ఓం ప్రమాణాయ నమః | ॐ प्रमाणाय नमः | OM Pramāṇāya namaḥ
స్వయం ప్రమా ప్రమితిస్సంవిత్ప్రమాణమితీర్యతే ।
శ్రీచక్రపాణిః ప్రజ్ఞానం బ్రహ్మేతి శ్రుతివాక్యతః ॥
ఏది కలదో అదియే ఉత్తమమగు జ్ఞానము. అదియే స్వతఃసిద్ధమగు యథార్థానుభవాత్మక జ్ఞానము. దానినే ఇచట 'ప్రమాణమ్' అనగా ప్రకృష్టమయిన జ్ఞానము అను శబ్దముచే చెప్పియున్నారు. ఈ విషయమున 'ప్రజ్ఞానం బ్రహ్మ' (ఐత్తరేయ ఉపనిషత్ 3.5.3) - 'ప్రకృష్టమయిన జ్ఞానమే బ్రహ్మతత్త్వము' అను శ్రుతి ప్రమాణము.
:: విష్ణు పురాణే ప్రథమాంశే ద్వితీయోఽధ్యాయః ::
జ్ఞానస్వరూపమత్యన్త నిర్మలం పరమార్థతః ।
తమేవార్థస్వరూపేణ భ్రాన్తిదర్శనతః స్థితమ్ ॥ 6 ॥
పరమార్థమున వస్తుస్థితిలో జ్ఞానమాత్ర స్వరూపుడును, అత్యంత నిర్మలుడును, భ్రాంతి జ్ఞానముచే అవిద్యావశమున పదార్థ స్వరూపముననున్నవాడును అగు ఆ పరమాత్ముని నమస్కరించెదను.
428. ప్రమాణమ్, प्रमाणम्, Pramāṇam
स्वयं प्रमा प्रमितिस्संवित्प्रमाणमितीर्यते ।
श्रीचक्रपाणिः प्रज्ञानं ब्रह्मेति श्रुतिवाक्यतः ॥
Svayaṃ pramā pramitissaṃvitpramāṇamitīryate,
Śrīcakrapāṇiḥ prajñānaṃ brahmeti śrutivākyataḥ.
Pramiti is samvit or knowledge and is self-effulgent and self-certifying. It is Pramāṇam or authority vide 'प्रज्ञानं ब्रह्म / Prajñānaṃ brahma' (Aittareya upaniṣat 3.5.3) - "Wisdom is Brahman."
:: विष्णु पुराणे प्रथमांशे द्वितीयोऽध्यायः ::
ज्ञानस्वरूपमत्यन्त निर्मलं परमार्थतः ।
तमेवार्थस्वरूपेण भ्रान्तिदर्शनतः स्थितम् ॥ ६ ॥
Viṣṇu Purāṇa - Part 1, Chapter 2
Jñānasvarūpamatyanta nirmalaṃ paramārthataḥ,
Tamevārthasvarūpeṇa bhrāntidarśanataḥ sthitam. 6.
In reality, the nature of knowledge is unblemished. By illusory sight, it takes forms of various objects.
428. ప్రమాణమ్, प्रमाणम्, Pramāṇam
| प्रमाणं प्राणनिलयः प्राणभृत् प्राणजीवनः । |
| तत्त्वं तत्त्वविदेकात्मा जन्ममृत्युजरातिगः ॥ १०३ ॥ |
| ప్రమాణం ప్రాణనిలయః ప్రాణభృత్ ప్రాణజీవనః । |
| తత్త్వం తత్త్వవిదేకాత్మా జన్మమృత్యుజరాతిగః ॥ 103 ॥ |
| Pramāṇaṃ prāṇanilayaḥ prāṇabhr̥t prāṇajīvanaḥ, |
| Tattvaṃ tattvavidekātmā janmamr̥tyujarātigaḥ ॥ 103 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి