5 జన, 2013

63. మఙ్గళం పరమ్, मङ्गलं परम्, Maṅgaḷaṃ param

ఓం మఙ్గళాయ పరస్మై నమః | ॐ मङ्गलाय परस्मै नमः | OM Maṅgalāya parasmai namaḥ


ఇది రెండు పదాల నామము. మంగళం - విశేషము. పరం విశేష్యము. శుభకరమును, శుభస్వరూపమును, సర్వభూతములకంటే ఉత్కృష్టమును అగు బ్రహ్మ తత్త్వము.

:: విష్ణు పురాణము ::
అశుభాని నిరాచష్టే తనోతి శుభ సంతతిం ।
స్మృతిమాత్రేణ య త్పుంసాం బ్రహ్మ తన్మంగలం విదుః ॥


ఏ బ్రహ్మము తన స్మరణమాత్రముచేతనే జీవుల అశుభములను తొలగించునో శుభనైరంతర్యమును (ఎడతెగని శుభములను) వర్ధిల్లజేయునో అటువంటి బ్రహ్మ తత్త్వమును 'మంగలం' అని తత్త్వవేత్తలు తలచుచున్నారు.



Maṅgaḷaṃ and param make one word as adjective and noun. Supremely auspicious. He is Maṅgaḷaṃ due to His auspicious form and param of all beings the highest, Brahma.

Viṣṇu purāṇa
Aśubhāni nirācaṣṭe tanoti śubha saṃtatiṃ,
Smr̥timātreṇa ya tpuṃsāṃ brahma tanmaṃgalaṃ viduḥ.


Brahman is known as Maṅgaḷaṃ, the beneficent, which wards off evils and dowers with series of good by being merely remembered.

अग्राह्यश्शाश्वतः कृष्णो लोहिताक्षः प्रतर्दनः ।
प्रभूतः स्त्रिककुब्धाम पवित्रं मङ्गलं परम् ॥ 7 ॥

అగ్రాహ్యశ్శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః ।
ప్రభూతః స్త్రికకుబ్ధామ పవిత్రం మఙ్గళం పరమ్ ॥ 7 ॥

Agrāhyaśśāśvataḥ kr̥ṣṇo lohitākṣaḥ pratardanaḥ ।
Prabhūtaḥ strikakubdhāma pavitraṃ maṅgaḷaṃ param ॥ 7 ॥

4 జన, 2013

62. పవిత్రం, पवित्रं, Pavitraṃ

ఓం పవిత్రాయ నమః | ॐ पवित्राय नमः | OM Pavitrāya namaḥ


యేన పునాతి తత్ పవిత్రమ్ దేనిచే దేనినైను శుద్ధమునుగా చేయుదురో అట్టి తృణవిశేషము కానీ, మంత్రము కానీ, ఋషి కాని 'పవిత్రమ్‌' అనబడును.

:: భగవద్గీత - రాజవిద్యా రాజగుహ్య యోగము ::
పితాఽహమస్య జగతో మాతా ధాతా పితామహః ।
వేద్యం పవిత్ర మోంకార ఋక్సామయజురేవ చ ॥ 17 ॥

ఈ జగత్తునకు నేనే తండ్రిని, తల్లిని, సంరక్షకుడను, తాతను మఱియు తెలిసికొనదగిన వస్తువును, పవిత్రతను చేకూర్చేవాడినీ, ఓంకారమును, ఋగ్వేద, యజుర్వేద, సామవేదములును అయియున్నాను.



Yena punāti tat pavitram That by which one is purified. It can be an object/being or a Mantrā or R̥ṣi.

Bhagavad Gīta - Chapter 9
Pitā’hamasya jagato mātā dhātā pitāmahaḥ,
Vedyaṃ pavitra moṃkāra r̥ksāmayajureva ca. (17)

Of this world, I am the father, mother, ordainer and the grand father; I am the knowable, the sanctifier, the syllable OM as also R̥k, Sāma and Yajus.

अग्राह्यश्शाश्वतः कृष्णो लोहिताक्षः प्रतर्दनः ।
प्रभूतः स्त्रिककुब्दाम पवित्रं मङ्गलं परम् ॥ 7 ॥

అగ్రాహ్యశ్శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః ।
ప్రభూతః स्त्रिककुब्धाम పవిత్రం మఙ్గళం పరమ్ ॥ 7 ॥

Agrāhyaśśāśvataḥ kr̥ṣṇo lohitākṣaḥ pratardanaḥ ।
Prabhūtaḥ strikakubdhāma pavitraṃ maṅgaḷaṃ param ॥ 7 ॥

3 జన, 2013

61. త్రికకుబ్ధామ, त्रिककुब्धाम, Trikakubdhāma

ఓం త్రికకుబ్ధామ్నే నమః | ॐ त्रिककुब्धाम्ने नमः | OM Trikakubdhāmne namaḥ


(ఊర్ధ్వాధోమధ్యభేదేన) తిసృణాం కకుభాం (అపి) ధామ ఊర్ధ్వదిక్, అధోదిక్, మధ్యదిక్ అనుభేదముతో (నుండు) మూడు దిక్కులకును ఆశ్రయస్థానము అగువాడు.

:: పోతన భాగవతము - షష్టమ స్కందము ::
త్రిభువనాత్మ భవన! త్రివిక్రమ! త్రిణయన! త్రిలోక మనోహరానుభావ! భవదీయ వైభవ విభూతి భేదంబు లైన దనుజాదులకు ననుపక్రమ సమయం బెఱింగి, నిజమాయాబలంబున సుర నగ మృగ జలచరాది రూపంబులు ధరియించి, తదీయావతారంబుల ననురూపంబైన విధంబున శిక్షింతువు.

నీవు ముల్లోకాలలో నిండి ఉన్నావు. ముల్లోకాలనూ ఆక్రమించిన త్రివిక్రముడవు. ముల్లోకాలనూ దర్శించే త్రినేత్రుడవు. ముల్లోకాల ఆత్మలను ఆకర్షించే మహామహిమాన్వితుడవు. నీ విభూతి భేదాలైన దానవులు మొదలైన వారికి అంత్యకాలం ఆసన్నం అయిందని తెలుసుకొని నీ మాయా ప్రభావంవల్ల వామనాది దేవతా రూపాలనూ, రామకృష్ణాది మానవ రూపాలనూ, వరాహాది మృగరూపాలనూ, మత్స్యకూర్మాది జలచర రూపాలనూ ధరించి తగిన విధంగా శిక్షిస్తుంటావు.



(Ūrdhvādhomadhyabhedena) Tisr̥ṇāṃ kakubhāṃ (api) dhāma His abode is above, below and the middle regions.

Śrīmad Bhāgavata - Canto 6, Chapter 9
Tri-bhuvanātma-bhavana trivikrama tri-nayana tri-loka-manoharānubhāva tavaiva vibhūtayo ditijadanujādayaścāpi teṣām upakrama samayo'yam iti svātma māyayā sura nara mṛga miśrita jalacarākṛtibhir yathāparādhaṃ daṇḍaṃ daṇḍadhara dadhartha evam enam api bhagavañjahi tvāṣṭram uta yadi manyase. (40)

You are the Supersoul of the three worlds whose power and opulence is distributed throughout the three worlds; O maintainer and seer of the three worlds who is perceived as the most beautiful within the three worlds. Everything and everyone, including human beings and even the Daitya demons and the Dānavas are but an expansion of Your energy. O supremely powerful one, You have always appeared in Your forms as the various incarnations to punish the demons as soon as they become very powerful. You appear as Lord Vāmanadeva, Lord Rāma and Lord Kṛṣṇa. You appear sometimes as an animal like Lord Boar, sometimes a mixed incarnation like Lord Nṛsiḿhadeva and Lord Hayagrīva, and sometimes an aquatic like Lord Fish and Lord Tortoise. Assuming such various forms, You have always punished the demons and Dānavas. We therefore pray that Your Lordship appear today as another incarnation, if You so desire, to kill the great demon Vṛtrāsura.

अग्राह्यश्शाश्वतः कृष्णो लोहिताक्षः प्रतर्दनः ।
प्रभूतः स्त्रिककुब्धाम पवित्रं मङ्गलं परम् ॥ 7 ॥

అగ్రాహ్యశ్శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః ।
ప్రభూతః స్త్రికకుబ్ధామ పవిత్రం మఙ్గళం పరమ్ ॥ 7 ॥

Agrāhyaśśāśvataḥ kr̥ṣṇo lohitākṣaḥ pratardanaḥ ।
Prabhūtaḥ strikakubdhāma pavitraṃ maṅgaḷaṃ param ॥ 7 ॥

2 జన, 2013

60. ప్రభూతః, प्रभूतः, Prabhūtaḥ

ఓం ప్రభూతాయ నమః | ॐ प्रभूताय नमः | OM Prabhūtāya namaḥ


జ్ఞానైశ్వర్యాది గుణైః సంపన్నః జ్ఞానము, ఈశ్వరత్వము మొదలగు గుణములతో నిండినవాడు.

ప్రభవతి కార్యం సంపాదయితుమితి ప్రభూతం కార్యమును జేయ సమర్ధమైనది.



Jñānaiśvaryādi guṇaiḥ saṃpannaḥ Abundantly endowed with the qualities of wisdom, eminence etc..

अग्राह्यश्शाश्वतः कृष्णो लोहिताक्षः प्रतर्दनः ।
प्रभूतः स्त्रिककुब्धाम पवित्रं मङ्गलं परम् ॥ 7 ॥

అగ్రాహ్యశ్శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః ।
ప్రభూతః స్త్రికకుబ్ధామ పవిత్రం మఙ్గళం పరమ్ ॥ 7 ॥

Agrāhyaśśāśvataḥ kr̥ṣṇo lohitākṣaḥ pratardanaḥ ।
Prabhūtaḥ strikakubdhāma pavitraṃ maṅgaḷaṃ param ॥ 7 ॥

1 జన, 2013

59. ప్రతర్దనః, प्रतर्दनः, Pratardanaḥ

ఓం ప్రతర్దనాయ నమః | ॐ प्रतर्दनाय नमः | OM Pratardanāya namaḥ


(ప్రలయే భూతాని) ప్రతర్దయతి (హినస్తి) ప్రలయ సమయమునందు ప్రాణులను హింసించును.



(Pralaye bhūtāni) Pratardayati (hinasti) Destroyer of all at the time of cosmic dissolution.

अग्राह्यश्शाश्वतः कृष्णो लोहिताक्षः प्रतर्दनः
प्रभूतः स्त्रिककुब्धाम पवित्रं मङ्गलं परम् ॥ 7 ॥

అగ్రాహ్యశ్శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః
ప్రభూతః స్త్రికకుబ్ధామ పవిత్రం మఙ్గళం పరమ్ ॥ 7 ॥

Agrāhyaśśāśvataḥ kr̥ṣṇo lohitākṣaḥ pratardanaḥ
Prabhūtaḥ strikakubdhāma pavitraṃ maṅgaḷaṃ param ॥ 7 ॥