7 నవం, 2012

4. భూతభవ్యభవత్ప్రభుః, भूतभव्यभवत्प्रभुः, Bhūtabhavyabhavatprabhuḥ

ఓం భూతభవ్యభవత్ప్రభవే నమః | ॐ भूतभव्यभवत्प्रभवे नमः | OM Bhūtabhavyabhavatprabhavē namaḥ


భూతం చ భవ్యం చ భవత్ చ భూతభవ్యభవన్తి ।
తేషాం ప్రభుః భూతభవ్యభవత్ప్రభుః  ॥

గడిచినది, రానున్నది, జరుగుతున్నది 'భూతభవ్యభవంతి' అనబడును. వానికి మూడిటికిని ప్రభువు 'భూతభవ్యభవత్ప్రభుః' అగును. మూడును కాని మరి ఇతర విధములు కాని కల కాలభేధమును లెక్కపెట్టక (వాని అవధులకు లోను గాక) 'సన్మాత్రప్రతియోగికమగు (ఉనికి మాత్రము తనకు ఆలంబనముగా కల) ఈశ్వరతత్వము ఈతనికి కలదు కావున విష్ణువు ఈ శబ్దముచే చెప్పబడదగియున్నాడు.

భగవద్గీత విభూతి యోగాధ్యయములో 'అహమేవాక్షయః కాలో ధాతాహం విశ్వతోముఖః' (10.33) - 'నాశములేని కాలమును లేక కాలకాలుడగు పరమేశ్వరుడను సర్వత్రముఖములుగల విరాట్స్వరూపియగు కర్మ ఫల ప్రదాతయును నేనై ఉన్నాను' అని గీతాచార్యుడు అర్జునునకు ఉపదేశిస్తాడు. అలాగే విశ్వరూపసందర్శన యోగాధ్యయములో ఆ భగవానుని విరాట్స్వరూపమునుగాంచి నివ్వెర పోయి 'నీవెవరు' అన్న అర్జునుని ప్రశ్నకు సమాధానమునిస్తూ ఆయన ఉపయోగించిన మొదటి పదము 'కాలోఽస్మి' (11.32). ఆ పరమాత్మయే కాలుడు. కాలానికే కాలస్వరూపుడు. అట్టివాడు భూత, భవిష్యత్‌, వర్తమానాలకు ప్రభువు అని అర్థం చేసుకొనడం కష్టమేమీ కాదు కదా!

నిన్నటి రేపుకు కానీ, నేటి నిన్నకు కానీ, నేటికి రేపు కానీ, రేపటి నిన్నకు కానీ - అన్ని కాలాలకు ఆయనే ప్రభువు; అన్ని కాలాలలో ఆయనే ప్రభువు. కాలస్వరూపుడూ, కాలాతీతుడూ, కాలకాలుడూ ఐన ఆ విష్ణుదేవునికి ప్రణామము.



The Master of the past, future and present. As He is beyond the sway of time in its three aspects, He is eternal being and thus His majesty is undecaying. He is therefore the real Prabhu - the Lord.

In the chapter 10 of Bhagavad Gītā, the Lord reveals to Arjuna 'Ahamevākṣayaḥ kālo dhātāhaṃ viśvatomukhaḥ' that I Myself am the infinite or endless time, well known as 'moment' etc.; or I am the Supreme God who is Kāla (Time, the measurer) even of Time. I am the Dispenser of the fruits of actions of the whole world with faces everywhere. In the subsequent chapter of Gītā, when Arjuna fearfully inquires about the fierce Cosmic form of the Supreme Godhead, the first word of the sentence with which the Lord responds is 'kālo’smi' - 'I am the Time'. Almighty is Time infinite Himself. Of course it is no difficult task, thus, to understand that He is the Lord of the past, the present and the future.

Whether for (or in) the future of the past or the past of the present or the future of the present or the past of the future, He is the Lord. He is Time himself; He is beyond the measure of Time; He is in fact the Annihilator of Time itself. I bow down to that glorious God Viṣṇu.

विश्वं विष्णुर्वषट्कारो भूतभव्यभवत्प्रभुः
भूतकृद्भूतभृद्भावो भूतात्मा भूतभावनः ॥ 1 ॥

విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః
భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః  ॥ 1 ॥

Viśvaṃ viṣṇurvaṣaṭkāro bhūtabhavyabhavatprabhuḥ
Bhūtakr̥dbhūtabhr̥dbhāvo bhūtātmā bhūtabhāvanaḥ ॥ 1 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి