11 నవం, 2012

8. భూతాత్మా, भूतात्मा, Bhūtātmā

ఓం భూతాత్మనే నమః | ॐ भूतात्मने नमः | OM Bhūtātmanē namaḥ


గదిలో ఉన్న మఠాకాశం కానీ కుండలో ఉన్న ఘఠాకాశము కానీ - వివిధమైన వస్తువులచే పరివేష్టించబడ్డది సర్వవ్యాపకమైన ఆకాశము మాత్రమే. అదే విధముగా అన్ని భూతములలో ఉన్న తేజము కూడా ఆ పరమాత్మయే.

పురుషః స పరః పార్థా భక్త్యా లభ్యస్త్వనన్యయా ।
యస్యాన్తఃస్థాని భూతాని యేన సర్వమిదం తతమ్ ॥

ఎవనియందీ ప్రాణికోట్లన్నియు నివసించుచున్నవో, ఎవనిచే ఈ సమస్త జగత్తున్ను వ్యాపింపబడియున్నదో, అట్టి పరమపురుషుడు (పరమాత్మ) అనన్యమగు భక్తిచేతనే పొందబడగలడని శ్రీ కృష్ణ పరమాత్మ అర్జుననకు అక్షర పరబ్రహ్మయోగములో తెలిపియున్నదానిలో ఈ విషయమే తెలుస్తున్నది.

భగవద్గీతలోని 13వ అధ్యాయమయిన క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగమునందు కూడా 'సమం సర్వేషు భూతేషు తిష్ఠన్తం పరమేశ్వరం' - సమస్త ప్రాణులలో సమముగనున్నట్టి పరమేశ్వరుని ఎవడు చూడగలడో వాడే నిజముగ చూచువాడని గీతాచార్యుడు తెలిపిన దానిలో కూడా అన్ని భూతములయందు సమముగా ఉన్న ఆ 'భూతాత్మ' యొక్క వివరణ దొరుకుతుంది.

భూతానాం ఆత్మాః; భూతములకు అంతర్యామి రూపమున ఆత్మగా నుండువాడు; 'ఏష త ఆత్మాంఽతర్యామ్యమృతః' (బృహ - 3.7.3.22) 'ఈతడే నీకు ఆత్మయు అంతర్యామియు అమృత తత్వమును' అను శ్రుతి ఇందులకు పమాణము. ఆయా ప్రాణులయందు తాను ఉండి వానిని తన ఆజ్ఞచే ఆయా వ్యాపారములయందు ప్రవర్తిల్లజేయువాడు; అంతః యమయతి ఇతి అంతర్యామి.



The essence of all beings. He is the in-dweller, Aṃtaryāmin, of all objects individually and collectively. 'Eṣa ta ātm'āntaryāmyamr̥taḥ'  - this Thy Ātmā (Soul) is the inner pervader and immortal (Brihadaranyaka Upanishad - 3.7.3.22).

He is the Ātmā of all the beings: The very 'Be' in all the living beings. Just as the same universal space that is present in all rooms as the room-space (Ṃaṭhākāśa), or in all the pots as pot-space (Ghaṭhākāśa), so the infinite life playing through any given vehicle is called the Ātmā of the vehicle. It is well known that space everywhere is one and the same; so too, the one reality sports as though different Ātmās. This One Universal Soul is called the Supreme Brahman (Para Brahman) in Vedanta. In the Bhāgavata, the Lord is addressed as "You are the One Self in all living creatures ever illumining all their experiences."

As per Kathopanishad 'Eko vaśī sarvabhūtāntarātmā rūpaṃ rūpaṃ pratirupo bahiśca' - 'The One enchanting truth that revels in every form manifesting in plurality.'

Samaṃ sarvēṣu bhūtēṣu tiṣṭhantaṃ paramēśvaraṃ,
Vinaśyatsvavinaśyantaṃ yaḥ paśyati sa paśyati.

The 28th stanza of 13th chapter in Bhagavad Gitā also helps understand the divine name 'Bhūtātmā' as 'He sees who sees the supreme Lord as existing equally in all beings and as Imperishable among the perishable.'

विश्वं विष्णुर्वषट्कारो भूतभव्यभवत्प्रभुः ।
भूतकृद्भूतभृद्भावो भूतात्मा भूतभावनः ॥ 1 ॥

విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః ।
భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః  ॥ 1 ॥

Viśvaṃ viṣṇurvaṣaṭkāro bhūtabhavyabhavatprabhuḥ ।
Bhūtakr̥dbhūtabhr̥dbhāvo bhūtātmā bhūtabhāvanaḥ ॥ 1 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి