15 నవం, 2012

12. ముక్తానాం పరమా గతిః, मुक्तानां परमा गतिः, Muktānāṃ paramā gatiḥ

ఓం ముక్తానాం పరమాయై గతయే నమః | ॐ मुक्तानां परमायै गतये नमः | OM Muktānāṃ Paramāyai Gataye Namaḥ


ముక్తి నందిన వారలకు ఉత్తమమగు గమ్యము (అగుదేవత); అతనిని చేరిన వారికి పునరావృత్తి లేదు కదా! భగవద్గీత సాంఙ్ఖ్య యోగాధ్యాయమునందు ఈ దివ్య నామము యొక్క వివరణ పలు శ్లోకాలలో కనబడుతుంది.

కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః ।
జన్మబన్ధవినిర్ముక్తాః పదం గచ్ఛన్త్యనామయమ్ ॥ 2.51 ॥

సమత్వబుద్ధితో గూడిన వివేకవంతులు కర్మముల నొనర్చుచున్నను వాని ఫలమును త్యజించివైచి జననమరణరూపమను బంధమునుండి విడుదలను బొందినవారై దుఃఖరహితమగు మోక్షపదవిని బొందుచున్నారు.

విహాయ కామాన్ యస్సర్వాన్ పుమాం శ్చరతి నిస్స్పృహః ।
నిర్మమో నిరహంకారః స శాన్తి మధిగచ్ఛతి ॥ 2.71 ॥
ఏషా బ్రాహ్మీస్థితి పార్థనైనాం ప్రాప్య విముహ్యతి ।
స్థిత్వాఽస్యా మన్తకాలేఽపి బ్రహ్మనిర్వాణ మృచ్ఛతి ॥ 2.72 ॥

ఎవడు సమస్తములైన కోరికలను, శబ్దాదివిషయములను త్యజించి వానియందేమాత్రము ఆశలేక, అహంకారమమకారవర్జితుడై ప్రవర్తించునో అట్టివాడే శాంతిని పొందుచున్నాడు. అర్జునా! ఇదియంతయు బ్రహ్మసంబంధమైన స్థితి; ఇట్టి బ్రాహ్మీస్థితిని బొందినవాడు మఱల నెన్నటికి విమోహమును జెందనేరడు. అంత్యకాలమునందు గూడ ఇట్టి స్థితియందున్నవాడు బ్రహ్మానందరూప మోక్షమును బడయుచున్నాడు.



The highest goal of the liberated ones. For one who attains to Him, there is neither rebirth nor attaining to any thing higher, there being nothing higher than Him.

The second chapter of Bhagavad Gitā on 'The Path of Knowledge' provides elaboration on this divine name in multiple Ślokās.

Karmajaṃ buddhiyuktā hi falaṃ tyaktvā manīṣiṇaḥ,
Janmabandhavinirmuktāḥ padaṃ gacchantyanāmayam. (2.51)

Because, those who are devoted to wisdom, (they) becoming men of Enlightenment by giving up the fruits produced by actions, reach the state beyond evils by having become freed from the bondage of birth.

Vihāya kāmān yassarvān pumāṃ ścarati nisspr̥haḥ,
Nirmamō nirahaṃkāraḥ sa śānti madhigacchati. (2.71)
Ēṣā brāhmīsthiti pārthanaināṃ prāpya vimuhyati,
Sthitvā’syā mantakālē’pi brahmanirvāṇa mr̥cchati. (2.72)

That man attains peace who, after rejecting all desires, moves about free from hankering, without the idea of ('me' and) 'mine' and devoid of pride. O Parthā, this is the state of being established in Brahman. One does not become deluded after attaining this. One attains identification with Brahman by being established in this state even in the closing years of one's life.

पूतात्मा परमात्मा च मुक्तानां परमा गतिः
अव्ययः पुरुषस्साक्षी क्षेत्रज्ञोऽक्षर एव च ॥ 2 ॥

పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమా గతిః
అవ్యయః పురుషస్సాక్షీ క్షేత్రజ్ఞోఽక్షర ఏవ చ ॥ 2 ॥

Pūtātmā paramātmā ca muktānāṃ paramā gatiḥ
Avyayaḥ puruṣassākṣī kṣetrajño’kṣara ēva ca ॥ 2 ॥

1 కామెంట్‌: