10 ఆగ, 2014

645. శూరజనేశ్వరః, शूरजनेश्वरः, Śūrajaneśvaraḥ

ఓం శూరజనేశ్వరాయ నమః | ॐ शूरजनेश्वराय नमः | OM Śūrajaneśvarāya namaḥ


యొవాసవాదీనాం శూరజనానాం పరమేశ్వరః ।
శౌర్యస్యాతిశయేనేష్టో విష్ణుః శూరజనేశ్వరః ॥

తన శౌర్యాతిశయముచే ఈతడు శూరజనులగు ఇంద్రాదులకును ఈశత్వము అనగా ప్రభుత్వమును వహించుచున్నాడు గనుక, ఆ విష్ణు దేవుడు శూరజనేశ్వరః అని చెప్పబడును.



यॊवासवादीनां शूरजनानां परमेश्वरः ।
शौर्यस्यातिशयेनेष्टो विष्णुः शूरजनेश्वरः ॥

Yóvāsavādīnāṃ śūrajanānāṃ parameśvaraḥ,
Śauryasyātiśayeneṣṭo viṣṇuḥ śūrajaneśvaraḥ.

By His superior prowess, exceedingly greater than heroes like Indra etc., He lords upon all these powerful ones and hence Lord Viṣṇu is called Śūrajaneśvaraḥ.

कालनेमिनिहा वीरश्शौरिश्शूरजनेश्वरः ।
त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहा हरिः ॥ ६९ ॥

కాలనేమినిహా వీరశ్శౌరిశ్శూరజనేశ్వరః ।
త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః ॥ 69 ॥

Kālaneminihā vīraśśauriśśūrajaneśvaraḥ,
Trilokātmā trilokeśaḥ keśavaḥ keśihā hariḥ ॥ 69 ॥

9 ఆగ, 2014

644. శౌరిః, शौरिः, Śauriḥ

ఓం శౌరయే నమః | ॐ शौरये नमः | OM Śauraye namaḥ


శౌరిః, शौरिः, Śauriḥ

శూరకులోద్భవత్వాచ్ఛౌరిరుచ్యతే శూరుడు అను యాదవుని వంశమున పురుష సంతతిగా జనించినందున శౌరిః. (వాసుదేవుడు వసుదేవుని పుత్రుడు. వసుదేవుని తండ్రి శూరసేనుడు)

:: పోతన భాగవతము తృతీయ స్కంధము ::
చ. హరి దన నాభిపంకరుహమందు జనించిన యట్టి భారతీ
    శ్వరుఁ డతిభక్తి వేఁడ యదువంశమునన్ బలకృష్ణమూర్తులై
    పరఁగ జనించి భూభారముఁ బాపిన భవ్యులు రేవతీందిరా
    వరు లట శూరసేనుని నివాసమునన్ సుఖ మున్నవారలే? (49)

తన నాభి కమలము నుండి పుట్టిన బ్రహ్మదేవుడు పరమభక్తితో ప్రార్థింపగా శ్రీహరి - బలరాముడుగా, కృష్ణుడుగా యదువంశములో ఉదయించినాడు. అటుల పుట్టి భూభారమును పోగొట్టిన మహోదయులు, రేవతీరుక్మిణీ హృదయప్రియులు అయిన రామకృష్ణులు తమ తాతగారు అయిన శూరసేనుని గృహములో సుఖముగా ఉన్నారా?



शूरकुलोद्भवत्वाच्छौरिरुच्यते / Śūrakulodbhavatvācchaurirucyate Since the Lord took birth in Śūra clan, He is called Śauriḥ. (Vasudeva is the father of Lord Vāsudeva; Vasudeva is son of Śūrasena).

:: श्रीमद्भागवते दशमस्कन्धे द्वितीयोऽध्यायः ::
ततो जग्न्मङ्गलमच्युतांशं समाहितं शूरसुतेन देवी ।
दधार सर्वात्मकमात्मभूतं काष्ठा यथानन्दकरं मनस्तः ॥ १८ ॥

Śrīmad Bhāgavata - Canto 10, Chapter 2
Tato jagnmaṃgalamacyutāṃśaṃ samāhitaṃ śūrasutena devī,
Dadhāra sarvātmakamātmabhūtaṃ kāṣṭhā yathānaṃdakaraṃ manastaḥ. 18.

Thereafter, accompanied by plenary expansions, the fully opulent Lord, who is all-auspicious for the entire universe, was transferred from the mind of Vasudeva to the mind of Devakī. Devakī, having thus been initiated by Vasudeva, became beautiful by carrying Lord Kṛṣṇa, the original consciousness for everyone, the cause of all causes, within the core of her heart, just as the east becomes beautiful by carrying the rising moon.

