ఓం శబ్దసహాయ నమః | ॐ शब्दसहाय नमः | OM Śabdasahāya namaḥ
సర్వే వేదాః తాత్పర్యేణ తమేవ వదన్తీతి శబ్దసహః శబ్దములను తనకు ప్రతిపాదములనుగా అగీకరించును. సర్వవేదములును అతనియందే తమ తాత్పర్యములద్వార అతనినే చెప్పుచున్నవి కనుక అతడు శబ్దసహుడు.
:: కఠోపనిషత్ ప్రథమాధ్యాయము 2వ వల్లి ::
సర్వే వేదాయత్పదమాననన్తి
తపాగ్‍ంసిసర్వాణి చ యద్యదన్తి ।
యదిచ్ఛన్తో బ్రహ్మచర్యం చరన్తి
తత్తేపదగ్‍ం సఙ్గ్రహేణ బ్రవీ మ్యోమిత్యేతత్ ॥ 15 ॥
(యమధర్మరాజు చెప్పుచున్నాడు) సమస్త వేదములు ఏ వస్తువును లక్ష్యముగా చెప్పుచున్నవో, కృచ్ఛచాంద్రాయణాది రూపములగు తపస్సులన్నియు ఏ వస్తువును పొందుటయే ప్రయోజనములుగా గలిగి ఆచరింపబడుచున్నవో, ఏ వస్తువును కోరి బ్రహ్మచర్యమును అవలంభించుచున్నారో, అట్టి పరమ పదమును గురించి సంగ్రహముగా చెప్పుచున్నాను. ఆ పరమ పదమే ప్రణవము - ఓం.
:: శ్రీమద్భగవద్గీత - పురుషోత్తమప్రాప్తి యోగము ::
సర్వస్య చాహం హృది సన్నివిష్టో
మత్తః స్స్మృతి ర్జ్ఞాన మపోహనం చ ।
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో
వేదాన్తకృద్వేదవిదేవ చాహమ్ ॥ 15 ॥
నేను సమస్త ప్రాణులయొక్క హృదయమందున్నవాడను. నావలననే జీవునకు జ్ఞాపకశక్తి, జ్ఞానము, మఱపు కలుగుచున్నవి. వేదములన్నిటిచేతను తెలియదగినవాడను నేనే అయియున్నాను. మఱియు వేదము నెఱిగినవాడనుగూడ నేనే అయియున్నాను.
सर्वे वेदाः तात्पर्येण तमेव वदन्तीति शब्दसहः / Sarve vedāḥ tātparyeṇa tameva vadantīti śabdasahaḥ He who is declared by the Sabdas or sounds of Vedas as their import is Śabdasahaḥ.
:: कठोपनिषत् प्रथमाध्याय २व वल्लि ::
सर्वे वेदायत्पदमाननन्ति
तपाग्ंसिसर्वाणि च यद्यदन्ति ।
यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति
तत्ते पदग्ं सङ्ग्रहेण ब्रवी म्योमित्येतत् ॥ १५ ॥
Kaṭhopaniṣat Chapter 1 Canto 2
Sarve vedāyatpadamānananti
Tapāgˈṃsisarvāṇi ca yadyadanti,
Yadicchanto brahmacaryaṃ caranti
Tatte padagˈṃ saṅgraheṇa bravī myomityetat. 15.
I (Yamadharmarāja) tell you briefly of that goal which all the Vedas with one voice propound, which all the austerities speak of, and wishing for which people practice Brahmacarya: it is this, viz, praṇava or ॐ.
:: श्रीमद्भगवद्गीत - पुरुषोत्तमप्राप्ति योग ::
सर्वस्य चाहं हृदि सन्निविष्टो
मत्तः स्स्मृति र्ज्ञान मपोहनं च ।
वेदैश्च सर्वैरहमेव वेद्यो
वेदान्तकृद्वेदविदेव चाहम् ॥ १५ ॥
Śrīmad Bhagavad Gīta - Chapter 15
Sarvasya cāhaṃ hr̥di sanniviṣṭo
Mattaḥ ssmr̥ti rjñāna mapohanaṃ ca,
Vedaiśca sarvairahameva vedyo
Vedāntakr̥dvedavideva cāham. 15.
I am seated in the hearts of all. From Me are memory, knowledge and their loss. I alone am the object to be known through all the Vedas; I am also the originator of the Vedānta, and I Myself am the knower of the Vedas.
अरौद्रः कुण्डली चक्री विक्रम्यूर्जितशासनः । |
शब्दातिगश्शब्दसहश्शिशिरश्शर्वरीकरः ॥ ९७ ॥ |
అరౌద్రః కుణ్డలీ చక్రీ విక్రమ్యూర్జితశాసనః । |
శబ్దాతిగశ్శబ్దసహశ్శిశిరశ్శర్వరీకరః ॥ 97 ॥ |
Araudraḥ kuṇḍalī cakrī vikramyūrjitaśāsanaḥ, |
Śabdātigaśśabdasahaśśiśiraśśarvarīkaraḥ ॥ 97 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి