ఓం ప్రభవాయ నమః | ॐ प्रभवाय नमः | OM Prabhavāya namaḥ
ప్ర(ప్రకర్షేణ సర్వాణి భూతాని అస్మాత్) భవంతి సకల భూతములును, ప్రాణులును ఈతని నుండియే మిక్కిలిగా కలుగుచున్నవి. లేదా ప్ర(కృష్టః) భవః (అస్య) ఇతర ప్రాణుల జన్మముకంటే విశిష్టమగు అవతారములు ఈతనికి కలవు.
:: భగవద్గీత - విజ్ఞాన యోగము ::
ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ ।
అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రలయస్తథా ॥ 6 ॥
జడ, చేతనములగు సమస్త భూతములున్ను రెండు విధములగు (పరాపర) ప్రకృతుల వలననే కలుగునవియని తెలిసికొనుము. ఈ రెండు ప్రకృతుల* ద్వారా నేనే ఈ సమస్త ప్రపంచముయొక్క ఉత్పత్తికి, వినాశమునకు కారణ భూతుడనై యున్నాను.
* - అపరా ప్రకృతి చాల అల్పమైనది. దీనికంటే వేఱైనదియు, ఈ జగత్తునంతయు ధరించునదియు, జీవరూపమైనదియునగు 'పరాప్రకృతి' యను మఱియొక ప్రకృతి శ్రేష్ఠమైనది.
One from whom all the great elements have their birth. Or one who has exalted births as incarnations.
Bhagavad Gīta - Chapter 7
Etadyonīni bhūtāni sarvāṇītyupadhāraya,
Ahaṃ kr̥tsnasya jagataḥ prabhavaḥ pralayastathā. (6)
Understand thus that all sentient and insentient things have these* as their source. I am the origin as also the end of the whole Universe.
* - The Prakr̥ti that is divided eight fold is inferior to the other Prakr̥ti of Lord which takes the form of individual souls and by which this world is upheld.
सर्वश्शर्वश्शिवस्थाणुर्भूतादिर्निधिरव्ययः । |
सम्भवो भावनो भर्ता प्रभवः प्रभुरीश्वरः ॥ 4 ॥ |
సర్వశ్శర్వశ్శివస్థాణుర్భూతాదిర్నిధిరవ్యయః । |
సమ్భవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః ॥ 4 ॥ |
Sarvaśśarvaśśivasthāṇurbhūtādirnidhiravyayaḥ । |
Sambhavo bhāvano bhartā prabhavaḥ prabhurīśvaraḥ ॥ 4 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి