ఓం స్వయంజాతాయ నమః | ॐ स्वयंजाताय नमः | OM Svayaṃjātāya namaḥ
నిమిత్తకారణమపి పరమాత్మా సనాతనః ।
స ఏవేతి దర్శయితుం స్వయఞ్జాత ఇతీర్యతే ॥
మరి యేదియు తనకు కారణము లేక తనకు ఇతరము ఏదియు ఉపాదాన కారణము కాని, నిమిత్త కారణము కాని లేక తానే జనించినవాడు వలె అనుభవమున గోచరడగుచు ఉన్నాడు అని అర్థము.
తాను స్వయంజాతుడగుచు జగత్ ఉపాదాన కారణముగా ఉన్నాడు. ఆత్మయోనిః అనుటచేతను జగత్తు యొక్క ఉత్పత్తికి పూర్వము ఉన్న ఏకైక చేతన తత్త్వము ఆతడొక్కడేయని 'ఆత్మా నా ఇద్ మేక ఏవాగ్ర ఆసీత్' ఇత్యాది శ్రుతులు చెప్పుచుండుటచేతను జగన్నిమిత్త కారణము కూడ ఆతడేయని చెప్పుటయైనది. ఇట్లు హరియే జగదుత్పత్తిలో నిమిత్తోపాదాన కారణములు రెండునగుననుట 'ప్రకృతిశ్చ ప్రతిజ్ఞాదృష్టాంతాను పరోధాత్' (బ్రహ్మ సూత్రము 1.4.23) - అనుచోట చెప్పబడినది.
అదెట్లనిన ఛాందోగ్యోపనిషత్ ఇత్యాదులయందు "ఏ ఒకదానిని గూర్చి వినినచో విశేషాకార గ్రహణముచే విననిదెల్ల వినినదే అగునో" ఇత్యాది ప్రతిజ్ఞయు, "మృత్పిండమునొకదానిని అనుభవమున ఎరిగినచో మృణ్మయమగు ప్రతియొకదానిని అనుభవమున ఎరిగినట్లే అగుచున్నది" అను ఈ మొదలగు దృష్టాంతమును "పరస్పర పీడనమునందక సామంజస్యమున కుదుర వలయుననినచో పరమాత్మ తాను జగత్సృష్టి సేయ సంకల్పించెను" అను శ్రుతులనుబట్టి ఆతడు జగదుద్పత్తిలో నిమిత్త కారణమగుటతోపాటు ఉపాదాన కారణముకూడ అగునని చెప్పవలయును.
निमित्तकारणमपि परमात्मा सनातनः ।
स एवेति दर्शयितुं स्वयञ्जात इतीर्यते ॥
Nimittakāraṇamapi paramātmā sanātanaḥ,
Sa eveti darśayituṃ svayañjāta itīryate.
As explained in the description of 'Ātmayoniḥ' He is the material cause. To show that He is also the efficient cause i.e., nimitta kāraṇa, it is said Svayaṃ jātaḥ.
That Hari is both the material and the efficient cause - is established by the 'प्रकृतिश्च प्रतिज्ञादृष्टान्तानु परोधात् / Prakr̥tiśca pratijñādr̥ṣṭāṃtānu parodhāt' (Brahma sūtra 1.4.23) - 'Brahman must be the twofold cause so as not to contradict the proposition and the illustration.'
आत्मयोनिस्स्वयंजातो वैखानस्सामगायनः । |
देवकीनन्दनस्स्रष्टा क्षितीशः पापनाशनः ॥ १०६ ॥ |
ఆత్మయోనిస్స్వయంజాతో వైఖానస్సామగాయనః । |
దేవకీనన్దనస్స్రష్టా క్షితీశః పాపనాశనః ॥ 106 ॥ |
Ātmayonissvayaṃjāto vaikhānassāmagāyanaḥ, |
Devakīnandanassraṣṭā kṣitīśaḥ pāpanāśanaḥ ॥ 106 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి