10 డిసెం, 2012

37. స్వయంభూః, स्वयंभूः, Svayaṃbhūḥ

ఓం స్వయంభువే నమః | ॐ स्वयंभुवे नमः | OM Svayaṃbhuve namaḥ

స్వయం ఏవ భవతి తనకు తానుగానే కలుగువాడు (ఉద్భవించినవాడు). 'స ఏవ స్వయముద్భవే' (మను స్మృతి 1-7) ఆ పరమేశ్వరుడు, పరమాత్మ తానుగానే ఉద్భవించాడు అను మను స్మృతి వచనము ఇందు ప్రమాణము. లేదా ఎల్లవారికిని పై గాను స్వయముగాను కూడ తాను ఉండును లేదా స్వయముగా తానే తనకు తానై ఎవరి ఆలంబనమును లేకయే ఉండును. లేదా ఎవ్వరికి - ఏ సకల భూతములకును పై వాడుగా తాను ఉండునో ఏ పరమాత్ముడుగా తాను ఎల్లవారికిని పైగా ఉండునో ఆ రెండును తానే ఐ ఉండును. పరమాత్మయు పరమేశ్వరుడును దృశ్యజగమందలి సమస్త పదార్థములును తానే అయి యుండును.

One who exists by Himself, uncaused by any other. Says Manu Smr̥ti (1.7) 'Sa eva svayamudbhave' - He manifested Himself'. He is so called because He existed before everything and over everything. He is the supreme.

स्वयम्भूश्शम्भुरादित्यः पुष्कराक्षो महास्वनः ।
अनादिनिधनो धाता विधाता धातुरुत्तमः ॥ 5 ॥

స్వయమ్భూశ్శమ్భురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః ।
అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమః ॥ 5 ॥

Svayambhūśśambhurādityaḥ puṣkarākṣo mahāsvanaḥ ।
Anādinidhano dhātā vidhātā dhāturuttamaḥ ॥ 5 ॥

9 డిసెం, 2012

36. ఈశ్వరః, ईश्वरः, Īśvaraḥ

ఓం ఈశ్వరాయ నమః | ॐ ईश्वराय नमः | OM Īśvarāya namaḥ

నిరుపాధికం ఐశ్వర్యం అస్య అస్తి ఉపాధితో పనిలేకయే సిద్ధించిన ఐశ్వర్యము - ఈశ్వరత్వము ఈతనికి కలదు.

:: భగవద్గీత - పురుషోత్తమప్రాప్తి యోగము::
ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః ।
యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః ॥ 17 ॥

ఎవడు మూడులోకములందును ప్రవేశించి వానిని భరించుచున్నాడో, అట్టి నాశరహితుడును, జగన్నియామకుడును, క్షరాక్షరులిద్దఱికంటెను వేఱైనవాడును నగు ఉత్తమపురుషుడు పరమాత్మయని చెప్పబడుచున్నాడు.

One who has unlimited lordiness or power over all things.

Bhagavad Gīta - Chapter 15
Uttamaḥ puruṣastvanyaḥ paramātmētyudāhr̥taḥ,
Yo lokatrayamāviśya bibhartyavyaya īśvaraḥ.
(17)

Different from the mutable and immutable is the supreme Person who is spoken of as the transcendental Self, who, permeating the three worlds, upholds (them), and is the imperishable God.

सर्वश्शर्वश्शिवस्थाणुर्भूतादिर्निधिरव्ययः ।
सम्भवो भावनो भर्ता प्रभवः प्रभुरीश्वरः ॥ 4 ॥

సర్వశ్శర్వశ్శివస్థాణుర్భూతాదిర్నిధిరవ్యయః ।
సమ్భవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః ॥ 4 ॥

Sarvaśśarvaśśivasthāṇurbhūtādirnidhiravyayaḥ ।
Sambhavo bhāvano bhartā prabhavaḥ prabhurīśvaraḥ ॥ 4 ॥

8 డిసెం, 2012

35. ప్రభుః, प्रभुः, Prabhuḥ

ఓం ప్రభవే నమః | ॐ प्रभवे नमः | OM Prabhavē namaḥ

ప్రభవతి అన్ని క్రియల యందును సమర్థుడు. సర్వశక్తుడు.

:: భగవద్గీత - రాజవిద్యా రాజగుహ్య యోగము ::
గతిర్భర్తా ప్రభుస్సాక్షీ నివాసశ్శరణం సుహృత్ ।
ప్రభవః ప్రలయః స్థానం నిధానం బీజమవ్యయమ్ ॥ 18 ॥

పరమలక్ష్యమును, భరించువాడును, ప్రభువును, సాక్షియు, ప్రాణుల నివాసమును, శరణమొందదగినవాడును, హితమొనర్చువాడును, సృష్టిస్థితిలయకర్తయు, నిక్షేపమును, నాశరహితమైన బీజమును నేనే అయియున్నాను.

యేఽప్యన్యదేవతాభక్తా యజన్తే శ్రద్ధయాన్వితాః ।
తేఽపి మామేవ కౌన్తేయ యజన్త్యవిధి పూర్వకమ్ ॥ 23 ॥
అహం హి సర్వ యజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ ।
న తు మామమ్భిజానన్తి తత్త్వేనాతశ్చ్యవన్తి తే ॥ 24 ॥

ఓ అర్జునా! ఎవరు ఇతర దేవతలయెడల భక్తిగలవారై శ్రద్ధతోగూడి వారి నారాధించుచున్నారో, వారున్ను నన్నే అవిధిపూర్వకముగ ఆరాధించుచున్న వారగుదురు. ఏలయనగా, సమస్తయజ్ఞములకు భోక్తను, ప్రభువు (యజమానుడు)ను నేనే అయియున్నాను. అట్టి నన్ను - వారు యథార్థముగ తెలిసికొనుటలేదు. ఇందువలన జారిపోవుచున్నారు.

One who is an adept in all rites.

Bhagavad Gīta - Chapter 9
Gatirbhartā prabhussākṣī nivāsaśśaraṇaṃ suhr̥t,
Prabhavaḥ pralayaḥ sthānaṃ nidhānaṃ bījamavyayam.
(18)

I am the fruit of actions, the nourisher, the Lord, witness, abode, refuge, friend, origin, end, foundation, store and the imperishable seed.

Ye’pyanyadevatābhaktā yajante śraddhayānvitāḥ,
Te’pi māmeva kaunteya yajantyavidhi pūrvakam.
(23)
Ahaṃ hi sarva yajñānāṃ bhoktā ca prabhureva ca,
Na tu māmambhijānanti tattvenātaścyavanti te.
(24)

Even those who, being devoted to other deities and endowed with faith, worship (them), they also, O son of Kuntī, worship Me alone (though) following the wrong method. I indeed am the enjoyer as also the Lord of all sacrifices; but they do not know Me in reality. Therefore they fall.

सर्वश्शर्वश्शिवस्थाणुर्भूतादिर्निधिरव्ययः ।
सम्भवो भावनो भर्ता प्रभवः प्रभुरीश्वरः ॥ 4 ॥

సర్వశ్శర్వశ్శివస్థాణుర్భూతాదిర్నిధిరవ్యయః ।
సమ్భవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః ॥ 4 ॥

Sarvaśśarvaśśivasthāṇurbhūtādirnidhiravyayaḥ ।
Sambhavo bhāvano bhartā prabhavaḥ prabhurīśvaraḥ ॥ 4 ॥

7 డిసెం, 2012

34. ప్రభవః, प्रभवः, Prabhavaḥ

ఓం ప్రభవాయ నమః | ॐ प्रभवाय नमः | OM Prabhavāya namaḥ

ప్ర(ప్రకర్షేణ సర్వాణి భూతాని అస్మాత్‌) భవంతి సకల భూతములును, ప్రాణులును ఈతని నుండియే మిక్కిలిగా కలుగుచున్నవి. లేదా ప్ర(కృష్టః) భవః (అస్య) ఇతర ప్రాణుల జన్మముకంటే విశిష్టమగు అవతారములు ఈతనికి కలవు.

:: భగవద్గీత - విజ్ఞాన యోగము ::
ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ ।
అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రలయస్తథా ॥ 6 ॥

జడ, చేతనములగు సమస్త భూతములున్ను రెండు విధములగు (పరాపర) ప్రకృతుల వలననే కలుగునవియని తెలిసికొనుము. ఈ రెండు ప్రకృతుల* ద్వారా నేనే ఈ సమస్త ప్రపంచముయొక్క ఉత్పత్తికి, వినాశమునకు కారణ భూతుడనై యున్నాను.

* - అపరా ప్రకృతి చాల అల్పమైనది. దీనికంటే వేఱైనదియు, ఈ జగత్తునంతయు ధరించునదియు, జీవరూపమైనదియునగు 'పరాప్రకృతి' యను మఱియొక ప్రకృతి శ్రేష్ఠమైనది.

One from whom all the great elements have their birth. Or one who has exalted births as incarnations.

Bhagavad Gīta - Chapter 7
Etadyonīni bhūtāni sarvāṇītyupadhāraya,
Ahaṃ kr̥tsnasya jagataḥ prabhavaḥ pralayastathā
. (6)

Understand thus that all sentient and insentient things have these* as their source. I am the origin as also the end of the whole Universe.

* - The Prakr̥ti that is divided eight fold is inferior to the other Prakr̥ti of Lord which takes the form of individual souls and by which this world is upheld.

सर्वश्शर्वश्शिवस्थाणुर्भूतादिर्निधिरव्ययः ।
सम्भवो भावनो भर्ता प्रभवः प्रभुरीश्वरः ॥ 4 ॥

సర్వశ్శర్వశ్శివస్థాణుర్భూతాదిర్నిధిరవ్యయః ।
సమ్భవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః ॥ 4 ॥

Sarvaśśarvaśśivasthāṇurbhūtādirnidhiravyayaḥ ।
Sambhavo bhāvano bhartā prabhavaḥ prabhurīśvaraḥ ॥ 4 ॥

6 డిసెం, 2012

33. భర్తా, भर्ता, Bhartā

ఓం భర్త్రే నమః | ॐ भर्त्रे नमः | OM Bhartre namaḥ

ప్రపంచస్య అధిష్ఠానతయా - తం - బిభర్తి మిథ్యా తత్వముగా తోచుచున్న ప్రపంచమునకు అధిష్ఠానముగా దానిని తనయందు నిలుపుకొని పోషించి  భరించు వాడు.

:: భగవద్గీత - రాజవిద్యా రాజగుహ్య యోగము ::
గతిర్భర్తా ప్రభుస్సాక్షీ నివాసశ్శరణం సుహృత్ ।
ప్రభవః ప్రలయః స్థానం నిధానం బీజమవ్యయమ్ ॥ 18 ॥

పరమలక్ష్యమును, భరించువాడును, ప్రభువును, సాక్షియు, ప్రాణుల నివాసమును, శరణమొందదగినవాడును, హితమొనర్చువాడును, సృష్టిస్థితిలయకర్తయు, నిక్షేపమును, నాశరహితమైన బీజమును నేనే అయియున్నాను.

One who supports the universe as its substratum.

Bhagavad Gita - Chapter 9
Gatirbhartā prabhussākṣī nivāsaśśaraṇaṃ suhr̥t,
Prabhavaḥ pralayaḥ sthānaṃ nidhānaṃ bījamavyayam. (18)