10 జులై, 2013

249. విశిష్టః, विशिष्टः, Viśiṣṭaḥ

ఓం విశిష్టాయ నమః | ॐ विशिष्टाय नमः | OM Viśiṣṭāya namaḥ


విశిష్టః, विशिष्टः, Viśiṣṭaḥ

విశిష్యతే సర్వం అతిశేతే విశేషించును; సర్వమును మించియుండును.

:: పోతన భాగవతము - అష్టమ స్కంధము ::
సీ. భావించి కొందఱు బ్రహ్మంబు నీ వని తలపోసి కొందఱు ధర్మ మనియుఁ
జర్చించి కొందఱు సదసదీశ్వరుఁడని సరవిఁ గొందఱు శక్తి సహితుఁడనియుఁ
జింతించి కొందఱు చిరతరుం డవ్యయుఁ డాత్మతంత్రుఁడు పరుం డధికుఁడనియుఁ
దొడరి యూహింతురు తుది నద్వయద్వయ సదసద్విశిష్ట సంశ్రయుఁడ నీవు;
తే. తలఁప నొక్కింత వస్తుభేదంబు గలదె, కంకణాదులు పసిఁడి యొక్కటియ కాదె?
కడలు పెక్కైన వార్ధి యొక్కటియ కాదె? భేద మంచును నిను వికల్పింప వలదు. (386)

నీవు పరబ్రహ్మవని కొందరు భావిస్తారు. నీవు ధర్మమని కొందరు తలుస్తారు. నీవు ప్రకృతి పురుషులకంటె పరుడవని కొందరంటారు. నీవు శక్తిస్వరూపుడవని కొందరు ధ్యానిస్తారు. విష్ణువుగా శాశ్వతుడుగా, స్వతంత్రుడుగా పరమపురుషుడుగా ఉత్తముడుగా కొందరు నిన్ను ఊహిస్తారు. అన్నింటినీ మించి సాటిలేని వాడవు నీవు. సదసత్తులకు పవిత్రమైన నిలయం నీవు. ఆలోచించి చూస్తే కంకణం మొదలైన బంగారు నగలూ, బంగారమూ వాస్తవముగా ఒకటే కదా! అనంతమైన అలలూ సముద్రమూ ఒకటే కదా! అందువల్ల పైకి భేదం కనిపిస్తున్నా నీకు ఈ సృష్టికీ వాస్తవంగా భేదం లేనే లేదు.



Viśiṣyate sarvaṃ atiśete / विशिष्यते सर्वं अतिशेते One who excels everything.

असंख्येयोऽप्रमेयात्मा विशिष्टश्शिष्टकृच्छुचिः ।
सिद्दार्थस्सिद्धसङ्कल्पः सिद्धिदस्सिद्धिसाधनः ॥ २७ ॥

అసంఖ్యేయోఽప్రమేయాత్మా విశిష్టశ్శిష్టకృచ్ఛుచిః ।
సిద్దార్థస్సిద్ధసఙ్కల్పః సిద్ధిదస్సిద్ధిసాధనః ॥ ౨౭ ॥

Asaṃkhyeyo’prameyātmā viśiṣṭaśśiṣṭakr̥cchuciḥ ।
Siddārthassiddhasaṅkalpaḥ siddhidassiddhisādhanaḥ ॥ 27 ॥

9 జులై, 2013

248. అప్రమేయాఽఽత్మా, अप्रमेयाऽऽत्मा, Aprameyā’’tmā

ఓం అప్రమేయాత్మనే నమః | ॐ अप्रमेयात्मने नमः | OM Aprameyātmane namaḥ


అప్రమేయాఽఽత్మా, अप्रमेयाऽऽत्मा, Aprameyā’’tmā

అప్రమేయః ఆత్మా యస్య ప్రత్యక్షాదిప్రమాణములకు గోచరమగు ఆత్మ స్వరూపము ఎవనికి లేదో అట్టివాడు.

:: పోతన భాగవతము - దశమ స్కంధము, ఉత్తరభాగము ::
ఆ. వరద! పద్మనాభ! హరి! కృష్ణ! గోవింద, దాసదుఃఖనాశ! వాసుదేవ!
     యవ్యయాప్రమేయ! యనిశంబుఁ గావింతు, మిందిరేశ! నీకు వందనములు (749)



Aprameyaḥ ātmā yasya / अप्रमेयः आत्मा यस्य He whose nature is not the subject of being determined by the cannons of reasoning.

Śrīmad Bhāgavata - Canto 10, Chapter 70
Kr̥ṣṇā kr̥ṣṇāprameyātmanprapannabhayabhañjana,
Vayaṃ tvāṃ śraṇaṃ yāmo bhavabhītāḥ pr̥thanghiyaḥ. (25)

:: श्रीमद्भागवते दशमस्कन्धे उत्तरार्धे सप्ततितमोऽध्यायः ::
कृष्णा कृष्णाप्रमेयात्मन्प्रपन्नभयभञ्जन ।
वयं त्वां श्रणं यामो भवभीताः पृथन्घियः ॥ २५ ॥

O Kṛṣṇa! Kṛṣṇa, O immeasurable Soul, destroyer of fear for those surrendered to You! Despite our separatist attitude, we have come to You for shelter out of fear of material existence.

असंख्येयोऽप्रमेयात्मा विशिष्टश्शिष्टकृच्छुचिः ।
सिद्दार्थस्सिद्धसङ्कल्पः सिद्धिदस्सिद्धिसाधनः ॥ २७ ॥

అసంఖ్యేయోఽప్రమేయాత్మా విశిష్టశ్శిష్టకృచ్ఛుచిః ।
సిద్దార్థస్సిద్ధసఙ్కల్పః సిద్ధిదస్సిద్ధిసాధనః ॥ ౨౭ ॥

Asaṃkhyeyo’prameyātmā viśiṣṭaśśiṣṭakr̥cchuciḥ ।
Siddārthassiddhasaṅkalpaḥ siddhidassiddhisādhanaḥ ॥ 27 ॥

8 జులై, 2013

247. అసంఖ్యేయః, असंख्येयः, Asaṃkhyeyaḥ

ఓం అసంఖ్యేయాయ నమః | ॐ असंख्येयाय नमः | OM Asaṃkhyeyāya namaḥ


సంఖ్యాతుం న శక్యతే లెక్కించబడిటకు శక్యుడు కాని వాడు. ఈతనియందు నామ బేధ రూప భేదాదికమగు సంఖ్య వాస్తవమున ఉండదు. ఉపాసనార్థమై - ఈ కనబడు నామభేద రూప భేదాదులన్నియు కల్పించుకొనబడినవి.



Saṃkhyātuṃ na śakyate / संख्यातुं न शक्यते The One who cannot be enumerated. He cannot be attributed a limited number of forms. All the known manifestations are only a help ease His worship and in reality He is beyond these.

Śrīmad Bhāgavata - Canto 5, Chapter 18
Yasminnasaṅkhyeyaviśeṣanāma rūpākr̥tau kavibhiḥ kalpiteyam,
Saṅkhyā yayā tattvadr̥śāpanīyate tasmai namaḥ sāṅkhyanidarṣanāya te iti. (33)

:: श्रीमद्भागवते पङ्चम स्कन्धे अष्टदशोऽध्यायः ::
यस्मिन्नसङ्ख्येयविशेषनाम रूपाकृतौ कविभिः कल्पितेयम् ।
सङ्ख्या यया तत्त्वदृशापनीयते तस्मै नमः साङ्ख्यनिदर्षनाय ते इति ॥ ३३ ॥

O my Lord, Your name, form and bodily features are expanded in countless forms. No one can determine exactly how many forms exist, yet You Yourself, in Your incarnation as the learned scholar Kapiladeva, have analyzed the cosmic manifestation as containing twenty-four elements. Therefore if one is interested in Sāńkhya philosophy, by which one can enumerate the different truths, he must hear it from You. Unfortunately, non-devotees simply count the different elements and remain ignorant of Your actual form. I offer my respectful obeisances unto You.

असंख्येयोऽप्रमेयात्मा विशिष्टश्शिष्टकृच्छुचिः ।
सिद्दार्थस्सिद्धसङ्कल्पः सिद्धिदस्सिद्धिसाधनः ॥ २७ ॥

అసంఖ్యేయోఽప్రమేయాత్మా విశిష్టశ్శిష్టకృచ్ఛుచిః ।
సిద్దార్థస్సిద్ధసఙ్కల్పః సిద్ధిదస్సిద్ధిసాధనః ॥ ౨౭ ॥

Asaṃkhyeyo’prameyātmā viśiṣṭaśśiṣṭakr̥cchuciḥ ।
Siddārthassiddhasaṅkalpaḥ siddhidassiddhisādhanaḥ ॥ 27 ॥

7 జులై, 2013

246. నరః, नरः, Naraḥ

ఓం నరాయ నమః | ॐ नराय नमः | OM Narāya namaḥ


నయతి ప్రాణులను, విశ్వములను సృష్టిస్థితిలయాదులచే స్వస్వవ్యాపారములయందు  ముందునకు కొనిపొవును. భక్తులను తన పరమపదమునకు కొనిపోవును. నయతీతి నరః ప్రోక్తః పరమాత్మా సనాతనః శాశ్వతుడగు పరమాత్ముడు నయతి/కొనిపోవును అను వ్యుత్పత్తి చే నరః అని చెప్పబడుచున్నాడు అను వ్యాసవచనముచే నరుడు అనగా విష్ణువు.



Nayatīti naraḥ proktaḥ paramātmā sanātanaḥ / नयतीति नरः प्रोक्तः परमात्मा सनातनः The eternal Paramātma is said to lead men to salvation. So He is Naraḥ.

सुप्रसादः प्रसन्नात्मा विश्वधृग्विश्वभुग्विभुः ।
सत्कर्तासत्कृतस्साधुर्जह्नुर्नारायणो नरः ॥ २६ ॥

సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వభుగ్విభుః ।
సత్కర్తాసత్కృతస్సాధుర్జహ్నుర్నారాయణో నరః ॥ ౨౬ ॥

Suprasādaḥ prasannātmā viśvadhr̥gviśvabhugvibhuḥ ।
Satkartāsatkr̥tassādhurjahnurnārāyaṇo naraḥ ॥ 26 ॥

6 జులై, 2013

245. నారాయణః, नारायणः, Nārāyaṇaḥ

ఓం నారాయణాయ నమః | ॐ नारायणाय नमः | OM Nārāyaṇāya namaḥ


నరః అనగా ఆత్మ. దానినుండి జనించిన ఆకాశాది కార్యములు నారములు అనగా నరుని నుండి జనించినవి. తన నుండియే జనించిన ఈ నారములు తనకు 'అయనము' లేదా ఆశ్రయము అగుచున్నవి కావున నారాః ఆయనం యస్య నారములు ఎవనికి ఆయనమో అట్టివాడు నారాయణుడు. అనువ్యుత్పత్తిచే విష్ణువు 'నారాయణః' అనబడుచున్నాడు.

యచ్చ కించి జ్జగ త్సర్వం దృశ్యతే శ్రూయతేఽపి వా అంతర్బహిశ్చ త తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః (నారాయణోపనిషత్ 13.12) ఏ ఈ కొంచెము జగత్తు కనబడుచున్నదో వినబడుచున్నదో దానిని అంతటిని లోపలను వెలుపలను కూడా వ్యాపించి నారాయణుడు ఉన్నాడు.

:: శ్రీ మహాభారతే వనపర్వణిఏకోననవత్యాధికశతతమోఽధ్యాయః ::
దేవ ఉవాచ
అపాం నారా ఇతి పురా సంజ్ఞాకర్మ కృతం మయా ।
తేన నారాయణోఽప్యుక్తో మమ తత్ త్వయనం సదా ॥ 3 ॥


పూర్వకాలమునందు నేనే జలములకు 'నారా' అని నామమొసంగితిని. అట్టి 'నారా' అనగా జలము నా 'అయనము' అనగా వాసస్థానమైయున్నందున నేను నారాయణుడిగా విఖ్యాతినొందితిని.



Naraḥ means Ātma or The Soul. The Elements like water that originated from It are called Nāras i.e., the Ones that emanated from Naraḥ. Nārāḥ āyanaṃ yasya The One who has such Nāras, which originated from Himself, as His Āyana or retreat is Nārāyaṇa.

Yacca kiṃci jjaga tsarvaṃ dr̥śyate śrūyate’pi vā aṃtarbahiśca ta tatsarvaṃ vyāpya nārāyaṇaḥ sthitaḥ (Nārāyaṇopaniṣat 13.12) (even) The little portion of universe that is visible and audible has Nārāyaṇa all pervading within and without.

Śrī Mahābhārata - Book III, Chapter 189
Deva uvāca
Apāṃ nārā iti purā saṃjñākarma kr̥taṃ mayā,
Tena nārāyaṇo’pyukto mama tat tvayanaṃ sadā.
3.

In the ancient times, it is Me who named waters 'Nārā.' Since I have such waters as my Āyana or retreat, I came to become widely known as Nārāyaṇa.

सुप्रसादः प्रसन्नात्मा विश्वधृग्विश्वभुग्विभुः ।
सत्कर्तासत्कृतस्साधुर्जह्नुर्नारायणो नरः ॥ २६ ॥

సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వధృగ్విశ్వభుగ్విభుః ।
సత్కర్తాసత్కృతస్సాధుర్జహ్నుర్నారాయణో నరః ॥ ౨౬ ॥

Suprasādaḥ prasannātmā viśvadhr̥gviśvabhugvibhuḥ ।
Satkartāsatkr̥tassādhurjahnurnārāyaṇo naraḥ ॥ 26 ॥