9 నవం, 2012

6. భూతభృత్, भूतभृत्, Bhūtabhr̥t

ఓం భూతభృతే నమః | ॐ भूतभृते नमः | OM Bhūtabhr̥te namaḥ


భూతకృత్ అను నామమునకు రజస్తమోగుణాలను ఆధారం చేసుకొని సృష్టి, లయలను ఆయనే చేయుచున్నాడని అర్థము వివరించడము జరిగినది. ఈ భూతభృత్ అను నామముతో ఆయనే స్థితికారకుడు అన్నది తెలుస్తున్నది.

భగవద్గీతలోని క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగమునందు 'భూతభర్తృ చ తజ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ' - పుట్టించువారు, పోషించువారు, లయింపజేయువారు పరమాత్మయే అని తెలుస్తున్నది. బ్రహ్మ, విష్ణు, శివరూపములు మూడును వారివే.

యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత ।
అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ ॥ (4.7)

గీతలోని పై శ్లోకము బహుసంధర్భాలలో తరచూ వాడబడుతూ ఉంటుంది. 'ఓ అర్జునా! ఎప్పుడెప్పుడు ధర్మము క్షీణించి, అధర్మము వృద్ధియగుచుండునో, అప్పుడప్పుడు నన్ను నేను సృష్టించుకొనుచుందును.'

భగవంతుడు వాస్తవముగ నిరాకారుడు, సర్వవ్యాపి, ప్రపంచాతీతుడు, ప్రకృతికి విలక్షణమైనవాడు, అనంతుడు, నాశరహితుడు. లోకకల్యాణార్థమై వారు అపుడపుడు దేహమును ధరించి దుష్టశిక్షణ, శిష్టరక్షణ, ధర్మసముద్ధరణాది కార్యముల నొనర్చుటకై లోకమున అవతరించుచుందురు. మాయను స్వాధీనపఱచుకొనినవారు కనుక వారు తమ యిష్టప్రకారము దేహమును గ్రహించుటకు, త్యజించుటకు శక్తిగలిగియుందురు.

'భూతభృత్‌' కనుకనే, ఆయన సృష్టించిన ఈ ప్రపంచానికి స్థితికారకుడై, దాని నిర్వహాణను కూడా ఆయనే చూసుకుంటారు.

భూతాని బిభర్తి; (సత్వగుణమును ఆశ్రయించి) భూతములను పాలించును / ధరించును / నిలుపును / పోషించును. [(డు) భృఞ్ - ధారణ పోషణయోః; జుహోత్యాదిః; ఇదియూ క్రితం నామమువలె ఉపపదసమాసము].



One who supports or sustains or governs the universe. Assuming the Sattva Guṇa, He sustains the worlds.

In the chapter 13 (Kṣētrakṣētrajña vibhāgayoga) of Bhagavad Gitā we come across 'Bhūtabhartr̥ ca tajñeyaṃ grasiṣṇu prabhaviṣṇu ca' which means 'It (Brahman) is the sustainer of all beings as also the devourer and originator.' The Lord is the Creator, Sustainer and Annihilator. The fifth divine name of 'Bhūtabhr̥t' from Sri Vishnu Sahasranama implies the second of the three roles; first and last of which convey the meaning of previous name 'Bhūtakr̥t.'

We can also seek the meaning of 'Bhūtabhr̥t' from another stanza of Gitā.

Yadā yadā hi dharmasya glānirbhavati bhārata,
abhyutthānama dharmasya tadātmānaṃ sr̥jāmyaham. (4.7)

Whenever there is a decline of virtue and increase of vice, then does He manifest Himself.

Since He sustains and nourishes this (His) creation, He also descends at appropriate times, in appropriate forms to help stabilize imbalance of any kind.

विश्वं विष्णुर्वषट्कारो भूतभव्यभवत्प्रभुः ।
भूतकृद्भूतभृद्भावो भूतात्मा भूतभावनः ॥ 1 ॥

విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః ।
భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః  ॥ 1 ॥

Viśvaṃ viṣṇurvaṣaṭkāro bhūtabhavyabhavatprabhuḥ ।
Bhūtakr̥dbhūtabhr̥dbhāvo bhūtātmā bhūtabhāvanaḥ ॥ 1 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి