30 ఏప్రి, 2015

908. చక్రీ, चक्री, Cakrī

ఓం చక్రిణే నమః | ॐ चक्रिणे नमः | OM Cakriṇe namaḥ

సమస్తలోకరక్షార్థం మనస్తత్త్వాత్మకం సుదర్శనాఖ్యం చక్రం ధత్త ఇతి చక్రీ చక్రము ఈతనికి కలదు. సమస్త లోక రక్షార్థము మనస్తత్త్వ రూపమగు సుదర్శనమను పేరు కల చక్రమును ధరించువాడు కనుక విష్ణునకు చక్రీ అను నామము కలదు.

:: శ్రీ విష్ణుమహాపురాణే ప్రథమాంశే ద్వావింశోఽధ్యాయః ::
చలస్వరూపమత్యన్తం జవేనాన్తరితానిలమ్ ।
చక్రస్వరూపం చ మనో ధత్తే విష్ణుః కరే స్థితమ్ ॥ 71 ॥

చలించు స్వభావము కలదియు, తన అత్యంతవేగముచే వాయువును కూడ క్రిందుపరచునదియు, చక్రస్వరూపము కలదియు అగు మనసును - విష్ణువు తన కరమునందు ధరించుచున్నాడు.

समस्तलोकरक्षार्थं मनस्तत्त्वात्मकं सुदर्शनाख्यं चक्रं धत्त इति चक्री / Samastalokarakṣārthaṃ manastattvātmakaṃ sudarśanākhyaṃ cakraṃ dhatta iti cakrī He wields the discus known as Sudarśana of the nature of the mind for the protection of all the worlds.

:: श्री विष्णुमहापुराणे प्रथमांशे द्वाविंशोऽध्यायः ::
चलस्वरूपमत्यन्तं जवेनान्तरितानिलम् ।
चक्रस्वरूपं च मनो धत्ते विष्णुः करे स्थितम् ॥ ७१ ॥

Viṣṇu Purāṇa - Part 1, Chapter 22
Calasvarūpamatyantaṃ javenāntaritānilam,
Cakrasvarūpaṃ ca mano dhatte viṣṇuḥ kare sthitam. 71.

Viṣṇu holds in His hands the Cakra or discus representing the unsteady mind, swifter than the wind.

अरौद्रः कुण्डली चक्री विक्रम्यूर्जितशासनः ।
शब्दातिगश्शब्दसहश्शिशिरश्शर्वरीकरः ॥ ९७ ॥

అరౌద్రః కుణ్డలీ చక్రీ విక్రమ్యూర్జితశాసనః ।
శబ్దాతిగశ్శబ్దసహశ్శిశిరశ్శర్వరీకరః ॥ 97 ॥

Araudraḥ kuṇḍalī cakrī vikramyūrjitaśāsanaḥ,
Śabdātigaśśabdasahaśśiśiraśśarvarīkaraḥ ॥ 97 ॥

29 ఏప్రి, 2015

907. కుణ్డలీ, कुण्डली, Kuṇḍalī

ఓం కుణ్డలినే నమః | ॐ कुण्डलिने नमः | OM Kuṇḍaline namaḥ

శేషరూపభాక్ కుణ్డలీ సహస్రంశుమణ్డలోపమకుణ్డలధారణాద్వా; యద్ధా సాఙ్ఖ్యయోగాత్మకే కుణ్డలే మకరాకారే అస్య స్త ఇతి కుణ్డలీ కుండలములు ఈతనికి కలవు. అవి ఎట్టివి?

1. 'కుండలీ' అను పదము వాడుకలో సర్పమును చెప్పును. విష్ణువు శేష రూపధారి కనుక కుండలీ.

2. సూర్యమండలమును పోలిన కుండలములు ధరించినవాడు కనుక కుండలీ.

3. సాంఖ్యము, యోగము అను దర్శనముల రూపమున ఉండు కుండలములు మకరపు ఆకృతి కలవి. అవి ఈతనికి కలవు కనుక కుండలీ.

शेषरूपभाक् कुण्डली सहस्रंशुमण्डलोपमकुण्डलधारणाद्वा; यद्धा साङ्ख्ययोगात्मके कुण्डले मकराकारे अस्य स्त इति कुण्डली / Śeṣarūpabhāk kuṇḍalī sahasraṃśumaṇḍalopamakuṇḍaladhāraṇādvā; yaddhā sāṅkhyayogātmake kuṇḍale makarākāre asya sta iti kuṇḍalī The One with Kuṇḍalas or ear ornaments. Which kind?

1. The word 'Kuṇḍalī' means a serpent. Since Lord Viṣṇu is of the form of śeṣa or serpent, He is called Kuṇḍalī.

2. He has ear ornaments resembling the sun and hence Kuṇḍalī.

3. Philosophies like sāṅkhya and yoga, which are considered to be of the shape of makara or fish, are His ear ornaments.

अरौद्रः कुण्डली चक्री विक्रम्यूर्जितशासनः ।
शब्दातिगश्शब्दसहश्शिशिरश्शर्वरीकरः ॥ ९७ ॥

అరౌద్రః కుణ్డలీ చక్రీ విక్రమ్యూర్జితశాసనః ।
శబ్దాతిగశ్శబ్దసహశ్శిశిరశ్శర్వరీకరః ॥ 97 ॥

Araudraḥ kuṇḍalī cakrī vikramyūrjitaśāsanaḥ,
Śabdātigaśśabdasahaśśiśiraśśarvarīkaraḥ ॥ 97 ॥

28 ఏప్రి, 2015

906. అరౌద్రః, अरौद्रः, Araudraḥ

ఓం అరౌద్రాయ నమః | ॐ अरौद्राय नमः | OM Araudrāya namaḥ

కర్మ రౌద్రమ్ రాగశ్చ రౌద్రః కోపశ్చ రౌద్రః యస్య రౌద్రత్రయం నాస్తి అవాప్తసర్వకామత్వేన రాగద్వేషాదేరభావాత్ అరౌద్రః రౌద్రము లేదా ఉగ్రమగు కర్మాచరణము కాని, 'ఇవి నాకు సుఖము కలిగించునవి కావున నేను పొందవలయును' అను తలంపు అగు రౌద్రపూరితమగు రాగము కాని, రౌద్రమగు కోపము - ఈ మూడు రౌద్ర త్రయమును ఎవనియందు లేవో అట్టివాడు భగవానుడు శ్రీ విష్ణువు. అన్ని కోరికల ఫలములను పొందియున్నవాడగు అవాప్త సర్వకాముడు కావున అతని యందు రాగము, ద్వేషము, కోపము మొదలగునవి ఉండుటకు అవకాశము లేదు. అవి రౌద్రములుగా ఉండు అవకాశము మొదలే లేదు.

कर्म रौद्रम् रागश्च रौद्रः कोपश्च रौद्रः यस्य रौद्रत्रयं नास्ति अवाप्तसर्वकामत्वेन रागद्वेषादेरभावात् अरौद्रः / Karma raudram rāgaśca raudraḥ kopaśca raudraḥ yasya raudratrayaṃ nāsti avāptasarvakāmatvena rāgadveṣāderabhāvāt araudraḥ Action is wild, attachment is passionate and anger is violent. He in whom these three kinds of fierceness do not exist by reason of His being of all fulfilled desires and as He is not moved by attachment, aversion etc., He is Araudraḥ.

अरौद्रः कुण्डली चक्री विक्रम्यूर्जितशासनः ।
शब्दातिगश्शब्दसहश्शिशिरश्शर्वरीकरः ॥ ९७ ॥

అరౌద్రః కుణ్డలీ చక్రీ విక్రమ్యూర్జితశాసనః ।
శబ్దాతిగశ్శబ్దసహశ్శిశిరశ్శర్వరీకరః ॥ 97 ॥

Araudraḥ kuṇḍalī cakrī vikramyūrjitaśāsanaḥ,
Śabdātigaśśabdasahaśśiśiraśśarvarīkaraḥ ॥ 97 ॥

27 ఏప్రి, 2015

905. స్వస్తిదక్షిణః, स्वस्तिदक्षिणः, Svastidakṣiṇaḥ

ఓం స్వస్తిదక్షిణాయ నమః | ॐ स्वस्तिदक्षिणाय नमः | OM Svastidakṣiṇāya namaḥ

స్వస్తిరూపేణ దక్షతే వర్ధతే, స్వమ్తి దాన్తుం సమర్థ ఇతి వా స్వస్తిదక్షిణః । అథవా దక్షిణశబ్ద ఆశుకారిణి వర్తతే; శీఘ్రం స్వస్తి దాతుమ్ అయమేవ సమర్థ ఇతి, యస్య స్మరణాదేవ సిధ్యన్తి సర్వసిద్దయః ॥

1. శుభకర రూపముతో వర్ధిల్లుచు నిరంతరము కొనసాగుచు ఉండువాడు.

2. శుభములను ఇచ్చుటకు శక్తి కలవాడు.

3. 'దక్షిణ' శబ్దమునకు 'శీఘ్రకారీ' అనగా శీఘ్రముగా పనిని చేయువాడు అను అర్థమును కలదు. ఏ భగవానుని స్మరించినంత మాత్రముననే సర్వసిద్ధులు సిద్ధించునో అట్టివాడు శ్రీ మహా విష్ణువు కావున 'స్వస్తి దక్షిణః' అనగా శీఘ్రముగా శుభములను ఇచ్చుటకు సమర్థుడు అను అర్థమును చెప్పవచ్చును.

:: శ్రీ విష్ణు పురాణే పఞ్చమాంశే సప్తదశోఽధ్యాయః ::
స్మృతే సకల కల్యాణ భాజనం యత్ర జాయతే ।
పురుష స్త మజం నిత్యం వ్రజామి శరణం హరిమ్ ॥ 18 ॥

ఎవరు స్మరించబడినంతనే జీవుడు సకల శుభములకును పాత్రము అగునో, అట్టి జన్మరహితుడును, నిత్యుడును, స్వయం సిద్ధుడును, శాశ్వతుడును అగు హరిని రక్షకునిగా శరణమును పొందుచున్నాను.

స్మరణా దేవ కృష్ణస్య పాపసఙ్ఘాతపఞ్జరం ।
శతధా భేద మాయాతి గిరిర్వ్రజహతోయథా ॥

కృష్ణుని స్మరణ మాత్రము వలననే పాపముల రాశి అను పంజరము వజ్రపు దెబ్బ తినిన పర్వతమువలె నూరు చెక్కలుగా బ్రద్దలగుచున్నది.

ఈ మొదలగు వచనములను బట్టి పై అర్థము సమర్థింపబడుచున్నది.

स्वस्तिरूपेण दक्षते वर्धते, स्वम्ति दान्तुं समर्थ इति वा स्वस्तिदक्षिणः । अथवा, दक्षिणशब्द आशुकारिणि वर्तते; शीघ्रं स्वस्ति दातुम् अयमेव समर्थ इति, यस्य स्मरणादेव सिध्यन्ति सर्वसिद्दयः ॥

Svastirūpeṇa dakṣate vardhate, svamti dāntuṃ samartha iti vā svastidakṣiṇaḥ, athavā, dakṣiṇaśabda āśukāriṇi vartate; śīghraṃ svasti dātum ayameva samartha iti.

1. He who grows in the form of svasti i.e., auspiciousness.

2. He who is efficient in conferring svasti i.e., auspiciousness.

3. The word dakṣiṇaḥ is applied to one who does action quickly. Lord Śrī Mahā Viṣṇu alone is able to confer svasti quickly; for by mere devout thought of Him are realized all siddhis vide the below.

:: श्री विष्णु पुराणे पञ्चमांशे सप्तदशोऽध्यायः ::
स्मृते सकल कल्याण भाजनं यत्र जायते ।
पुरुष स्त मजं नित्यं व्रजामि शरणं हरिम् ॥ १८ ॥

Śrī Viṣṇu Purāṇa Section 5, Chapter 17
Smr̥te sakala kalyāṇa bhājanaṃ yatra jāyate,
Puruṣa sta majaṃ nityaṃ vrajāmi śaraṇaṃ harim. 18.

I always seek refuge in Hari the unborn - who when remembered, becomes the source from which all auspiciousness flows.

स्मरणा देव कृष्णस्य पापसङ्घातपञ्जरं ।
शतधा भेद मायाति गिरिर्व्रजहतोयथा ॥

Smaraṇā deva kr̥ṣṇasya pāpasaṅghātapañjaraṃ,
Śatadhā bheda māyāti girirvrajahatoyathā.

By remembrance alone of Kr̥ṣṇa, the totality of sins is split into hundredfold like a mountain struck by vajra (Indra's thunderbolt weapon).

सनात्सनातनतमः कपिलः कपिरप्ययः ।
स्वस्तिदस्स्वस्तिकृत् स्वस्ति स्वस्तिभुक् स्वस्तिदक्षिणः ॥ ९६ ॥

సనాత్సనాతనతమః కపిలః కపిరప్యయః ।
స్వస్తిదస్స్వస్తికృత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః ॥ 96 ॥

Sanātsanātanatamaḥ kapilaḥ kapirapyayaḥ,
Svastidassvastikr̥t svasti svastibhuk svastidakṣiṇaḥ ॥ 96 ॥

26 ఏప్రి, 2015

904. స్వస్తిభుక్, स्वस्तिभुक्, Svastibhuk

ఓం స్వస్తిభుజే నమః | ॐ स्वस्तिभुजे नमः | OM Svastibhuje namaḥ

తదేవ భుక్తం ఇతి స్వస్తిభుక్ స్వస్తిని, శుభమును అనుభవించును కనుక స్వస్తిభుక్. భక్తానాం మఙ్గలం స్వస్తి భునక్తీతి వా స్వస్తిభుక్ లేదా భక్తుల స్వస్తిని, శుభమును రక్షించును కనుక స్వస్తిభుక్ అని కూడ చెప్పవచ్చును.

तदेव भुक्तं इति स्वस्तिभुक् / Tadeva bhuktaṃ iti svastibhuk Since He is the enjoyer of svasti or auspiciousness, He is called Svastibhuk. भक्तानां मङ्गलं स्वस्ति भुनक्तीति वा स्वस्तिभुक् / Bhaktānāṃ maṅgalaṃ svasti bhunaktīti vā svastibhuk or He protects the auspiciousness of His devotees hence Svastibhuk.

सनात्सनातनतमः कपिलः कपिरप्ययः ।
स्वस्तिदस्स्वस्तिकृत् स्वस्ति स्वस्तिभुक् स्वस्तिदक्षिणः ॥ ९६ ॥

సనాత్సనాతనతమః కపిలః కపిరప్యయః ।
స్వస్తిదస్స్వస్తికృత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః ॥ 96 ॥

Sanātsanātanatamaḥ kapilaḥ kapirapyayaḥ,
Svastidassvastikr̥t svasti svastibhuk svastidakṣiṇaḥ ॥ 96 ॥

25 ఏప్రి, 2015

903. స్వస్తి, स्वस्ति, Svasti

ఓం స్వస్తయే నమః | ॐ स्वस्तये नमः | OM Svastaye namaḥ

మఙ్గలస్వరూపమాత్మీయం పరమానన్దలక్షణం స్వస్తి పరమాత్ముని పరమానంద రూపమగు స్వరూపము మంగళము, శుభమగునది.

मङ्गलस्वरूपमात्मीयं परमानन्दलक्षणं स्वस्ति / Maṅgalasvarūpamātmīyaṃ paramānandalakṣaṇaṃ svasti His nature is auspiciousness characterized by supreme bliss.

सनात्सनातनतमः कपिलः कपिरप्ययः ।
स्वस्तिदस्स्वस्तिकृत् स्वस्ति स्वस्तिभुक् स्वस्तिदक्षिणः ॥ ९६ ॥

సనాత్సనాతనతమః కపిలః కపిరప్యయః ।
స్వస్తిదస్స్వస్తికృత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః ॥ 96 ॥

Sanātsanātanatamaḥ kapilaḥ kapirapyayaḥ,
Svastidassvastikr̥t svasti svastibhuk svastidakṣiṇaḥ ॥ 96 ॥

24 ఏప్రి, 2015

902. స్వస్తికృత్, स्वस्तिकृत्, Svastikr̥t

ఓం స్వస్తికృతే నమః | ॐ स्वस्तिकृते नमः | OM Svastikr̥te namaḥ

తదేవ కరోతీతి స్వస్తికృత్ భక్తులకు స్వస్తిని, శుభమును కలిగించును కనుక స్వస్తికృత్.

तदेव करोतीति स्वस्तिकृत् / Tadeva karotīti svastikr̥t Since He does that (conferring auspiciousness) itself, He is Svastikr̥t.

सनात्सनातनतमः कपिलः कपिरप्ययः ।
स्वस्तिदस्स्वस्तिकृत् स्वस्ति स्वस्तिभुक् स्वस्तिदक्षिणः ॥ ९६ ॥

సనాత్సనాతనతమః కపిలః కపిరప్యయః ।
స్వస్తిదస్స్వస్తికృత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః ॥ 96 ॥

Sanātsanātanatamaḥ kapilaḥ kapirapyayaḥ,
Svastidassvastikr̥t svasti svastibhuk svastidakṣiṇaḥ ॥ 96 ॥

23 ఏప్రి, 2015

901. స్వస్తిదః, स्वस्तिदः, Svastidaḥ

ఓం స్వస్తిదాయ నమః | ॐ स्वस्तिदाय नमः | OM Svastidāya namaḥ

భక్తానాం స్వస్తి మఙ్గలం దదాతీతి స్వస్తిదః భక్తులకు స్వస్తిని, శుభమును ప్రసాదించును కనుక స్వస్తిదః.

भक्तानां स्वस्ति मङ्गलं ददातीति स्वस्तिदः / Bhaktānāṃ svasti maṅgalaṃ dadātīti svastidaḥ Since He confers maṅgalaṃ or auspiciousness upon devotees, He is called Svastidaḥ.

सनात्सनातनतमः कपिलः कपिरप्ययः ।
स्वस्तिदस्स्वस्तिकृत् स्वस्ति स्वस्तिभुक् स्वस्तिदक्षिणः ॥ ९६ ॥

సనాత్సనాతనతమః కపిలః కపిరప్యయః ।
స్వస్తిదస్స్వస్తికృత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః ॥ 96 ॥

Sanātsanātanatamaḥ kapilaḥ kapirapyayaḥ,
Svastidassvastikr̥t svasti svastibhuk svastidakṣiṇaḥ ॥ 96 ॥

22 ఏప్రి, 2015

900. అప్యయః, अप्ययः, Apyayaḥ

ఓం అవ్యయాయ నమః | ॐ अव्ययाय नमः | OM Avyayāya namaḥ

అప్యయః ప్రలయే అస్మిన్నపియన్తి జగన్తీతి అప్యయః ప్రళయ సమయమున జగములు ఈతనియందు మరల చేరి లయమందును కనుక అప్యయః.

अप्ययः प्रलये अस्मिन्नपियन्ति जगन्तीति अप्ययः / Apyayaḥ pralaye asminnapiyanti jagantīti apyayaḥ The worlds go unto Him even at the time of pralaya or universal deluge which is why He is called Apyayaḥ.

सनात्सनातनतमः कपिलः कपिरप्ययः
स्वस्तिदस्स्वस्तिकृत् स्वस्ति स्वस्तिभुक् स्वस्तिदक्षिणः ॥ ९६ ॥

సనాత్సనాతనతమః కపిలః కపిరప్యయః
స్వస్తిదస్స్వస్తికృత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః ॥ 96 ॥

Sanātsanātanatamaḥ kapilaḥ kapirapyayaḥ,
Svastidassvastikr̥t svasti svastibhuk svastidakṣiṇaḥ ॥ 96 ॥

21 ఏప్రి, 2015

899. కపిః, कपिः, Kapiḥ

ఓం కపయే నమః | ॐ कपये नमः | OM Kapaye namaḥ

కం జలం రశ్మిభిః పిబన్ కపిః సూర్యః; కపిః వరాహో వా 'కపిర్వరాహః శ్రేష్ఠశ్చ' ఇతి వచనాత్ కం అనగా జలములు. పి అనగా జలములను తన కిరణములచే త్రావువాడు - నీటిని త్రావువాడు అనగా సూర్యుడు. లేదా వరాహమునకు కపిః అని వ్యవహారము. 'కపి అను పదమునకు వరాహమును, శ్రేష్ఠుడును అని అర్థములు' అను పెద్దల వచనము (మహాభారత శాంతి పర్వము 352.25) ఇందు ప్రమాణము. ఇవియు పరమాత్ముని విభూతులే!

कं जलं रश्मिभिः पिबन् कपिः सूर्यः; कपिः वराहो वा 'कपिर्वराहः श्रेष्ठश्च' इति वचनात् / Kaṃ jalaṃ raśmibhiḥ piban kapiḥ sūryaḥ; kapiḥ varāho vā 'kapirvarāhaḥ śreṣṭhaśca' iti vacanāt Kaṃ stands for water, pi stands for drinking it with his rays. So Kapiḥ is sūrya or sun. Kapiḥ means Varāha or wild boar. 'Kapi is  Varāha and eminent' vide Mahābhārata Śānti parva 352.25.

सनात्सनातनतमः कपिलः कपिरप्ययः ।
स्वस्तिदस्स्वस्तिकृत् स्वस्ति स्वस्तिभुक् स्वस्तिदक्षिणः ॥ ९६ ॥

సనాత్సనాతనతమః కపిలః కపిరప్యయః ।
స్వస్తిదస్స్వస్తికృత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః ॥ 96 ॥

Sanātsanātanatamaḥ kapilaḥ kapirapyayaḥ,
Svastidassvastikr̥t svasti svastibhuk svastidakṣiṇaḥ ॥ 96 ॥

20 ఏప్రి, 2015

898. కపిలః, कपिलः, Kapilaḥ

ఓం కపిలాయ నమః | ॐ कपिलाय नमः | OM Kapilāya namaḥ

బడబానలస్య కపిలో వర్ణ ఇతి తద్రూపీ కపిలః బడబాగ్నికి సంబంధించిన వర్ణము కపిలవర్ణము. పరమాత్ముడు తద్రూపుడు అని - బడబాగ్ని పరమాత్ముని విభూతియే అని భావన చేయగా, 'కపిలః' అనబడును.

बडबानलस्य कपिलो वर्ण इति तद्रूपी कपिलः / Baḍabānalasya kapilo varṇa iti tadrūpī kapilaḥ The color of Baḍabānala i.e., submarine fire or fire that burns beneath ocean (hot layers beneath) is kapila or tawny. Since the Lord is of that form, He is Kapilaḥ.

सनात्सनातनतमः कपिलः कपिरप्ययः ।
स्वस्तिदस्स्वस्तिकृत् स्वस्ति स्वस्तिभुक् स्वस्तिदक्षिणः ॥ ९६ ॥

సనాత్సనాతనతమః కపిలః కపిరప్యయః ।
స్వస్తిదస్స్వస్తికృత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః ॥ 96 ॥

Sanātsanātanatamaḥ kapilaḥ kapirapyayaḥ,
Svastidassvastikr̥t svasti svastibhuk svastidakṣiṇaḥ ॥ 96 ॥

19 ఏప్రి, 2015

897. సనాతనతమః, सनातनतमः, Sanātanatamaḥ

ఓం సనాతనతమాయ నమః | ॐ सनातनतमाय नमः | OM Sanātanatamāya namaḥ

సర్వకారణత్వాత్ విరిఞ్చయాదీనామపి సనాతనానామతిశయేన సనాతనత్వాత్ సనాతనతమః సనాతనులు, ప్రాచీనుల అందరలోను మిగుల సనాతనుడు; పరమాత్ముడు సర్వకారణము కావున సనాతనులగు చతుర్ముఖ బ్రహ్మాది దేవతలందరలోను ప్రాచీనతముడు కనుక సనాతనతమః.

सर्वकारणत्वात् विरिञ्चयादीनामपि सनातनानामतिशयेन सनातनत्वात् सनातनतमः / Sarvakāraṇatvāt viriñcayādīnāmapi sanātanānāmatiśayena sanātanatvāt sanātanatamaḥ Being the cause of everything and being more ancient than Brahma and others who are ancient, He is Sanātanatamaḥ i.e., most ancient.

सनात्सनातनतमः कपिलः कपिरप्ययः ।
स्वस्तिदस्स्वस्तिकृत् स्वस्ति स्वस्तिभुक् स्वस्तिदक्षिणः ॥ ९६ ॥

సనాత్సనాతనతమః కపిలః కపిరప్యయః ।
స్వస్తిదస్స్వస్తికృత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః ॥ 96 ॥

Sanātsanātanatamaḥ kapilaḥ kapirapyayaḥ,
Svastidassvastikr̥t svasti svastibhuk svastidakṣiṇaḥ ॥ 96 ॥

18 ఏప్రి, 2015

896. సనాత్, सनात्, Sanāt

ఓం సనాతే నమః | ॐ सनाते नमः | OM Sanāte namaḥ

సనాత్ ఇతి నిపాతః చిరార్థవచనః ।
కాలశ్చ ప్రస్యైవ వికల్పనా కాపి ॥

'సనాత్‍' అను నిపాతము అనగా అవ్యుత్పన్న శబ్దము - 'చిరకాలము' అను అర్థమును తెలుపునది. కాలము కూడ పరతత్త్వ విషయమున ఏర్పడు ఒకానొక అనిర్వచనీయమైన వికల్పన అనగా భేద కల్పన మాత్రమే.

:: విష్ణు పురాణే ప్రథమాంశే ద్వితీయోఽధ్యాయః ::
పరస్య బ్రహ్మణో రూపం పురుషః ప్రథమం ద్విజ ।
వ్యక్తాఽవ్యక్తే తథైవాఽన్యే రూపే కాల స్తథాఽపరమ్ ॥ 15 ॥

పరబ్రహ్మకు సంబంధించిన మొదటి రూపము చైతన్య రూపమగు పురుషుడు. అటులే మరి రెండు - అవ్యక్తమైన ప్రకృతి, వ్యక్తమగు మహత్తత్త్వాదికము. నాలుగవది కాలము అని తెలియుము.

सनात् इति निपातः चिरार्थवचनः ।
कालश्च प्रस्यैव विकल्पना कापि ॥

Sanāt iti nipātaḥ cirārthavacanaḥ,
Kālaśca prasyaiva vikalpanā kāpi.

The particle Sanāt conveys the meaning of long duration. Kāla or time is a manifestation of the Supreme.

:: विष्णु पुराणे प्रथमांशे द्वितीयोऽध्यायः ::
परस्य ब्रह्मणो रूपं पुरुषः प्रथमं द्विज ।
व्यक्ताऽव्यक्ते तथैवाऽन्ये रूपे काल स्तथाऽपरम् ॥ १५ ॥

Viṣṇu Purāṇa Part 1, Chapter 2
Parasya brahmaṇo rūpaṃ puruṣaḥ prathamaṃ dvija,
Vyaktā’vyakte tathaivā’nye rūpe kāla stathā’param. 15.

Puruṣa is the first form of Parabrahman. Vyakta and avyakta - the manifested and the unmanifested are the next forms. The next is kāla or Time.

सनात्सनातनतमः कपिलः कपिरप्ययः ।
स्वस्तिदस्स्वस्तिकृत् स्वस्ति स्वस्तिभुक् स्वस्तिदक्षिणः ॥ ९६ ॥

సనాత్సనాతనతమః కపిలః కపిరప్యయః ।
స్వస్తిదస్స్వస్తికృత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః ॥ 96 ॥

Sanātsanātanatamaḥ kapilaḥ kapirapyayaḥ,
Svastidassvastikr̥t svasti svastibhuk svastidakṣiṇaḥ ॥ 96 ॥

17 ఏప్రి, 2015

895. అద్భుతః, अद्भुतः, Adbhutaḥ

ఓం అద్భూతాయ నమః | ॐ अद्भूताय नमः | OM Adbhūtāya namaḥ

అద్భుతత్వాత్ అద్భుతః ఆశ్చర్యకరుడు కనుక అద్భుతః.

:: కఠోపనిషత్ ప్రథమాధ్యాయః (2వ వల్లి) ::
శ్రవణాయాఽపి బహుభిర్యో న లభ్యః శృణ్వన్తోఽపి బహవో యం న విద్యుః ।
ఆశ్చర్యో వక్తా కుశలోఽస్య లబ్బ్ధాఽశ్చర్యో జ్ఞాతా కుశలానుశిష్టః ॥ 7 ॥

ఆత్మను గురించి వినుటకు అనేకులకు సాధ్యము కాదు. ఒకప్పుడు వినినప్పటికీ దానిని సరిగా అర్థము చేసికొనలేరు. ఆట్టి స్థితిలో ఆత్మజ్ఞానము బోధించువాడు లభించిన ఆశ్చర్యకరమైన విషయమే! తగిన గురువుచేత బోధింపబడినవాడై దానిని గ్రహించగల శిష్యుడు లభించుటయు నాశ్చర్యకరమైన విషయమే.

:: శ్రీమద్భగవద్గీత శాఙ్ఖ్య యోగము ::
ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేన మాశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ।
ఆశ్చర్యవచ్చైనమన్యశ్శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్ ॥ 29 ॥

ఈ ఆత్మను ఒకానొకడు ఆశ్చర్యమైనదానినివలె చూచుచున్నాడు. మఱియొకడు ఆశ్చర్యమైనదానినివలె దీనిని గూర్చి చెప్పుచున్నాడు. అట్లే వేఱొకడు ఆశ్చర్యమైన దానినివలె దీనినిగూర్చి విచుచున్నాడు. ఆట్లే వినియు, చూచియు, చెప్పియుగూడ ఒకడును దానిని సరిగా తెలిసికొనుటలేదు, సాక్షాత్తుగా అనుభవించుటలేదు.

अद्भुतत्वात् अद्भुतः / Adbhutatvāt adbhutaḥ Since He is wonderful, He is called Adbhutaḥ.

:: कठोपनिषत् प्रथमाध्यायः (2व वल्लि) ::
श्रवणायाऽपि बहुभिर्यो न लभ्यः शृण्वन्तोऽपि बहवो यं न विद्युः ।
आश्चर्यो वक्ता कुशलोऽस्य लब्ब्धाऽश्चर्यो ज्ञाता कुशलानुशिष्टः ॥ 7 ॥

Kaṭhopaniṣat Chapter 1, Valli 2
Śravaṇāyā’pi bahubhiryo na labhyaḥ śr̥ṇvanto’pi bahavo yaṃ na vidyuḥ,
Āścaryo vaktā kuśalo’sya labbdhā’ścaryo jñātā kuśalānuśiṣṭaḥ. 7.

Of that (Self), which is not available for the mere hearing of many, which many do not understand even having heard, the expounder is wonderful and the receiver is wonderful; wonderful is he who knows under the instruction of an adept.

:: श्रीमद्भगवद्गीत शाङ्ख्य योग ::
आश्चर्यवत्पश्यति कश्चिदेन माश्चर्यवद्वदति तथैव चान्यः ।
आश्चर्यवच्चैनमन्यश्शृणोति श्रुत्वाप्येनं वेद न चैव कश्चित् ॥ २९ ॥

Śrīmad Bhagavad Gīta Chapter 2
Āścaryavatpaśyati kaścidena māścaryavadvadati tathaiva cānyaḥ,
Āścaryavaccainamanyaśśr̥ṇoti śrutvāpyenaṃ veda na caiva kaścit. 29.

Someone visualizes It as a wonder and similarly indeed, someone else talks of It as a wonder and someone else hears of It as a wonder. And someone else, indeed, does not realize It even after hearing about It.

अनन्तो हुतभुग् भोक्ता सुखदो नैकजोऽग्रजः ।
अनिर्विण्णस्सदामर्षी लोकाधिष्ठानमद्भुतः ॥ ९५ ॥

అనన్తో హుతభుగ్ భోక్తా సుఖదో నైకజోఽగ్రజః ।
అనిర్విణ్ణస్సదామర్షీ లోకాధిష్ఠానమద్భుతః ॥ 95 ॥

Ananto hutabhug bhoktā sukhado naikajo’grajaḥ,
Anirviṇṇassadāmarṣī lokādhiṣṭhānamadbhutaḥ ॥ 95 ॥

16 ఏప్రి, 2015

894. లోకాఽధిష్ఠానమ్, लोकाऽधिष्ठानम्, Lokā’dhiṣṭhānam

ఓం లోకాధిష్ఠానాయ నమః | ॐ लोकाधिष्ठानाय नमः | OM Lokādhiṣṭhānāya namaḥ

తమనాధారమాధార మధిష్ఠాయ త్రయో లోకాస్తిష్ఠన్తి ఇతి లోకాధిష్ఠానం బ్రహ్మ లోకములకు ఆశ్రయము; తనకు ఎవరును ఆశ్రయము లేని అతనిని ఆశ్రయించి మూడు లోకములును నిలిచియున్నవి. అట్టిది బ్రహ్మతత్త్వము.

तमनाधारमाधार मधिष्ठाय त्रयो लोकास्तिष्ठन्ति इति लोकाधिष्ठानं ब्रह्म / Tamanādhāramādhāra madhiṣṭhāya trayo lokāstiṣṭhanti iti lokādhiṣṭhānaṃ brahma All worlds remain in position standing on Him, who has no support, as their support i.e., Brahma.

अनन्तो हुतभुग् भोक्ता सुखदो नैकजोऽग्रजः ।
अनिर्विण्णस्सदामर्षी लोकाधिष्ठानमद्भुतः ॥ ९५ ॥

అనన్తో హుతభుగ్ భోక్తా సుఖదో నైకజోఽగ్రజః ।
అనిర్విణ్ణస్సదామర్షీ లోకాధిష్ఠానమద్భుతః ॥ 95 ॥

Ananto hutabhug bhoktā sukhado naikajo’grajaḥ,
Anirviṇṇassadāmarṣī lokādhiṣṭhānamadbhutaḥ ॥ 95 ॥

15 ఏప్రి, 2015

893. సదామర్షీ, सदामर्षी, Sadāmarṣī

ఓం సదామర్షిణే నమః | ॐ सदामर्षिणे नमः | OM Sadāmarṣiṇe namaḥ

సతః సాధూన్ ఆభిముఖ్యేన మృష్యతే క్షమత ఇతి సదామర్షీ సజ్జనులను, సాధు పురుషులను ఆభిముఖ్యముతో అనగా వారి ఎదుటనున్నవాడగుచు క్షమించును కనుక సదామర్షీ. సజ్జనుల అపరాధములను క్షమించి వారిని రక్షించును.

सतः साधून् आभिमुख्येन मृष्यते क्षमत इति सदामर्षी / Sataḥ sādhūn ābhimukhyena mr̥ṣyate kṣamata iti sadāmarṣī He is good to good people or forgives or bears with them; hence Sadāmarṣī.

अनन्तो हुतभुग् भोक्ता सुखदो नैकजोऽग्रजः ।
अनिर्विण्णस्सदामर्षी लोकाधिष्ठानमद्भुतः ॥ ९५ ॥

అనన్తో హుతభుగ్ భోక్తా సుఖదో నైకజోఽగ్రజః ।
అనిర్విణ్ణస్సదామర్షీ లోకాధిష్ఠానమద్భుతః ॥ 95 ॥

Ananto hutabhug bhoktā sukhado naikajo’grajaḥ,
Anirviṇṇassadāmarṣī lokādhiṣṭhānamadbhutaḥ ॥ 95 ॥

14 ఏప్రి, 2015

892. అనిర్విణ్ణః, अनिर्विण्णः, Anirviṇṇaḥ

ఓం అనిర్విణ్ణాయ నమః | ॐ अनिर्विण्णाय नमः | OM Anirviṇṇāya namaḥ

అవాత్పసర్వకామత్వాదప్రాప్తిహేత్వభావాన్నిర్వేదోఽస్య నాస్తీతి అనిర్విణ్ణః 'నేను ఇట్లుంటినే' అను నిర్వేదమును, ఖేదమును పొందెడివాడు కాడు కావున విష్ణువు అనిర్విణ్ణః. ఏలయన ఆ హరి అవాప్త సకల కాముడు అనగా అన్ని కోరికల ఫలములను పొందినవాడు. అప్రాప్తి అనగా ఏ దేనినైనను పొందక పోవుట అను నిర్వేదమును కలిగించు హేతువు ఏదియు ఈతనికి లేదు.

अवात्प सर्वकामत्वादप्राप्तिहेत्वभावान्निर्वेदोऽस्य नास्तीति अनिर्विण्णः / Avātpa sarvakāmatvādaprāptihetvabhāvānnirvedo’sya nāstīti anirviṇṇaḥ The One who never has a feeling 'Why have I ended up like this?' caused by unfulfilled desires, is Anirviṇṇaḥ. Lord Hari has no grief as He is of all realized desires since there can be no desire unrealized by Him or as He has no want to desire its realization.

अनन्तो हुतभुग् भोक्ता सुखदो नैकजोऽग्रजः ।
अनिर्विण्णस्सदामर्षी लोकाधिष्ठानमद्भुतः ॥ ९५ ॥

అనన్తో హుతభుగ్ భోక్తా సుఖదో నైకజోఽగ్రజః ।
అనిర్విణ్ణస్సదామర్షీ లోకాధిష్ఠానమద్భుతః ॥ 95 ॥

Ananto hutabhug bhoktā sukhado naikajo’grajaḥ,
Anirviṇṇassadāmarṣī lokādhiṣṭhānamadbhutaḥ ॥ 95 ॥

13 ఏప్రి, 2015

891. అగ్రజః, अग्रजः, Agrajaḥ

ఓం అగ్రజాయ నమః | ॐ अग्रजाय नमः | OM Agrajāya namaḥ

అగ్రే జాయత ఇతి అగ్రజః, హిరణ్యగర్భః - హిరణ్యగర్భః సమవర్తతాగ్రే' ఇత్యాది శ్రుతేః అందరికంటెను ముందటి కాలమునందు జనించినవాడు; హిరణ్యగర్భుడు.

'హిరణ్యగర్భః సమవర్తతాఽగ్రే' (ఋ. సం. 10.121.1) - 'మొదట హిరణ్యగర్భుడు ఉండెను' అను శ్రుతి ఈ విషయమున ప్రమాణము.

अग्रे जायत इति अग्रजः, हिरण्यगर्भः - हिरण्यगर्भः समवर्तताग्रे इत्यादि श्रुतेः / Agre jāyata iti agrajaḥ, hiraṇyagarbhaḥ - Hiraṇyagarbhaḥ samavartatāgre ityādi śruteḥ Born first i.e., Hiraṇyagarbhaḥ vide the śruti 'हिरण्यगर्भः समवर्तताऽग्रे' / 'Hiraṇyagarbhaḥ samavartatā’gre' (R̥. Saṃ. 10.121.1) - Hiraṇyagarbha appeared first.

अनन्तो हुतभुग् भोक्ता सुखदो नैकजोऽग्रजः ।
अनिर्विण्णस्सदामर्षी लोकाधिष्ठानमद्भुतः ॥ ९५ ॥

అనన్తో హుతభుగ్ భోక్తా సుఖదో నైకజోఽగ్రజః ।
అనిర్విణ్ణస్సదామర్షీ లోకాధిష్ఠానమద్భుతః ॥ 95 ॥

Ananto hutabhug bhoktā sukhado naikajo’grajaḥ,
Anirviṇṇassadāmarṣī lokādhiṣṭhānamadbhutaḥ ॥ 95 ॥

12 ఏప్రి, 2015

890. నైకజః, नैकजः, Naikajaḥ

ఓం నైకజాయ నమః | ॐ नैकजाय नमः | OM Naikajāya namaḥ

ధర్మగుప్తయే అసకృజ్జాయమానత్వాత్ నైకజః ఏకజః - అనగా ఒకసారి పుట్టెడి లేదా అవతరించెడిది. న ఏకజః - అనగా పదే పదే అవతరించుట. ధర్మస్థాపనార్థమై పలుమారులు అవతరించెడివాడు కనుక హరి నైకజః.

