27 నవం, 2012

24. పురుషోత్తమః, पुरुषोत्तमः, Puruṣottamaḥ

ఓం పురుషోత్తమాయ నమః | ॐ पुरुषोत्तमाय नमः | OM Puruṣottamāya namaḥ


పురుషః అను 14వ దివ్యనామముయొక్క వివరణలో మహాభారత శాంతి పర్వమునందలి ప్రమాణమును పరిగణించితిమి. 'అంతటను అన్నియును తానై నిండి యుండుటచే లేదా అన్నిటిని తన శక్తితో నింపుటచే అన్నిట చేరియుండుటచే ఆ హేతువు వలన ఈ పరమాత్ముడు 'పురుషుడు' అని చెప్పబడుచున్నాడు'.

పురుషాణాం ఉత్తమః పురుషులలో - చేతన తత్త్వములన్నిటిలో ఉత్తముడు లేదా పురుషేభ్యః ఉత్తమః చేతనులందరికంటే ఉత్తముడు.

:: భగవద్గీత - పురుషోత్తమప్రాప్తి యోగము ::
యస్మాత్‌క్షర మతీతోఽహ మక్షరాదపి చోత్తమః ।
అతోఽస్మి లోకే వేదే చ ప్రథీతః పురుషోత్తమః ॥ 18 ॥


నేను క్షరస్వరూపునికంటె మించినవాడను, అక్షరస్వరూపుని కంటే శ్రేష్ఠుడను అయినందువలన ప్రపంచమునందును, వేదమునందును 'పురుషోత్తము'డని ప్రసిద్ధికెక్కియున్నాను.



For the 14th divine name Puruṣāḥ, a reference from Śānti Parva of Mahābhārata was considered. 'The great being resides in and pervades the mansion of the body, having all the features described before and provided with nine gateways; because of this He is called Puruṣa.'

Puruṣāṇāṃ uttamaḥ The greatest among all Puruṣās - spirits. Or Puruṣebhyaḥ uttamaḥ One greater than all individual spirits.

Bhagavad Gīta - Chapter 15
Yasmātˈkṣara matīto’ha makṣarādapi cottamaḥ,
ato’smi lokē vede ca prathītaḥ puruṣottamaḥ. (18)

Since I am transcendental to the mutable and above even the immutable, hence I am well known in the world and in the Vedās as the supreme Person - 'Puruṣottama'.

योगो योगविदां नेता प्रधानपुरुषेश्वरः ।
नारसिंहवपु श्श्रीमान् केशवः पुरुषोत्तमः ॥ 3 ॥

యోగో యోగవిదాం నేతా ప్రధానపురుషేశ్వరః ।
నారసింహవపు శ్శ్రీమాన్ కేశవః పురుషోత్తమః ॥ 3 ॥

Yogo yogavidāṃ netā pradhānapuruṣeśvaraḥ ।
Nārasiṃhavapu śśrīmān keśavaḥ puruṣottamaḥ ॥ 3 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి