14 నవం, 2012

11. పరమాత్మా, परमात्मा, Paramātmā

ఓం పరమాత్మనే నమః | ॐ परमात्मने नमः | OM Paramātmane  namaḥ


పరమశ్చ అసౌ ఆత్మాచ; సర్వోత్తమమగు ఆత్మ ఇది (పరమాత్మ నుండి ఏర్పడిన జగద్రూప); కార్యముకంటెను ఆ జగత్తునకు కారణముగా నుండు అవ్యక్తతత్వము కంటెను విలక్షణమగు నిత్య శుద్ధ బుద్ధముక్త స్వభావుడు; (స్వతః సిద్ధము గుణ రహితము జ్ఞానాత్మకము బంధరహితము అగు స్వభావము కలవాడు).

భగవద్గీత పురుషోత్తమప్రాప్తి యోగములో పరమాత్మ గురించిన శ్లోకము ఒకటి ఉన్నది.

ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః ।
యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః ॥

ఎవడు మూడులోకములందును ప్రవేశించి వానిని భరించుచున్నాడో, అట్టి నాశరహితుడును, జగన్నియామకుడును, క్షరాక్షరులిద్దఱికంటెను వేరైనవాడును నగు ఉత్తమపురుషుడు పరమాత్మయని చెప్పబడుచున్నాడు.

ప్రపంచమునందు క్షరుడనియు, అక్షరుడనియు ఇరువురు పురుషులు కలరు. అందు సమస్త ప్రాణులయొక్క దేహముల యొక్క అభిమాని క్షరుడనియు, కూటస్థుడగు జీవుడు (మనస్సుయొక్క) అభిమాని అక్షరుడనియు చెప్పబడుచున్నారు.



He who is supreme one and the Ātman. He does not come within the cause and effect relationship and He is by nature ever free, pure and wakeful.

In the Bhagavad Gitā, stanzas 16 and 17 of the 15th chapter provide a meaning for the divine name Paramātmā.

There are these two persons in the world - the mutable and the immutable. The mutable consists of all things; the one existing as Māyā is called the immutable. (16)

Uttamaḥ puruṣastvanyaḥ paramātmētyudāhr̥taḥ,
Yo lokatrayamāviśya bibhartyavyaya īśvaraḥ. (17)

But different is the supreme Person who is spoken of as the transcendental Self, who, permeating the three worlds, upholds them, and is the imperishable God.

पूतात्मा परमात्मा च मुक्तानां परमा गतिः ।
अव्ययः पुरुषस्साक्षी क्षेत्रज्ञोऽक्षर एव च ॥ 2 ॥

పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమా గతిః ।
అవ్యయః పురుషస్సాక్షీ క్షేత్రజ్ఞోఽక్షర ఏవ చ ॥ 2 ॥

Pūtātmā paramātmā ca muktānāṃ paramā gatiḥ ।
Avyayaḥ puruṣassākṣī kṣetrajño’kṣara ēva ca ॥ 2 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి