5 ఆగ, 2014

640. ప్రద్యుమ్నః, प्रद्युम्नः, Pradyumnaḥ

ఓం ప్రద్యుమ్నాయ నమః | ॐ प्रद्युम्नाय नमः | OM Pradyumnāya namaḥ


ద్యుమ్నం ప్రకృష్టం ద్రవిణం యస్య ప్రద్యుమ్న ఏవ సః ।
చతుర్వ్యూహేష్వన్యతమ ఇతి వా సతథోచ్యతే ॥

ఉత్తమమైన ద్యుమ్నము అనగా శుద్ధజ్ఞానరూపమగు ధనము ఈతనికి కలదుగనుక ప్రద్యుమ్నః. లేదా 'చతుర్వ్యూహ' (138. చతుర్వ్యూహః, चतुर्व्यूहः, Caturvyūhaḥ) నామము నందు ప్రస్తావించబడిన నాలుగు వ్యూహములలో ప్రద్యుమ్న వ్యూహము కూడ ఈతనే.

:: శ్రీ మహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మపర్వణి ఏకోనచత్వారింశదధికత్రిశతతమోఽధ్యాయః ::
న చ జీవం వినా బ్రహ్మన్ వాయవశ్చేష్టయన్తుత ।
స జీవః పరిసంఖ్యాతహ్ శేషః సంకర్షణః ప్రభుః ॥ 36 ॥
తస్మాత్ సనత్కుమారత్వం యోఽలభత్ స్వేన కర్మణా ।
సస్మింశ్చ సర్వభూతాని ప్రలయం యాన్తి సంక్షయమ్ ॥ 37 ॥
స మనః సర్వభూతానాం ప్రద్యుమ్నః పరిపఠ్యేతే ।


జీవము లేక ప్రాణవాయువు వ్యాపారము అనగా చేష్ట చేయలేదు. అట్టి జీవమే శేషుడు లేదా భగవాన్ సంకర్షణుడుగా చెప్పబడుచున్నాడు. అట్టి సంకర్షణుడు లేదా జీవునినుండి ఉత్పన్నమై, తన కర్మల (ధ్యాన పూజాదులు) ద్వారా సనత్కుమారత్వమును అనగా జీవన్ముక్తిని పొందుతున్నది. అట్టి ఏ సనత్కుమారత్వమున సమస్త ప్రాణికోటియును లయ, క్షయములను పొందుచున్నవో, అట్టి సంపూర్ణ భూతముల మనమే 'ప్రద్యుమ్న' గా చెప్పబడుచున్నది.



द्युम्नं प्रकृष्टं द्रविणं यस्य प्रद्युम्न एव सः ।
चतुर्व्यूहेष्वन्यतम इति वा सतथोच्यते ॥

Dyumnaṃ prakr̥ṣṭaṃ draviṇaṃ yasya pradyumna eva saḥ,
Caturvyūheṣvanyatama iti vā satathocyate.

He who has infinite wealth. Or since being one of the four vyuhas (138. చతుర్వ్యూహః, चतुर्व्यूहः, Caturvyūhaḥ), Pradyumna is also the Lord Himself.

:: श्री महाभारते शान्तिपर्वणि मोक्षधर्मपर्वणि एकोनचत्वारिंशदधिकत्रिशततमोऽध्यायः ::
न च जीवं विना ब्रह्मन् वायवश्चेष्टयन्तुत ।
स जीवः परिसङ्ख्यातह् शेषः सङ्कर्षणः प्रभुः ॥ ३६ ॥
तस्मात् सनत्कुमारत्वं योऽलभत् स्वेन कर्मणा ।
सस्मिंश्च सर्वभूतानि प्रलयं यान्ति संक्षयम् ॥ ३७ ॥
स मनः सर्वभूतानां प्रद्युम्नः परिपठ्येते । 


Śrī Mahābhārata - Book XII, Chapter 339
Na ca jīvaṃ vinā brahman vāyavaśceṣṭayantuta,
Sa jīvaḥ parisaṃkhyātah śeṣaḥ saṃkarṣaṇaḥ prabhuḥ.
36.
Tasmāt sanatkumāratvaṃ yo’labhat svena karmaṇā,
Sasmiṃśca sarvabhūtāni pralayaṃ yānti saṃkṣayam.
37.
Sa manaḥ sarvabhūtānāṃ pradyumnaḥ paripaṭhyete,

Without, again, the entrance of Jīva into the body, the mind dwelling within it cannot cause it to move and act. He that enters the body is possessed of great puissance and is called Jīva. He is known also by other names, viz., Śeṣa and Sankarṣana. He that takes his rise, from that Sankarṣana, by his own acts, Sanatkumāra, and in whom all creatures merge when the universal dissolution comes, is the Mind of all creatures and is called by the name of Pradyumna.

अर्चिष्मानर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः ।
अनिरुद्धोऽप्रतिरथः प्रद्युम्नोऽमितविक्रमः ॥ ६८ ॥

అర్చిష్మానర్చితః కుమ్భో విశుద్ధాత్మా విశోధనః ।
అనిరుద్ధోఽప్రతిరథః ప్రద్యుమ్నోఽమితవిక్రమః ॥ 68 ॥

Arciṣmānarcitaḥ kumbho viśuddhātmā viśodhanaḥ,
Aniruddho’pratirathaḥ pradyumno’mitavikramaḥ ॥ 68 ॥

4 ఆగ, 2014

639. అప్రతిరథః, अप्रतिरथः, Apratirathaḥ

ఓం అప్రతిరథాయ నమః | ॐ अप्रतिरथाय नमः | OM Apratirathāya namaḥ


న విద్యతే ప్రతిరథః ప్రతిపక్షోఽస్య చక్రిణః ।
ఇత్యప్రతిరథ ఇతి ప్రోచ్యతే విబుధైర్హరిః ॥

పోటీబడగల ప్రతిపక్షుడు అనగా ప్రతిరథుడు లేనివాడు అప్రతిరథః. ఆ పరమాత్మతో పోటీబడగల సమర్థుడెవ్వడు?



न विद्यते प्रतिरथः प्रतिपक्षोऽस्य चक्रिणः ।
इत्यप्रतिरथ इति प्रोच्यते विबुधैर्हरिः ॥

Na vidyate pratirathaḥ pratipakṣo’sya cakriṇaḥ,
Ityapratiratha iti procyate vibudhairhariḥ.

The One who has no opponent rival to Him is Apratirathaḥ. Who is competent enough to rival the Lord?

अर्चिष्मानर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः ।
अनिरुद्धोऽप्रतिरथः प्रद्युम्नोऽमितविक्रमः ॥ ६८ ॥

అర్చిష్మానర్చితః కుమ్భో విశుద్ధాత్మా విశోధనః ।
అనిరుద్ధోఽప్రతిరథః ప్రద్యుమ్నోఽమితవిక్రమః ॥ 68 ॥

Arciṣmānarcitaḥ kumbho viśuddhātmā viśodhanaḥ,
Aniruddho’pratirathaḥ pradyumno’mitavikramaḥ ॥ 68 ॥

3 ఆగ, 2014

638. అనిరుద్ధః, अनिरुद्धः, Aniruddhaḥ

ఓం అనిరుద్ధాయ నమః | ॐ अनिरुद्धाय नमः | OM Aniruddhāya namaḥ



చతుర్వ్యూహేషు చతురః శత్రుర్భిర్ననిరుద్ధ్యతే ।
కదాచిద్వేతి సవిష్ణురనిరుద్ధ ఇతీర్యతే ॥

వాసుదేవుడు, ప్రద్యుమ్నుడూ, సంకర్షణుడూ, అనిరుద్ధుడూ అను నాలుగు వ్యూహములలో నాలుగవ వ్యూహము కూడ తానే అయి యున్నవాడు. లేదా ఎన్నడును శత్రువులచే అడ్డగించబడువాడు కాడు.

:: శ్రీ మహాభారతే శాన్తి పర్వణి మోక్షధర్మపర్వణి ఏకచత్వారింశదధికత్రిశతతమోఽధ్యాయః ::
తస్మాత్ సర్వాః ప్రవర్తన్తే సర్గప్రలయవిక్రియాః ।
తపో యజ్ఞశ్చ యష్టా చ పురాణాః పురుషో విరాట్ ॥ 25 ॥
అనిరుద్ధ ఇతి ప్రోక్తో లోకానాం ప్రభవాప్యయః । 25 ½ ।

(పదునెనిమిది గుణాలుగల సత్త్వము అనగా ఆదిపురుషరూపము) నుండే సృష్టి ప్రళయము అనే సంపూర్ణ వికారములు ఉద్భవిస్తాయి. ఆ స్వరూపమే తపమూ, యజ్ఞమూ, యజమానీ. అదే పురాతన విరాట్ రూపము. దానినే అనిరుద్ధుడు అని కూడా అందురు. దాని నుండే లోకాల సృష్టీ ప్రళయాలు సంభవిస్తాయి.

185. అనిరుద్ధః, अनिरुद्धः, Aniruddhaḥ



चतुर्व्यूहेषु चतुरः शत्रुर्भिर्ननिरुद्ध्यते ।
कदाचिद्वेति सविष्णुरनिरुद्ध इतीर्यते ॥

Caturvyūheṣu caturaḥ śatrurbhirnaniruddhyate,
Kadācidveti saviṣṇuraniruddha itīryate.

Of the four Vyuha forms or manifestations of God, the fourth i.e., Aniruddha is also Lord's form. Or the One who is never overcome by adversaries.

:: श्री महाभारते शान्ति पर्वणि मोक्षधर्मपर्वणि एकचत्वारिंशदधिकत्रिशततमोऽध्यायः ::
तस्मात् सर्वाः प्रवर्तन्ते सर्गप्रलयविक्रियाः ।
तपो यज्ञश्च यष्टा च पुराणाः पुरुषो विराट् ॥ २५ ॥
अनिरुद्ध इति प्रोक्तो लोकानां प्रभवाप्ययः । २५ ½ ।

Śrī Mahābhārata - Book XII, Chapter 342
Tasmāt sarvāḥ pravartante sargapralayavikriyāḥ,
Tapo yajñaśca yaṣṭā ca purāṇāḥ puruṣo virāṭ. 25.
Aniruddha iti prokto lokānāṃ prabhavāpyayaḥ (25 ½)

From (Supreme Nature) it flows all the modifications of both Creation and Destruction. (It is identical with my Prakr̥ti or Nature). It is the penances that people undergo. He is both the sacrifice that is performed and the sacrificer that performs the sacrifice. He is the ancient and the infinite Puruṣa. He is otherwise called Aniruddha and is the source of the Creation and the Destruction of the universe.

185. అనిరుద్ధః, अनिरुद्धः, Aniruddhaḥ

अर्चिष्मानर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः ।
अनिरुद्धोऽप्रतिरथः प्रद्युम्नोऽमितविक्रमः ॥ ६८ ॥

అర్చిష్మానర్చితః కుమ్భో విశుద్ధాత్మా విశోధనః ।
అనిరుద్ధోఽప్రతిరథః ప్రద్యుమ్నోఽమితవిక్రమః ॥ 68 ॥

Arciṣmānarcitaḥ kumbho viśuddhātmā viśodhanaḥ,
Aniruddho’pratirathaḥ pradyumno’mitavikramaḥ ॥ 68 ॥

2 ఆగ, 2014

637. విశోధనః, विशोधनः, Viśodhanaḥ

ఓం విశోధనాయ నమః | ॐ विशोधनाय नमः | OM Viśodhanāya namaḥ


విశోధనః, विशोधनः, Viśodhanaḥ

స్మృతిమాత్రేణ పాపానాం (శోధనాత్‍) క్షపణాత్ స విశోధనః తన స్మరణ మాత్రముచేతనే పాపములను నశింపజేసి పాపులను విశుద్ధులనుగా చేయువాడు విశోధనః

:: పోతన భాగవతము - షష్టమ స్కంధము ::
సీ. బ్రహ్మహత్యానేక పాపాటవుల కగ్ని కీలలు హరినామ కీర్తనములు
గురుతల్ప కల్మష క్రూర సర్పములకుఁ గేకులు హరినామ కీర్తనములు
తపనీయ చౌర్య సంతమసంబుకను సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు
మధుపాన కిల్బిష మదనాగ సమితికిఁ గేసరుల్ హరినామ కీర్తనములు
గీ. మహిత యోగోగ్ర నిత్యసమాధి విధుల, నలరు బ్రహ్మాది సురులకు నందరాని
భూరి నిర్వాణ సామ్రాజ్య భోగభాగ్య, ఖేలనంబులు హరినామ కీర్తనములు. (118)

భగవంతుని నామసంకీర్తనలు బ్రహ్మహత్య మొదలైన పాపాములు అనే అడవులకు అగ్నిజ్వాలలు. హరినామ కీర్తనలు గురుద్రోహమనే ఘోర సర్పాలకు నెమళ్ళు. భగవన్నామ కీర్తనలు బంగారమును దోంగిలించడమనే మహా పాపరూపమైన చీకట్లను పోగొట్టే సూర్యకిరణములు.  హరినామ కీర్తనములు మధుపాన మహాపాపమనే మదపుటేనుగులను సంహరించే సింహాలు. మహిమతోగూడిన యోగసమాధి విధులతో ఒప్పే బ్రహ్మ మొదలగు దేవతలకు సైతము అందరాని మోక్ష సామ్రాజ్య వైభవ విలాసములు హరినామ కీర్తనములు.



स्मृतिमात्रेण पापानां (शोधनात्‍) क्षपणात् स विशोधनः / Smr̥timātreṇa pāpānāṃ (śodhanātˈ) kṣapaṇāt sa Viśodhanaḥ Since by mere remembrance He erases the sins, he purifies the sinners and hence He is Viśodhanaḥ.

:: श्रीमद्भागवते षष्ठस्कन्धे द्वितीयोऽध्यायः ::
अयम् हि कृतनिर्वेशो जन्मकोट्यंहसामपि ।
यद्व्याजहार विवशो नाम स्वस्त्ययनं हरेः ॥ ७ ॥

Śrīmad Bhāgavata - Canto 6, Chapter 2
Ayam hi kr̥tanirveśo janmakoṭyaṃhasāmapi,
Yadvyājahāra vivaśo nāma svastyayanaṃ hareḥ. 7.

(Ajāmiḷa) has already atoned for all his sinful actions. Indeed, he has atoned not only for sins performed in one life but for those performed in millions of lives, for in a helpless condition he chanted the holy name of Nārāyaṇa. Even though he did not chant purely, he chanted without offense, and therefore he is now pure and eligible for liberation.

अर्चिष्मानर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः ।
अनिरुद्धोऽप्रतिरथः प्रद्युम्नोऽमितविक्रमः ॥ ६८ ॥

అర్చిష్మానర్చితః కుమ్భో విశుద్ధాత్మా విశోధనః ।
అనిరుద్ధోఽప్రతిరథః ప్రద్యుమ్నోఽమితవిక్రమః ॥ 68 ॥

Arciṣmānarcitaḥ kumbho viśuddhātmā viśodhanaḥ,
Aniruddho’pratirathaḥ pradyumno’mitavikramaḥ ॥ 68 ॥

1 ఆగ, 2014

636. విశుద్ధాత్మా, विशुद्धात्मा, Viśuddhātmā

ఓం విశుద్ధాత్మనే నమః | ॐ विशुद्धात्मने नमः | OM Viśuddhātmane namaḥ


అసావాత్మా విశుద్ధశ్చ విశుద్ధాత్మేతి కథ్యతే గుణత్రయాతీతుడు కావున విశుద్ధమగు ఆత్మ స్వరూపము గల ఆ పరమాత్మ విశుద్ధాత్మగా పిలువబడును.



असावात्मा विशुद्धश्च विशुद्धात्मेति कथ्यते / Asāvātmā viśuddhaśca viśuddhātmeti kathyate Since He is beyond the three guṇas, He is Viśuddha or pure.  Since His is the purest ātma or soul, He is Viśuddhātmā.

अर्चिष्मानर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः ।
अनिरुद्धोऽप्रतिरथः प्रद्युम्नोऽमितविक्रमः ॥ ६८ ॥

అర్చిష్మానర్చితః కుమ్భో విశుద్ధాత్మా విశోధనః ।
అనిరుద్ధోఽప్రతిరథః ప్రద్యుమ్నోఽమితవిక్రమః ॥ 68 ॥

Arciṣmānarcitaḥ kumbho viśuddhātmā viśodhanaḥ,
Aniruddho’pratirathaḥ pradyumno’mitavikramaḥ ॥ 68 ॥