धर्मगुप्तये असकृज्जायमानत्वात् नैकजः / Dharmaguptaye asakr̥jjāyamānatvāt naikajaḥ Ekajaḥ means born once; na ekajaḥ - not born only once or incarnating more than once and multiple times. Being incarnated many times for the preservation of dharma, He is Naikajaḥ.

अनन्तो हुतभुग् भोक्ता सुखदो नैकजोऽग्रजः ।
अनिर्विण्णस्सदामर्षी लोकाधिष्ठानमद्भुतः ॥ ९५ ॥

అనన్తో హుతభుగ్ భోక్తా సుఖదో నైకజోఽగ్రజః ।
అనిర్విణ్ణస్సదామర్షీ లోకాధిష్ఠానమద్భుతః ॥ 95 ॥

Ananto hutabhug bhoktā sukhado naikajo’grajaḥ,
Anirviṇṇassadāmarṣī lokādhiṣṭhānamadbhutaḥ ॥ 95 ॥

11 ఏప్రి, 2015

889. సుఖదః, सुखदः, Sukhadaḥ

ఓం సుఖదాయ నమః | ॐ सुखदाय नमः | OM Sukhadāya namaḥ

భక్తానాం సుఖం మోక్షలక్షణం దదాతీతి సుఖదః భక్తులకు మోక్షరూపమగు సుఖమును ఇచ్చును కనుక సుఖదః. అసుఖం దతి ఖణ్డయతీతి వా అసుఖదః అట్టి భక్తుల అసుఖమును ఖండించును కనున అసుఖదః అను విభాగమును కూడ చెప్పవచ్చును.

भक्तानां सुखं मोक्षलक्षणं ददातीति सुखदः / Bhaktānāṃ sukhaṃ mokṣalakṣaṇaṃ dadātīti sukhadaḥ Gives sukha or bliss of mokṣa to His devotees hence Sukhadaḥ. असुखं दति खण्डयतीति वा असुखदः / Asukhaṃ dati khaṇḍayatīti vā asukhadaḥ Spelt as Asukhadaḥ - He cuts or removes the asukham or the miseries of His devotees.

अनन्तो हुतभुग् भोक्ता सुखदो नैकजोऽग्रजः ।
अनिर्विण्णस्सदामर्षी लोकाधिष्ठानमद्भुतः ॥ ९५ ॥

అనన్తో హుతభుగ్ భోక్తా సుఖదో నైకజోఽగ్రజః ।
అనిర్విణ్ణస్సదామర్షీ లోకాధిష్ఠానమద్భుతః ॥ 95 ॥

Ananto hutabhug bhoktā sukhado naikajo’grajaḥ,
Anirviṇṇassadāmarṣī lokādhiṣṭhānamadbhutaḥ ॥ 95 ॥

10 ఏప్రి, 2015

888. భోక్తా, भोक्ता, Bhoktā

ఓం భోక్త్రే నమః | ॐ भोक्त्रे नमः | OM Bhoktre namaḥ

ప్రకృతిం భోగ్యామ్ అచేతనాం భుఙ్క్తే ఇతి, జగత్పాలయతీతి వా భోక్తా భోగ్య రూపయు అచేతనయు అగు ప్రకృతిని భుజించును కనుక భోక్తా. లేదా జగత్తును పాలించును కనుక భోక్తా.

प्रकृतिं भोग्याम् अचेतनां भुङ्क्ते इति, जगत्पालयतीति वा भोक्ता / Prakr̥tiṃ bhogyām acetanāṃ bhuṅkte iti, jagatpālayatīti vā bhoktā He enjoys the enjoyable things which constitute prakr̥ti or nature. Or since He protects the universe, He is called Bhoktā.

अनन्तो हुतभुग् भोक्ता सुखदो नैकजोऽग्रजः ।
अनिर्विण्णस्सदामर्षी लोकाधिष्ठानमद्भुतः ॥ ९५ ॥

అనన్తో హుతభుగ్ భోక్తా సుఖదో నైకజోఽగ్రజః ।
అనిర్విణ్ణస్సదామర్షీ లోకాధిష్ఠానమద్భుతః ॥ 95 ॥

Ananto hutabhug bhoktā sukhado naikajo’grajaḥ,
Anirviṇṇassadāmarṣī lokādhiṣṭhānamadbhutaḥ ॥ 95 ॥

9 ఏప్రి, 2015

887. హుతభుగ్, हुतभुग्, Hutabhug

ఓం హుతభుజే నమః | ॐ हुतभुजे नमः | OM Hutabhuje namaḥ

హుతం భునక్తీతి హుతభుగితి ప్రోచ్యతే హరిః హుతమును అనగా యజ్ఞమునందలి హవిస్సును భుజించును లేదా రక్షించును కనుక హుతభుక్‍.

879. హుతభుగ్, हुतभुग्, Hutabhug

हुतं भुनक्तीति हुतभुगिति प्रोच्यते हरिः / Hutaṃ bhunaktīti hutabhugiti procyate hariḥ As He protects what is hutam offered in oblation, Lord Hari is called Hutabhuk.

879. హుతభుగ్, हुतभुग्, Hutabhug

अनन्तो हुतभुग् भोक्ता सुखदो नैकजोऽग्रजः ।
अनिर्विण्णस्सदामर्षी लोकाधिष्ठानमद्भुतः ॥ ९५ ॥

అనన్తో హుతభుగ్ భోక్తా సుఖదో నైకజోఽగ్రజః ।
అనిర్విణ్ణస్సదామర్షీ లోకాధిష్ఠానమద్భుతః ॥ 95 ॥

Ananto hutabhug bhoktā sukhado naikajo’grajaḥ,
Anirviṇṇassadāmarṣī lokādhiṣṭhānamadbhutaḥ ॥ 95 ॥

8 ఏప్రి, 2015

886. అనన్తః, अनन्तः, Anantaḥ

ఓం అనన్తాయ నమః | ॐ अनन्ताय नमः | OM Anantāya namaḥ

నిత్యత్వాత్ సర్వగతత్వాదనన్త ఇతి కథ్యతే ।
దేశకాలాపరిచ్ఛిన్నో విష్ణుర్వా శేషరూపధృత్ ॥

నిత్యుడును, సర్వగతుడును, దేశకాల కృతమగు పరిచ్ఛేదము అనగా పరిమితి లేనివాడగుటచే శ్రీ విష్ణువునకు అనంతుడని నామము. అనంతుడు అనగా అంతము లేనివాడు. ఆదిశేషుడనియైనను చెప్పవచ్చును.

659. అనన్తః, अनन्तः, Anantaḥ

नित्यत्वात् सर्वगतत्वादनन्त इति कथ्यते ।
देशकालापरिच्छिन्नो विष्णुर्वा शेषरूपधृत् ॥

Nityatvāt sarvagatatvādananta iti kathyate,
Deśakālāparicchinno viṣṇurvā śeṣarūpadhr̥t.

Since He is eternal, omnipresent and not limited by constraints like time and space - Lord Viṣṇu is called Anantaḥ the limitless. Or since also He is of the form of Ādiśeṣa, the name Anantaḥ.

659. అనన్తః, अनन्तः, Anantaḥ

अनन्तो हुतभुग् भोक्ता सुखदो नैकजोऽग्रजः ।
अनिर्विण्णस्सदामर्षी लोकाधिष्ठानमद्भुतः ॥ ९५ ॥

అనన్తో హుతభుగ్ భోక్తా సుఖదో నైకజోఽగ్రజః ।
అనిర్విణ్ణస్సదామర్షీ లోకాధిష్ఠానమద్భుతః ॥ 95 ॥

Ananto hutabhug bhoktā sukhado naikajo’grajaḥ,
Anirviṇṇassadāmarṣī lokādhiṣṭhānamadbhutaḥ ॥ 95 ॥

7 ఏప్రి, 2015

885. రవిలోచనః, रविलोचनः, Ravilocanaḥ

ఓం రవిలోచనాయ నమః | ॐ रविलोचनाय नमः | OM Ravilocanāya namaḥ

రవిర్లోచనమస్యేతి రవిలోచన ఈర్యతే ।
చక్షుషీ చన్ద్రసూర్యావిత్యాదిశ్రుతిసమీరణాత్ ॥

ఈతనికి రవి కన్నుగానున్నాడు కనుక రవిలోచనః.

:: ముణ్డకోపనిషత్ - ద్వితీయ ముణ్డకే ప్రథమ ఖణ్డః ::
అగ్ని ర్మూర్థా చక్షుషీ చన్ద్రసూర్యా దిశః శ్రోత్రే వా గ్వివృతాశ్చ వేదాః ।
వాయుః ప్రాణో హృదయం విశ్వమస్య పద్భ్యాం పృథివీ హ్యేష సర్వభూతాన్తరాత్మా ॥ 4 (26) ॥

విరాట్పురుషునకు ఆకాశమే శిరస్సు; సూర్యచంద్రులు నేత్రములు; దిక్కులు శ్రోత్రములు; వాగ్వివరములు వేదములు వాక్కు; వాయువే ప్రాణము. ఈ విశ్వమే మనస్సు. ఆ పురుషుని పాదముల నుండి భూమి పుట్టెను, అతడే సర్వభూతాంతరాత్మగా వెలుగుచున్నాడు.

रविर्लोचनमस्येति रविलोचन ईर्यते ।
चक्षुषी चन्द्रसूर्यावित्यादिश्रुतिसमीरणात् ॥

Ravirlocanamasyeti ravilocana īryate,
Cakṣuṣī candrasūryāvityādiśrutisamīraṇāt.

Since He has Ravi or the sun as (one of) His eye(s), He is Ravilocanaḥ.

:: मुण्डकोपनिषत् - द्वितीय मुण्डके प्रथम खण्डः ::
अग्नि र्मूर्था चक्षुषी चन्द्रसूर्या दिशः श्रोत्रे वा ग्विवृताश्च वेदाः ।
वायुः प्राणो हृदयं विश्वमस्य पद्भ्यां पृथिवी ह्येष सर्वभूतान्तरात्मा ॥ ४ (२६) ॥

Muṇḍakopaniṣat - Muṇḍaka 2, Chapter 1
Agni rmūrthā cakṣuṣī candrasūryā diśaḥ śrotre vā gvivr̥tāśca vedāḥ,
Vāyuḥ prāṇo hr̥dayaṃ viśvamasya padbhyāṃ pr̥thivī hyeṣa sarvabhūtāntarātmā. 4 (26).

The indwelling Self of all is surely He of whom the heaven is the head, the moon and sun are the two eyes, the directions are the two ears, the revealed Vedas are the speech, air is the vital force, the whole Universe is the heart, and (it is He) from whose two feet emerged the earth.

विहायसगतिर्ज्योतिस्सुरुचिर्हुतभुग्विभुः ।
रविर्विलोचनस्सूर्यः सविता रविलोचनः ॥ ९४ ॥

విహాయసగతిర్జ్యోతిస్సురుచిర్హుతభుగ్విభుః ।
రవిర్విలోచనస్సూర్యః సవితా రవిలోచనః ॥ 94 ॥

Vihāyasagatirjyotissurucirhutabhugvibhuḥ,
Ravirvilocanassūryaḥ savitā ravilocanaḥ ॥ 94 ॥

6 ఏప్రి, 2015

884. సవితా, सविता, Savitā

ఓం సవిత్రే నమః | ॐ सवित्रे नमः | OM Savitre namaḥ

విష్ణుః సర్వస్య జగతః ప్రసవాత్ సవితేర్యతే ।
ప్రజానాన్తు ప్రసవనాత్ సవితేతి నిగద్యతే ॥

సర్వ జగత్తును ప్రసవించును కావున విష్ణువు 'సవితా'.

:: విష్ణు ధర్మోత్తర పురాణే ప్రథమ ఖణ్డే త్రింశోఽధ్యాయః ::
ధామకార్యం హి క్రియతే యేనాస్య జగతః సదా ।
ప్రజానాన్తు ప్రసవనాత్ సవితేతి నిగద్యసే ॥ 15 ॥

వెలుగు కావలిసిన ఈ జగత్తుయొక్క స్థితి నీచే నిర్వహింపబడుచున్నది. ప్రజల ప్రసూతికి కారణమగుటచే సవిత యని (నీవు పిలువబడుతావు).

विष्णुः सर्वस्य जगतः प्रसवात् सवितेर्यते ।
प्रजानान्तु प्रसवनात् सवितेति निगद्यते ॥

Viṣṇuḥ sarvasya jagataḥ prasavāt saviteryate,
Prajānāntu prasavanāt saviteti nigadyate.

Since He is the One that brings to birth the entire universe, He is called Savitā.

:: विष्णु धर्मोत्तर पुराणे प्रथम खण्डे त्रिंशोऽध्यायः ::
धामकार्यं हि क्रियते येनास्य जगतः सदा ।
प्रजानान्तु प्रसवनात् सवितेति निगद्यसे ॥ १५ ॥

Viṣṇu Dharmottara Purāṇa - Section 1, Chapter 30
Dhāmakāryaṃ hi kriyate yenāsya jagataḥ sadā,
Prajānāntu prasavanāt saviteti nigadyase. 15.

You verily look after this world that needs illumination and since You issue out beings out of Yourself, You are called Savitā.

विहायसगतिर्ज्योतिस्सुरुचिर्हुतभुग्विभुः ।
रविर्विलोचनस्सूर्यः सविता रविलोचनः ॥ ९४ ॥

విహాయసగతిర్జ్యోతిస్సురుచిర్హుతభుగ్విభుః ।
రవిర్విలోచనస్సూర్యః సవితా రవిలోచనః ॥ 94 ॥

Vihāyasagatirjyotissurucirhutabhugvibhuḥ,
Ravirvilocanassūryaḥ savitā ravilocanaḥ ॥ 94 ॥

5 ఏప్రి, 2015

883. సూర్యః, सूर्यः, Sūryaḥ

ఓం సూర్యాయ నమః | ॐ सूर्याय नमः | OM Sūryāya namaḥ

సూతే శ్రియమితి సూర్యో వహ్నిర్వా సూర్య ఉచ్యతే ।
విష్ణుః సూతేస్సువతేర్వా సూర్యశబ్దో నిపాత్యతే ॥
రాజసూయ స్సూర్య ఇతి పాణినేర్వచనాత్తథా ॥

ఐశ్వర్యమును ప్రసవించును లేదా ఇచ్చును. ఇది సూర్యునికయినను అగ్నికైనను పేరు కాదగును.

[షూఞ్ - ప్రాణిప్రసవే (ప్రాణులను కనుట) లేదా షు - ప్రసవైశ్వర్యయోః (ప్రసవించుట, ఐశ్వర్యమునిచ్చుట) అను ధాతువు నుండి ఈ సూర్య శబ్దము నిష్పన్నమయినట్లు 'రాజసూయ సూర్య' (పాణిని 3.1.114) ఇత్యాది పాణిని సూత్రములచే నిపాతించబడుచున్నది.]

सूते श्रियमिति सूर्यो वह्निर्वा सूर्य उच्यते ।
विष्णुः सूतेस्सुवतेर्वा सूर्यशब्दो निपात्यते ॥
राजसूय स्सूर्य इति पाणिनेर्वचनात्तथा ॥

Sūte śriyamiti sūryo vahnirvā sūrya ucyate,
Viṣṇuḥ sūtessuvatervā sūryaśabdo nipātyate.
Rājasūya ssūrya iti pāṇinervacanāttathā.

Giver of wealth or brings the world to birth or induces to work. By Pāṇini's dictum 'Rājasūya Sūrya' (Pāṇini 3.1.114) the word surya in different senses is obtained. He is verily the sun, surya.

विहायसगतिर्ज्योतिस्सुरुचिर्हुतभुग्विभुः ।
रविर्विलोचनस्सूर्यः सविता रविलोचनः ॥ ९४ ॥

విహాయసగతిర్జ్యోతిస్సురుచిర్హుతభుగ్విభుః ।
రవిర్విలోచనస్సూర్యః సవితా రవిలోచనః ॥ 94 ॥

Vihāyasagatirjyotissurucirhutabhugvibhuḥ,
Ravirvilocanassūryaḥ savitā ravilocanaḥ ॥ 94 ॥

4 ఏప్రి, 2015

882. విరోచనః, विरोचनः, Virocanaḥ

ఓం విరోచనాయ నమః | ॐ विरोचनाय नमः | OM Virocanāya namaḥ

వివిధం రోచత ఇతి విరోచన ఇతీర్యతే వివిధములగా ప్రకాశించు సూర్య రూపుడు కనుక విరోచనః.

विविधं रोचत इति विरोचन इतीर्यते / Vividhaṃ rocata iti virocana itīryate He has various hues and hence Virocanaḥ.

विहायसगतिर्ज्योतिस्सुरुचिर्हुतभुग्विभुः ।
रविर्विलोचनस्सूर्यः सविता रविलोचनः ॥ ९४ ॥

విహాయసగతిర్జ్యోతిస్సురుచిర్హుతభుగ్విభుః ।
రవిర్విలోచనస్సూర్యః సవితా రవిలోచనః ॥ 94 ॥

Vihāyasagatirjyotissurucirhutabhugvibhuḥ,
Ravirvilocanassūryaḥ savitā ravilocanaḥ ॥ 94 ॥

3 ఏప్రి, 2015

881. రవిః, रविः, Raviḥ

ఓం రవయే నమః | ॐ रवये नमः | OM Ravaye namaḥ

రసానాదత్త ఇతి స ఆదిత్యాఽఽత్మా రవిః స్మృతః ।
రసానాం చ తథా దానాద్ రవిరిత్యభిధీయతే ॥

రసము అనగా జలములను తన కిరణములచే గ్రహించును కనుక రవిః - రసాన్ ఆదత్తే. ఆదిత్య రూపుడగు విష్ణువు 'రవిః' అని ఇచ్చట చెప్పబడినాడు.

:: విష్ణు ధర్మోత్తర పురాణే ప్రథమ ఖణ్డే త్రింశోఽధ్యాయః ::
రసానాఞ్చతథాఽఽదానాత్ రవి రిత్యభిధీయసే ।
ఆదిత్యస్త్వం తథా దానాత్ మిత్రతస్త్వం మైత్రభావతః ॥ 16 ॥

రసము (జలములు) వితరణము సేయుటచే రవియని, దానము సేయుటచే ఆదిత్యుడని, మైత్రభావనమును సర్వప్రాణులయెడ బాటించుటచే మిత్రుడని పేర్కొనబడుదువు.

रसानादत्त इति स आदित्याऽऽत्मा रविः स्मृतः ।
रसानां च तथा दानाद् रविरित्यभिधीयते ॥

Rasānādatta iti sa ādityā’’tmā raviḥ smr̥taḥ,
Rasānāṃ ca tathā dānād ravirityabhidhīyate.

Since He draws the juices i.e., waters, He is Raviḥ, of the form of Āditya - the Sun.

:: विष्णु धर्मोत्तर पुराणे प्रथम खण्डे त्रिंशोऽध्यायः ::
रसानाञ्चतथाऽऽदानात् रवि रित्यभिधीयसे ।
आदित्यस्त्वं तथा दानात् मित्रतस्त्वं मैत्रभावतः ॥ १६ ॥

Viṣṇu Dharmottara Purāṇa - Section 1, Chapter 30
Rasānāñcatathā’’dānāt ravi rityabhidhīyase,
Ādityastvaṃ tathā dānāt mitratastvaṃ maitrabhāvataḥ. 16.

Since You cause distribution of rasa or waters, You are known as Ravi. Since You grant - the name Āditya and because you are a friend of all beings, You are called Mitra.

विहायसगतिर्ज्योतिस्सुरुचिर्हुतभुग्विभुः ।
रविर्विलोचनस्सूर्यः सविता रविलोचनः ॥ ९४ ॥

విహాయసగతిర్జ్యోతిస్సురుచిర్హుతభుగ్విభుః ।
రవిర్విలోచనస్సూర్యః సవితా రవిలోచనః ॥ 94 ॥

Vihāyasagatirjyotissurucirhutabhugvibhuḥ,
Ravirvilocanassūryaḥ savitā ravilocanaḥ ॥ 94 ॥

2 ఏప్రి, 2015

880. విభుః, विभुः, Vibhuḥ

ఓం విభవే నమః | ॐ विभवे नमः | OM Vibhave namaḥ

సర్వత్ర వర్తమానత్వాద్ వా త్రిలోక్యాః ప్రభుత్వతః ।
విభురిత్యుచ్యతే విష్ణుర్వేదవిద్యావిశారదైః ॥

 విశేషముగా అంతటను ఉండును. సర్వవ్యాపి. లేదా లోకత్రయవిభుడు కనుక విభుః.

सर्वत्र वर्तमानत्वाद् वा त्रिलोक्याः प्रभुत्वतः ।
विभुरित्युच्यते विष्णुर्वेदविद्याविशारदैः ॥

Sarvatra vartamānatvād vā trilokyāḥ prabhutvataḥ,
Vibhurityucyate viṣṇurvedavidyāviśāradaiḥ.

Because He is omnipresent or because He is the Lord of the three worlds, He is Vibhuḥ.

विहायसगतिर्ज्योतिस्सुरुचिर्हुतभुग्विभुः
रविर्विलोचनस्सूर्यः सविता रविलोचनः ॥ ९४ ॥

విహాయసగతిర్జ్యోతిస్సురుచిర్హుతభుగ్విభుః
రవిర్విలోచనస్సూర్యః సవితా రవిలోచనః ॥ 94 ॥

Vihāyasagatirjyotissurucirhutabhugvibhuḥ,
Ravirvilocanassūryaḥ savitā ravilocanaḥ ॥ 94 ॥

1 ఏప్రి, 2015

879. హుతభుగ్, हुतभुग्, Hutabhug

ఓం హుతభుజే నమః | ॐ हुतभुजे नमः | OM Hutabhuje namaḥ

ఉద్దిశ్య దేవతాస్సర్వాః ప్రవృత్తేష్వసి కర్మసు ।
హుతం భూఙ్క్తే భునక్తితి వా విష్ణుర్హుతభుక్ స్మృతః ॥

సర్వ దేవతల ఉద్దేశముతో అనగా ఆయా దేవతలనుద్దేశించి ఆచరించు ఏ కర్మలయందైనను హుతము అనగా హవిర్ద్రవ్యమును తాను సర్వదేవతామయుడై భుజించును అనునది ఒక అర్థము. తానే యజ్ఞపతిగా ఉండి విష్ణువు ఆ హవిస్సును రక్షించును అనునది మరొక అర్థము. హుతమును స్వీకరించును, రక్షించును అని రెండు వ్యుత్పత్తులును ఇచ్చట గ్రహించదగును.

उद्दिश्य देवतास्सर्वाः प्रवृत्तेष्वसि कर्मसु ।
हुतं भूङ्क्ते भुनक्तिति वा विष्णुर्हुतभुक् स्मृतः ॥

Uddiśya devatāssarvāḥ pravr̥tteṣvasi karmasu,
Hutaṃ bhūṅkte bhunaktiti vā viṣṇurhutabhuk smr̥taḥ.

In all sacrificial acts dedicated to whichever god, He enjoys the oblation. Or He, presiding upon all sacrificial acts, has the responsibility of safeguarding the oblations.