12 నవం, 2012

9. భూతభావనః, भूतभावनः, Bhūtabhāvanaḥ

ఓం భూతభావనాయ నమః | ॐ भूतभावनाय नमः | OM Bhūtabhāvanāya namaḥ


తస్మాత్వా ఏతస్మాదాత్మాన ఆకాశః సంభూతః సంకల్ప మాత్రముననే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివ్యాదులు సృష్టింప బడినవి. ఈ సృష్టియంతయును ఆయన తపోఫలమే. భూతభావనభూతేశ దేవ దేవ జగత్పతే.

న చ మత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరమ్ ।
భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః


ప్రాణికోట్లు నాయందుండునవియుకావు. ఈశ్వరసంబంధమగు నా యీ యోగమహిమను జూడుము. నాయాత్మ (స్వరూపము) ప్రాణికోట్లనుత్పన్న మోనర్చునదియు, భరించునదియునైనను ఆ ప్రాణులయందుండుటలేదు.

భగవద్గీతలోని రాజవిద్యా రాజగుహ్యయోగమునందు పై వాక్యములను భగవానుడు దృశ్యరహిత పరిపూర్ణాద్వైతదృష్టియందు చెప్పిరి. అట్టి పూర్ణస్థితియందు ఒక్క బ్రహ్మము తప్ప అన్యమగు ఏ వస్తువున్ను ఉండనేరదు. కావున ద్వైతదృష్టిలో తనయొక్క స్వరూపము ప్రాణులను భరించుచున్నను, రక్షించుచున్నను, పరమార్థదృష్టిలో ప్రాణులలోగానీ, జగత్తుతోగానీ ఏ మాత్రము సంబంధము లేక వెలయుచున్నారు. 

భూతాని భావయతి; భూతములను కలిగించును లేదా వృద్ధినందించును. [భూత శబ్ధము ఉపపదముగా 'భూ' ధాతు ప్రేరణార్థక రూపమునుండి ఉపపద సమాసము.]

:: పోతన భాగవతము షష్ఠమ స్కంధము ::
సీ. పూని నా రూపంబు భూతజాలంబులు, భూతభావనుఁడ నేఁ బొందువడఁగ

బ్రహ్మంబు మఱియు శబ్దబ్రహ్మమును శాశ్వతంబైన తనువులు దగిలె నాకు

నఖిలలోకములందు ననుగతంబై యుందు, లోకంబు నా యందు జోకఁజెందు,

నుభయంబు నాయందు నభిగతంబై యుండు, నభిలీన మగుదు న య్యుభయమందు!
తే. వెలయ నిద్రించువాఁడాత్మ విశ్వమెల్లఁ, జూచి మేల్కాంచి తా నొక్క చోటివానిఁ

గా వివేకించు మాడ్కి నీ జీవితేశ, మాయ దిగనాడి పరమధర్మంబుఁ దెలియు. (479)

ఈ జగత్తులోని సమస్తజీవులూ నా స్వరూపాలే. నేను భూత భావనుడను. ఈ సృష్టిలోని సమస్త రూపములను నిర్దేశించెడివాడను నేనే! బ్రహ్మమూ, శబ్దబ్రహ్మమూ - రెండూ శాశ్వతమైన నా దేహములు. ఆత్మస్వరూపుడనైన నేను అఖిల లోకములయందు నిండి ఉన్నాను. ఈ సమస్త జగత్తులు నాలో ఇమిడి ఉన్నాయి. ఈ రెండు స్థితులూ నాకు అనుకూలముగా నడుస్తూ ఉంటాయి. నేను ఈ రెంటిలోను అంతర్లీనముగా ఉంటాను. నిదురించెడివాడు స్వప్నావస్థలో సమస్త విశ్వమును సందర్శించి మేల్కాంచిన అనంతరము తాను ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటాడు. అదే విధముగా జీవులు ఈ విశాల సృష్టియందు విహరించి ఏదో ఒకనాడు భగవంతుని మాయనుండి విడివడినవారై పరమార్థమును తెలుసుకుంటారు.



He who originates and develops the elements. One who creates and multiplies the creatures; meaning the One, who is the cause for the birth and who is responsible for the growth of all living creatures.

In the 9th chapter of Bhagavad Gitā, the Lord tells Arjuna...

Na ca matsthāni bhūtāni paśya me yogamaiśvaram,
Bhūtabhr̥nna ca bhūtastho mamātmā Bhūtabhāvanaḥ.

Nor do the beings dwell in Me. Behold My divine Yoga! I am the sustainer and originator of beings, but My Self is not contained in the beings.

One has to understand the absence of association due to Its being free from contact. There is no possibility of Its remaining contained in beings. How again, is it said 'It is My Self?' Following human understanding, having separated the aggregate of body etc. from the Self and superimposing egoism on them, the Lord calls It 'My Self'. But not that He has said so by ignorantly thinking like ordinary mortals that the Self is different from Himself.

So also, I am the bhūtabhāvanaḥ, originator of beings, on who gives birth to or nourishes the beings.

:: श्रीमद्भागवते षष्ठस्कन्धे षोडशोऽध्यायः ::
अहं वै सर्वभूतानि भूतात्मा भूतभावनः ।
शब्दब्रह्म परं ब्रह्म ममोभे शाश्वती तनू ॥ ५१ ॥

Śrīmad Bhāgavata - Canto 6, Chapter 16
Ahaṃ vai sarvabhūtāni bhūtātmā bhūtabhāvanaḥ,
Śabdabrahma paraṃ brahma mamobhe śāśvatī tanū. 51.

All living entities, moving and non-moving, are My expansions and are separate from Me. I am the Supersoul of all living beings, who exist because I manifest them. I am the form of the transcendental vibrations like oḿkāra and I am the Supreme Absolute Truth. These two forms of Mine - namely, the transcendental sound and the eternally blissful spiritual form of the Deity, are My eternal forms; they are not material.
विश्वं विष्णुर्वषट्कारो भूतभव्यभवत्प्रभुः ।
भूतकृद्भूतभृद्भावो भूतात्मा भूतभावनः ॥ 1 ॥

విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః ।
భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః  ॥ 1 ॥

Viśvaṃ viṣṇurvaṣaṭkāro bhūtabhavyabhavatprabhuḥ ।
Bhūtakr̥dbhūtabhr̥dbhāvo bhūtātmā bhūtabhāvanaḥ ॥ 1 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి