5 అక్టో, 2014

701. సత్తా, सत्ता, Sattā

ఓం సత్తాయై నమః | ॐ सत्तायै नमः | OM Sattāyai namaḥ


సజాతీయ విజాతీయ స్వగతత్వైస్త్రిధాభిదా ।
అనుభూతి స్తద్రహితా సత్తా సా విష్ణు దేవతా ।
ఏకమేవ ద్వితీయమిత్యాది శ్రుతి సమీరణాత్ ॥

సజాతీయ, విజాతీయ స్వగత భేదములేని అనుభూతి సత్తా అనబడును. 'ఏకమే వాఽద్వితీయకమ్‍' ఛాందోగ్యోపనిషత్ 6.2.1 శ్రుతి వచన ప్రమాణ్యముచే బ్రహ్మము ఒక్కటియే; రెండవది తాను అగునది మరి యేదియును లేదు.



सजातीय विजातीय स्वगतत्वैस्त्रिधाभिदा ।
अनुभूति स्तद्रहिता सत्ता सा विष्णु देवता ।
एकमेव द्वितीयमित्यादि श्रुति समीरणात् ॥

Sajātīya vijātīya svagatatvaistridhābhidā,
Anubhūti stadrahitā sattā sā viṣṇu devatā,
Ekameva dvitīyamityādi śruti samīraṇāt.

The state of existence in which there is no difference of the same kind, of different kind or internal differences is sattā or pure existence. For the śruti (Chāndogyopaniṣat 6.2.1) says Reality i.e., Brahman is one only without a second.

सद्गतिस्सत्कृतिस्सत्ता सद्भूतिस्सत्परायणः ।
शूरसेनो यदुश्रेष्ठस्सन्निवासस्सुयामुनः ॥ ७५ ॥

సద్గతిస్సత్కృతిస్సత్తా సద్భూతిస్సత్పరాయణః ।
శూరసేనో యదుశ్రేష్ఠస్సన్నివాసస్సుయామునః ॥ 75 ॥

Sadgatissatkr̥tissattā sadbhūtissatparāyaṇaḥ,
Śūraseno yaduśreṣṭhassannivāsassuyāmunaḥ ॥ 75 ॥

4 అక్టో, 2014

700. సత్కృతిః, सत्कृतिः, Satkr̥tiḥ

ఓం సద్కృతయే నమః | ॐ सद्कृतये नमः | OM Sadkr̥taye namaḥ


సతీ కృతిర్జగద్రక్షా లక్షణాఽస్య యతస్తతః ।
సత్కృతిః ప్రోచ్యతే విష్ణుర్వేదికైస్తత్వదర్శిభిః ॥

పరమాత్ముడు జగద్రక్షణము అను మిగుల ఉత్కృష్టమైన కృతిని ఆచరించుచుండువాడు కనుక 'సత్కృతిః' - 'గొప్పపని కలవాడు.'



सती कृतिर्जगद्रक्षा लक्षणाऽस्य यतस्ततः ।
सत्कृतिः प्रोच्यते विष्णुर्वेदिकैस्तत्वदर्शिभिः ॥

Satī kr̥tirjagadrakṣā lakṣaṇā’sya yatastataḥ,
Satkr̥tiḥ procyate viṣṇurvedikaistatvadarśibhiḥ. 

The Lord's action of protecting the world is sat or good and hence He is called Satkr̥tiḥ.

सद्गतिस्सत्कृतिस्सत्ता सद्भूतिस्सत्परायणः ।
शूरसेनो यदुश्रेष्ठस्सन्निवासस्सुयामुनः ॥ ७५ ॥

సద్గతిస్సత్కృతిస్సత్తా సద్భూతిస్సత్పరాయణః ।
శూరసేనో యదుశ్రేష్ఠస్సన్నివాసస్సుయామునః ॥ 75 ॥

Sadgatissatkr̥tissattā sadbhūtissatparāyaṇaḥ,
Śūraseno yaduśreṣṭhassannivāsassuyāmunaḥ ॥ 75 ॥

3 అక్టో, 2014

699. సద్గతిః, सद्गतिः, Sadgatiḥ

ఓం సద్గతయే నమః | ॐ सद्गतये नमः | OM Sadgataye namaḥ


అస్తి బ్రహ్మేతి చేద్వేద సన్తమేనం తతో విదుః ।
ఇతి శ్రుతేర్బ్రహ్మాస్తితి యే విదుస్తైస్స ఆప్యతే ॥
ఇత్యథవా సముత్కృష్టాహ్యస్య బుద్ధిస్సతీ గతిః ।
ఇతివా సద్గతిరితి విష్ణుర్విద్వద్భిరుచ్యతే ॥

'బ్రహ్మ తత్త్వము ఉన్నది అను ఎరుక గలవాడు అగుచో అట్టివానిని ఉన్నవానినిగా - అనగా సత్ అను శబ్దముచే చెప్పబడదగిన వానినిగా తత్త్వవేత్తలు తలచుచున్నారు' అను తైత్తిరీయోపనిషత్ (2.6) శ్రుతి వచన ప్రమాణముచేత 'బ్రహ్మము ఉన్నది' అని నిశ్చితముగా ఎవరు ఎరుగుదురో వారు 'సత్‍' అనబడువారు. వారు ఆ పరమాత్మ తత్త్వము తాముగనే అగుట అను స్థితిని పొందెదరు. కావున పరమాత్మునకు 'సద్గతిః' అని వ్యవహారము.

లేదా గతి అనగా బుద్ధి. సత్ బుద్ధి కలవాడుగనుక ఆతండు సద్గతిః.



अस्ति ब्रह्मेति चेद्वेद सन्तमेनं ततो विदुः ।
इति श्रुतेर्ब्रह्मास्तिति ये विदुस्तैस्स आप्यते ॥
इत्यथवा समुत्कृष्टाह्यस्य बुद्धिस्सती गतिः ।
इतिवा सद्गतिरिति विष्णुर्विद्वद्भिरुच्यते ॥

Asti brahmeti cedveda santamenaṃ tato viduḥ,
Iti śruterbrahmāstiti ye vidustaissa āpyate.
Ityathavā samutkr̥ṣṭāhyasya buddhissatī gatiḥ,
Itivā sadgatiriti viṣṇurvidvadbhirucyate.

By the śruti 'If one knows that Brahman exists, he is known as sat - the existent' (Taittirīyopaniṣat 2.6). Those that realize that Brahman exists, they are those that are sat. The Lord is attained by them; So He is their goal - Sa.dgatiḥ

Or Gati also means buddhi or intellect. Since He has superior buddhi, He is called Sadgatiḥ.

सद्गतिस्सत्कृतिस्सत्ता सद्भूतिस्सत्परायणः ।
शूरसेनो यदुश्रेष्ठस्सन्निवासस्सुयामुनः ॥ ७५ ॥

సద్గతిస్సత్కృతిస్సత్తా సద్భూతిస్సత్పరాయణః ।
శూరసేనో యదుశ్రేష్ఠస్సన్నివాసస్సుయామునః ॥ 75 ॥

Sadgatissatkr̥tissattā sadbhūtissatparāyaṇaḥ,
Śūraseno yaduśreṣṭhassannivāsassuyāmunaḥ ॥ 75 ॥

2 అక్టో, 2014

698. హవిః, हविः, Haviḥ

ఓం హవిషే నమః | ॐ हविषे नमः | OM Haviṣe namaḥ


బ్రహ్మార్పణం బ్రహ్మహవిరితి గీతోక్తితో హవిః శ్రీమద్భగవద్గీతలో కల భగవద్వచనముచే యజ్ఞాదులయందు అర్పింపబడు హవిస్సు కూడా భగవద్రూపమే గనుక ఆ దేవదేవుడు హవిః.

:: శ్రీమద్భగవద్గీత జ్ఞాన యోగము ::
బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్ ।
బ్రహ్మైవ తేన గన్తవ్యం బ్రహ్మకర్మసమాధినా ॥ 24 ॥

యజ్ఞమునందలి హోమసాధనములు, హోమద్రవ్యములు, హోమాగ్ని, హోమము చేయువాడు, చేయబడు హోమము - అన్నియును బ్రహ్మస్వరూపములేయనెడి ఏకాగ్ర భావముతో ఆ యజ్ఞాది కర్మలను చేయు మనుజుడు బ్రహ్మమునే పొందగలడు.



ब्रह्मार्पणं ब्रह्महविरिति गीतोक्तितो हविः / Brahmārpaṇaṃ brahmahaviriti gītoktito haviḥ By the Lord's word in Śrīmad Bhagavad Gīta, Brahman is the offer and also the offering.

:: श्रीमद्भगवद्गीत ज्ञान योगमु ::
ब्रह्मार्पणं ब्रह्महविर्ब्रह्माग्नौ ब्रह्मणा हुतम् ।
ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिना ॥ २४ ॥

Śrīmad Bhagavad Gīta - Chapter 4
Brahmārpaṇaṃ brahmahavirbrahmāgnau brahmaṇā hutam,
Brahmaiva tena gantavyaṃ brahmakarmasamādhinā. 24.

The ladle is Brahman, the oblation is Brahman, the offering is poured by Brahman in the sacrificial fire of Brahman. Brahman alone is to be reached by him who has concentration on Brahman as the objective.

मनोजवस्तीर्थकरो वसुरेता वसुप्रदः ।
वसुप्रदो वासुदेवो वसुर्वसुमना हविः ॥ ७४ ॥

మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః ।
వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః ॥ 74 ॥

Manojavastīrthakaro vasuretā vasupradaḥ,
Vasuprado vāsudevo vasurvasumanā haviḥ ॥ 74 ॥

1 అక్టో, 2014

697. వసుమనాః, वसुमनाः, Vasumanāḥ

ఓం వసుమనసే నమః | ॐ वसुमनसे नमः | OM Vasumanase namaḥ


అవిశేషేణ సర్వేషు విషయేష్వస్య చక్రిణః ।
వసతీతి వసుప్రోక్తమ్ తాదృశం విద్యతే మనః ।
ఇతి విష్ణుర్వసుమనా ఇతి సఙ్కీర్త్యతే బుధైః ॥

సమానముగా ఒకే విధమున సర్వ భూతములయందును వసించును కావున వసుః. సర్వ భూతములయందును సమాన రూపమున వసించు మనస్సు ఈతనికి కలదుగనుక వసుమనాః.



अविशेषेण सर्वेषु विषयेष्वस्य चक्रिणः ।
वसतीति वसुप्रोक्तम् तादृशं विद्यते मनः ।
इति विष्णुर्वसुमना इति सङ्कीर्त्यते बुधैः ॥

Aviśeṣeṇa sarveṣu viṣayeṣvasya cakriṇaḥ,
Vasatīti vasuproktam tādr̥śaṃ vidyate manaḥ,
Iti viṣṇurvasumanā iti saṅkīrtyate budhaiḥ.

He resides uniformly in all beings i.e., vasu. His mind is of that nature and hence Vasumanāḥ.

मनोजवस्तीर्थकरो वसुरेता वसुप्रदः ।
वसुप्रदो वासुदेवो वसुर्वसुमना हविः ॥ ७४ ॥

మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః ।
వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః ॥ 74 ॥

Manojavastīrthakaro vasuretā vasupradaḥ,
Vasuprado vāsudevo vasurvasumanā haviḥ ॥ 74 ॥