13 నవం, 2012

10. పూతాత్మా, पूतात्मा, Pūtātmā

ఓం పూతాత్మనే నమః | ॐ पूतात्मने नमः | OM Pūtātmane namaḥ


పూతః - ఆత్మా - యస్య సః; పవిత్రమగు (గుణ సంబంధము లేని) ఆత్మ ఎవనికి కలదో అట్టివాడు; లేదా - పూతః - ఆత్మా పవిత్రమగు ఆత్మ; (పూతశ్చాసౌ ఆత్మాచ అని) కర్మధారయ సమాసము నైన చెప్పవచ్చును; కేవలో నిర్గుణశ్చ (శ్వేతా - 6-11) 'కేవలుడును (శుద్ధుడును) నిర్గుణుడును' అని శ్రుతి ఇందులకు ప్రమాణము.

మొదట 'భూతకృత్‌' మొదలయిన వానిచే పరమాత్మకు సగుణత్వమును తరువాత 'పూతాత్మా' అనుచు నిర్గుణత్వమును చెప్పుటచే శుద్ధుడగు పరమాత్మకు తన స్వేచ్ఛచే ఆయా గుణములతోడి సంబంధము ఆతని స్వేచ్ఛచేతనే కలిగినదే కాని స్వతఃసిద్ధము కాదు అని కల్పించ (అనుమాన ప్రమాణముచే ఊహించ) బడుచున్నది.

న మాం కర్మాణి లిమ్పన్తి న మే కర్మఫలే స్పృహా ।
ఇతి మాం యోఽభిజానాతి కర్మభిర్న స బధ్యతే ॥

భగవద్గీత జ్ఞాన యోగాధ్యాయమునందు 14వదైన పై శ్లోకములో భగవానుడు "నన్ను కర్మలంటవు. నాకు కర్మఫలమునం దపేక్షయు లేదు. ఈ ప్రకారముగా నన్నుగూర్చి యెవడు తెలిసికొనునో ఆతడు కర్మలచే బంధింపబడడు" అని బోధించారు.

భగవానుడు కర్మఫలమునం దపేక్షలేక కర్మలనాచరించుచున్నారని యెఱింగినపుడు జీవుడు తానున్ను ఫలాపేక్షలేక కర్మల నాచరింపదొడగును. తత్ఫలితముగ నాతడు కర్మలచే నంటబడక కర్మబంధవిముక్తుడు కాగల్గును.



One whose nature is purity or one who is purity and essence of all things. According to the Śruti 'Kevalo nirguṇaś ca' He is non-dual being untouched by Guṇas (Sve. Up - 6.11). The Puruṣa only assumes a relation with the Guṇas of Prakr̥iti, but His essential nature is not affected by it. So He is ever pure.

Revealing the knowledge related to Renunciation of Actions, in the chapter 4 of Bhagavad Gitā, the Lord tells Arjunā that actions do not taint Him since He has no hankering for the results of actions. Further, One who knows Him thus, does not become bound by actions.

Because of the absence of egoism, those actions do not taint Him by becoming the originators of body etc. And for Him there is no hankering for the results of those actions. But in case of transmigrating beings, who have self-identification in the form, 'I am the agent' and the thirst for actions as also for their results, it is reasonable that actions should taint them. Owing to the absence of these, actions do not taint Him. Anyone else, too, who knows Him thus, as his own Self, and knows 'I am not an agent'; 'I have no hankering for the results of actions' does not become bound by actions. In his case also actions cease to be the originators of the body etc. This is the import.

पूतात्मा परमात्मा च मुक्तानां परमा गतिः ।
अव्ययः पुरुषस्साक्षी क्षेत्रज्ञोऽक्षर एव च ॥ 2 ॥

పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమా గతిః ।
అవ్యయః పురుషస్సాక్షీ క్షేత్రజ్ఞోఽక్షర ఏవ చ ॥ 2 ॥

Pūtātmā paramātmā ca muktānāṃ paramā gatiḥ ।
Avyayaḥ puruṣassākṣī kṣetrajño’kṣara ēva ca ॥ 2 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి