16 నవం, 2012

13. అవ్యయః, अव्ययः, Avyayaḥ

ఓం అవ్యయాయ నమః | ॐ अव्ययाय नमः | OM Avyayāya namaḥ


అవ్యయః: న - వ్యేతి; ఇతడు వినాశనము నందడు; 2. లేదా - ఈతడు (తన స్వరూపమునుండి) మార్పునందడు. 'అజరోఽమరోఽవ్యయః' - 'ముసలితనము లేనివాడు, మృతి లేనివాడు, మార్పు లేనివాడు' అను శ్రుతి ఇచ్చట ప్రమాణము. [న+వి+ఇ(ణ్‌)+అ>వ్యయః; ఇ(ణ్‌)-గతౌ-ధాతువు]

:: భగవద్గీత - జ్ఞాన యోగము ::
అజోఽపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోఽపి సన్ ।
ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా ॥ 6 ॥

నేను పుట్టుకలేనివాడను, నాశరహితస్వరూపముకలవాడను, సమస్తప్రాణులకు ఈశ్వరుడను అయియున్నప్పటికి స్వకీయమగు ప్రకృతిని వశపఱచుకొని నా మాయాశక్తిచేత అవతరించుచున్నాను.

:: భగవద్గీత - విజ్ఞాన యోగము ::
నాహం ప్రకాశః సర్వస్య యోగమాయాసమావృతాః ।
మూఢోఽయం నాభిజానాతి లోకో మామజమవ్యయమ్ ॥ 25 ॥

యోగమాయచే బాగుగ కప్పబడియుండుటచే నేను అందఱికిని కనుపించు వాడనుగాను. అవివేకులగు ఈ జనులు నన్ను పుట్టుకలేనివానినిగను, నాశరహితునిగను ఎరుగరు.

:: భగవద్గీత - రాజవిద్యా రాజగుహ్య యోగము ::
మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః ।
భజన్త్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయమ్ ॥ 13 ॥


ఓ అర్జునా! మహాత్ములైతే దైవీ ప్రకృతిని ఆశ్రయించినవారలై నన్ను సమస్తప్రాణులకును ఆదికారణునిగను, నాశరహితునిగను ఎఱింగి వేఱొకదానియందు మనస్సునుంచనివారలై నన్నే సేవించుచుందురు. 



Avyayaḥ: One for whom there is no decay. He is described in the Śr̥ti as 'Ajarō’marō’vyayaḥ' - unaging, undying and undecaying.

Bhagavad Gitā - Chapter 4
Ajo’pi sannavyayātmā bhūtānāmīśvaro’pi san,
Prakr̥tiṃ svāmadhiṣṭhāya saṃbhavāmyātmamāyayā
(6)

Though I am birthless, undecaying by nature, and the Lord of beings, (still) by subjugating My Prakr̥ti, I take birth by means of My own Māyā.

Bhagavad Gitā - Chapter 7
Nāhaṃ prakāśaḥ sarvasya yogamāyāsamāvr̥tāḥ,
mūḍo’yaṃ nābhijānāti loko māmajamavyayam.
(25)

Being enveloped by yoga-māyā, I do not become manifest to all. This deluded world does not know Me who am birthless and undecaying.

Bhagavad Gitā - Chapter 9
Mahātmānastu māṃ pārtha daivīṃ prakr̥timāśritāḥ,
Bhajantyananyamanaso jñātvā bhūtādimavyayam.
(13)

O son of Pr̥thā, the noble ones, being possessed of divine nature, surely adore Me with single-mindedness, knowing Me as the Supreme Personality of Godhead, original and inexhaustible..

पूतात्मा परमात्मा च मुक्तानां परमा गतिः ।
अव्ययः पुरुषस्साक्षी क्षेत्रज्ञोऽक्षर एव च ॥ 1 ॥

పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమా గతిః ।
అవ్యయః పురుషస్సాక్షీ క్షేత్రజ్ఞోఽక్షర ఏవ చ ॥ 2 ॥

Pūtātmā paramātmā ca muktānāṃ paramā gatiḥ ।
Avyayaḥ puruṣassākṣī kṣetrajño’kṣara ēva ca ॥ 2 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి