31 జులై, 2015

1000. సర్వప్రహరణాయుధః, सर्वप्रहरणायुधः, Sarvapraharaṇāyudhaḥ

ఓం సర్వప్రహరణాయుధాయ నమః | ॐ सर्वप्रहरणायुधाय नमः | OM Sarvapraharaṇāyudhāya namaḥ


కేవలమ్ ప్రహరణాన్యాయుధాన్యస్తేతి సర్వప్రహరణాయుధః ।
ఆయుధత్వేనాప్రసిద్దాన్యపి కరజాదీన్యస్యాయుధాని భవన్తీతి ॥

కేవలము ఇవి (శంఖము, నందకి అను ఖడ్గము, చక్రము, శాఙ్గము అను ధనుస్సు, కౌమోదకి అను గద, రథాంగము) మాత్రమే ఈతని ఆయుధములు అని నియమము లేదు. దెబ్బకొట్టుటకు ఉపయోగపడునవి ఎన్ని యుండునో అన్నియు ఈతని ఆయుధములే అగును. దీనిచే ఆయుధములుగా ప్రసిద్ధములుగానుండని కరజములు అనగా గోళ్ళు మొదలగునవియు నరసింహావతారమునందు వలెనే ఈతని ఆయుధములే అగుచుండును.

అన్తే సర్వ ప్రహరణాయుధ ఇతి వచనం సత్యసఙ్కల్పత్వేన సర్వేశ్వరత్వం దర్శయితుమ్ । 'ఏష సర్వేశ్వరః' ఇతి శ్రుతేః ॥

విశేషము: అంతమున 'సర్వప్రహరణాయుధః' - 'ఏ ప్రహరణమయినను ఈతనికి ఆయుధమేయగును' అని చెప్పుట పరమాత్ముడు 'సత్యసంకల్పుడు' - 'ఏది తాను సంకల్పించునో అది ఆచరించు శక్తి కలవాడు' అని చూపుటకే 'ఏష సర్వేశ్వరః' - 'ఈతడు సర్వేశ్వరుడు, సర్వకార్యకరణ శక్తుడు' అను శ్రుతి ఇచట ప్రమాణము.

ద్విర్వచనం సమాప్తిం ద్యోతయతి ద్విర్వచనము అనగా 'సర్వప్రహరణ' శబ్దమును రెండుమారులుచ్చరించుట సమాప్తిని తెలుపుచున్నది.

ఓఙ్కారశ్చ మఙ్గలార్థః, ఓఙ్కారశ్చాథశబ్దశ్చ ద్వావేతౌ బ్రహ్మణః పురా ।
కణ్ఠం భిత్త్వా వినిర్యాతౌ తస్మాన్మాన్మాఙ్గలికావుభఊ ఇతి వచనాత్ ॥


సహస్ర నామాంతమున ఉచ్చరించబడిన 'ఓం నమః'లోని ఈ 'ఓం'కారము శుభార్థవాచకము. "'ఓం'కారమును, 'అథ' శబ్దమును - ఈ రెండును అతి ప్రాచీన కాలమునందే బ్రహ్మదేవుని కంఠమును భేదించి అతి స్పష్టముగా వెలుపలికి వచ్చియుండెను. అందువలననే ఈ రెండును శుభార్థ ప్రతిపాదకములు" అను వచనము ఈ విషయమున ప్రమాణము.

అన్తే 'నమః' ఇత్యుక్త్యా పరిచరణం కృతవాన్ ।
'భూయిష్టాం తే నమౌక్తిం విధేమ' ఇతి మన్త్రవర్ణాత్ ॥

అంతమున 'నమః' అని పలికి పరిచరణమును అనగా పూజను చేసినారు. "నీకు మాటి మాటికి 'నమో' వచనమును పలికి పూజ చేయుదుము" అను శ్రుతి వచనము ఇందు ప్రమాణము.

'ధన్యం తదేవ లగ్నం తన్నక్షత్రం తదేవ పుణ్యమహః ।
కరణస్య చ సా సిద్ధిర్యత్ర హరిః ప్రాఙ్నమస్క్రియతే ' ఇతి చ ॥

'ఏ క్రియాచరణమునందు మొదటగా హరి నమస్కరించబడునో ఆ క్రియను ఆరంభించిన సమయమున ఉండు లగ్నమే ధన్యము. ఆ నక్షత్రమును, ఆ దినమును పుణ్యకరములు. అట్లు ఆచరించబడిన కరణమునకును ఆ హరి నామ స్మరణమే సిద్ధి కలిగించునదియగును' అనియు చెప్పబడినది.

ప్రాగిత్యుప లక్షణమ, అన్తేఽపి నమస్కారస్య శిష్టైరాచరణాత్ । నమస్కార ఫలం ప్రాగేవ దర్శితమ్ ॥

ఇందుకు 'ప్రాక్‍' అనగా ఆరంభమునందు 'మొదటగా అనుట' క్రియాచరణమునకు అవధిగా మాత్రము తీసికొనవలెను. అవధిరూప క్షణమును గుర్తింపజేయునదిగా గ్రహించవలెను. అనగా క్రియ ఆరంభమగుటకు ముందరి కాలమున చేసినట్లే ముగిసిన తరువాత కూడ భగవన్నమస్కారము చేయవలెనని చెప్పినట్లయినది.  కావుననే క్రియాంతమునందును నమస్కారము చేయుట శిష్టులచే ఆచరించబడుచు కనబడుచున్నది. నమస్కారము వలన కలుగు ఫలము ఇంతకు ముందే ఉపోద్ఘాతమున చెప్పబడియున్నది.

:: శ్రీమహాభారతే శాన్తిపర్వణి రాజధర్మానుశాసనపర్వణి సప్తచత్వారింశోఽధ్యాయః ::
ఏకోఽపి కృష్ణస్య కృతః ప్రణామో
    దశాశ్వమేధావభృథేన తుల్యః ।
దశాశ్వమేధీ పునరేతి జన్మ
    కృష్ణప్రణామీ న పునర్భవాయ ॥ 92 ॥

కృష్ణుని విషయమున చేయబడిన ఒక నమస్కారమయినను పది అశ్వమేధయాగములను సమగ్రముగా ఆచరించి అవభృథస్నానము చేయుటతో సమానము. కాని పది అశ్వమేధములను ఆచరించినవాడు వాని వలన లభించు ఫలములను అనుభవించుట ముగిసిన తరువాత మరల జన్మమునొందును. కృష్ణుని నమస్కరించినవాడు మాత్రము మరల జన్మమునొందవలసిన పనియుండదు.

:: శ్రీమహాభారతే శాన్తిపర్వణి రాజధర్మానుశాసనపర్వణి సప్తచత్వారింశోఽధ్యాయః ::
అసతీపుష్పశఙ్కాశం పీతవాససమచ్యుతమ్ ।
యే నమస్యన్తి గోవిన్దం న తేషాం విద్యతే భయమ్ ॥ 90 ॥

నల్ల అవిసి పూవులవంటి దేహచ్ఛాయ కలవాడును పచ్చని పట్టువస్త్రమును ధరించిన వాడును తన స్థితినుండి ఎన్నడును తొలగనివాడును తన్నాశ్రయించినవారినెన్నడును చెడనీయనివాడును అగు గోవిందుని ఎవరు నమస్కరింతురో వారికెన్నడును భయముండదు.

లోకత్రయాధిపతిమప్రతిమప్రభావ
    మీషత్ప్రణమస్య శిరసా ప్రభవిష్ణుమీశమ్ ।
జన్మాన్తరప్రలయకల్పసహస్రజాత
    మాశు ప్రశాన్తిముపయాతి నరస్య పాపమ్ ॥ ఇతి ॥

లోకత్రయాధిపతియు సాటిలేని ప్రభావము కలవాడును సర్వసమర్థుడును ఈశుడును అగు నారయణుని ఉద్దేశించి కొంచెముగనైన శిరస్సుతో నమస్కరించినచో వేయి కల్పములయు వేయి ప్రళయములయు కాల పరిమాణమున నరునకు కలుగు వేలకొలది జన్మములయందు సంభవించునంత పాపము కూడ శీఘ్రముగా ప్రశాంతినందును.

ఇతి నామ్నాం దశమం శతం వివృతమ్ ఇట్లు ఇంతవరకును పది వందల నామములు వివరించబడినవి.

యదక్షరపదభ్రష్టం మాత్రాహీనన్తుయద్భవేత్ ।
తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోఽస్తుతే ॥

అక్షరములును, పదములును పొరబాటున తప్పుగ వ్రాసినను, మాత్రలను చేర్చుట మరచినను తత్ఫలితముగా కలుగు దోషములను ఉపశమింపజేసి మమ్మనుగ్రహింపుమని ఆ నారాయణుని వేడుకొందును.



केवलम् प्रहरणान्यायुधान्यस्तेति सर्वप्रहरणायुधः ।
आयुधत्वेनाप्रसिद्दान्यपि करजादीन्यस्यायुधानि भवन्तीति ॥

Kevalam praharaṇānyāyudhānyasteti sarvapraharaṇāyudhaḥ,
Āyudhatvenāprasiddānyapi karajādīnyasyāyudhāni bhavantīti.

There is no rule that only these (conch, sword, discus, bow, club) are His weapons. He has all kinds of offensive weapons. Even finger nails that are not famous as weapons  are also included. So, He has all kinds of weapons of offense at His disposal.

अन्ते सर्व प्रहरणायुध इति वचनं सत्यसङ्कल्पत्वेन सर्वेश्वरत्वं दर्शयितुम् । 'एष सर्वेश्वरः' इति श्रुतेः ॥ / Ante sarva praharaṇāyudha iti vacanaṃ satyasaṅkalpatvena sarveśvaratvaṃ darśayitum, 'eṣa sarveśvaraḥ' iti śruteḥ The reference to Sarvapraharaṇāyudhaḥ at the end is intended to indicate that He is the Lord of all, to fulfill His purposes vide the śruti 'He is the Lord of all'.

द्विर्वचनं समाप्तिं द्योतयति / Dvirvacanaṃ samāptiṃ dyotayati Repetition of the last Name shows the completion of Sahasranāma.

ओङ्कारश्च मङ्गलार्थः, ओङ्कारश्चाथशब्दश्च द्वावेतौ ब्रह्मणः पुरा ।
कण्ठं भित्त्वा विनिर्यातौ तस्मान्मान्माङ्गलिकावुभऊ इति वचनात् ॥

Oṅkāraśca maṅgalārthaḥ, oṅkāraścāthaśabdaśca dvāvetau brahmaṇaḥ purā,
Kaṇṭhaṃ bhittvā viniryātau tasmānmānmāṅgalikāvubhaū iti vacanāt.

Omkāra has the meaning of auspiciousness. "'Om' and 'atha' both these came out of the throat of Brahman at the beginning. Therefore they both stand for auspiciousness."

अन्ते 'नमः' इत्युक्त्या परिचरणं कृतवान् ।
'भूयिष्टां ते नमौक्तिं विधेम' इति मन्त्रवर्णात् ॥

Ante 'namaḥ' ityuktyā paricaraṇaṃ kr̥tavān,
'Bhūyiṣṭāṃ te namauktiṃ vidhema' iti mantravarṇāt.

By traditionally saying namaḥ at the end, prostration is indicated. "To thee we submit our word 'prostration' at the end."

'धन्यं तदेव लग्नं तन्नक्षत्रं तदेव पुण्यमहः ।
करणस्य च सा सिद्धिर्यत्र हरिः प्राङ्नमस्क्रियते ' इति च ॥

'Dhanyaṃ tadeva lagnaṃ tannakṣatraṃ tadeva puṇyamahaḥ,
Karaṇasya ca sā siddhiryatra hariḥ prāṅnamaskriyate ' iti ca.

Also, 'When Hari is prostrated to, that alone is auspicious lagna, auspicious nakshatra, holy day and proper karaṇa'.

प्रागित्युप लक्षणम, अन्तेऽपि नमस्कारस्य शिष्टैराचरणात् । नमस्कार फलं प्रागेव दर्शितम् ॥
Prāgityupa lakṣaṇam, ante’pi namaskārasya śiṣṭairācaraṇāt, namaskāra phalaṃ prāgeva darśitam.

prāk: in the beginning, is only indicative as namaskāra at the end also is observed by the learned. The fruit of namaskāra, prostration was shown at the beginning itself.

:: श्रीमहाभारते शान्तिपर्वणि राजधर्मानुशासनपर्वणि सप्तचत्वारिंशोऽध्यायः ::
एकोऽपि कृष्णस्य कृतः प्रणामो
    दशाश्वमेधावभृथेन तुल्यः ।
दशाश्वमेधी पुनरेति जन्म
    कृष्णप्रणामी न पुनर्भवाय ॥ ९२ ॥

Śrī Mahābhārata Book 12, Chapter 47
Eko’pi kr̥ṣṇasya kr̥taḥ praṇāmo
    Daśāśvamedhāvabhr̥thena tulyaḥ,
Daśāśvamedhī punareti janma
    Kr̥ṣṇapraṇāmī na punarbhavāya. 92.

One prostration to Kr̥ṣṇa properly done is equal to taking conclusive bath taken after completing aśāśvamedha vedic sacrifice. The man who has performed ten of these alone is born again after experiencing the resultant fruits. Whereas, He who has made prostration of Kr̥ṣṇa does not need to take birth again.

:: श्रीमहाभारते शान्तिपर्वणि राजधर्मानुशासनपर्वणि सप्तचत्वारिंशोऽध्यायः ::
असतीपुष्पशङ्काशं पीतवाससमच्युतम् ।
ये नमस्यन्ति गोविन्दं न तेषां विद्यते भयम् ॥ ९० ॥

Śrī Mahābhārata Book 12, Chapter 47
Asatīpuṣpaśaṅkāśaṃ pītavāsasamacyutam,
Ye namasyanti govindaṃ na teṣāṃ vidyate bhayam. 90.

Those who bow to Govinda, who is of the color of hemp flower and who is clad in yellow and is called Acyuta, have no fear.

लोकत्रयाधिपतिमप्रतिमप्रभाव
    मीषत्प्रणमस्य शिरसा प्रभविष्णुमीशम् ।
जन्मान्तरप्रलयकल्पसहस्रजात
    माशु प्रशान्तिमुपयाति नरस्य पापम् ॥ इति ॥

Lokatrayādhipatimapratimaprabhāva
    Mīṣatpraṇamasya śirasā prabhaviṣṇumīśam,
Janmāntarapralayakalpasahasrajāta
    Māśu praśāntimupayāti narasya pāpam. Iti.

By bowing a little with the head to the Lord of the three worlds, of matchless glory, the Supreme Ruler, a man's accumulated sins of thousands of previous lives are quickly annihilated.

इति नाम्नां दशमं शतं विवृतम् / Iti nāmnāṃ daśamaṃ śataṃ vivr̥tam Thus the ten hundred Names have been explained.

यदक्षरपदभ्रष्टं मात्राहीनन्तुयद्भवेत् ।
तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तुते ॥

Yadakṣarapadabhraṣṭaṃ mātrāhīnaṃtuyadbhavet,
Tatsarvaṃ kṣamyatāṃ deva nārāyaṇa namo’stute.

May the mistakes in the form of misspelled words caused by omission or inappropriate inclusion of letters, incorrect usage of vowels etc., be forgiven by the Lord Nārāyaṇa before whom I prostrate and submit.

शङ्खभृन्नन्दकी चक्री शार्ङ्गधन्वा गदाधरः ।
रथांगपाणिरक्षोभ्यस्सर्वप्रहरणायुधः ॥ १०७ ॥

శఙ్ఖభృన్నన్దకీ చక్రీ శార్ఙ్గధన్వా గదాధరః ।
రథాంగపాణిరక్షోభ్యస్సర్వప్రహరణాయుధః ॥ 107 ॥

Śaṅkhabhr̥nnandakī cakrī śārṅgadhanvā gadādharaḥ,
Rathāṃgapāṇirakṣobhyassarvapraharaṇāyudhaḥ ॥ 107 ॥

30 జులై, 2015

999. అక్షోభ్యః, अक्षोभ्यः, Akṣobhyaḥ

ఓం అక్షోభ్యాయ నమః | ॐ अक्षोभ्याय नमः | OM Akṣobhyāya namaḥ


అత ఏవ అశక్యక్షోభణః ఇతి అక్షోభ్యః ఇట్టి ఆయుధములను కలిగియుండుటచేత ఈతనిని కలవరపరుచుట ఎవరికిని శక్యము కాదు కనుక అక్షోభ్యః.

801. అక్షోభ్యః, अक्षोभ्यः, Akṣobhyaḥ



अत एव अशक्यक्षोभणः इति अक्षोभ्यः / Ata eva aśakyakṣobhaṇaḥ iti akṣobhyaḥ As He has all these weapons, He cannot be discomfited; hence Akṣobhyaḥ.

801. అక్షోభ్యః, अक्षोभ्यः, Akṣobhyaḥ

शङ्खभृन्नन्दकी चक्री शार्ङ्गधन्वा गदाधरः ।
रथांगपाणिरक्षोभ्यस्सर्वप्रहरणायुधः ॥ १०७ ॥

శఙ్ఖభృన్నన్దకీ చక్రీ శార్ఙ్గధన్వా గదాధరః ।
రథాంగపాణిరక్షోభ్యస్సర్వప్రహరణాయుధః ॥ 107 ॥

Śaṅkhabhr̥nnandakī cakrī śārṅgadhanvā gadādharaḥ,
Rathāṃgapāṇirakṣobhyassarvapraharaṇāyudhaḥ ॥ 107 ॥

29 జులై, 2015

998. రథాఙ్గపాణి, रथाङ्गपाणि, Rathāṅgapāṇi

ఓం రథాఙ్గ్పాణయే నమః | ॐ रथाङ्ग्पाणये नमः | OM Rathāṅgpāṇaye namaḥ


రథాఙ్గ చక్రమస్య పాణౌ స్థితమితి రథాఙ్గపాణిః రథాంగము అనగా చక్రము ఈతని హస్తమందు కలదు.



रथाङ्ग चक्रमस्य पाणौ स्थितमिति रथाङ्गपाणिः / Rathāṅga cakramasya pāṇau sthitamiti rathāṅgapāṇiḥ He in Whose hand is the wheel which is the part of a chariot.

शङ्खभृन्नन्दकी चक्री शार्ङ्गधन्वा गदाधरः ।
रथांगपाणिरक्षोभ्यस्सर्वप्रहरणायुधः ॥ १०७ ॥

శఙ్ఖభృన్నన్దకీ చక్రీ శార్ఙ్గధన్వా గదాధరః ।
రథాంగపాణిరక్షోభ్యస్సర్వప్రహరణాయుధః ॥ 107 ॥

Śaṅkhabhr̥nnandakī cakrī śārṅgadhanvā gadādharaḥ,
Rathāṃgapāṇirakṣobhyassarvapraharaṇāyudhaḥ ॥ 107 ॥

28 జులై, 2015

997. గదాధరః, गदाधरः, Gadādharaḥ

ఓం గదాధరాయ నమః | ॐ गदाधराय नमः | OM Gadādharāya namaḥ


బుద్ధితత్త్వాత్మికాం కౌమోదకీ నామ గదాం వహన్ గదాధరః బుద్ధితత్త్వ రూపమగు కౌమోదకీ నామక గదను ధరించువాడు గదాధరః.

:: శ్రీ విష్ణుమహాపురాణే ప్రథమాంశే ద్వావింశోఽధ్యాయః ::
శ్రీవత్ససంస్థానధర మనన్తే న సమాశ్రితమ్ ।
ప్రధానం బుద్ధిరప్యాస్తే గదారూపేణ మాధవే ॥ 69 ॥


ప్రధానమును శ్రీవత్స రూపమున అనంతుడు తనయందు ఆశ్రయము కల్పించెను. ఆ మాధవుడు బుద్ధితత్త్వమును తన గధ రూపమున ధరియించియున్నాడు.



बुद्धितत्त्वात्मिकां कौमोदकी नाम गदां वहन् गदाधरः / Buddhitattvātmikāṃ kaumodakī nāma gadāṃ vahan gadādharaḥ Since He wields a gada or mace by name kaumodakī, of the form of buddhitattva or intellect, He is called Gadādharaḥ.

:: श्री विष्णुमहापुराणे प्रथमांशे द्वाविंशोऽध्यायः ::
श्रीवत्ससंस्थानधर मनन्ते न समाश्रितम् ।
प्रधानं बुद्धिरप्यास्ते गदारूपेण माधवे ॥ ६९ ॥ 


Śrī Viṣṇu Mahā Purāṇa - Part 1, Chapter 22
Śrīvatsasaṃsthānadhara manante na samāśritam,
Pradhānaṃ buddhirapyāste gadārūpeṇa mādhave.
69.

Pradhāna or the chief principle of things is seated on the eternal, as the Srivatsa mark. Intellect abides in Mādhava, in the form of his club.

शङ्खभृन्नन्दकी चक्री शार्ङ्गधन्वा गदाधरः
रथांगपाणिरक्षोभ्यस्सर्वप्रहरणायुधः ॥ १०७ ॥

శఙ్ఖభృన్నన్దకీ చక్రీ శార్ఙ్గధన్వా గదాధరః
రథాంగపాణిరక్షోభ్యస్సర్వప్రహరణాయుధః ॥ 107 ॥

Śaṅkhabhr̥nnandakī cakrī śārṅgadhanvā gadādharaḥ,
Rathāṃgapāṇirakṣobhyassarvapraharaṇāyudhaḥ ॥ 107 ॥

27 జులై, 2015

996. శార్ఙ్గధన్వా, शार्ङ्गधन्वा, Śārṅgadhanvā

ఓం శర్ఙ్గధన్వనే నమః | ॐ शर्ङ्गधन्वने नमः | OM Śarṅgadhanvane namaḥ


ఇన్ద్రియాద్యహఙ్కారాత్మకం శార్ఙ్గం నామ ధనురస్యాస్తీతి శార్ఙ్గధన్వా ।
'ధనుషశ్చ' ఇతి అనఙ్గ సమాసాన్తః ॥

ఇంద్రియాద్యహంకారరూపమగు శార్ఙ్గ నామ ధనుస్సు ఈతనికి కలదు.

'ధనుషస్చ' అను పాణినీ సూత్రముచే సమాసాంత ప్రత్యయమురాగా 'అనఙ్‍' ప్రత్యయమురాగా: శార్ఙ్గ + ధనుష్ + అన్ = శార్ఙ్గ + ధను + అన్ = శార్ఙ్గధన్వన్ అగును.

:: శ్రీ విష్ణుమహాపురాణే ప్రథమాంశే ద్వావింశోఽధ్యాయః ::
భూతాదిమిన్ద్రియాదిం చ ద్విధాహఙ్కారమీశ్వరః ।
బిభర్తి శాఙ్ఖరూపేణ శార్ఙ్గ్రూపేణ చ స్థితమ్ ॥ 70 ॥

భూతములయందు అహంకారమును పంచభూతాత్మకమైన శంఖముగను, ఇంద్రియాహంకారమైన శార్ఙ్గముగను ఈశ్వరుడు రెండు విభాగములుగ ఆధారమును కల్పించును.



इन्द्रियाद्यहङ्कारात्मकं शार्ङ्गं नाम धनुरस्यास्तीति शार्ङ्गधन्वा ।
'धनुषश्च' इति अनङ्ग समासान्तः ॥

Indriyādyahaṅkārātmakaṃ śārṅgaṃ nāma dhanurasyāstīti śārṅgadhanvā,
'Dhanuṣaśca' iti anaṅga samāsāntaḥ.

He has the bow called Śārṅga of the form of the sense organs and the ahaṅkāra or ego.

The construct is as per the pāṇinī precept of grammar whereing for compound words with anaṅ suffix: śārṅga + dhanuṣ + an = śārṅga + dhanu + an = śārṅgadhanvan.

:: श्री विष्णुमहापुराणे प्रथमांशे द्वाविंशोऽध्यायः ::
भूतादिमिन्द्रियादिं च द्विधाहङ्कारमीश्वरः ।
बिभर्ति शाङ्खरूपेण शार्ङ्ग्रूपेण च स्थितम् ॥ ७० ॥

Śrī Viṣṇu Mahā Purāṇa - Part I, Section 22
Bhūtādimindriyādiṃ ca dvidhāhaṅkāramīśvaraḥ,
Bibharti śāṅkharūpeṇa śārṅgrūpeṇa ca sthitam. 70.

Īśvara the Lord supports ahaṅkāra or egotism in its twofold division, into elements and organs of sense, in the emblems of his conch-shell and his bow.

शङ्खभृन्नन्दकी चक्री शार्ङ्गधन्वा गदाधरः ।
रथांगपाणिरक्षोभ्यस्सर्वप्रहरणायुधः ॥ १०७ ॥

శఙ్ఖభృన్నన్దకీ చక్రీ శార్ఙ్గధన్వా గదాధరః ।
రథాంగపాణిరక్షోభ్యస్సర్వప్రహరణాయుధః ॥ 107 ॥

Śaṅkhabhr̥nnandakī cakrī śārṅgadhanvā gadādharaḥ,
Rathāṃgapāṇirakṣobhyassarvapraharaṇāyudhaḥ ॥ 107 ॥

26 జులై, 2015

995. చక్రీ, चक्री, Cakrī

ఓం చక్రిణే నమః | ॐ चक्रिणे नमः | OM Cakriṇe namaḥ


మనస్తత్త్వాత్మకం సుదర్శనాఖ్యం చక్రమస్యాస్తీని ।
సంసారచక్రమస్యాజ్ఞయా పరివర్తత ఇతి వా చక్రీ ॥

మనస్తత్త్వ రూపమగు సుదర్శన నామక చక్రము ఈతనికి కలదు. తన ఆజ్ఞచే పరివర్తమానము అనగా పునః పునః మొదటివలనే తిరుగుచుండునదిగా సంసార చక్రము ఇతని ఆధీనమున కలదు.

:: శ్రీ విష్ణుమహాపురాణే ప్రథమాంశే ద్వావింశోఽధ్యాయః ::
చలత్స్వరూపమత్యంతం జవేనాంతరితానిలమ్ ।
చక్రస్వరూపం చ మనో ధత్తే విష్ణుకరే స్థితతమ్ ॥ 71 ॥

చలించు స్వభావము కలదియు, తన అత్యంతవేగముచే వాయువును కూడ క్రిందుపరచునదియు, చక్రస్వరూపము కలదియు అగు మనసును - విష్ణువు తన కరమునందు ధరించుచున్నాడు.

908. చక్రీ, चक्री, Cakrī



मनस्तत्त्वात्मकं सुदर्शनाख्यं चक्रमस्यास्तीनि ।
संसारचक्रमस्याज्ञया परिवर्तत इति वा चक्री ॥

Manastattvātmakaṃ sudarśanākhyaṃ cakramasyāstīni,
Saṃsāracakramasyājñayā parivartata iti vā cakrī.

His is the cakra or discuss (one of the weapons) called Sudarśana of the form of manastattva or psychology. He sets the wheel of saṃsāra or world in motion; so Cakrī. Cakra means circle.

:: श्री विष्णुमहापुराणे प्रथमांशे द्वाविंशोऽध्यायः ::
चलत्स्वरूपमत्यन्तं जवेनान्तरितानिलम् ।
चक्रस्वरूपं च मनो धत्ते विष्णुकरे स्थिततम् ॥ ७१ ॥

Śrī Viṣṇu Mahāpurāṇa Part 1, Chapter 22
Calatsvarūpamatyaṃtaṃ javenāṃtaritānilam,
Cakrasvarūpaṃ ca mano dhatte viṣṇukare sthitatam. 71.

In his hand Vishńu holds, in the form of His discus, the mind, whose thoughts like the weapon fly swifter than the winds.

908. చక్రీ, चक्री, Cakrī

शङ्खभृन्नन्दकी चक्री शार्ङ्गधन्वा गदाधरः ।
रथांगपाणिरक्षोभ्यस्सर्वप्रहरणायुधः ॥ १०७ ॥

శఙ్ఖభృన్నన్దకీ చక్రీ శార్ఙ్గధన్వా గదాధరః ।
రథాంగపాణిరక్షోభ్యస్సర్వప్రహరణాయుధః ॥ 107 ॥

Śaṅkhabhr̥nnandakī cakrī śārṅgadhanvā gadādharaḥ,
Rathāṃgapāṇirakṣobhyassarvapraharaṇāyudhaḥ ॥ 107 ॥

25 జులై, 2015

994. నన్దకీ, नन्दकी, Nandakī

ఓం నన్దకినే నమః | ॐ नन्दकिने नमः | OM Nandakine namaḥ


విద్యామయో నన్దకాఖ్యః ఖడ్గోఽస్యాఽస్తితి నన్దకీ ఈతనికి విద్య, తత్త్వజ్ఞాన రూపమగు నందక నామ ఖడ్గము కలదు.

:: శ్రీ విష్ణుమహాపురాణే ప్రథమాంశే ద్వావింశోఽధ్యాయః ::
బిభర్తి యచ్చాసిరన్తమచ్చ్యుతోత్యన్తనిర్మలమ్ ।
విద్యామయ తు తజ్జ్ఞానమవిద్యాకోశసంస్థితమ్ ॥ 74 ॥

అచ్యుతుడు ధరించు అసిరత్నము (చక్రవర్తి ధరించు ఖడ్గము) విద్యామయమును, జ్ఞానరూపయు, అత్యంత నిర్మలమును అయియుండి అవిద్య అనబడు ఖడ్గకోశమునందు నిక్షేపింపబడియుండును.



विद्यामयो नन्दकाख्यः खड्गोऽस्याऽस्तिति नन्दकी / Vidyāmayo nandakākhyaḥ khaḍgo’syā’stiti Nandakī His sword is called Nandaka, of the nature of the knowledge.

:: श्री विष्णुमहापुराणे प्रथमांशे द्वाविंशोऽध्यायः ::
बिभर्ति यच्चासिरन्तमच्च्युतोत्यन्तनिर्मलम् ।
विद्यामय तु तज्ज्ञानमविद्याकोशसंस्थितम् ॥ ७४ ॥

Śrī Viṣṇu Mahā Purāṇa - Part I, Chapter 22
Bibharti yaccāsirantamaccyutotyantanirmalam,
Vidyāmaya tu tajjñānamavidyākośasaṃsthitam. 74.

The bright sword of Achyuta is holy wisdom, concealed at some seasons in the scabbard of ignorance.

शङ्खभृन्नन्दकी चक्री शार्ङ्गधन्वा गदाधरः ।
रथांगपाणिरक्षोभ्यस्सर्वप्रहरणायुधः ॥ १०७ ॥

శఙ్ఖభృన్నన్దకీ చక్రీ శార్ఙ్గధన్వా గదాధరః ।
రథాంగపాణిరక్షోభ్యస్సర్వప్రహరణాయుధః ॥ 107 ॥

Śaṅkhabhr̥nnandakī cakrī śārṅgadhanvā gadādharaḥ,
Rathāṃgapāṇirakṣobhyassarvapraharaṇāyudhaḥ ॥ 107 ॥

24 జులై, 2015

993. శఙ్ఖభృత్, शङ्खभृत्, Śaṅkhabhr̥t

ఓం శఙ్ఖభృతే నమః | ॐ शङ्खभृते नमः | OM Śaṅkhabhr̥te namaḥ


స బిభ్రత్ పాఞ్చజన్యాఖ్యం శఙ్ఖం శ్రీహరిరచ్యుతః ।
భూతాద్యహఙ్కారరూపం శఙ్ఖభృత్ ప్రోచ్యతేబుధైః ॥

పంచభూతాత్మకమును, అహంకార రూపమును అగు పాంచజన్య నామక శంఖమును ధరించు శ్రీహరి శంఖభృత్.



स बिभ्रत् पाञ्चजन्याख्यं शङ्खं श्रीहरिरच्युतः ।
भूताद्यहङ्काररूपं शङ्खभृत् प्रोच्यतेबुधैः ॥

Sa bibhrat pāñcajanyākhyaṃ śaṅkhaṃ śrīhariracyutaḥ,
Bhūtādyahaṅkārarūpaṃ śaṅkhabhr̥t procyatebudhaiḥ.

The bearer of the conch named Pāñcajanya of the form of the five elements and the ahaṅkāra or ego.

शङ्खभृन्नन्दकी चक्री शार्ङ्गधन्वा गदाधरः ।
रथांगपाणिरक्षोभ्यस्सर्वप्रहरणायुधः ॥ १०७ ॥

శఙ్ఖభృన్నన్దకీ చక్రీ శార్ఙ్గధన్వా గదాధరః ।
రథాంగపాణిరక్షోభ్యస్సర్వప్రహరణాయుధః ॥ 107 ॥

Śaṅkhabhr̥nnandakī cakrī śārṅgadhanvā gadādharaḥ,
Rathāṃgapāṇirakṣobhyassarvapraharaṇāyudhaḥ ॥ 107 ॥

23 జులై, 2015

992. పాపనాశనః, पापनाशनः, Pāpanāśanaḥ

ఓం పాపనాశనాయ నమః | ॐ पापनाशनाय नमः | OM Pāpanāśanāya namaḥ


కీర్తితః పూజితో ధ్యాతః స్మృతః పాపరాశిం నాశయన్ పాపనాశనః కీర్తించబడి, పూజించబడి, స్మరించబడినపుడు పాపరాశిని నశింపజేయువాడు కనుక శ్రీ మహా విష్ణువు పాపనాశనః అని తెలియబడుతాడు.

'పక్షోపవాసాద్యత్పాపం పురుషస్య ప్రణశ్యతి । ప్రాణాయామశతేనైవ తత్పాపం నశ్యతే నృణామ్ ॥ ప్రాణాయామసహస్రేణ యత్పాపం నశ్యతే నృణామ్ । క్షణమాత్రేన తత్పాపం హరేర్ధ్యానాత్ప్రణశ్యతి ॥' ఇతి వృద్ధశాతాతపే 'పక్షోపాసము వలన జీవుని ఏ పాపము నశించునో నరుల అంతపాపమును ప్రాణాయామ శతముచే నశించును. ప్రాణాయామ సహస్రముచే నరుల ఎంత పాపము నశించునో అంత పాపము హరి ధ్యానము క్షణ మాత్రముననే నశించును' అని వృద్ధశాతాతప స్మృతియందు చెప్పబడియున్నది.



कीर्तितः पूजितो ध्यातः स्मृतः पापराशिं नाशयन् पापनाशनः / Kīrtitaḥ pūjito dhyātaḥ smr̥taḥ pāparāśiṃ nāśayan pāpanāśanaḥ When praised, worshiped or meditated upon, Lord Mahā Viṣṇu destroys accrued sins of a devotee and hence is known as Pāpanāśanaḥ.

'पक्षोपवासाद्यत्पापं पुरुषस्य प्रणश्यति । प्राणायामशतेनैव तत्पापं नश्यते नृणाम् ॥ प्राणायामसहस्रेण यत्पापं नश्यते नृणाम् । क्षणमात्रेन तत्पापं हरेर्ध्यानात्प्रणश्यति ॥' इति वृद्धशातातपे / 'Pakṣopavāsādyatpāpaṃ puruṣasya praṇaśyati, prāṇāyāmaśatenaiva tatpāpaṃ naśyate nr̥ṇām. prāṇāyāmasahasreṇa yatpāpaṃ naśyate nr̥ṇām, kṣaṇamātrena tatpāpaṃ harerdhyānātpraṇaśyati.' iti vr̥ddhaśātātape That sin of men which is destroyed by fasting fortnightly, is destroyed by performance of hundred prāṇāyāmas. That sin of men which is destroyed by performance of a thousand prāṇāyāmas dies out merely by a moment's thought of Lord Hari - thus is stated in Vr̥ddhaśātātapa Smr̥ti.

आत्मयोनिस्स्वयंजातो वैखानस्सामगायनः ।
देवकीनन्दनस्स्रष्टा क्षितीशः पापनाशनः ॥ १०६ ॥

ఆత్మయోనిస్స్వయంజాతో వైఖానస్సామగాయనః ।
దేవకీనన్దనస్స్రష్టా క్షితీశః పాపనాశనః ॥ 106 ॥

Ātmayonissvayaṃjāto vaikhānassāmagāyanaḥ,
Devakīnandanassraṣṭā kṣitīśaḥ pāpanāśanaḥ ॥ 106 ॥

22 జులై, 2015

991. క్షితీశః, क्षितीशः, Kṣitīśaḥ

ఓం క్షితీశాయ నమః | ॐ क्षितीशाय नमः | OM Kṣitīśāya namaḥ


క్షితేర్భూమేరీశః క్షితీశః దశరథాత్మజః భూమికి ప్రభువు క్షితీశః. ఈ నామము దశరథాత్మజుడైన శ్రీరామునికి కూడ వర్తించును.



क्षितेर्भूमेरीशः क्षितीशः दशरथात्मजः / Kṣiterbhūmerīśaḥ Kṣitīśaḥ Daśarathātmajaḥ The Lord of the earth is Kṣitīśaḥ. Son of Daśaratha i.e., Lord Rāma is known by this name.

आत्मयोनिस्स्वयंजातो वैखानस्सामगायनः ।
देवकीनन्दनस्स्रष्टा क्षितीशः पापनाशनः ॥ १०६ ॥

ఆత్మయోనిస్స్వయంజాతో వైఖానస్సామగాయనః ।
దేవకీనన్దనస్స్రష్టా క్షితీశః పాపనాశనః ॥ 106 ॥

Ātmayonissvayaṃjāto vaikhānassāmagāyanaḥ,
Devakīnandanassraṣṭā kṣitīśaḥ pāpanāśanaḥ ॥ 106 ॥

21 జులై, 2015

990. స్రష్టా, स्रष्टा, Sraṣṭā

ఓం స్రష్ట్రే నమః | ॐ स्रष्ट्रे नमः | OM Sraṣṭre namaḥ


స్రష్టేతి సర్వలోకస్య సృష్టేర్విష్ణుస్సముచ్యతే సర్వలోకములను సృజించు విష్ణుడు స్రష్టా అని చెప్పబడును.

:: పోతన భాగవతము - దశమ స్కంధము, ఉత్తర భాగము ::
ఉ. వేదవధూశిరో మహితవీథులఁ జాల నలంకరించు మీ
     పాదసరోజయుగ్మము శుభస్థితి మా హృదయంబులందు ని
     త్యోదితభక్తిమైఁ దగిలియుండు నుపాయ మెరుంగఁ బల్కు దా
     మోదర! భక్త దుర్భవపయోనిధితారణ! సృష్టికారణా! ( 753)

దామోదరా! వేదాంత వీథులలో విహరించెడి నీ పాద పద్మములు మా హృదయములలో ఎల్లప్పుడును నిలి ఉండే ఉపాయమును మాకు అనుగ్రహింపుము. నీవు సంసార సాగరమును తరింప జేసెడివాడవు. ఈ సమస్త సృష్టికీ కారణమైయున్నవాడవు.

588. స్రష్టా, स्रष्टा, Sraṣṭā



स्रष्टेति सर्वलोकस्य सृष्टेर्विष्णुस्समुच्यते / Sraṣṭeti sarvalokasya sr̥ṣṭerviṣṇussamucyate As the Creator of all worlds, Lord Viṣṇu is called Sraṣṭā.

:: श्रीमद्भागवते दशमस्कन्धे षट्पञ्चाशत्तमोऽध्यायः ::
त्वं हि विश्वसृजाम्‌स्रष्टा सृष्टानामपि यच्च सत् ।
कालः कलयतामीशः पर आत्मा तथात्मनाम् ॥ २७ ॥

Śrīmad Bhāgavata - Canto 10, Chapter 56
Tvaṃ hi viśvasr̥jāmˈsraṣṭā sr̥ṣṭānāmapi yacca sat,
Kālaḥ kalayatāmīśaḥ para ātmā tathātmanām. 27.

You are the ultimate creator of all creators of the universe, and of everything created You are the underlying substance. You are the subduer of all subduers, the Supreme Lord and Supreme Soul of all souls.

588. స్రష్టా, स्रष्टा, Sraṣṭā

आत्मयोनिस्स्वयंजातो वैखानस्सामगायनः ।
देवकीनन्दनस्स्रष्टा क्षितीशः पापनाशनः ॥ १०६ ॥

ఆత్మయోనిస్స్వయంజాతో వైఖానస్సామగాయనః ।
దేవకీనన్దనస్స్రష్టా క్షితీశః పాపనాశనః ॥ 106 ॥

Ātmayonissvayaṃjāto vaikhānassāmagāyanaḥ,
Devakīnandanassraṣṭā kṣitīśaḥ pāpanāśanaḥ ॥ 106 ॥

20 జులై, 2015

989. దేవకీనన్దనః, देवकीनन्दनः, Devakīnandanaḥ

ఓం దేవకీనన్దనాయ నమః | ॐ देवकीनन्दनाय नमः | OM Devakīnandanāya namaḥ


కృష్ణావతారే దేవక్యాః సుతోభూత్ మధుసూదనః ।
దేవకీనన్దన ఇతి కీర్త్యతే విబుధోత్తమైః ॥

దేవకీదేవి తనయుడై అవతరించిన విష్ణువు దేవకీనందనః అని చెప్పబడును.

:: శ్రీ మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి అష్టపఞ్చదధికశతతమోఽధ్యాయః ::
జ్యోతీంషి శుక్లాని హి సర్వలోకే త్రయో లోకా లోకపాలాస్త్రయశ్చ ।
త్రయోఽగ్నయో వ్యాహృతయశ్చతిస్త్రః సర్వే దేవా దేవకీపుత్ర ఏవ ॥ 31 ॥

లోకమున ప్రకాశమానములగు జ్యోతిస్సులును, మూడు లోకములును, సకలలోకపాలురును, వేదత్రయమును, అగ్నిత్రయమును, ఐదు ఆహుతులును, సర్వదేవతలును - ఏవి ఎన్ని కలవో - అన్నియు దేవకీ పుత్రుడే!



कृष्णावतारे देवक्याः सुतोभूत् मधुसूदनः ।
देवकीनन्दन इति कीर्त्यते विबुधोत्तमैः ॥

Kr̥ṣṇāvatāre devakyāḥ sutobhūt madhusūdanaḥ,
Devakīnandana iti kīrtyate vibudhottamaiḥ.

As the incarnation of Kr̥ṣṇa, the Lord was born to Devakī Devi and hence He is called Devakīnandanaḥ.

:: श्री महाभारते अनुशासनपर्वणि दानधर्मपर्वणि अष्टपञ्चदधिकशततमोऽध्यायः ::
ज्योतींषि शुक्लानि हि सर्वलोके त्रयो लोका लोकपालास्त्रयश्च ।
त्रयोऽग्नयो व्याहृतयश्चतिस्त्रः सर्वे देवा देवकीपुत्र एव ॥ ३१ ॥

Śrī Mahābhārata - Book 13, Chapter 158
Jyotīṃṣi śuklāni hi sarvaloke trayo lokā lokapālāstrayaśca,
Trayo’gnayo vyāhr̥tayaścatistraḥ sarve devā devakīputra eva. 31.

All the luminaries in the world, the three worlds, the protectors of the worlds, the three Vedas, the three sacred fires, the five oblations and all the devas are the son of Devakī Himself.

आत्मयोनिस्स्वयंजातो वैखानस्सामगायनः ।
देवकीनन्दनस्स्रष्टा क्षितीशः पापनाशनः ॥ १०६ ॥

ఆత్మయోనిస్స్వయంజాతో వైఖానస్సామగాయనః ।
దేవకీనన్దనస్స్రష్టా క్షితీశః పాపనాశనః ॥ 106 ॥

Ātmayonissvayaṃjāto vaikhānassāmagāyanaḥ,
Devakīnandanassraṣṭā kṣitīśaḥ pāpanāśanaḥ ॥ 106 ॥

19 జులై, 2015

988. సామగాయనః, सामगायनः, Sāmagāyanaḥ

ఓం సామగాయనాయ నమః | ॐ सामगायनाय नमः | OM Sāmagāyanāya namaḥ


సామాని గాయతీతి స సామగాయన ఉచ్యతే యజ్ఞములయందు సామగానము చేయు ఉద్గాతయు శ్రీ విష్ణురూపుడే. సామభిః గీయతే - సామ మంత్రములచే గానము చేయబడువాడు అనియు చెప్పుట సమంజసమే.



सामानि गायतीति स सामगायन उच्यते / Sāmāni gāyatīti sa sāmagāyana ucyate The udgāta who recites Sāma veda in vedic rituals is Śrī Viṣṇu Himself. Or सामभिः गीयते / Sāmabhiḥ gīyate 'He who is addressed by recitation of sāma veda hyms' is also a possible interpretation.

आत्मयोनिस्स्वयंजातो वैखानस्सामगायनः
देवकीनन्दनस्स्रष्टा क्षितीशः पापनाशनः ॥ १०६ ॥

ఆత్మయోనిస్స్వయంజాతో వైఖానస్సామగాయనః
దేవకీనన్దనస్స్రష్టా క్షితీశః పాపనాశనః ॥ 106 ॥

Ātmayonissvayaṃjāto vaikhānassāmagāyanaḥ,
Devakīnandanassraṣṭā kṣitīśaḥ pāpanāśanaḥ ॥ 106 ॥

18 జులై, 2015

987. వైఖానః, वैखानः, Vaikhānaḥ

ఓం వైఖానాయ నమః | ॐ वैखानाय नमः | OM Vaikhānāya namaḥ


విశేషేన ఖనతీతి వైఖాన ఇతి కీర్త్యతే ।
వారాహం రూపమాస్థాయ విశేషేణ భువం హరిః ॥
పాతాలవాసినం దైత్యం హిరణ్యాక్షం జఘాన సః ।
ఇతి పౌరాణికీ గాథా ప్రసిద్ధా శ్రూయతేఽసకృత్ ॥

విశేషేన ఖనతీతి వైఖానః అనగా మిక్కిలిగా త్రవ్వినవాడు వైఖానః. శ్రీ విష్ణువు వారాహరూపమును ఆశ్రయించి ధరణిని మిక్కిలిగా త్రవ్వి పాతాళమున వసించుచు ఉండిన హిరణ్యాక్షుడనబడు దైత్యుడిని చెంపెను అను కథ పురాణమున ప్రసిద్ధమై యున్నది.



विशेषेन खनतीति वैखान इति कीर्त्यते ।
वाराहं रूपमास्थाय विशेषेण भुवं हरिः ॥
पातालवासिनं दैत्यं हिरण्याक्षं जघान सः ।
इति पौराणिकी गाथा प्रसिद्धा श्रूयतेऽसकृत् ॥

Viśeṣena khanatīti vaikhāna iti kīrtyate,
Vārāhaṃ rūpamāsthāya viśeṣeṇa bhuvaṃ hariḥ.
Pātālavāsinaṃ daityaṃ hiraṇyākṣaṃ jaghāna saḥ,
Iti paurāṇikī gāthā prasiddhā śrūyate’sakr̥t.

Viśeṣena khanatīti Vaikhānaḥ - The One who digs especially is Vaikhānaḥ. It is well-known in the purāṇas that the Lord dug especially into the earth assuming the form of the boar and killed a daitya by the name Hiraṇyākṣa who had his abode in the nether world.

आत्मयोनिस्स्वयंजातो वैखानस्सामगायनः ।
देवकीनन्दनस्स्रष्टा क्षितीशः पापनाशनः ॥ १०६ ॥

ఆత్మయోనిస్స్వయంజాతో వైఖానస్సామగాయనః ।
దేవకీనన్దనస్స్రష్టా క్షితీశః పాపనాశనః ॥ 106 ॥

Ātmayonissvayaṃjāto vaikhānassāmagāyanaḥ,
Devakīnandanassraṣṭā kṣitīśaḥ pāpanāśanaḥ ॥ 106 ॥

17 జులై, 2015

986. స్వయఞ్జాతః, स्वयञ्जातः, Svayañjātaḥ

ఓం స్వయంజాతాయ నమః | ॐ स्वयंजाताय नमः | OM Svayaṃjātāya namaḥ


నిమిత్తకారణమపి పరమాత్మా సనాతనః ।
స ఏవేతి దర్శయితుం స్వయఞ్జాత ఇతీర్యతే ॥

మరి యేదియు తనకు కారణము లేక తనకు ఇతరము ఏదియు ఉపాదాన కారణము కాని, నిమిత్త కారణము కాని లేక తానే జనించినవాడు వలె అనుభవమున గోచరడగుచు ఉన్నాడు అని అర్థము.

తాను స్వయంజాతుడగుచు జగత్ ఉపాదాన కారణముగా ఉన్నాడు. ఆత్మయోనిః అనుటచేతను జగత్తు యొక్క ఉత్పత్తికి పూర్వము ఉన్న ఏకైక చేతన తత్త్వము ఆతడొక్కడేయని 'ఆత్మా నా ఇద్ మేక ఏవాగ్ర ఆసీత్‌' ఇత్యాది శ్రుతులు చెప్పుచుండుటచేతను జగన్నిమిత్త కారణము కూడ ఆతడేయని చెప్పుటయైనది. ఇట్లు హరియే జగదుత్పత్తిలో నిమిత్తోపాదాన కారణములు రెండునగుననుట 'ప్రకృతిశ్చ ప్రతిజ్ఞాదృష్టాంతాను పరోధాత్‌' (బ్రహ్మ సూత్రము 1.4.23) - అనుచోట చెప్పబడినది.

అదెట్లనిన ఛాందోగ్యోపనిషత్ ఇత్యాదులయందు "ఏ ఒకదానిని గూర్చి వినినచో విశేషాకార గ్రహణముచే విననిదెల్ల వినినదే అగునో" ఇత్యాది ప్రతిజ్ఞయు, "మృత్పిండమునొకదానిని అనుభవమున ఎరిగినచో మృణ్మయమగు ప్రతియొకదానిని అనుభవమున ఎరిగినట్లే అగుచున్నది" అను ఈ మొదలగు దృష్టాంతమును "పరస్పర పీడనమునందక సామంజస్యమున కుదుర వలయుననినచో పరమాత్మ తాను జగత్సృష్టి సేయ సంకల్పించెను" అను శ్రుతులనుబట్టి ఆతడు జగదుద్పత్తిలో నిమిత్త కారణమగుటతోపాటు ఉపాదాన కారణముకూడ అగునని చెప్పవలయును.



निमित्तकारणमपि परमात्मा सनातनः ।
स एवेति दर्शयितुं स्वयञ्जात इतीर्यते ॥

Nimittakāraṇamapi paramātmā sanātanaḥ,
Sa eveti darśayituṃ svayañjāta itīryate.

As explained in the description of 'Ātmayoniḥ' He is the material cause. To show that He is also the efficient cause i.e., nimitta kāraṇa, it is said Svayaṃ jātaḥ.

That Hari is both the material and the efficient cause - is established by the 'प्रकृतिश्च प्रतिज्ञादृष्टान्तानु परोधात्‌ / Prakr̥tiśca pratijñādr̥ṣṭāṃtānu parodhāt' (Brahma sūtra 1.4.23) - 'Brahman must be the twofold cause so as not to contradict the proposition and the illustration.'

आत्मयोनिस्स्वयंजातो वैखानस्सामगायनः ।
देवकीनन्दनस्स्रष्टा क्षितीशः पापनाशनः ॥ १०६ ॥

ఆత్మయోనిస్స్వయంజాతో వైఖానస్సామగాయనః ।
దేవకీనన్దనస్స్రష్టా క్షితీశః పాపనాశనః ॥ 106 ॥

Ātmayonissvayaṃjāto vaikhānassāmagāyanaḥ,
Devakīnandanassraṣṭā kṣitīśaḥ pāpanāśanaḥ ॥ 106 ॥

16 జులై, 2015

985. ఆత్మయోనిః, आत्मयोनिः, Ātmayoniḥ

ఓం ఆత్మయోనయే నమః | ॐ आत्मयोनये नमः | OM Ātmayonaye namaḥ


ఆత్మైవ యోనిరుపాదానకారణం నాన్యదిత్యతః ।
ఆత్మయోనిరితి విష్ణుః ప్రోచ్యతే విబుధోత్తమైః ॥

యోని అనగా మూల ఉపాదాన కారణము. 'ఆత్మ ఏవ యోనిః - ఆత్మయోనిః' అను విగ్రహ వాక్యము చెప్పవలయును. ఆత్మయే అనగా పరమాత్ముడే సర్వ జగద్రూప కార్యోత్పత్తికిని ఉపాదాన కారణమగు యోని; మరి యేదియు కాదు అని అర్థము.

:: శ్రీ మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి అష్టాపఞ్చదధికశతతమోఽధ్యాయః ::
తేన విశ్వం కృతమేతద్ధి రాజన్ స జీవయత్యాత్మనైవాత్మయోనిః ।
తతో దేవానసురాన్ మానవాంశ్చ లోకానృషీంశ్చాపి పితౄన్ ప్రజాశ్చ ।
సమాసేన విధివత్ప్రాణిలోకాన్ సర్వాన్ సదా భూతపతిః సిసృక్షుః ॥ 42 ॥

ఓ రాజా! ఈతడే ఈ విశ్వములను ఉత్పన్నముగావించినవాడును, ఆత్మయోని అయిన శ్రీ కృష్ణుడే తన శక్తి ద్వారమున సమస్త ప్రాణులకును జీవమును ప్రసాదీంచినవాడు అయియున్నాడు. దేవతలు, అసురులు, మనుష్యులు, లోకములు, ఋషులు, పితృదేవతలు, ప్రజలు మరియు సమస్త ప్రాణికోటికి ఈతనినుండే జీవము లభించియున్నది. భూతనాథుడైన ఈ భగవంతుడే ఎల్లప్పుడును విధిపూర్వకముగ సమస్తములైన భూతములను సృష్టించు సంకల్పము కలిగియుండువాడు.



आत्मैव योनिरुपादानकारणं नान्यदित्यतः ।
आत्मयोनिरिति विष्णुः प्रोच्यते विबुधोत्तमैः ॥

Ātmaiva yonirupādānakāraṇaṃ nānyadityataḥ,
Ātmayoniriti viṣṇuḥ procyate vibudhottamaiḥ.

Yoni is the root cause. 'Ātma eva yoniḥ - ātmayoniḥ' is the figurative construct. Ātma, the soul or paramātma is the material root cause of all of universe and nothing else.

:: श्री महाभारते अनुशासनपर्वणि दानधर्मपर्वणि अष्टापञ्चदधिकशततमोऽध्यायः ::
तेन विश्वं कृतमेतद्धि राजन् स जीवयत्यात्मनैवात्मयोनिः ।
ततो देवानसुरान् मानवांश्च लोकानृषींश्चापि पितॄन् प्रजाश्च ।
समासेन विधिवत्प्राणिलोकान् सर्वान् सदा भूतपतिः सिसृक्षुः ॥ ४२ ॥

Śrī Mahābhārata - Book 13, Chapter 158
Tena viśvaṃ kr̥tametaddhi rājan sa jīvayatyātmanaivātmayoniḥ,
Tato devānasurān mānavāṃśca lokānr̥ṣīṃścāpi pitṝn prajāśca,
Samāsena vidhivatprāṇilokān sarvān sadā bhūtapatiḥ sisr̥kṣuḥ. 42.

O king! He is the One from whom the worlds emanated and Śrī Kr̥ṣṇa, who is the root cause of everything, is the One who infused life into creatures. Devas, asuras, men, the worlds, the sages, ancestral deities, mankind and in essence all the beings have been given life by Him. He, the Lord of all, is always determined of making orderly creation.

आत्मयोनिस्स्वयंजातो वैखानस्सामगायनः ।
देवकीनन्दनस्स्रष्टा क्षितीशः पापनाशनः ॥ १०६ ॥

ఆత్మయోనిస్స్వయంజాతో వైఖానస్సామగాయనః ।
దేవకీనన్దనస్స్రష్టా క్షితీశః పాపనాశనః ॥ 106 ॥

Ātmayonissvayaṃjāto vaikhānassāmagāyanaḥ,
Devakīnandanassraṣṭā kṣitīśaḥ pāpanāśanaḥ ॥ 106 ॥

15 జులై, 2015

983. అన్నాదః, अन्नादः, Annādaḥ

ఓం అన్నాయ నమః | ॐ अन्नाय नमः | OM Annāya namaḥ


అన్నామత్తీత్యతో విష్ణురన్నాద ఇతి కీర్త్యతే ।
సర్వమన్నాదిరూపేణ జగదేతచ్చరాచరమ్ ॥
భోక్తృ భోగ్యాత్మక మేవ నైవాన్యత్ కేశవాదితి ।
దర్శయితు మేవకారః ప్రయుక్తోఽన్వర్ధకోఽత్రహి ॥
కేశవే జగదాత్మకే చ శబ్దః పరమే పుంసి ।
ఏకస్మిన్ సర్వనామ్నాఞ్చ వృత్తిం దర్శయితుం హరౌ ॥

అన్నమును తిను ప్రాణి. ఇచట శ్లోకమున 'అన్నమన్నాద ఏవ చ' అని చెప్పబడినది. సర్వ జగత్తును అన్న రూపమున భోగ్యరూపమున ఉన్నది. జగద్రూపము ఇదియే అని చెప్పుటకే ఈ 'ఏవ' శబ్దమును ఉచ్చరించుట. 'చ' అనునది అనేకములను ఒకే ఆశ్రయమునందు వర్తింపజేయు సముచ్చయమును తెలుపును. అట్టి 'చ' శబ్దమును ఈ శ్లోకాంతమున ఉచ్చరించుటచే అన్ని నామములును ఏకైక పరమార్థ తత్త్వమగు పరమ పురుషునియందే వర్తించును.



अन्नामत्तीत्यतो विष्णुरन्नाद इति कीर्त्यते ।
सर्वमन्नादिरूपेण जगदेतच्चराचरम् ॥
भोक्तृ भोग्यात्मक मेव नैवान्यत् केशवादिति ।
दर्शयितु मेवकारः प्रयुक्तोऽन्वर्धकोऽत्रहि ॥
केशवे जगदात्मके च शब्दः परमे पुंसि ।
एकस्मिन् सर्वनाम्नाञ्च वृत्तिं दर्शयितुं हरौ ॥

Annāmattītyato viṣṇurannāda iti kīrtyate,
Sarvamannādirūpeṇa jagadetaccarācaram.
Bhoktr̥ bhogyātmaka meva naivānyat keśavāditi,
Darśayitu mevakāraḥ prayukto’nvardhako’trahi.
Keśave jagadātmake ca śabdaḥ parame puṃsi,
Ekasmin sarvanāmnāñca vr̥ttiṃ darśayituṃ harau.

He who eats annam. The stanza concludes as 'Annamannāda eva ca.'  Here 'eva' is used to show that the whole world is a consumable as food in the form of the eater and the eaten. 'ca' is used to show that all words can be applied together to One Supreme Person.

यज्ञभृद्यज्ञकृद्यज्ञी यज्ञभुग्यज्ञसाधनः ।
यज्ञान्तकृद्यज्ञगुह्यमनमन्नाद एव च ॥ १०५ ॥

యజ్ఞభృద్యజ్ఞకృద్యజ్ఞీ యజ్ఞభుగ్యజ్ఞసాధనః ।
యజ్ఞాన్తకృద్యజ్ఞగుహ్యమనమన్నాద ఏవ చ ॥ 105 ॥

Yajñabhr̥dyajñakr̥dyajñī yajñabhugyajñasādhanaḥ,
Yajñāntakr̥dyajñaguhyamanamannāda eva ca ॥ 105 ॥

14 జులై, 2015

983. అన్నమ్, अन्नम्, Annam

ఓం అన్నాయ నమః | ॐ अन्नाय नमः | OM Annāya namaḥ


భూతాన్యత్త్యద్యతే భూతైశ్చేతి బ్రహ్మాన్నముచ్యతే ప్రాణులచే తినబడును; ప్రాణులను తినును. అట్టి అన్నము పరమాత్మ రూపమే!

:: తైత్తిరీయోపనిషత్ - ఆనన్దవల్లి (బ్రహ్మానన్దవల్లి) ద్వితీయాధ్యాయః, ద్వితీయోఽనువాకః ::
అన్నాద్వై ప్రజాః ప్రజాయన్తే । యాః కాశ్చ పృథివీగ్‍ం శ్రితాః । అథో అన్నేనైవ జీవన్తి । అథైనదపి యన్త్యన్తతః । అన్నగ్‍ం హి భూతానాం జ్యేష్ఠమ్ । తస్మాత్సర్వౌషధ ముచ్యతే సర్వం వైతేఽన్నమాప్నువన్తి । యేఽన్నం బ్రహ్మో పాసతే అన్నం హి భూతానాం జ్యేష్ఠమ్ । తస్మాత్సర్వౌషధముచ్యతే ॥ 1 ॥

అన్నము వలననే సమస్త ప్రజలు పుట్టుచున్నారు. ఈ భూమిని ఆశ్రయించియుండెడివన్నియు అన్నము చేతనే జీవధారణమును చేయుచున్నవి. జీవితకాలముయొక్క అంతమునందు తిరిగి అన్నియు అన్నమునే పొందుచున్నవి. ఇట్లు అన్నము అన్నిటియొక్క జన్మ, స్థితిలయములకు హేతువగుట వలన సమస్త భూతములకు కారణమైయున్నది. ఆ కారణము వలననే అది సర్వమునకు ఔషధముగానున్నది. ఇట్టి సర్వకారణమగు అన్నమును పరబ్రహ్మ స్వరూపముగా ఉపాసించెడివారు సమస్త స్వరూపమైన అన్నమును పొందుచున్నారు. సర్వమునకు ఔషధరూపమైన అన్నము కారణమై అన్నిటికి ముందు పుట్టినదిగా చెప్పబడుచున్నది



भूतान्यत्त्यद्यते भूतैश्चेति ब्रह्मान्नमुच्यते / Bhūtānyattyadyate bhūtaiśceti brahmānnamucyate Eaten by living beings and also eats them too. Such annam i.e., food is Brahman Itself.

:: तैत्तिरीयोपनिषत् - आनन्दवल्लि (ब्रह्मानन्दवल्लि) द्वितीयाध्यायः, द्वितीयोऽनुवाकः ::
अन्नाद्वै प्रजाः प्रजायन्ते । याः काश्च पृथिवीग्‍ं श्रिताः । अथो अन्नेनैव जीवन्ति । अथैनदपि यन्त्यन्ततः । अन्नग्‍ं हि भूतानां ज्येष्ठम् । तस्मात्सर्वौषध मुच्यते सर्वं वैतेऽन्नमाप्नुवन्ति । येऽन्नं ब्रह्मो पासते अन्नं हि भूतानां ज्येष्ठम् । तस्मात्सर्वौषधमुच्यते ॥ १ ॥

Taittirīya Upaniṣat - Part II, Chapter II
Annādvai prajāḥ prajāyante, yāḥ kāśca pr̥thivīgˈṃ śritāḥ, atho annenaiva jīvanti, athainadapi yantyantataḥ, annagˈṃ hi bhūtānāṃ jyeṣṭham, tasmātsarvauṣadha mucyate sarvaṃ vaite’nnamāpnuvanti, ye’nnaṃ brahmo pāsate annaṃ hi bhūtānāṃ jyeṣṭham, tasmātsarvauṣadhamucyate. 1.

All beings that rest on the earth are born verily from food. Besides, they live on food, and at the end they get merged in food. Food was verily born before all creatures; therefore it is called the medicine for all. Those who worship food as Brahman acquire all the food. Food was verily born before all creatures; therefore it is called the medicine for all. Creatures are born of food; being born, they grow by food. Since it is eaten and it eats the creatures, therefore it is called annam i.e., food.

यज्ञभृद्यज्ञकृद्यज्ञी यज्ञभुग्यज्ञसाधनः ।
यज्ञान्तकृद्यज्ञगुह्यमनमन्नाद एव च ॥ १०५ ॥

యజ్ఞభృద్యజ్ఞకృద్యజ్ఞీ యజ్ఞభుగ్యజ్ఞసాధనః ।
యజ్ఞాన్తకృద్యజ్ఞగుహ్యమనమన్నాద ఏవ చ ॥ 105 ॥

Yajñabhr̥dyajñakr̥dyajñī yajñabhugyajñasādhanaḥ,
Yajñāntakr̥dyajñaguhyamannamannāda eva ca ॥ 105 ॥

13 జులై, 2015

982. యజ్ఞగుహ్యమ్, यज्ञगुह्यम्, Yajñaguhyam

ఓం యజ్ఞగుహ్యాయ నమః | ॐ यज्ञगुह्याय नमः | OM Yajñaguhyāya namaḥ


ఫలాభిసన్ధిరహితో యజ్ఞః శ్రీ విష్ణురేవ వా ।
జ్ఞానయజ్ఞో హి యజ్ఞానాం గుహ్యం బ్రహ్మాచ్యుతం హరిః ॥
తదభేదోపచారార్థం యజ్ఞగుహ్యమితీర్యతే ॥

యజ్ఞములన్నిటిలో గుహ్యము అనగా రహస్యము, ఉత్కృష్టము అయినది జ్ఞాన యజ్ఞము. అది జ్ఞానయజ్ఞముకాని, ఫలాభిసంధిరహిత యజ్ఞము కాని అగును. అట్టి యజ్ఞగుహ్యమునకు పరమాత్మునితో అభేదమును ఆరోపించుటచే పరమాత్ముడే 'యజ్ఞగుహ్యమ్‍' అనబడుచున్నాడు.



फलाभिसन्धिरहितो यज्ञः श्री विष्णुरेव वा ।
ज्ञानयज्ञो हि यज्ञानां गुह्यं ब्रह्माच्युतं हरिः ॥
तदभेदोपचारार्थं यज्ञगुह्यमितीर्यते ॥

Phalābhisandhirahito yajñaḥ śrī viṣṇureva vā,
Jñānayajño hi yajñānāṃ guhyaṃ brahmācyutaṃ hariḥ.
Tadabhedopacārārthaṃ yajñaguhyamitīryate.

The secret of sacrifices is jñānayajña or the sacrifice performed without attachment to result. Brahman is considered as non different from it and is said to be Yajñaguhyam, thus.

यज्ञभृद्यज्ञकृद्यज्ञी यज्ञभुग्यज्ञसाधनः ।
यज्ञान्तकृद्यज्ञगुह्यमनमन्नाद एव च ॥ १०५ ॥

యజ్ఞభృద్యజ్ఞకృద్యజ్ఞీ యజ్ఞభుగ్యజ్ఞసాధనః ।
యజ్ఞాన్తకృద్యజ్ఞగుహ్యమనమన్నాద ఏవ చ ॥ 105 ॥

Yajñabhr̥dyajñakr̥dyajñī yajñabhugyajñasādhanaḥ,
Yajñāntakr̥dyajñaguhyamanamannāda eva ca ॥ 105 ॥

12 జులై, 2015

981. యజ్ఞాన్తకృత్, यज्ञान्तकृत्, Yajñāntakr̥t

ఓం యజ్ఞాన్తకృతే నమః | ॐ यज्ञान्तकृते नमः | OM Yajñāntakr̥te namaḥ


యజ్ఞస్యాన్తం ఫలప్రాప్తం కుర్వన్ యజ్ఞాన్తకృద్ధరిః ।
వైష్ణవర్క్ఛ్య ఫలప్రాప్తిం కుర్వన్ యజ్ఞాన్తకృద్ధరిః ॥
యజ్ఞం కృత్వా స యజ్ఞ సమాప్తిం విష్ణుః కరోతి సః ।
వేతి యజ్ఞాన్తకృద్విష్ణుః ప్రోచ్యతే విబుధోత్తమైః ॥

యజ్ఞమును యథావిధిగా అంతము అనగా పరిసమాప్తమునొందినచో, దానివలన కలుగునది ఫలమే కావున, యజ్ఞాంతము అనగా యజ్ఞ ఫలము అని ఇట శ్రీ భాష్యకారులచే అర్థము చెప్పబడినది. కనుక యజ్ఞమునకు సంబంధించిన అంతమును అనగా ఫలప్రాప్తిని కలిగించువాడు శ్రీ విష్ణువు. యజ్ఞములనాచరించుటచే కలుగు ఫలమును యజమానునకు ప్రాప్తమగునట్లు చేయు యజ్ఞఫలదాత శ్రీ విష్ణువే!

లేదా వైష్ణవ ఋక్ సంశమనము అనగా ఉచ్ఛారణము చేసి పూర్ణాహుతిని ఆచరించుటతో యజ్ఞమును ఏ కొరత లేని పూర్ణముగా చేసి యజ్ఞసమాప్తి చేయు యజమానుడును 'యజ్ఞాంతకృత్‍' అనబడుచున్నాడు. అట్టి ఆ యజమానుడును పరమాత్మునితో అభిన్నుడే!



यज्ञस्यान्तं फलप्राप्तं कुर्वन् यज्ञान्तकृद्धरिः ।
वैष्णवर्क्छ्य फलप्राप्तिं कुर्वन् यज्ञान्तकृद्धरिः ॥
यज्ञं कृत्वा स यज्ञ समाप्तिं विष्णुः करोति सः ।
वेति यज्ञान्तकृद्विष्णुः प्रोच्यते विबुधोत्तमैः ॥

Yajñasyāntaṃ phalaprāptaṃ kurvan yajñāntakr̥ddhariḥ,
Vaiṣṇavarkchya phalaprāptiṃ kurvan yajñāntakr̥ddhariḥ.
Yajñaṃ kr̥tvā sa yajña samāptiṃ viṣṇuḥ karoti saḥ,
Veti yajñāntakr̥dviṣṇuḥ procyate vibudhottamaiḥ.

The anta or conclusion of a Yajña leads to fruition in the form of its result. Thus Yajña anta means the final step of realizing fruits at the end of a Yajña; this elucidation is provided by Śrī Bhāṣyakāras. Since Lord Viṣṇu gives the fruit of vedic sacrifices at the end of their complete performance, He is called Yajñāntakr̥t.

Or by uttering the vaiṣṇava R̥k sound in the final oblation, the yajamāna i.e., performer of the vedic sacrifice, concludes the Yajña. The yajamāna, thus, is non different from paramātma Himself.

यज्ञभृद्यज्ञकृद्यज्ञी यज्ञभुग्यज्ञसाधनः ।
यज्ञान्तकृद्यज्ञगुह्यमनमन्नाद एव च ॥ १०५ ॥

యజ్ఞభృద్యజ్ఞకృద్యజ్ఞీ యజ్ఞభుగ్యజ్ఞసాధనః ।
యజ్ఞాన్తకృద్యజ్ఞగుహ్యమనమన్నాద ఏవ చ ॥ 105 ॥

Yajñabhr̥dyajñakr̥dyajñī yajñabhugyajñasādhanaḥ,
Yajñāntakr̥dyajñaguhyamanamannāda eva ca ॥ 105 ॥

11 జులై, 2015

980. యజ్ఞసాధనః, यज्ञसाधनः, Yajñasādhanaḥ

ఓం యజ్ఞసాధనాయ నమః | ॐ यज्ञसाधनाय नमः | OM Yajñasādhanāya namaḥ


తత్ప్రాప్తౌ సాధనం యజ్ఞా ఇత్యతో యజ్ఞసాధనః ఆ పరమాత్ముని పొందుట విషయమున చిత్తశుద్ధి ద్వారమున జ్ఞానమును కలిగించుటకు హేతువులగుచు యజ్ఞములు సాధనములుగా ఉన్నవి కనుక ఆ పరమాత్ముడు యజ్ఞసాధనః.



तत्प्राप्तौ साधनं यज्ञा इत्यतो यज्ञसाधनः / Tatprāptau sādhanaṃ yajñā ityato yajñasādhanaḥ Since Vedic sacrificial rituals, which are performed sincerely and thus lead to enlightenment, are the means to attain Him, He is called Yajñasādhanaḥ.

यज्ञभृद्यज्ञकृद्यज्ञी यज्ञभुग्यज्ञसाधनः
यज्ञान्तकृद्यज्ञगुह्यमनमन्नाद एव च ॥ १०५ ॥

యజ్ఞభృద్యజ్ఞకృద్యజ్ఞీ యజ్ఞభుగ్యజ్ఞసాధనః
యజ్ఞాన్తకృద్యజ్ఞగుహ్యమనమన్నాద ఏవ చ ॥ 105 ॥

Yajñabhr̥dyajñakr̥dyajñī yajñabhugyajñasādhanaḥ,
Yajñāntakr̥dyajñaguhyamanamannāda eva ca ॥ 105 ॥

10 జులై, 2015

979. యజ్ఞభుక్, यज्ञभुक्, Yajñabhuk

ఓం యజ్ఞభుజే నమః | ॐ यज्ञभुजे नमः | OM Yajñabhuje namaḥ


యజ్ఞం భుఙ్క్తే భునక్తీతి యజ్ఞభుగితీర్యతే యజ్ఞమును అనుభవించువాడును, యజ్ఞమును రక్షించువాడును కనుక యజ్ఞభుక్‌.



यज्ञं भुङ्क्ते भुनक्तीति यज्ञभुगितीर्यते / Yajñaṃ bhuṅkte bhunaktīti yajñabhugitīryate Since He enjoys the vedic sacrificial rituals and also protects it, He is called Yajñabhhuk.

यज्ञभृद्यज्ञकृद्यज्ञी यज्ञभुग्यज्ञसाधनः ।
यज्ञान्तकृद्यज्ञगुह्यमनमन्नाद एव च ॥ १०५ ॥

యజ్ఞభృద్యజ్ఞకృద్యజ్ఞీ యజ్ఞభుగ్యజ్ఞసాధనః ।
యజ్ఞాన్తకృద్యజ్ఞగుహ్యమనమన్నాద ఏవ చ ॥ 105 ॥

Yajñabhr̥dyajñakr̥dyajñī yajñabhugyajñasādhanaḥ,
Yajñāntakr̥dyajñaguhyamanamannāda eva ca ॥ 105 ॥

9 జులై, 2015

978. యజ్ఞీ, यज्ञी, Yajñī

ఓం యజ్ఞినే నమః | ॐ यज्ञिने नमः | OM Yajñine namaḥ


శ్రీ విష్ణురేవ యజ్ఞానాం తత్సమారాధనాత్మనామ్ ।
శేషీతి ఖలు యజ్ఞీతి ప్రోచ్యతే విబుధోత్తమైః ॥

యజ్ఞములు ఈతని సాత్తులుగానున్నవి. లెస్సయగు తన ఆరాధనమే రూపముగా కల యజ్ఞములకు పరమాత్ముడు శేషి. యజ్ఞమనబడు ఆరాధనకు శేషియైన పరమాత్ముడు యజ్ఞీ అనబడును.



श्री विष्णुरेव यज्ञानां तत्समाराधनात्मनाम् ।
शेषीति खलु यज्ञीति प्रोच्यते विबुधोत्तमैः ॥

Śrī Viṣṇureva yajñānāṃ tatsamārādhanātmanām,
Śeṣīti khalu yajñīti procyate vibudhottamaiḥ.

Yajñas i.e., vedic sacrificial rituals are to please Him. He is the whole of which the yajñas are parts.

यज्ञभृद्यज्ञकृद्यज्ञी यज्ञभुग्यज्ञसाधनः ।
यज्ञान्तकृद्यज्ञगुह्यमनमन्नाद एव च ॥ १०५ ॥

యజ్ఞభృద్యజ్ఞకృద్యజ్ఞీ యజ్ఞభుగ్యజ్ఞసాధనః ।
యజ్ఞాన్తకృద్యజ్ఞగుహ్యమనమన్నాద ఏవ చ ॥ 105 ॥

Yajñabhr̥dyajñakr̥dyajñī yajñabhugyajñasādhanaḥ,
Yajñāntakr̥dyajñaguhyamanamannāda eva ca ॥ 105 ॥

8 జులై, 2015

977. యజ్ఞకృత్, यज्ञकृत्, Yajñakr̥t

ఓం యజ్ఞకృతే నమః | ॐ यज्ञकृते नमः | OM Yajñakr̥te namaḥ


జగదాదౌ తదన్తేచ విష్ణుర్యజ్ఞం కరోత్యుత ।
కృతన్తీతి హరిర్యజ్ఞకృదితి ప్రోచ్యతే బుధైః ॥

జగత్తు ఆదియందు అనగా సృష్టియందును, జగత్ అంతమునందు అనగా ప్రళయమందున యజ్ఞమునాచరించును. ప్రళయకాలమున యజ్ఞమును ప్రవర్తిల్లకుండ చేయును.



जगदादौ तदन्तेच विष्णुर्यज्ञं करोत्युत ।
कृतन्तीति हरिर्यज्ञकृदिति प्रोच्यते बुधैः ॥

Jagadādau tadanteca viṣṇuryajñaṃ karotyuta,
Kr̥tantīti hariryajñakr̥diti procyate budhaiḥ.

At the beginning of the world and at the end of it, He performs yajña or destroys it; so Yajñakr̥t.

यज्ञभृद्यज्ञकृद्यज्ञी यज्ञभुग्यज्ञसाधनः ।
यज्ञान्तकृद्यज्ञगुह्यमनमन्नाद एव च ॥ १०५ ॥

యజ్ఞభృద్యజ్ఞకృద్యజ్ఞీ యజ్ఞభుగ్యజ్ఞసాధనః ।
యజ్ఞాన్తకృద్యజ్ఞగుహ్యమనమన్నాద ఏవ చ ॥ 105 ॥

Yajñabhr̥dyajñakr̥dyajñī yajñabhugyajñasādhanaḥ,
Yajñāntakr̥dyajñaguhyamanamannāda eva ca ॥ 105 ॥

7 జులై, 2015

976. యజ్ఞభృత్‍, यज्ञभृत्, Yajñabhr̥t

ఓం యజ్ఞభృతే నమః | ॐ यज्ञभृते नमः | OM Yajñabhr̥te namaḥ


యజ్ఞం భిభర్తి పాతీతి వా యజ్ఞభృదితీర్యతే యజ్ఞమును ధారణ చేయువాడు అనగా నిలిపి, రక్షించువాడు యజ్ఞభృత్‍.

:: శ్రీమద్రామాయణే బాలకాణ్డే త్రింశస్సర్గః ::
స హత్వా రాక్షసాన్ యజ్ఞఘ్నాన్ రఘునన్దనః ।
ఋషిభిః పూజిత స్తత్ర యథేన్ద్రో విజయే పురా ॥ 24 ॥

ఆ రఘునందనుడు (విశ్వామిత్రునిచే చేయబడిన) యజ్ఞమునకు విఘ్నములొనరించు రాక్షసులందరిని హతమార్చెను. పూర్వము రాక్షసులను జయించిన ఇంద్రునివలె శ్రీరాముడు మునీశ్వరులచే పూజలందుకొనెను.



यज्ञं भिभर्ति पातीति वा यज्ञभृदितीर्यते / Yajñaṃ bhibharti pātīti vā yajñabhr̥ditīryate He who supports and protects the yajña or vedic sacrificial ritual is Yajñābhr̥t.

:: श्रीमद्रामायणे बालकाण्डे त्रिंशस्सर्गः ::
स हत्वा राक्षसान् यज्ञघ्नान् रघुनन्दनः ।
ऋषिभिः पूजित स्तत्र यथेन्द्रो विजये पुरा ॥ २४ ॥

Śrīmad Rāmāyaṇa - Book 1, Chapter 31
Sa hatvā rākṣasān yajñaghnān raghunandanaḥ,
R̥ṣibhiḥ pūjita statra yathendro vijaye purā. 24.

When Rāma, the delight of Raghu's dynasty, eliminated all of the demons who were hindering Vedic rituals (performed by Viśvāmitra), the sages in the hermitage idealized him as Indra was idealized once, when he became victories on demons.

यज्ञभृद्यज्ञकृद्यज्ञी यज्ञभुग्यज्ञसाधनः ।
यज्ञान्तकृद्यज्ञगुह्यमनमन्नाद एव च ॥ १०५ ॥

యజ్ఞభృద్యజ్ఞకృద్యజ్ఞీ యజ్ఞభుగ్యజ్ఞసాధనః ।
యజ్ఞాన్తకృద్యజ్ఞగుహ్యమనమన్నాద ఏవ చ ॥ 105 ॥

Yajñabhr̥dyajñakr̥dyajñī yajñabhugyajñasādhanaḥ,
Yajñāntakr̥dyajñaguhyamanamannāda eva ca ॥ 105 ॥

6 జులై, 2015

975. యజ్ఞవాహనః, यज्ञवाहनः, Yajñavāhanaḥ

ఓం యజ్ఞవాహనాయ నమః | ॐ यज्ञवाहनाय नमः | OM Yajñavāhanāya namaḥ


యజ్ఞాన్ ఫలహేతు భూతాన్ యో వాహయతి కేశవః ।
స యజ్ఞవాహన ఇతి ప్రోచ్యతే విబుధోత్తమైః ॥

ఫలమునకు హేతుభూతములగు యజ్ఞములను ప్రవర్తిల్లజేయును కనుక కేశవునికి యజ్ఞవాహనః అను నామము కలదు.



यज्ञान् फलहेतु भूतान् यो वाहयति केशवः ।
स यज्ञवाहन इति प्रोच्यते विबुधोत्तमैः ॥

Yajñān phalahetu bhūtān yo vāhayati keśavaḥ,
Sa yajñavāhana iti procyate vibudhottamaiḥ.

He directs the performance of the yajñas or vedic sacrificial rituals which are fruitful; hence He is Yajñavāhanaḥ.

भूर्भुवस्स्वस्तरुस्तारस्सविता प्रपितामहः ।
यज्ञो यज्ञपतिर्यज्वायज्ञाङ्गोयज्ञवाहनः ॥ १०४ ॥

భూర్భువస్స్వస్తరుస్తారస్సవితా ప్రపితామహః ।
యజ్ఞో యజ్ఞపతిర్యజ్వాయజ్ఞాఙ్గోయజ్ఞవాహనః ॥ 104 ॥

Bhūrbhuvassvastarustārassavitā prapitāmahaḥ,
Yajño yajñapatiryajvāyajñāṅgoyajñavāhanaḥ ॥ 104 ॥

5 జులై, 2015

974. యజ్ఞాఙ్గః, यज्ञाङ्गः, Yajñāṅgaḥ

ఓం యజ్ఞాఙ్గాయ నమః | ॐ यज्ञाङ्गाय नमः | OM Yajñāṅgāya namaḥ


యజ్ఞా అఙ్గాని యస్య స వారాహం వపురాస్థితః ।
శ్రీవిష్ణుర్యజ్ఞాఙ్గ ఇతి కీర్త్యతే విబుధోత్తమైః ॥

యజ్ఞములు ఈతని అంగములుగానున్నవి. ఆట్టివాడగు యజ్ఞవరాహమూర్తి యగు విష్ణుపరమాత్ముడు యజ్ఞాంగః.

:: పోతన భాగవతము తృతీయ స్కంధము ::
వ.అని వెండియు నిట్లు స్తుతియించిరి. (424)
సీ.త్వక్కున నఖిల వేదములు, రోమంబుల యందును బర్హిస్సు, లక్షులందు

వాజ్యంబు, పాదంబులందుఁ జాతుర్హోత్ర కలితంబులగు యజ్ఞకర్మములును,

స్రుక్కు తుండంబున, స్రువము నాసికను, నిడాపాత్ర ముదరకోటరమునందు,

శ్రవణాస్యబిలములఁ జమసప్రాశిత్రముల్‍, గళమున నిష్టిత్రికంబు, జిహ్వఁ
తే.దగుఁ బ్రవర్గ్యము, నగ్నిహోత్రమును నీదు, చర్వణంబును, సభ్యావసథ్యు లుత్త

మాంగ మసువులు చయనము లగుఁ గిటీశ! యనుచు నుతియించి రత్తఱి యజ్ఞవిబుని. (425)
వ.వెండియు ముహుర్ముహు ర్భగవదావిర్భావంబు దీక్షణీయేష్టి యగు. నీదు దంష్ట్రలు ప్రాయణీయంబను దీక్షా నంరేష్టియు, నుదనీయం బను సమాప్తేష్టియు, యుష్మద్రేతంబు సోమంబును, ద్వదీయావస్థానంబు పాత్ర స్సవనాదులు, నీదు త్వఙ్మాంసాది సప్తధాతువు లగ్నిష్టోమోక్థ్యషోడశీ వాజపేయాతిరాత్రాప్తోర్యామంబు లను సంస్థా భేదంబులును ద్వాదశాదిరూపంబులైన బహు యాగ సంఘాతరూపంబులు నగు; సర్వ సత్త్రంబులు భవదీయశరీర సంధులు; ససోమాసోమంబులగు యజ్ఞక్రతువులు నీవ; మఱియును యజనబంధనంబులచే నొప్పుచుందు వద్యునుం గాక. (426)
క.హవరూపివి! హవనేతవు! హవభోక్తవు! నిఖిలహన ఫలాధారుండవున్‍!

హవరక్షకుఁడవు నగు నీ కవితథముగ నుతు లొనర్తుమయ్య ముకుందా! (427)

అని ఇంకను ఈ విధముగ దేవతలు దేవాది దేవుడిని స్తుతియించినారు. "ఓ స్వామీ! నీ చర్మము నుండి సమస్త వేదములును జనియించెను. నీ రోమకూపములనుండి అగ్నులు ఆవిర్భవించెను. నీ కనులనుండి హోమద్రవ్యమయిన నెయ్యి, నీ నాలుగు పాదములనుండి నాలుగు హోత్రములతో కూడిన యజ్ఞ కర్మలును, ముట్టె నుండి స్రుక్కు, ముక్కు నుండి స్రువము, ఉదరమునుండి ఇడా పాత్రము, చెవులనుండి చమసము, ముఖమునుండి ప్రాశ్రితము అను పాత్రలు, కంఠమునుండి ఇష్టులు అనెడి మూడు యజ్ఞములు, నాలుకనుండియు ప్రవర్గ్యము అను యజ్ఞములు ఉద్భవించెను. నీ చర్వణమే అగ్నిహోత్రము. సభ్యము అనగ హోమరహిత అగ్ని, అవసథ్యము అనగా ఔపోసనాగ్ని - నీ శిరస్సు నుండి జనియించెను. చయనములు నీ ప్రాణ స్వరూపములు. నీవు యజ్ఞాధినాథుడవు! యజ్ఞవరాహమూర్తివి!

"ఇంతియేకాక, భవంతుడయిన నీవు పలుమారులు ఆవిర్భవించడము 'దీక్షణియము' అనెడి యజ్ఞము. 'ప్రాణనీయము' అనెడి దిక్షానంతర ఇష్టి, 'ఉదయనీయము' అనెడి సమాప్తేష్టి నీ కోరలు. సోమరసము నీ రేతస్సు. నీ ఉనికియే ప్రాతః కాలము, మధ్యాహ్నము, సాయం సమయము - అనెడి మూడు యజ్ఞాంశములు. నీ చర్మము, మాంసము మొదలైన సప్త ధాతువులు, అగ్నిష్టోమము, ఉక్థ్యము, షోడశి, వాజపేయము, అతిరాత్రము, ఆప్తోర్యామము, ద్వాదశాహము మొదలైన యజ్ఞభేదములు. సమస్త యజ్ఞములును నీ శరీర సంధులు. సోమరసముతో కూడినవీ, కూడనివి అయిన క్రతువులన్నియును నీవే. నీవే యజ్ఞ బంధములతో అలరారుతు ఉంటావు.

"అంతియేగాక నీవు యజ్ఞస్వరూపుడివి, యజ్ఞకర్తవు, యజ్ఞభోక్తవు, యజ్ఞ ఫల ప్రదాతవు, యజ్ఞ రక్షకుడవీవు. సమస్తము నీవే ఓ ముకుందా! నీకు మా హృదయపూర్వకమయిన అభివాదములు."



यज्ञा अङ्गानि यस्य स वाराहं वपुरास्थितः ।
श्रीविष्णुर्यज्ञाङ्ग इति कीर्त्यते विबुधोत्तमैः ॥

Yajñā aṅgāni yasya sa vārāhaṃ vapurāsthitaḥ,
Śrīviṣṇuryajñāṅga iti kīrtyate vibudhottamaiḥ.

Vedic sacrifices are His limbs in His incarnation as Varāha and hence He is Yajñāṅgaḥ.

:: श्रीमद्भागवते तृतीयस्कन्धे त्रयोदशोऽध्यायः ::
ऋषय ऊचुः
जितं जितं तेऽजित यघ्यभावन त्रयीं तनु स्वां परिधुन्वते नमः ।
यद्रोमगर्तेषु निलिल्युरद्धयस्तस्मै नमः कारणसूकराय ते ॥ ३४ ॥
रूपं तवितन्ननु दुष्कृतात्मनां दुर्दर्शनं देव यदध्वरात्मकम् ।
छन्दांसि यस्य त्वचि बर्हिरोमस्वाज्यं दृशि त्वङ्घ्रिशु चातुर्होत्रम् ॥ ३५ ॥
स्रक्तुण्ड आसीत्स्‌रुव ईश नासयोरिडोदरे चमसाः कर्णरन्ध्रे ।
प्राशित्रमस्ये ग्रसने ग्रहास्तु ते यच्चर्वणां ते भगवन्नग्निहोत्रम् ॥ ३६ ॥
दिक्शानुजन्मोपसदः शिरोधरं त्वं प्रायणियोदयनीयदंष्ट्रः ।
जिह्वा प्रवर्ग्यस्तव शिर्षकं क्रतोः सत्यावसथ्यं चितयोऽसवो हि ते ॥ ३७ ॥
सोमस्तु रेतः सवनान्यवस्थितिः संस्थाविभेदास्तव देव धातवः ।
सत्राणि सर्वाणि शरीरसन्धिस्त्वं सर्वयज्ञक्रतुरिष्टिबन्धनः ॥ ३८ ॥
नमो नमस्तेऽखिलमन्त्रदेवता द्रव्याय सर्वक्रतवे क्रियात्मने ।
वैराग्यभक्त्यात्मजयानुभावित ज्ञानाय विद्यागुरवे नमो नमः ॥ ३९ ॥

Śrīmad Bhāgavata - Canto 3, Chapter 13
R̥ṣaya ūcuḥ
Jitaṃ jitaṃ te’jita yaghyabhāvana trayīṃ tanu svāṃ paridhunvate namaḥ,
Yadromagarteṣu nililyuraddhayastasmai namaḥ kāraṇasūkarāya te. 34.
Rūpaṃ tavitannanu duṣkr̥tātmanāṃ durdarśanaṃ deva yadadhvarātmakam,
Chandāṃsi yasya tvaci barhiromasvājyaṃ dr̥śi tvaṃghriśu cāturhotram. 35.
Sraktuṇḍa āsītsˈruva īśa nāsayoriḍodare camasāḥ karṇaraṃdhre,
Prāśitramasye grasane grahāstu te yaccarvaṇāṃ te bhagavannagnihotram. 36.
Dikśānujanmopasadaḥ śirodharaṃ tvaṃ prāyaṇiyodayanīyadaṃṣṭraḥ,
Jihvā pravargyastava śirṣakaṃ kratoḥ satyāvasathyaṃ citayo’savo hi te. 37.
Somastu retaḥ savanānyavasthitiḥ saṃsthāvibhedāstava deva dhātavaḥ,
Satrāṇi sarvāṇi śarīrasandhistvaṃ sarvayajñakraturiṣṭibandhanaḥ. 38.
Namo namaste’khilamantradevatā dravyāya sarvakratave kriyātmane,
Vairāgyabhaktyātmajayānubhāvita jñānāya vidyāgurave namo namaḥ. 39.

All the sages uttered with great respect: 

O unconquerable enjoyer of all sacrifices, all glories and all victories unto You! You are moving in Your form of the personified Vedas, and in the spores of Your body the oceans are submerged. To uplift the earth You have now assumed the form of a boar.

O Lord! Your form is worshipable by performances of sacrifice, but souls who are simply miscreants are unable to see it. All the Vedic hymns, Gāyatri and others, are in the touch of Your skin. In Your bodily hairs is the kuśa grass, in Your eyes is the clarified butter, and in Your four legs are the four kinds of fruitive activities.

O Lord! Your tongue is a plate of sacrifice, Your nostril is another plate of sacrifice, in Your belly is the eating plate of sacrifice, and another plate of sacrifice is the holes of Your ears. In Your mouth is the Brahma plate of sacrifice, Your throat is the plate of sacrifice known as soma, and whatever You chew is known as agnihotra.

Moreover, O Lord! The repetition of Your appearance is the desire for all kinds of initiation. Your neck is the place for three desires, and Your tusks are the result of initiation and the end of all desires. Your tongue is the prior activities of initiation, Your head is the fire without sacrifice as well as the fire of worship, and Your living forces are the aggregate of all desires.

O Lord! Your semen is the sacrifice called soma yajña. Your growth is the ritualistic performances of the morning. Your skin and touch sensations are the seven elements of the agniṣṭoma sacrifice. Your bodily joints are symbols of various other sacrifices performed in twelve days. Therefore You are the object of all sacrifices called soma and asoma, and You are bound by yajñas only.

O Lord! You are the Supreme God and are worshipable by universal prayers, Vedic hymns and sacrificial ingredients. We offer our obeisances unto You. You can be realized by the pure mind freed from all visible and invisible material contamination. We offer our respectful obeisances to You as the supreme spiritual master of knowledge in devotional service.

भूर्भुवस्स्वस्तरुस्तारस्सविता प्रपितामहः ।
यज्ञो यज्ञपतिर्यज्वायज्ञाङ्गोयज्ञवाहनः ॥ १०४ ॥

భూర్భువస్స్వస్తరుస్తారస్సవితా ప్రపితామహః ।
యజ్ఞో యజ్ఞపతిర్యజ్వాయజ్ఞాఙ్గోయజ్ఞవాహనః ॥ 104 ॥

Bhūrbhuvassvastarustārassavitā prapitāmahaḥ,
Yajño yajñapatiryajvāyajñāṅgoyajñavāhanaḥ ॥ 104 ॥

4 జులై, 2015

973. యజ్వా, यज्वा, Yajvā

ఓం యజ్వనే నమః | ॐ यज्वने नमः | OM Yajvane namaḥ


యజమానాత్మనా తిష్ఠన్ యజ్వేతి ప్రోచ్యతే హరిః యజమాని అనగా యజనము చేయువాడు. యజ్ఞమునాచరించు యజమానుని రూపమున పరమాత్ముడేయున్నాడు.



यजमानात्मना तिष्ठन् यज्वेति प्रोच्यते हरिः / Yajamānātmanā tiṣṭhan yajveti procyate hariḥ Yajamāna i.e., the one who performs Yajanam - vedic sacrificial ritual. The Yajamāna of a vedic sacrifice is verily the Paramātma Himself.

भूर्भुवस्स्वस्तरुस्तारस्सविता प्रपितामहः ।
यज्ञो यज्ञपतिर्यज्वायज्ञाङ्गोयज्ञवाहनः ॥ १०४ ॥

భూర్భువస్స్వస్తరుస్తారస్సవితా ప్రపితామహః ।
యజ్ఞో యజ్ఞపతిర్యజ్వాయజ్ఞాఙ్గోయజ్ఞవాహనః ॥ 104 ॥

Bhūrbhuvassvastarustārassavitā prapitāmahaḥ,
Yajño yajñapatiryajvāyajñāṅgoyajñavāhanaḥ ॥ 104 ॥

3 జులై, 2015

972. యజ్ఞపతిః, यज्ञपतिः, Yajñapatiḥ

ఓం యజ్ఞపతయే నమః | ॐ यज्ञपतये नमः | OM Yajñapataye namaḥ


యజ్ఞానాం రక్షకః స్వామీ వా యజ్ఞపతిరుచ్యతే యజ్ఞములను, యజ్ఞములలో సమర్పించు హవిస్సులను రక్షించువాడు. యజ్ఞమునకు ప్రభువు.

:: శ్రీమద్భగవద్గీత - రాజవిద్యా రాజగుహ్య యోగము ::
అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ ।
న తు మామభిజానన్తి తత్త్వేనాతశ్చ్యవన్తి తే ॥ 24 ॥

సమస్త యజ్ఞములకు భోక్తను, ప్రభువును నేనే అయియున్నాను. అట్టి నన్ను - వారు యథార్థముగ తెలిసికొనుటలేదు. ఇందువలన జారిపోవుచు పునర్జన్మను పొందుచున్నారు.



यज्ञानां रक्षकः स्वामी वा यज्ञपतिरुच्यते / Yajñānāṃ rakṣakaḥ svāmī vā yajñapatirucyate The protector of Yajña - vedic sacrificial rituals and of the sacrifice or the Lord of it.

:: श्रीमद्भगवद्गीत - राजविद्या राजगुह्य योग ::
अहं हि सर्वयज्ञानां भोक्ता च प्रभुरेव च ।
न तु मामभिजानन्ति तत्त्वेनातश्च्यवन्ति ते ॥ २४ ॥

Śrīmad Bhagavad Gīta - Chapter 9
Ahaṃ hi sarvayajñānāṃ bhoktā ca prabhureva ca,
Na tu māmabhijānanti tattvenātaścyavanti te. 24.

I indeed am the enjoyer as also the Lord of all sacrifices; but they do not know Me in reality. Therefore they fall.

भूर्भुवस्स्वस्तरुस्तारस्सविता प्रपितामहः ।
यज्ञो यज्ञपतिर्यज्वायज्ञाङ्गोयज्ञवाहनः ॥ १०४ ॥

భూర్భువస్స్వస్తరుస్తారస్సవితా ప్రపితామహః ।
యజ్ఞో యజ్ఞపతిర్యజ్వాయజ్ఞాఙ్గోయజ్ఞవాహనః ॥ 104 ॥

Bhūrbhuvassvastarustārassavitā prapitāmahaḥ,
Yajño yajñapatiryajvāyajñāṅgoyajñavāhanaḥ ॥ 104 ॥

2 జులై, 2015

971. యజ్ఞః, यज्ञः, Yajñaḥ

ఓం యజ్ఞాయ నమః | ॐ यज्ञाय नमः | OM Yajñāya namaḥ


సఙ్గన్తా యజ్ఞః వాని వాని యజ్ఞ ఫలములను యజ్ఞములతో కలుపువాడు అనగా యజ్ఞములకు తగిన ఫలములను ప్రసాదించువాడు కనుక విష్ణువు యజ్ఞః. లేదా యజ్ఞనామా హరిః యాజ్ఞోవైవిష్ణురితి మన్త్రతః యాజ్ఞ రూపమున ఉండు పరమాత్ముడు యజ్ఞః. వేదోపనిషత్తులలో చెప్పబడిన "యజ్ఞో వై విష్ణుః" - "యజ్ఞమే విష్ణువు, విష్ణుడే యజ్ఞము" అను మంత్రము ఇట ప్రమాణము.

445. యజ్ఞః, यज्ञः, Yajñaḥ



सङ्गन्ता यज्ञः / Saṅgantā yajñaḥ He who unites yajñas with their results is Yajñaḥ. Or यज्ञनामा हरिः याज्ञोवैविष्णुरिति मन्त्रतः / Yajñanāmā hariḥ yājñovaiviṣṇuriti mantrataḥ Lord Hari's name is synonymous with yajñas - the vedic sacrifices vide the mantra "यज्ञो वै विष्णुः / Yajño vai Viṣṇuḥ" (Vedas and various Upanishads) - Viṣṇu is yajña and yajña is Viṣṇu.

445. యజ్ఞః, यज्ञः, Yajñaḥ

भूर्भुवस्स्वस्तरुस्तारस्सविता प्रपितामहः ।
यज्ञो यज्ञपतिर्यज्वायज्ञाङ्गोयज्ञवाहनः ॥ १०४ ॥

భూర్భువస్స్వస్తరుస్తారస్సవితా ప్రపితామహః ।
యజ్ఞో యజ్ఞపతిర్యజ్వాయజ్ఞాఙ్గోయజ్ఞవాహనః ॥ 104 ॥

Bhūrbhuvassvastarustārassavitā prapitāmahaḥ,
Yajño yajñapatiryajvāyajñāṅgoyajñavāhanaḥ ॥ 104 ॥

1 జులై, 2015

970. ప్రపితామహః, प्रपितामहः, Prapitāmahaḥ

ఓం ప్రపితామహాయ నమః | ॐ प्रपितामहाय नमः | OM Prapitāmahāya namaḥ


పితామహస్యే విరిఞ్చేః పితేతి ప్రపితామహః పితామహుడు అనబడు బ్రహ్మకును తండ్రి కావున తాతకు తండ్రి అయిన ప్రపితామహుడు.



पितामहस्ये विरिञ्चेः पितेति प्रपितामहः / Pitāmahasye viriñceḥ piteti prapitāmahaḥ Since He is the father Brahma who himself is known as pitāmaha i.e., grand father, He is called Prapitāmahaḥ.

भूर्भुवस्स्वस्तरुस्तारस्सविता प्रपितामहः
यज्ञो यज्ञपतिर्यज्वायज्ञाङ्गोयज्ञवाहनः ॥ १०४ ॥

భూర్భువస్స్వస్తరుస్తారస్సవితా ప్రపితామహః
యజ్ఞో యజ్ఞపతిర్యజ్వాయజ్ఞాఙ్గోయజ్ఞవాహనః ॥ 104 ॥

Bhūrbhuvassvastarustārassavitā prapitāmahaḥ,
Yajño yajñapatiryajvāyajñāṅgoyajñavāhanaḥ ॥ 104 ॥

30 జూన్, 2015

969. సవితా, सविता, Savitā

ఓం సవిత్రే నమః | ॐ सवित्रे नमः | OM Savitre namaḥ


సర్వలోకస్య జనకః సవితేత్యుచ్యతే హరిః తండ్రిగా సర్వలోకమును జనింపజేయు సర్వలోకైక జనకుడుగాన ఆ హరి సవితా అని చెప్పబడును.

:: శ్రీమద్రామాయణే యుద్ధకాణ్డే సప్తోత్తరశతతమస్సర్గః (ఆదిత్య హృదయ స్తోత్రమ్) ::
ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ ।
సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః ॥ 10 ॥

ఇతడు అదితి పుత్రుడు (ఆదిత్యః) జగత్సృష్టికి కారకుడు (సవితా) జనులు తమ తమ విధులను నిర్వర్తించుటకు ప్రేరణను ఇచ్చువాడు (సూర్యః) లోకోపకారము కొరకు ఆకాశమున సంచరించుచుండెడివాడు (ఖగః) వర్షముల ద్వారమున జగత్తును పోషించెడివాడు (పూషా) తన కిరణములచే లోకములను ప్రకాశింపజేయువాడు (గభస్తిమాన్‍) బంగారు వన్నెతో తేజరిల్లుచుండువాడు (సువర్ణసదృశః) అద్భుతముగా ప్రకాశించుచుండువాడు (భానుః) బ్రహ్మాండముల ఉత్పత్తికి బీజమైనవాడు (హిరణ్యరేతాః) చీకట్లను తొలగించుచు దివాసమయమున ప్రాణులను కార్యనిమగ్నులను కావించువాడు (దివాకరః).



सर्वलोकस्य जनकः सवितेत्युच्यते हरिः / Sarvalokasya janakaḥ savitetyucyate Hariḥ Since Lord Hari is the progenitor of all worlds, He is called Savitā.

:: श्रीमद्रामायणे युद्धकाण्डे सप्तोत्तरशततमस्सर्गः (आदित्य हृदय स्तोत्रम्) ::
आदित्यः सविता सूर्यः खगः पूषा गभस्तिमान् ।
सुवर्णसदृशो भानुः हिरण्यरेता दिवाकरः ॥ १० ॥

Śrīmad Rāmāyaṇa Book 6, Chapter 107 (Āditya Hr̥daya Stotra)
Ādityaḥ savitā sūryaḥ khagaḥ pūṣā gabhastimān,
Suvarṇasadr̥śo bhānuḥ hiraṇyaretā divākaraḥ. 10.

An off-spring of Aditi (आदित्यः/Ādityaḥ), the Progenitor of all (सविता/Savitā), Surya the sun-god and the Provocator of acts in people (सूर्यः/Sūryaḥ), the Courser in the sky (खगः/Khagaḥ), the Nourisher of all with rain (पूषा/Pūṣā), the One who illuminates the worlds (गभस्तिमान्/Gabhastimān), the Possessor of golden rays (सुवर्णसदृशः/Suvarṇasadr̥śaḥ), the Brilliant (भानुः/Bhānuḥ), having golden seed whose energy constitutes the seed of the universe  (हिरण्यरेताः/Hiraṇyaretāḥ) and the Maker of the day (दिवाकरः/Divākaraḥ).

भूर्भुवस्स्वस्तरुस्तारस्सविता प्रपितामहः ।
यज्ञो यज्ञपतिर्यज्वायज्ञाङ्गोयज्ञवाहनः ॥ १०४ ॥

భూర్భువస్స్వస్తరుస్తారస్సవితా ప్రపితామహః ।
యజ్ఞో యజ్ఞపతిర్యజ్వాయజ్ఞాఙ్గోయజ్ఞవాహనః ॥ 104 ॥

Bhūrbhuvassvastarustārassavitā prapitāmahaḥ,
Yajño yajñapatiryajvāyajñāṅgoyajñavāhanaḥ ॥ 104 ॥

29 జూన్, 2015

968. తారః, तारः, Tāraḥ

ఓం తారాయ నమః | ॐ ताराय नमः | OM Tārāya namaḥ


సంసారసాగరం విష్ణుస్తారయన్ తార ఉచ్యతే ।
ప్రణవప్రతిపాద్యత్వాద్ వా తార ఇతి కీర్త్యతే ॥

తన అనుగ్రహముతో జీవులను సంసార సాగరమునుండి దాటించును. లేదా తారః అనునది ప్రణవమునకు మరియొకపేరు. పరమాత్మ ప్రణవ రూపుడును, ప్రణవముచే చెప్పబడువాడును కనుక తారః అని చెప్పబడును.

338. తారః, तारः, Tāraḥ



संसारसागरं विष्णुस्तारयन् तार उच्यते ।
प्रणवप्रतिपाद्यत्वाद् वा तार इति कीर्त्यते ॥

Saṃsārasāgaraṃ viṣṇustārayan tāra ucyate,
Praṇavapratipādyatvād vā tāra iti kīrtyate.

By His grace He helps devotees cross the ocean of worldly existence. Or Tāraḥ also means Praṇava i.e., Oṃkāra. Since the Lord is Praṇava Himself and is also indicated by it, Tāraḥ is an apt name.

338. తారః, तारः, Tāraḥ

भूर्भुवस्स्वस्तरुस्तारस्सविता प्रपितामहः ।
यज्ञो यज्ञपतिर्यज्वायज्ञाङ्गोयज्ञवाहनः ॥ १०४ ॥

భూర్భువస్స్వస్తరుస్తారస్సవితా ప్రపితామహః ।
యజ్ఞో యజ్ఞపతిర్యజ్వాయజ్ఞాఙ్గోయజ్ఞవాహనః ॥ 104 ॥

Bhūrbhuvassvastarustārassavitā prapitāmahaḥ,
Yajño yajñapatiryajvāyajñāṅgoyajñavāhanaḥ ॥ 104 ॥

28 జూన్, 2015

967. భూర్భువఃస్వస్తరుః, भूर्भुवःस्वस्तरुः, Bhūrbhuvaḥsvastaruḥ

ఓం భుర్భువః స్వస్తరవే నమః | ॐ भुर्भुवः स्वस्तरवे नमः | OM Bhurbhuvaḥ svastarave namaḥ


భూర్భువస్వస్సమాఖ్యాని త్రయీసారాణి యాని చ ।
త్రిణి వ్యాహృతిరూపాణి శుక్రాణ్యాహుర్హి బాహ్యృచాః ॥
యత్రైర్హోమాదినా విష్ణుస్తరై ప్లవతేఽథవా ।
జగత్రయతి తద్భూర్భువస్వస్తరురుచ్యతే ॥
భూర్భువస్వర్నామ లోకత్రయ సంసారభూరుహః ।
భూర్భువస్వస్తరురితి ప్రోచ్యతే కేశవో బుధైః ॥
భూర్భువస్వరాఖ్యలోకత్రయమేతద్ధి వృక్షవత్ ।
వ్యాప్య విష్ణుస్తిష్ఠతీతి భూర్భువస్వస్తరుః స్మృతః ॥

'భూః,' 'భువః,' 'స్వహః' అను మూడు వ్యాహృతుల రూపముగలవియు, వేదత్రయ సారభూతములును అగు పవిత్ర బీజ భూత శబ్ద రూప తత్త్వములైన శుక్రములను అధ్యయమున చెప్పుచున్నారు. ఆ మూడు వ్యాహృతుల చేతను జగత్ త్రయము హోమాదికములను ఆచరించుచు సంసార సాగరమున మునుగక ఈద కలుగుచున్నది. ఆవలి వొడ్డును చేరుచున్నది. ఆ మూడు వ్యాహృతులకును, వాని అర్థములకును కూడ మూల భూత తత్త్వము కావున పరమాత్మునకు 'భూర్భువఃస్వస్తరుః' అను నామము సముచితమై ఉన్నది.

:: మనుస్మృతి తృతీయోఽధ్యాయః ::
అగ్నౌ ప్రాస్తాఽఽహుతిః సమ్య గాదిత్య ముపతిష్ఠతే ।
ఆదిత్యా సృష్టిర్ వృష్టే రన్నం తతః ప్రజాః ॥ 76 ॥

అగ్నియందు విధివిధానుసారముగ ప్రక్షిప్తమయిన ఆహుతి ఆదిత్యుని సన్నిధిని చేరియుండును. అట్లు ఆహుతిని గ్రహించిన సూర్యుని వలన వర్షము కురియుచున్నది. వర్షము వలన అన్నము ఉత్పన్నమగుచున్నది. అన్నము వలన ప్రజలు, ప్రాణులు ఉత్పత్తినొందుచు వృద్ధినందుచు ఉన్నారు.

లేదా 'భూర్భువః' అను లోకత్రయ రూపమగునది సంసార వృక్షము. అదియు వస్తు తత్త్వమున పరమాత్మునియందు ఆరోపితమగుటచే పరమాత్ముని కంటె వేరు కాదు.

లేదా 'భూర్భువః స్వః' అను లోకత్రయమును వృక్షమువలె వ్యాపించియున్నవాడు పరమాత్ముడు అని కూడ చెప్పవచ్చును.



भूर्भुवस्वस्समाख्यानि त्रयीसाराणि यानि च ।
त्रिणि व्याहृतिरूपाणि शुक्राण्याहुर्हि बाह्यृचाः ॥
यत्रैर्होमादिना विष्णुस्तरै प्लवतेऽथवा ।
जगत्रयति तद्भूर्भुवस्वस्तरुरुच्यते ॥
भूर्भुवस्वर्नाम लोकत्रय संसारभूरुहः ।
भूर्भुवस्वस्तरुरिति प्रोच्यते केशवो बुधैः ॥
भूर्भुवस्वराख्यलोकत्रयमेतद्धि वृक्षवत् ।
व्याप्य विष्णुस्तिष्ठतीति भूर्भुवस्वस्तरुः स्मृतः ॥

Bhūrbhuvasvassamākhyāni trayīsārāṇi yāni ca,
Triṇi vyāhr̥tirūpāṇi śukrāṇyāhurhi bāhyr̥cāḥ.
Yatrairhomādinā Viṣṇustarai plavate’thavā,
Jagatrayati tadbhūrbhuvasvastarurucyate.
Bhūrbhuvasvarnāma lokatraya saṃsārabhūruhaḥ,
Bhūrbhuvasvastaruriti procyate keśavo budhaiḥ.
Bhūrbhuvasvarākhyalokatrayametaddhi vr̥kṣavat,
Vyāpya viṣṇustiṣṭhatīti bhūrbhuvasvastaruḥ smr̥taḥ.

'Bhūḥ,' 'Bhuvaḥ' and 'Svahaḥ' are known as the three vyāhr̥tis i.e., three potent sounds. They are pure and the essence of the Vedas. By means of these three and the oblations in the sacrificial fires, one crosses the three worlds. Since paramātma is the root essence of these three vyāhr̥ti, He is aptly addressed as Bhūrbhuvaḥsvastaruḥ.

:: मनुस्मृति तृतीयोऽध्यायः ::
अग्नौ प्रास्ताऽऽहुतिः सम्य गादित्य मुपतिष्ठते ।
आदित्या सृष्टिर् वृष्टे रन्नं ततः प्रजाः ॥ ७६ ॥

Manusmr̥ti Chapter 3
Agnau prāstā’’hutiḥ samya gāditya mupatiṣṭhate,
Ādityā sr̥ṣṭir vr̥ṣṭe rannaṃ tataḥ prajāḥ. 76.

The oblation devoutly made into the sacrificial fire reaches the sun, from the sun arises rain; from the rain - food and from food all beings are born and sustained.

Or 'Bhūrbhuvaḥ' is indicative of the threefold samsāra vr̥ķa i.e., tree indicative of the three worlds. Since it verily is attributable to the paramātma, it cannot be thought of being separate from Him.

Or since He envelops the three worlds indicated by 'Bhūrbhuvaḥ svaḥ,' He is Bhūrbhuvaḥsvastaruḥ.
 
भूर्भुवस्स्वस्तरुस्तारस्सविता प्रपितामहः ।
यज्ञो यज्ञपतिर्यज्वायज्ञाङ्गोयज्ञवाहनः ॥ १०४ ॥

భూర్భువస్స్వస్తరుస్తారస్సవితా ప్రపితామహః ।
యజ్ఞో యజ్ఞపతిర్యజ్వాయజ్ఞాఙ్గోయజ్ఞవాహనః ॥ 104 ॥

Bhūrbhuvassvastarustārassavitā prapitāmahaḥ,
Yajño yajñapatiryajvāyajñāṅgoyajñavāhanaḥ ॥ 104 ॥