कालनेमिनिहा वीरश्शौरिश्शूरजनेश्वरः ।
त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहा हरिः ॥ ६९ ॥

కాలనేమినిహా వీరశ్శౌరిశ్శూరజనేశ్వరః ।
త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః ॥ 69 ॥

Kālaneminihā vīraśśauriśśūrajaneśvaraḥ,
Trilokātmā trilokeśaḥ keśavaḥ keśihā hariḥ ॥ 69 ॥

8 ఆగ, 2014

643. వీరః, वीरः, Vīraḥ

ఓం వీరాయ నమః | ॐ वीराय नमः | OM Vīrāya namaḥ


వీరః, वीरः, Vīraḥ

వీరః శూరః శూరుడు, మహా విక్రమశాలి.

:: శ్రీమద్రామాయణే అరణ్యకాణ్డే త్రిపఞ్చాశస్సర్గః ::
నిమేషన్తరమాత్రేణ వినా భ్రాత్రా మహావనే ।
రాక్షసా నిహతా యేన సహస్రాణి చతుర్దశ ॥ 23 ॥
స కథం రాఘవో వీరః సర్వాస్త్రకుశలో బలీ ।
న త్వాం హన్యాచ్ఛరైస్తీక్ష్ణైః ఇష్టభార్యాపహారిణమ్ ॥ 24 ॥

(సీతా దేవి రావణునితో) ఆనాడు దండకారణ్యమునందు తమ్మునితోడు లేకుండగనే రాముడు ఒక్కడే ఖరుడు మొదలగు పదునాలుగువేలమంది రాక్షసయోధులను ఒక్క నిముషములో మట్టి గరిపించెను. వివిధములగు అస్త్రములను ప్రయోగించుటలో ఆరితేరినవాడు, మహా వీరుడు, బలశాలియు అయిన అట్టి శ్రీరాముడు అతని ప్రియభార్యను అపహరించిన నిన్ను తీక్ష్ణమైన శరములచే చంపకుండ ఎట్లుండగలడు?

401. వీరః, वीरः, Vīraḥ



वीरः शूरः / Vīraḥ Śūraḥ Brave and Valiant.

:: श्रीमद्रामायणे अरण्यकाण्डे त्रिपञ्चाशस्सर्गः ::
निमेषन्तरमात्रेण विना भ्रात्रा महावने ।
राक्षसा निहता येन सहस्राणि चतुर्दश ॥ २३ ॥
स कथं राघवो वीरः सर्वास्त्रकुशलो बली ।
न त्वां हन्याच्छरैस्तीक्ष्णैः इष्टभार्यापहारिणम् ॥ २४ ॥

Śrīmad Rāmāyaṇa - Book 3, Chapter 53
Nimeṣantaramātreṇa vinā bhrātrā mahāvane,
Rākṣasā nihatā yena sahasrāṇi caturdaśa. 23.
Sa kathaṃ rāghavo vīraḥ sarvāstrakuśalo balī,
Na tvāṃ hanyāccharaistīkṣṇaiḥ iṣṭabhāryāpahāriṇam. 24.

By whom fourteen thousand demons are killed in war just within a minute, single-handedly without any help from his brother, how then that brave and mighty Raghava, an expert in all kinds of missiles, not eliminate you, the stealer of his chosen wife, with his mordant arrows?" Thus Seetha poured forth her ire at Ravana

401. వీరః, वीरः, Vīraḥ

कालनेमिनिहा वीरश्शौरिश्शूरजनेश्वरः ।
त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहा हरिः ॥ ६९ ॥

కాలనేమినిహా వీరశ్శౌరిశ్శూరజనేశ్వరః ।
త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః ॥ 69 ॥

Kālaneminihā vīraśśauriśśūrajaneśvaraḥ,
Trilokātmā trilokeśaḥ keśavaḥ keśihā hariḥ ॥ 69 ॥

7 ఆగ, 2014

642. కాలనేమినిహా, कालनेमिनिहा, Kālaneminihā

ఓం కాలనేమినిఘ్నే నమః | ॐ कालनेमिनिघ्ने नमः | OM Kālaneminighne namaḥ


కాలనేమినిహా, कालनेमिनिहा, Kālaneminihā

అసురం కాలనేమింనిజఘానేతి జనార్దనః ।
కాలనేమినిహేత్యుక్తో వేదవిద్యా విశారదైః ॥

కాలనేమియను రక్కసుని సంహరించినందున ఆ జనార్దనునికి కాలనేమినిహా అను నామము గలదు.

:: పోతన భాగవతము అష్టమ స్కంధము ::
ఆ. కాలనేమి ఘోర కంఠీరవము నెక్కి, తార్‍క్ష్యు శిరము శూలధారఁ బొడువ
     నతని పోటుముట్టు హరి కేల నంకించి, దానఁ జావఁ బొడిచె దానవునిని. (345)

కాలనేమి అను దానవ వీరుడు భయంకరమైన సింహముపై కూర్చొన్నవాడై, గరుడుని తలపై వాడియైన బల్లెముతో కుమ్మినాడు. వాని ఆయుధమును విష్ణువు పట్టుకొని దానితోనే ఆ రక్కసుడు చనిపోయేటట్లు పొడిచి సంహరించినాడు.



असुरं कालनेमिंनिजघानेति जनार्दनः ।
कालनेमिनिहेत्युक्तो वेदविद्या विशारदैः ॥

Asuraṃ kālanemiṃnijaghāneti janārdanaḥ,
Kālaneminihetyukto vedavidyā viśāradaiḥ.

Since Lord Janārdana killed the demon Kālanemini,He is called Kālaneminihā.

:: श्रीमद्भागवते अष्टमस्कन्धे दशमोऽध्यायः ::
दृष्ट्वा मृधे गरुडवाहमिभारिवाह आविध्य शूलमहिनोदथ कालनेमिः ।
तल्लिलया गरुडमूर्ध्नि पतद्गृहीत्वा तेनाहनन्नृप सवाहमरिं त्र्यधीशः ॥ ५६ ॥

Śrīmad Bhāgavata - Canto 8, Chapter 10
Dr̥ṣṭvā mr̥dhe garuḍavāhamibhārivāha āvidhya śūlamahinodatha kālanemiḥ,
Tallilayā garuḍamūrdhni patadgr̥hītvā tenāhanannr̥pa savāhamariṃ tryadhīśaḥ. 56.

Being carried by a lion, the demon Kālanemini when he saw that the Lord carried by Garuda, was on the battlefield, he immediately took his trident, whirled it and discharged it at Garuda's head. Lord Hari, the master of the three worlds, immediately caught the trident, and with the very same weapon he killed the enemy Kalanemi, along with his carrier, the lion.

कालनेमिनिहा वीरश्शौरिश्शूरजनेश्वरः ।
त्रिलोकात्मा त्रिलोकेशः केशवः केशिहा हरिः ॥ ६९ ॥

కాలనేమినిహా వీరశ్శౌరిశ్శూరజనేశ్వరః ।
త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః ॥ 69 ॥

Kālaneminihā vīraśśauriśśūrajaneśvaraḥ,
Trilokātmā trilokeśaḥ keśavaḥ keśihā hariḥ ॥ 69 ॥

6 ఆగ, 2014

641. అమితవిక్రమః, अमितविक्रमः, Amitavikramaḥ

ఓం అమితవిక్రమాయ నమః | ॐ अमितविक्रमाय नमः | OM Amitavikramāya namaḥ


అమితోఽతులితో యస్య విక్రమస్స జనార్ధనః ।
అవిహింసిత విక్రమోఽమిత్ విక్రమ ఈర్యతే ॥

పరిమితముకాని అమితము అయిన విక్రమము, శక్తి లేదా పాదన్యాసము గలవాడు అమితవిక్రమః. లేదా ఎవరిచేతను బాధించబడనిదియగు విక్రమము కలవాడు.



अमितोऽतुलितो यस्य विक्रमस्स जनार्धनः ।
अविहिंसित विक्रमोऽमित् विक्रम ईर्यते ॥

Amito’tulito yasya vikramassa janārdhanaḥ,
Avihiṃsita vikramo’mit vikrama īryate.

The One with unlimited, incomparable valor. Or He whose valor has not been impaired is Amitavikramaḥ.

अर्चिष्मानर्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः ।
अनिरुद्धोऽप्रतिरथः प्रद्युम्नोऽमितविक्रमः ॥ ६८ ॥

అర్చిష్మానర్చితః కుమ్భో విశుద్ధాత్మా విశోధనః ।
అనిరుద్ధోఽప్రతిరథః ప్రద్యుమ్నోఽమితవిక్రమః ॥ 68 ॥

Arciṣmānarcitaḥ kumbho viśuddhātmā viśodhanaḥ,
Aniruddho’pratirathaḥ pradyumno’mitavikramaḥ ॥ 68 ॥