28 నవం, 2012

25. సర్వః, सर्वः, Sarvaḥ

ఓం సర్వస్మై నమః | ॐ सर्वस्मै नमः | OM Sarvasmai namaḥ


జడమూ, సూక్ష్మములైన సర్వము యొక్క మూలమూ మరియూ సర్వమునూ ఎఱుగునట్టి సర్వజ్ఞుడు - సర్వుడు. సర్వముతానైనవాడు. 'సర్వం సమాప్నోషి తతోసి సర్వః' సచ్చిదానంద సర్వవ్యాపక చైతన్యము సర్వము తానై విశ్వమంతయు వ్యాపించినవాడు.

:: మహాభారతము - ఉద్యోగ పర్వము ::
అసతశ్చ సతశ్చైవ సర్వస్య ప్రభావాఽప్యయాత్ ।
సర్వస్య సర్వదా జ్ఞానాత్ సర్వం మేనం ప్రచక్షతే ॥ 70-11 ॥


రూపము లేని, రూపము గల సర్వమునకును ఉత్పత్తీ, లయహేతువు తానే యగుట వలనను సర్వకాలములందును సర్వమును ఎఱుగువాడగుటచేతను ఈతనిని 'సర్వః' లేదా 'సర్వుడు' అందురు.

:: భగవద్గీత - విశ్వరూపసందర్శన యోగము ::
నమః పురస్తాదథ పృష్ఠతస్తే నమోఽస్తు తే సర్వత ఏవ సర్వ ।
అనన్తవీర్యామితవిక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోఽసి సర్వః ॥ 40 ॥

అర్జునుడు చెప్పెను. సర్వరూపులగు ఓ కృష్ణా! ఎదుటను, వెనుకను మీకు నమస్కారము మఱియు అన్ని వైపులను మీకు నమస్కారమగుగాక! అపరిమిత్సామర్థ్యము, పరాక్రమము గలవారగుమీరు సమస్తమును లెస్సగ వ్యాపించియున్నారు. కనుకనే సర్వస్వరూపులై యున్నారు.



The omniscient source of all existence.

Mahābhāratā - Udyoga parva
Asataśca sataścaiva sarvasya prabhāvā’pyayāt,
Sarvasya sarvadā jñānāt sarvaṃ menaṃ pracakṣate.
(70-11)

As He is the source of all things gross and subtle and as He knows all things all times - He is called Sarva.

Bhagavad Gita - Chapter 11
Namaḥ purastādatha pr̥ṣṭhataste namo’stu te sarvata eva sarva,
Anantavīryāmitavikramastvaṃ sarvaṃ samāpnoṣi tato’si sarvaḥ. (40)

Arjuna said, salutation to You in the East and behind. Salutation be to You on all sides indeed, O All! You are possessed of infinite strength and infinite heroism. You pervade everything; hence You are all!
सर्वश्शर्वश्शिवस्थाणुर्भूतादिर्निधिरव्ययः ।
सम्भवो भावनो भर्ता प्रभवः प्रभुरीश्वरः ॥ 4 ॥

సర్వశ్శర్వశ్శివస్థాణుర్భూతాదిర్నిధిరవ్యయః ।
సమ్భవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః ॥ 4 ॥

Sarvaśśarvaśśivasthāṇurbhūtādirnidhiravyayaḥ ।
Sambhavo bhāvano bhartā prabhavaḥ prabhurīśvaraḥ ॥ 4 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి