10 డిసెం, 2012

37. స్వయంభూః, स्वयंभूः, Svayaṃbhūḥ

ఓం స్వయంభువే నమః | ॐ स्वयंभुवे नमः | OM Svayaṃbhuve namaḥ


స్వయం ఏవ భవతి తనకు తానుగానే కలుగువాడు (ఉద్భవించినవాడు). 'స ఏవ స్వయముద్భవే' (మను స్మృతి 1-7) ఆ పరమేశ్వరుడు, పరమాత్మ తానుగానే ఉద్భవించాడు అను మను స్మృతి వచనము ఇందు ప్రమాణము. లేదా ఎల్లవారికిని పై గాను స్వయముగాను కూడ తాను ఉండును లేదా స్వయముగా తానే తనకు తానై ఎవరి ఆలంబనమును లేకయే ఉండును. లేదా ఎవ్వరికి - ఏ సకల భూతములకును పై వాడుగా తాను ఉండునో ఏ పరమాత్ముడుగా తాను ఎల్లవారికిని పైగా ఉండునో ఆ రెండును తానే ఐ ఉండును. పరమాత్మయు పరమేశ్వరుడును దృశ్యజగమందలి సమస్త పదార్థములును తానే అయి యుండును.



One who exists by Himself, uncaused by any other. Says Manu Smr̥ti (1.7) 'Sa eva svayamudbhave' - He manifested Himself'. He is so called because He existed before everything and over everything. He is the supreme.

स्वयम्भूश्शम्भुरादित्यः पुष्कराक्षो महास्वनः ।
अनादिनिधनो धाता विधाता धातुरुत्तमः ॥ 5 ॥

స్వయమ్భూశ్శమ్భురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః ।
అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమః ॥ 5 ॥

Svayambhūśśambhurādityaḥ puṣkarākṣo mahāsvanaḥ ।
Anādinidhano dhātā vidhātā dhāturuttamaḥ ॥ 5 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి