 డిసెం, 2013

399. నయః, नयः, Nayaḥ

ఓం నయాయ నమః | ॐ नयाय नमः | OM Nayāya namaḥ

నయతీతి నయో నేతేత్యుచ్యతే సద్భిరచ్యుతః ।
నయతీతి నయో విష్ణుర్నేతా దేవో జనార్దనః ॥
మార్గో నేయో నయ ఇతి త్రిరూపః పరికల్ప్యతే ॥

జీవులను మోక్షస్థితికి కొనిపోవువాడు; అతడు పరమాత్ముడే. ఇట్లు ఇచ్చట మార్గః - నేయః - నయః మోక్షమునకు చేరుటకు ఉపయోగించు త్రోవ - మోక్షమునకు కొనిపోబడుజీవుడు - జీవులను మోక్షమునకు తీసికొని పోవువాడు అను మూడు రూపములలోను పరమాత్ముడే యున్నాడని ఈ నామత్రయముచే వ్యవస్థ చేయబడుచున్నది.

Nayatīti nayo netetyucyate sadbhiracyutaḥ,
Nayatīti nayo viṣṇurnetā devo janārdanaḥ.
Mārgo neyo naya iti trirūpaḥ parikalpyate.

नयतीति नयो नेतेत्युच्यते सद्भिरच्युतः ।
नयतीति नयो विष्णुर्नेता देवो जनार्दनः ॥
मार्गो नेयो नय इति त्रिरूपः परिकल्प्यते ॥

He who leads, that is, who is the leader in the form of spiritual illumination is Nayaḥ. The Lord is referred to in the three ways as Mārgaḥ, Neyaḥ and Nayaḥ. He is the Way, the Goal and He who leads to it.

रामो विरामो विरजो मार्गोनेयोनयोऽनयः
वीरश्शक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः ॥ ४३ ॥

రామో విరామో విరజో మార్గోనేయోనయోఽనయః
వీరశ్శక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదుత్తమః ॥ ౪౩ ॥

Rāmo virāmo virajo mārgoneyonayo’nayaḥ
Vīraśśaktimatāṃ śreṣṭho dharmo dharmaviduttamaḥ ॥ 43 ॥

6 డిసెం, 2013

398. నేయః, नेयः, Neyaḥ

ఓం నేయాయ నమః | ॐ नेयाय नमः | OM Neyāya namaḥ

మార్గేణ సమ్యగ్జ్ఞా నేన పరమాత్మతయా నరః ।
నీయత ఇతి నేయ ఇత్యుచ్యతే సద్భిరచ్యుతః ॥

మార్గః నామమునందు జెప్పినవిధమగు సమ్యగ, లెస్సయగు జ్ఞానముచే జీవుడు పరమాత్ముడుగా కొని పోబడుచున్నాడు కావున ఆ జీవునకు నేయః అని వ్యవహారము. ఆ జీవుడును వస్తు స్థితిలో పరమాత్ముడే.

Mārgeṇa samyagjñā nena paramātmatayā naraḥ,
Nīyata iti neya ityucyate sadbhiracyutaḥ.

मार्गेण सम्यग्ज्ञा नेन परमात्मतया नरः ।
नीयत इति नेय इत्युच्यते सद्भिरच्युतः ॥

By right knowledge, the jīva is led to being of the nature of the identity with the Paramātman.

रामो विरामो विरजो मार्गोनेयोनयोऽनयः ।
वीरश्शक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः ॥ ४३ ॥

రామో విరామో విరజో మార్గోనేయోనయోఽనయః ।
వీరశ్శక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదుత్తమః ॥ ౪౩ ॥

Rāmo virāmo virajo mārgoneyonayo’nayaḥ ।
Vīraśśaktimatāṃ śreṣṭho dharmo dharmaviduttamaḥ ॥ 43 ॥

5 డిసెం, 2013

397. మార్గః, मार्गः, Mārgaḥ

ఓం మార్గాయ నమః | ॐ मार्गाय नमः | OM Mārgāya namaḥ

యం విదిత్వాఽమృతత్వాయ కల్పంతే యోగినో హరిమ్ ।
ముముక్షవస్స ఏవాయం పంథా మార్గ ఇతీర్యతే ॥

ఎవని విషయమున నిలుచు ఏ జ్ఞానముచే ముముక్షువులగు యోగులు అమృతత్వమును పొంద సమర్థులగుచున్నారో ఆతడును ఆ జ్ఞానమును 'మార్గము'. త్రోవయూ ఆ త్రోవను నడిచి చేరదగిన గమ్యమును విష్ణువే!

Yaṃ viditvā’mr̥tatvāya kalpaṃte yogino harim,
Mumukṣavassa evāyaṃ paṃthā mārga itīryate.

यं विदित्वाऽमृतत्वाय कल्पंते योगिनो हरिम् ।
मुमुक्षवस्स एवायं पंथा मार्ग इतीर्यते ॥

That path by knowing which the liberation seeking ascetics attain to immortality.  He is the path and destination too.

रामो विरामो विरजो मार्गोनेयोनयोऽनयः ।
वीरश्शक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः ॥ ४३ ॥

రామో విరామో విరజో మార్గోనేయోనయోఽనయః ।
వీరశ్శక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదుత్తమః ॥ ౪౩ ॥

Rāmo virāmo virajo mārgoneyonayo’nayaḥ ।
Vīraśśaktimatāṃ śreṣṭho dharmo dharmaviduttamaḥ ॥ 43 ॥

4 డిసెం, 2013

396. విరతః, विरतः, Virataḥ

ఓం విరతాయ నమః | ॐ विरताय नमः | OM Viratāya namaḥ

రతం విషయసేవాయాం విగతం యస్య చక్రిణః ।
స విష్ణుర్విరత ఇతి కీర్త్యతే విబుదోత్తమైః ॥

ఈతనికి శబ్దవిషయ సుఖముల అనుభవ విషయమున రతము అనగా ఆసక్తి తొలగినదియై ఉన్నది. తానే స్వయముగా నిత్యానందరూపుడు కావున తాను పొందవలసిన సుఖము లేవియు లేవు కావున ఆతనికి విషయ సుఖములను అనుభవించవలయునను ఆసక్తి లేదనుట తగినదియే.

Rataṃ viṣayasevāyāṃ vigataṃ yasya cakriṇaḥ,
Sa viṣṇurvirata iti kīrtyate vibudottamaiḥ.

रतं विषयसेवायां विगतं यस्य चक्रिणः ।
स विष्णुर्विरत इति कीर्त्यते विबुदोत्तमैः ॥

The One in whom the desire for enjoyments has ceased. Since He is always blissfully content, there is no other pleasure that is worth seeking.

रामो विरामो विरजो मार्गोनेयोनयोऽनयः ।
वीरश्शक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः ॥ ४३ ॥

రామో విరామో విరజో మార్గోనేయోనయోఽనయః ।
వీరశ్శక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదుత్తమః ॥ ౪౩ ॥

Rāmo virāmo virajo mārgoneyonayo’nayaḥ ।
Vīraśśaktimatāṃ śreṣṭho dharmo dharmaviduttamaḥ ॥ 43 ॥

3 డిసెం, 2013

395. విరామః, विरामः, Virāmaḥ

ఓం విరామాయ నమః | ॐ विरामाय नमः | OM Virāmāya namaḥ

విరామః, विरामः, Virāmaḥ

అస్మిన్విరామోఽవసానం ప్రాణినామితి కేశవః ।
విరామ ఇత్యుచ్యతే హి వేదవిద్యావిశారదైః ॥

విరామః అనగా అవసానము, ముగింపు అని అర్థము. ప్రాణులకు ప్రళయసమయములందు కానీ, ముక్తిచే కానీ ముగింపు కేశవునియందే కలదు కావున, ఈతను విరామః.

:: భగవద్గీత - రాజవిద్యా రాజగుహ్య యోగము ::
గతిర్భర్తా ప్రభుస్సాక్షీ నివాసశ్శరణం సుహృత్ ।
ప్రభవః ప్రలయః స్థానం నిధానం బీజమవ్యయమ్ ॥ 18 ॥

పరమలక్ష్యమును, భరించువాడును, ప్రభువును, సాక్షియు, ప్రాణుల నివాసమును, శరణమొందదగినవాడును, హితమొనర్చువాడును, సృష్టిస్థితిలయకర్తయు, నిక్షేపమును, నాశరహితమైన బీజమును నేనే అయియున్నాను.

Asminvirāmo’vasānaṃ prāṇināmiti keśavaḥ,
Virāma ityucyate hi vedavidyāviśāradaiḥ.

अस्मिन्विरामोऽवसानं प्राणिनामिति केशवः ।
विराम इत्युच्यते हि वेदविद्याविशारदैः ॥

Virāmaḥ means cessation. Since all the being merge into Lord Keśava either during the great deluge or by attaining salvation, He is called Virāmaḥ.

Bhagavad Gita - Chapter 9
Gatirbhartā prabhussākṣī nivāsaśśaraṇaṃ suhr̥t,
Prabhavaḥ pralayaḥ sthānaṃ nidhānaṃ bījamavyayam. 18.

I am the fruit of actions, the nourisher, the Lord, witness, abode, refuge, friend, origin, end, foundation, store and the imperishable seed.

रामो विरामो विरजो मार्गोनेयोनयोऽनयः ।
वीरश्शक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः ॥ ४३ ॥

రామో విరామో విరజో మార్గోనేయోనయోఽనయః ।
వీరశ్శక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదుత్తమః ॥ ౪౩ ॥

Rāmo virāmo virajo mārgoneyonayo’nayaḥ ।
Vīraśśaktimatāṃ śreṣṭho dharmo dharmaviduttamaḥ ॥ 43 ॥

2 డిసెం, 2013

394. రామః, रामः, Rāmaḥ

ఓం రామాయ నమః | ॐ रामाय नमः | OM Rāmāya namaḥ

రామః, रामः, Rāmaḥ

నిత్యానందలక్షణేస్మిన్ రమంతే యోగినస్సదా ।
ఇతి వా స్చేచ్ఛయా విష్ణూరమణీయం వపుర్వహన్ ॥
రమయత్వఖిలాన్ దాశరథీ రామాత్మనేతి వా ।
రామ ఇత్యుచ్యతే సిద్ధైర్వేదవిద్యావిశారదైః ॥

నిత్యానందరూపుడగు ఈతనియందు అనగా ఈతని సాక్షాత్కారముచే యోగులు రమింతురు, ఆనందింతురు. లేదా తన సుందర శరీరముచే ఆనందపరచువాడు. తన స్వేచ్ఛచేతనే రమణీయమగు శరీరమును ధరించిన దశరథరామునకు ఇట్లు ఈ 'రామ' పదము చెల్లును.

:: పద్మపురాణము ::
రమన్తే యోగినో యస్మిన్ నిత్యానందే చిదాత్మని ।
ఇతి రామపదేనైతత్ పరంబ్రహ్మాఽభిధీయతే ॥

ఏ నిత్యానందచిదాత్మునియందు యోగులు రమించి ఆనందిచుచుందురో అట్టివాడు అను అర్థమును తెలుపు రామ పదముచే ఈ పరబ్రహ్మము చెప్పబడుచున్నది.

:: శ్రీమద్రామయణే యుద్ధ కాండే విశంత్యుత్తరశతతమః సర్గః ::
బ్రహ్మ ఉవాచ:
సీతా లక్ష్మీర్భవాన్ విష్ణుః దేవః కృష్ణః ప్రజాపతిః ।
వదార్థం రావణస్యేహ ప్రవిష్టో మానుషీం తనుమ్ ॥ 29 ॥

సీతా సాధ్వియే లక్ష్మీదేవి. నీవు కృష్ణవర్ణముతో వెలుగొందే ప్రజాపతివైన శ్రీమహావిష్ణుడవు. లోకకంటకుడైన రావణుని వధించుటకై ఈ భూలోకములో మానవరూపమున అవతరించితివి.

Nityānaṃdalakṣaṇesmin ramaṃte yoginassadā,
Iti vā scecchayā viṣṇūramaṇīyaṃ vapurvahan.
Ramayatvakhilān dāśarathī rāmātmaneti vā,
Rāma ityucyate siddhairvedavidyāviśāradaiḥ.

नित्यानंदलक्षणेस्मिन् रमंते योगिनस्सदा ।
इति वा स्चेच्छया विष्णूरमणीयं वपुर्वहन् ॥
रमयत्वखिलान् दाशरथी रामात्मनेति वा ।
राम इत्युच्यते सिद्धैर्वेदविद्याविशारदैः ॥

The yogis delight in beholding or contemplation of Him who is characterized by permanent bliss. Or as Rāma, the son of Dasaratha, of His own free will assumed an enchanting figure.

Padmapurāṇa
Ramante yogino yasmin nityānaṃde cidātmani,
Iti rāmapadenaitat paraṃbrahmā’bhidhīyate.

:: पद्मपुराणमु ::
रमन्ते योगिनो यस्मिन् नित्यानंदे चिदात्मनि ।
इति रामपदेनैतत् परंब्रह्माऽभिधीयते ॥

Supreme brahman is indicated by the word Rāma to show that yogis revel in permanent bliss of cidātman, the ātman which is pure consciousness.

Śrīmad Rāmayaṇa, Book 6, Chapter 120
Lord Brahma says
Sītā lakṣmīrbhavān viṣṇuḥ devaḥ kr̥ṣṇaḥ prajāpatiḥ,
Vadārthaṃ rāvaṇasyeha praviṣṭo mānuṣīṃ tanum. 29.

:: श्रीमद्रामयणे युद्ध कांडे विशंत्युत्तरशततमः सर्गः ::
ब्रह्म उवाच
सीता लक्ष्मीर्भवान् विष्णुः देवः कृष्णः प्रजापतिः ।
वदार्थं रावणस्येह प्रविष्टो मानुषीं तनुम् ॥ २९ ॥

Seetha is none other than Goddess Lakshmi, while you are Lord Vishnu. You are having a shining dark-blue hue. You are the Lord of created beings. For the destruction of Ravana, you entered a human body here, on this earth.

रामो विरामो विरजो मार्गोनेयोनयोऽनयः ।
वीरश्शक्तिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः ॥ ४३ ॥

రామో విరామో విరజో మార్గోనేయోనయోఽనయః ।
వీరశ్శక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదుత్తమః ॥ ౪౩ ॥

Rāmo virāmo virajo mārgoneyonayo’nayaḥ ।
Vīraśśaktimatāṃ śreṣṭho dharmo dharmaviduttamaḥ ॥ 43 ॥

1 డిసెం, 2013

393. శుభేక్షణః, शुभेक्षणः, Śubhekṣaṇaḥ

ఓం శుభేక్షణాయ నమః | ॐ शुभेक्षणाय नमः | OM Śubhekṣaṇāya namaḥ

శుభేక్షణః, शुभेक्षणः, Śubhekṣaṇaḥ

ఈక్షణం దర్శనం యస్య శుభం శుభకరం చ వా ।
సర్వసందేహ విచ్ఛేదకారణం పాపిపావనమ్ ॥
మోక్షదం చ ముముక్షూణాం భోగదం భోగరాగిణామ్ ।
హృదయగ్రంథి విచ్ఛేది క్షపణం సర్వకర్మాణామ్ ॥

ఎవని దర్శనము శుభకరమో అనగా మోక్షార్థులకు మోక్షప్రదమును, భోగార్థులకు భోగప్రదమును, సర్వ సందేహములను తీర్చునదియు, సర్వవిధకర్మలను నశింపజేయునదియు, అవిద్యా - అజ్ఞాన నివృత్తికారణమును అగునో అట్టి మహానుభావుడు అని యర్థము.

:: ముణ్డకోపనిషత్ - ద్వితీయ ముణ్డకే, ద్వితీయ ఖణ్డః ::
బిద్యతే హృదయ గ్రన్ధి శ్ఛిద్యన్తే సర్వసంశయాః ।
క్షియన్తే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే ॥ 8 ॥ (41)

పరతత్వముగా పరుడును, ఉత్కృష్టుడును జగరూపమున అవరుడు (అపకృష్టుడు)ను అగు ఆ పరమాత్మ దర్శన గోచరుడు కాగానే ఈ ఉపాసకుని హృదయమందలి అవిద్యాగ్రంథి (ముడి) భేదిల్లును. సర్వ సంశయములును ఛిన్నములగును. ఈతని కర్మములన్నియు క్షయమునందును.

Īkṣaṇaṃ darśanaṃ yasya śubhaṃ śubhakaraṃ ca vā,
Sarvasaṃdeha vicchedakāraṇaṃ pāpipāvanam.
Mokṣadaṃ ca mumukṣūṇāṃ bhogadaṃ bhogarāgiṇām,
Hr̥dayagraṃthi vicchedi kṣapaṇaṃ sarvakarmāṇām.

ईक्षणं दर्शनं यस्य शुभं शुभकरं च वा ।
सर्वसंदेह विच्छेदकारणं पापिपावनम् ॥
मोक्षदं च मुमुक्षूणां भोगदं भोगरागिणाम् ।
हृदयग्रंथि विच्छेदि क्षपणं सर्वकर्माणाम् ॥

He whose īkṣaṇaṃ or look is śubham or auspicious, conferring salvation on those who seek it, enjoyment on those who aspire for it, dispelling all doubts, purifying sinners, breaking all knots of the heart, burning away all karmas and rooting out avidya or ignorance.

Muṇḍakopaniṣat - Chapter 2, Section 2
Bidyate hr̥daya grandhi śchidyante sarvasaṃśayāḥ,
Kṣiyante cāsya karmāṇi tasmin dr̥ṣṭe parāvare. 8. (41)

:: मुण्डकोपनिषत् - द्वितीय मुण्डके, द्वितीय खण्डः ::
बिद्यते हृदय ग्रन्धि श्छिद्यन्ते सर्वसंशयाः ।
क्षियन्ते चास्य कर्माणि तस्मिन् दृष्टे परावरे ॥ ८ ॥ (४१)

When a person realizes Him in both the high and the low i.e., in both cause and effect, the knots  of his heart are loosened i.e., desires and tendencies that clings to one's buddhi (intelligence or higher mind) due to ignorance are cleared, his doubts dispelled, and his karmas exhausted.

व्यवसायो व्यवस्थानः संस्थानस्थानदो ध्रुवः ।
परर्धिः परमस्पष्ट स्तुष्टः पुष्टश्शुभेक्षणः ॥ ४२ ॥

వ్యవసాయో వ్యవస్థానః సంస్థానస్థానదో ధ్రువః ।
పరర్ధిః పరమస్పష్ట స్తుష్టః పుష్టశ్శుభేక్షణః ॥ ౪౨ ॥

Vyavasāyo vyavasthānaḥ saṃsthānasthānado dhruvaḥ ।
Parardhiḥ paramaspaṣṭa stuṣṭaḥ puṣṭaśśubhekṣaṇaḥ ॥ 42 ॥

30 నవం, 2013

392. పుష్టః, पुष्टः, Puṣṭaḥ

ఓం పుష్టాయ నమః | ॐ पुष्टाय नमः | OM Puṣṭāya namaḥ

సర్వత్ర సంపూర్ణతయా పుష్ట ఇత్యుచ్యతే హరిః పుష్టి అనగా నిండుదనము కలవాడు. పరమాత్మ సర్వత్ర సంపూర్ణుడై యుండువాడుగదా!

Sarvatra saṃpūrṇatayā puṣṭa ityucyate Hariḥ / सर्वत्र संपूर्णतया पुष्ट इत्युच्यते हरिः As He is full of everything or blissfully content, He is Puṣṭaḥ.

व्यवसायो व्यवस्थानः संस्थानस्थानदो ध्रुवः ।
परर्धिः परमस्पष्ट स्तुष्टः पुष्टश्शुभेक्षणः ॥ ४२ ॥

వ్యవసాయో వ్యవస్థానః సంస్థానస్థానదో ధ్రువః ।
పరర్ధిః పరమస్పష్ట స్తుష్టః పుష్టశ్శుభేక్షణః ॥ ౪౨ ॥

Vyavasāyo vyavasthānaḥ saṃsthānasthānado dhruvaḥ ।
Parardhiḥ paramaspaṣṭa stuṣṭaḥ puṣṭaśśubhekṣaṇaḥ ॥ 42 ॥

29 నవం, 2013

391. తుష్టః, तुष्टः, Tuṣṭaḥ

ఓం తుష్టాయ నమః | ॐ तुष्टाय नमः | OM Tuṣṭāya namaḥ

పరమానంద రూపత్వాత్ తుష్ట ఇత్యుచ్యతే హరిః తుష్టి (పరమానంద రూపము) నంది యున్నవాడు. లేదా తుష్టియే తన రూపముగా కలవాడు. పరమాత్ముడు పరమానంద స్వరూపుడు కదా!

Paramānaṃda rūpatvāt tuṣṭa ityucyate hariḥ / परमानंद रूपत्वात् तुष्ट इत्युच्यते हरिः Being solely of the nature of absolute bliss, He is Tuṣṭaḥ - One who is of nature of supreme bliss.

व्यवसायो व्यवस्थानः संस्थानस्थानदो ध्रुवः ।
परर्धिः परमस्पष्ट स्तुष्टः पुष्टश्शुभेक्षणः ॥ ४२ ॥

వ్యవసాయో వ్యవస్థానః సంస్థానస్థానదో ధ్రువః ।
పరర్ధిః పరమస్పష్ట స్తుష్టః పుష్టశ్శుభేక్షణః ॥ ౪౨ ॥

Vyavasāyo vyavasthānaḥ saṃsthānasthānado dhruvaḥ ।
Parardhiḥ paramaspaṣṭa stuṣṭaḥ puṣṭaśśubhekṣaṇaḥ ॥ 42 ॥

28 నవం, 2013

390. పరమ స్పష్ఠః, परम स्पष्ठः, Parama spaṣṭhaḥ

ఓం పరమ స్పష్ఠాయ నమః | ॐ परम स्पष्ठाय नमः | OM Parama spaṣṭhāya namaḥ

పరమా కాంతి రస్యేతి వా సర్వోత్కృష్ట ఇత్యుత ।
అనన్యాదీన సిద్ధ్త్వాద్ విష్ణుః పరమ ఉచ్యతే ।
సంవిదాత్మతయా స్పష్టః పరమస్పష్ట ఉచ్యతే ॥

ఉత్కృష్టమైన శోభ కలవాడు. లేదా సర్వోత్కృష్టుడు. ఏలయన ఈతని ఏకార్యములు సిద్ధించుటయును తన అధీనమునందే యుండును కాని అవి పరుల అధీనమునందు ఉండునవి కావు.

కేవలానుభవ రూపుడు కావున స్పష్టః. అనుభవ రూపమున చక్కగా గోచరించువాడు.

ఈతడు పై విధమున పరముడును, స్పష్టుడును అయియున్నాడు.

Paramā kāṃti rasyeti vā sarvotkr̥ṣṭa ityuta,
Ananyādīna siddhtvād viṣṇuḥ parama ucyate,
Saṃvidātmatayā spaṣṭaḥ paramaspaṣṭa ucyate.

परमा कांति रस्येति वा सर्वोत्कृष्ट इत्युत ।
अनन्यादीन सिद्ध्त्वाद् विष्णुः परम उच्यते ।
संविदात्मतया स्पष्टः परमस्पष्ट उच्यते ॥

His is supreme splendor. So Paramaḥ.

As supremely eminent being not dependent on another or as clear of the nature of intelligence, spaṣṭhaḥ.

Hence He is Parama spaṣṭhaḥ.

व्यवसायो व्यवस्थानः संस्थानस्थानदो ध्रुवः ।
परर्धिः परमस्पष्ट स्तुष्टः पुष्टश्शुभेक्षणः ॥ ४२ ॥

వ్యవసాయో వ్యవస్థానః సంస్థానస్థానదో ధ్రువః ।
పరర్ధిః పరమస్పష్ట స్తుష్టః పుష్టశ్శుభేక్షణః ॥ ౪౨ ॥

Vyavasāyo vyavasthānaḥ saṃsthānasthānado dhruvaḥ ।
Parardhiḥ paramaspaṣṭa stuṣṭaḥ puṣṭaśśubhekṣaṇaḥ ॥ 42 ॥

27 నవం, 2013

389. పరర్ధిః, परर्धिः, Parardhiḥ

ఓం పరర్ధయే నమః | ॐ परर्धये नमः | OM Parardhaye namaḥ

ఋద్ధిః పరా విభూతి రస్యేతి పరర్ధిరీర్యతే ఈతనికి ఉత్కృష్టమూ, గొప్పదియగు ఋద్ధి అనగా విభూతి, సంపద లేదా సమృద్ధి కలదు.

R̥ddhiḥ parā vibhūti rasyeti parardhirīryate / ऋद्धिः परा विभूति रस्येति परर्धिरीर्यते He has supreme r̥ddhi or magnificence or One who possesses lordliness of this most exalted type.

व्यवसायो व्यवस्थानः संस्थानस्थानदो ध्रुवः ।
परर्धिः परमस्पष्ट स्तुष्टः पुष्टश्शुभेक्षणः ॥ ४२ ॥

వ్యవసాయో వ్యవస్థానః సంస్థానస్థానదో ధ్రువః ।
పరర్ధిః పరమస్పష్ట స్తుష్టః పుష్టశ్శుభేక్షణః ॥ ౪౨ ॥

Vyavasāyo vyavasthānaḥ saṃsthānasthānado dhruvaḥ ।
Parardhiḥ paramaspaṣṭa stuṣṭaḥ puṣṭaśśubhekṣaṇaḥ ॥ 42 ॥

26 నవం, 2013

388. ధ్రువః, ध्रुवः, Dhruvaḥ

ఓం ధ్రువాయ నమః | ॐ ध्र्युवाय नमः | OM Dhruvāya namaḥ

అవినాశ్యతో ధ్రువ ఇత్యుచ్యతే పరమేశ్వరః అవినాశిగా, నాశములేక స్థిరుడై యుండువాడు గనుక ఆ పరమేశ్వరుడు ధ్రువః

Avināśyato dhruva ityucyate parameśvaraḥ / अविनाश्यतो ध्रुव इत्युच्यते परमेश्वरः As He is imperishable and indestructible, the Lord is called Dhruvaḥ.

व्यवसायो व्यवस्थानः संस्थानस्थानदो ध्रुवः
परर्धिः परमस्पष्ट स्तुष्टः पुष्टश्शुभेक्षणः ॥ ४२ ॥

వ్యవసాయో వ్యవస్థానః సంస్థానస్థానదో ధ్రువః
పరర్ధిః పరమస్పష్ట స్తుష్టః పుష్టశ్శుభేక్షణః ॥ ౪౨ ॥

Vyavasāyo vyavasthānaḥ saṃsthānasthānado dhruvaḥ
Parardhiḥ paramaspaṣṭa stuṣṭaḥ puṣṭaśśubhekṣaṇaḥ ॥ 42 ॥

25 నవం, 2013

387. స్థానదః, स्थानदः, Sthānadaḥ

ఓం స్థానదాయ నమః | ॐ स्थानदाय नमः | OM Sthānadāya namaḥ

స్థానదః, स्थानदः, Sthānadaḥ

ధ్రువాదిభ్యఃస్వకర్మానురూపం స్థానం దదాతి యః ।
స స్థానద ఇతి ప్రోక్తో విబుధైర్భగవాన్ హరిః ॥

ధ్రువుడు మొదలగు వారికి తమ కర్మలకు తగిన స్థానమును ఇచ్చువాడు.

క. ధీరవ్రత! రాజన్య కు, మారక! నీ హృదయమందు మసలిన కార్యం
    బారూఢిగానెఱుంగుదు, నారయ నది వొందరాని దైనను నిత్తున్. (289)

వ. అది యెట్టి దనిన నెందేని మేధియందుఁ బరిభ్రామ్యమాణ గోచక్రం బునుం బోలె గ్రహనక్ష త్రతారాగణ జ్యోతిశ్చక్రంబు నక్షత్ర రూపంబుల యిన ధర్మాగ్ని కశ్యప శక్రులును సప్తర్షులును, దారకా సమేతులై ప్రదక్షిణంబు దిరుగుచుండుదురు; అట్టి దురాపంబును ననన్యాధిష్ఠితం బును లోకత్రయ ప్రళయకాలంబునందు నశ్వరంబుగాక ప్రకాశమా నంబును నయిన ధ్రువక్షితి యను పదంబు ముందట నిరువది యాఱువేలేండ్లు చనంబ్రాపింతువు... (290)

రాజకుమారా! నీ వ్రతదీక్ష అచంచలమైనది. నీ మనస్సులోని అభిప్రాయాలు చక్కగా గ్రహించాను. అయితే అది దుర్లభమైనది. అయినప్పటికీ, నీ కోరిక తీరుస్తాను. కట్టుకొయ్య చుట్టూ పశువుల మంద తిరిగినట్లు గ్రహాలూ, నక్షత్రాలూ, తారాగణాలూ, జ్యోతిశ్చక్రమూ, నక్షత్ర స్వరూపాలయిన ధర్ముడు, అగ్ని, కశ్యపుడు, శుక్రుడు, సప్తర్షులు, తారకలతో కూడి దేనికి ప్రదక్షిణం చేస్తుంటారో అటువంటి "ధ్రువక్షితి" అనే మహోన్నత స్థానాన్ని ఇకపైన అరవైఆరువేల సంవత్సరాల అనంతరం నీవు పొందుతావు. అది ఎవ్వరికీ అందరానిది. ఇదివరకు ఎవ్వరూ దానిని పొందలేదు. మూడు లోకాలూ నశించేటప్పుడు కూడ అది నశింపక ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటి స్థానాన్ని నీవు అలంకరిస్తావు.

Dhruvādibhyaḥsvakarmānurūpaṃ sthānaṃ dadāti yaḥ,
Sa sthānada iti prokto vibudhairbhagavān hariḥ.

ध्रुवादिभ्यःस्वकर्मानुरूपं स्थानं ददाति यः ।
स स्थानद इति प्रोक्तो विबुधैर्भगवान् हरिः ॥

Since Lord Hari confers on Dhruva and others their place according to their karmas, He is Sthānadaḥ.

Śrīmad Bhāgavata - Canto 4, Chapter 9
Nanyaradhiṣṭhitaṃ bhadra yad bhrājiṣṇu dhruvakṣiti,
Yatra graharkṣatārāṇāṃ jyotiṣāṃ cakramāhitam. 20.
Dharmo’gniḥ kaśyapaḥ śukro munayo ye vanaukasaḥ,
Caranti dakṣiṇīkr̥tya bhramanto yatsatārakāḥ. 22.

:: श्रीमद्भागवते चतुर्थ स्कन्धे नवमोऽध्यायः ::
नन्यरधिष्ठितं भद्र यद् भ्राजिष्णु ध्रुवक्षिति ।
यत्र ग्रहर्क्षताराणां ज्योतिषां चक्रमाहितम् ॥ २० ॥
धर्मोऽग्निः कश्यपः शुक्रो मुनयो ये वनौकसः ।
चरन्ति दक्षिणीकृत्य भ्रमन्तो यत्सतारकाः ॥ २२ ॥

Lord continued: My dear Dhruva, I shall award you the glowing planet known as the polestar, which will continue to exist even after the dissolution at the end of the millennium. No one has ever ruled this planet, which is surrounded by all the solar systems, planets and stars. All the luminaries in the sky circumambulate this planet, just as bulls tread around a central pole for the purpose of crushing grains. Keeping the polestar to their right, all the stars inhabited by the great sages like Dharma, Agni, Kaśyapa and Śukra circumambulate this planet, which continues to exist even after the dissolution of all others.

व्यवसायो व्यवस्थानः संस्थानस्थानदो ध्रुवः ।
परर्धिः परमस्पष्ट स्तुष्टः पुष्टश्शुभेक्षणः ॥ ४२ ॥

వ్యవసాయో వ్యవస్థానః సంస్థానస్థానదో ధ్రువః ।
పరర్ధిః పరమస్పష్ట స్తుష్టః పుష్టశ్శుభేక్షణః ॥ ౪౨ ॥

Vyavasāyo vyavasthānaḥ saṃsthānasthānado dhruvaḥ ।
Parardhiḥ paramaspaṣṭa stuṣṭaḥ puṣṭaśśubhekṣaṇaḥ ॥ 42 ॥

24 నవం, 2013

386. సంస్థానః, संस्थानः, Saṃsthānaḥ

ఓం సంస్థానాయ నమః | ॐ संस्थानाय नमः | OM Saṃsthānāya namaḥ

విశ్వేశ్వరేఽస్మిన్భూతానాం సంస్థితః ప్రలయాత్మికా ।
సమీచీనం స్థాన మస్యేత్యయం సంస్థాన ఉచ్యతే ॥

సంస్థితః, సంస్థానం అనునవి లెస్సయగు నిలుకడ అను అర్థమున సమానార్థక పదములు. అట్లు ఇతనియందు సకల భూతములకును 'ప్రళయ' రూపము అగు ఉనికి ఏర్పడును అను అర్థమున పరమాత్ముడు 'సంస్థానః' అనబడుచున్నాడు. లేదా సమీచీనం స్థానం అస్య ఇతనికి లెస్సయగు ఉనికి కలదు. తాను ఎవ్వరిని ఆశ్రయించక కాలపు అవధులకు లోబడక ఏవియు తనకు అంటక తాను వేనిని అంటక శాశ్వతుడై యుండు ఉనికి లెస్సయగు ఉనికియే కదా!

Viśveśvare’sminbhūtānāṃ saṃsthitaḥ pralayātmikā,
Samīcīnaṃ sthāna masyetyayaṃ saṃsthāna ucyate.

विश्वेश्वरेऽस्मिन्भूतानां संस्थितः प्रलयात्मिका ।
समीचीनं स्थान मस्येत्ययं संस्थान उच्यते ॥

Here is the resting place of creatures in the form of pralaya or deluge.

Or as He is the ultimate existence and His abode is excellent hence He is Saṃsthānaḥ.

व्यवसायो व्यवस्थानः संस्थानस्थानदो ध्रुवः ।
परर्धिः परमस्पष्ट स्तुष्टः पुष्टश्शुभेक्षणः ॥ ४२ ॥

వ్యవసాయో వ్యవస్థానః సంస్థానస్థానదో ధ్రువః ।
పరర్ధిః పరమస్పష్ట స్తుష్టః పుష్టశ్శుభేక్షణః ॥ ౪౨ ॥

Vyavasāyo vyavasthānaḥ saṃsthānasthānado dhruvaḥ ।
Parardhiḥ paramaspaṣṭa stuṣṭaḥ puṣṭaśśubhekṣaṇaḥ ॥ 42 ॥

23 నవం, 2013

385. వ్యవస్థానః, व्यवस्थानः, Vyavasthānaḥ

ఓం వ్యవస్థానాయ నమః | ॐ व्यवस्थानाय नमः | OM Vyavasthānāya namaḥ

అస్మిన్వ్యవస్థితిస్సర్వస్యేత్యయం పరమేశ్వరః ।
లోకపాలాద్యధికారాన్ జరాయుజాదిదేహినః ॥
బ్రహ్మణాదిక వర్ణాంశ్చ బ్రహ్మచర్యాదికాశ్రమాన్ ।
లక్షణాని చ స్త్రీ పుంసాం వావ్యవస్థాన ఉచ్యతే ॥ 

వ్యవస్థా - వ్యవస్థితిః - వ్యవస్థానం మొదలగు శబ్దములకు 'అమరిక' అని అర్థము. ప్రతియొక చేతనాచేతన పదార్థమునకును ఈ పరమాత్మనందే 'వ్యవస్థానము' ఏర్పడియున్నది. కావున ఆతడు 'వ్యవస్థానః' అనదగియున్నాడు. లేదా వ్యవస్థను చేయును. పరమాత్ముడు చేయు వ్యవస్థ వేని విషయమున ఎట్టిది? అనిన ఇంద్రాది లోకపాలుర వారి వారి అధికారములను; జరాయుజములు, అండజములు, ఉద్బిజ్జములు, స్వేదజములు మొదలగు ప్రాణుల స్థితులను బ్రహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర నామక ప్రధానవర్ణముల ధర్మములను బ్రహ్మచారి, గృహస్థాశ్రమ, వానప్రస్థ, సన్యాసములను ఆశ్రమ ధర్మములను వేరు వేరుగా ఏర్పరచును.

Asminvyavasthitissarvasyetyayaṃ parameśvaraḥ,
Lokapālādyadhikārān jarāyujādidehinaḥ.
Brahmaṇādika varṇāṃśca brahmacaryādikāśramān,
Lakṣaṇāni ca strī puṃsāṃ vāvyavasthāna ucyate.

अस्मिन्व्यवस्थितिस्सर्वस्येत्ययं परमेश्वरः ।
लोकपालाद्यधिकारान् जरायुजादिदेहिनः ॥
ब्रह्मणादिक वर्णांश्च ब्रह्मचर्यादिकाश्रमान् ।
लक्षणानि च स्त्री पुंसां वाव्यवस्थान उच्यते ॥

Everything is based on Him or in whom the orderly regulation of the universe rests; so Vyavasthānaḥ.

Or the regulator of the guardians of the worlds and their appropriate duties and those who are born of wombs, born from eggs, born cleaving the earth; of the brāhmaṇa, kṣatriya, vaiśya and śūdra castes and of the intermediate castes, of the brahmacarya, gr̥hastha, vānaprastha and sanyāsa āśramās.

व्यवसायो व्यवस्थानः संस्थानस्थानदो ध्रुवः ।
परर्धिः परमस्पष्ट स्तुष्टः पुष्टश्शुभेक्षणः ॥ ४२ ॥

వ్యవసాయో వ్యవస్థానః సంస్థానస్థానదో ధ్రువః ।
పరర్ధిః పరమస్పష్ట స్తుష్టః పుష్టశ్శుభేక్షణః ॥ ౪౨ ॥

Vyavasāyo vyavasthānaḥ saṃsthānasthānado dhruvaḥ ।
Parardhiḥ paramaspaṣṭa stuṣṭaḥ puṣṭaśśubhekṣaṇaḥ ॥ 42 ॥

22 నవం, 2013

384. వ్యవసాయః, व्यवसायः, Vyavasāyaḥ

ఓం వ్యవసాయాయ నమః | ॐ व्यवसायाय नमः | OM Vyavasāyāya namaḥ

సంవిన్మాత్ర స్వరూపత్వాత్ వ్యవసాయ ఇతీర్యతే వ్యవసాయః అనగా నిశ్చయాత్మక జ్ఞానము అని అర్థము. పరమాత్ముడు నిర్విషయకమును నిరంజనమును అగు కేవల జ్ఞానమే తన స్వరూపముగా కలవాడు కావున 'వ్యవసాయః' అనదగియున్నాడు.

:: శ్రీమద్భగవద్గీత - సాఙ్ఖ్య యోగము ::
యామిమాం పుషిప్తాం వాచం ప్రవదన్త్యవిపశ్చితః ।
వేదవాదరతాః పార్థ నాన్యదస్తీతివాదినః ॥ 42 ॥
కామాత్మానః స్వర్గపరా జన్మకర్మఫలప్రదామ్ ।
క్రియావిశేషబహులాం భోగైశ్వర్యగతిం ప్రతి ॥ 43 ॥
భోగైశ్వర్యప్రసక్తానాం తయాఽపహృతచేతసామ్ ।
వ్యవసాయాత్మికా బుద్ధిస్సమాధౌ న విధీయతే ॥ 44 ॥

వేదమునందు ఫలమునుదెలుపు భాగములం దిష్టముకలవారును, అందుజెప్పబడిన స్వర్గాది ఫలితములకంటే అధికమైనది వేఱొకటియెద్దియు లేదని వాదించువారును, విషయవాంఛలతో నిండిన చిత్తముకలవారును, స్వర్గాభిలాషులునగు అల్పజ్ఞులు, జన్మము, కర్మము, తత్ఫలము నొసంగునదియు, భోగైశ్వర్యసంపాదనకై వివిధకార్యకలాపములతో గూడినదియు, ఫలశూన్యమైనదియునగు ఏ వాక్యమును చెప్పుచున్నారో అద్దానిచే నపహరింపబడిన చిత్తముకలవారును, భోగైశ్వర్యప్రియులునగు జనులకు దైవధ్యానమందు నిశ్చయమైన బుద్ధి కలుగనే కలుగదు.

Saṃvinmātra svarūpatvāt vyavasāya itīryate / संविन्मात्र स्वरूपत्वात् व्यवसाय इतीर्यते Vyavasāyaḥ implies resolved knowledge. As He is of the nature of jñāna - pure and simple, He is Vyavasāyaḥ.

Śrīmad Bhagavad Gīta - Chapter 2
Yāmimāṃ puṣiptāṃ vācaṃ pravadantyavipaścitaḥ,
Vedavādaratāḥ pārtha nānyadastītivādinaḥ. 42.
Kāmātmānaḥ svargaparā janmakarmafalapradām,
Kriyāviśeṣabahulāṃ bhogaiśvaryagatiṃ prati. 43.
Bhogaiśvaryaprasaktānāṃ tayā’pahr̥tacetasām,
Vyavasāyātmikā buddhissamādhau na vidhīyate. 44.

:: श्रीमद्भगवद्गीत - साङ्ख्य योग::
यामिमां पुषिप्तां वाचं प्रवदन्त्यविपश्चितः ।
वेदवादरताः पार्थ नान्यदस्तीतिवादिनः ॥ ४२ ॥
कामात्मानः स्वर्गपरा जन्मकर्मफ़लप्रदाम् ।
क्रियाविशेषबहुलां भोगैश्वर्यगतिं प्रति ॥ ४३ ॥
भोगैश्वर्यप्रसक्तानां तयाऽपहृतचेतसाम् ।
व्यवसायात्मिका बुद्धिस्समाधौ न विधीयते ॥ ४४ ॥

Those undiscerning people who utter flowery talk - which promises birth as a result of rites and duties and is full of various special rites meant for attainment of enjoyment and affluence, they remain engrossed in the utterances of Vedās and declare that nothing else exists; their minds are full of desires and they have heaven as the goal. One-pointed conviction does not become established in the minds of those who delight in enjoyment and affluence and whose intellects are always carried away by that.

व्यवसायो व्यवस्थानः संस्थानस्थानदो ध्रुवः ।
परर्धिः परमस्पष्ट स्तुष्टः पुष्टश्शुभेक्षणः ॥ ४२ ॥

వ్యవసాయో వ్యవస్థానః సంస్థానస్థానదో ధ్రువః ।
పరర్ధిః పరమస్పష్ట స్తుష్టః పుష్టశ్శుభేక్షణః ॥ ౪౨ ॥

Vyavasāyo vyavasthānaḥ saṃsthānasthānado dhruvaḥ ।
Parardhiḥ paramaspaṣṭa stuṣṭaḥ puṣṭaśśubhekṣaṇaḥ ॥ 42 ॥

21 నవం, 2013

383. గుహః, गुहः, Guhaḥ

ఓం గుహాయ నమః | ॐ गुहाय नमः | OM Guhāya namaḥ

గుహః, गुहः, Guhaḥ

గూహతే సంవృణోతి స్వరూపాది నిజమాయయా ।
ఇతి విష్ణుర్గుహ ఇతి ప్రోచ్యతే విదుషాం చయైః ॥

తన స్వరూపము మొదలగువానిని తన మాయ చేతనే తెలియనీయక మూయుచున్నాడుగనుక ఆ విష్ణు దేవుని గుహః అని విద్వాంసులు భావిస్తారు.

:: శ్రీమద్భగవద్గీత - విజ్ఞాన యోగము ::
నాహం ప్రకాశః సర్వస్య యోగమాయాసమావృతః ।
మూఢోఽయం నాభిజానాతి లోకో మామజమవ్యయమ్ ॥ 25 ॥

యోగమాయచే బాగుగ కప్పబడియుండుటచే నేను అందఱికిని కనుపించు వాడనుగాను. అవివేకులగు ఈ జనులు నన్ను పుట్టుకలేనివానినిగను, నాశరహితునిగను ఎరుగరు.

Gūhate saṃvr̥ṇoti svarūpādi nijamāyayā,
Iti viṣṇurguha iti procyate viduṣāṃ cayaiḥ.

गूहते संवृणोति स्वरूपादि निजमायया ।
इति विष्णुर्गुह इति प्रोच्यते विदुषां चयैः ॥

He conceals His real form under the veil of māyā or illusion hence He is Guhaḥ.

Śrīmad Bhagavad Gīta - Chapter 7
Nāhaṃ prakāśaḥ sarvasya yogamāyāsamāvr̥taḥ,
Mūḍo’yaṃ nābhijānāti loko māmajamavyayam. 25.

:: श्रीमद्भगवद्गीत - विज्ञान योग ::
नाहं प्रकाशः सर्वस्य योगमायासमावृतः ।
मूढोऽयं नाभिजानाति लोको मामजमव्ययम् ॥ २५ ॥

Being enveloped by yoga-māyā, I do not become manifest to all. This deluded world does not know Me who am birth-less and undecaying.

उद्भवः क्षोभणो देवः श्रीगर्भः परमेश्वरः ।
करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः ॥ ४१ ॥

ఉద్భవః క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః ।
కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః ॥ ౪౧ ॥

Udbhavaḥ kṣobhaṇo devaḥ śrīgarbhaḥ parameśvaraḥ ।
Karaṇaṃ kāraṇaṃ kartā vikartā gahano guhaḥ ॥ 41 ॥