ఓం బ్రహ్మిణే నమః | ॐ ब्रह्मिणे नमः | OM Brahmiṇe namaḥ
అత్రైవ తచ్ఛేషభూతా వర్తన్తే బ్రహ్మ సంజ్ఞితాః ।
ఇతి త్రివిక్రమో బ్రహ్మీత్యుచ్యతే విదుషాం వరైః ॥
బ్రహ్మము తనయందుగలవాడు బ్రహ్మీ. బ్రహ్మ అను సంజ్ఞతో వ్యవహరించబడు తపము మొదలగునవి నాలుగును పరమాత్మునకు అంగ భూతములు అగుచు త్రివిక్రముడగు విష్ణునియందే యున్నవి గనుక బ్రహ్మీ.
:: పోతన భాగవతము షష్ఠమ స్కంధము ::
సీ. | పూని నా రూపంబు భూతజాలంబులు, భూతభావనుఁడ నేఁ బొందువడఁగ |
బ్రహ్మంబు మఱియు శబ్దబ్రహ్మమును శాశ్వతంబైన తనువులు దగిలె నాకు | |
నఖిలలోకములందు ననుగతంబై యుందు, లోకంబు నా యందు జోకఁజెందు, | |
నుభయంబు నాయందు నభిగతంబై యుండు, నభిలీన మగుదు న య్యుభయమందు! | |
తే. | వెలయ నిద్రించువాఁడాత్మ విశ్వమెల్లఁ, జూచి మేల్కాంచి తా నొక్క చోటివానిఁ |
గా వివేకించు మాడ్కి నీ జీవితేశ, మాయ దిగనాడి పరమధర్మంబుఁ దెలియు. (479) |
ఈ జగత్తులోని సమస్తజీవులూ నా స్వరూపాలే. నేను భూత భావనుడను. ఈ సృష్టిలోని సమస్త రూపములను నిర్దేశించెడివాడను నేనే! బ్రహ్మమూ, శబ్దబ్రహ్మమూ - రెండూ శాశ్వతమైన నా దేహములు. ఆత్మస్వరూపుడనైన నేను అఖిల లోకములయందు నిండి ఉన్నాను. ఈ సమస్త జగత్తులు నాలో ఇమిడి ఉన్నాయి. ఈ రెండు స్థితులూ నాకు అనుకూలముగా నడుస్తూ ఉంటాయి. నేను ఈ రెంటిలోను అంతర్లీనముగా ఉంటాను. నిదురించెడివాడు స్వప్నావస్థలో సమస్త విశ్వమును సందర్శించి మేల్కాంచిన అనంతరము తాను ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటాడు. అదే విధముగా జీవులు ఈ విశాల సృష్టియందు విహరించి ఏదో ఒకనాడు భగవంతుని మాయనుండి విడివడినవారై పరమార్థమును తెలుసుకుంటారు.
अत्रैव तच्छेषभूता वर्तन्ते ब्रह्म संज्ञिताः ।
इति त्रिविक्रमो ब्रह्मीत्युच्यते विदुषां वरैः ॥
Atraiva taccheṣabhūtā vartante brahma saṃjñitāḥ,
Iti trivikramo brahmītyucyate viduṣāṃ varaiḥ.
Austerity, the Vedas, sages and wisdom which are indicated by the word Brahma, are parts of Him and hence He is Brahmī.
:: श्रीमद्भागवते षष्ठस्कन्धे षोडशोऽध्यायः ::
अहं वै सर्वभूतानि भूतात्मा भूतभावनः ।
शब्दब्रह्म परं ब्रह्म ममोभे शाश्वती तनू ॥ ५१ ॥
Śrīmad Bhāgavata - Canto 6, Chapter 16
Ahaṃ vai sarvabhūtāni bhūtātmā bhūtabhāvanaḥ,
Śabdabrahma paraṃ brahma mamobhe śāśvatī tanū. 51.
All living entities, moving and non-moving, are My expansions and are separate from Me. I am the Supersoul of all living beings, who exist because I manifest them. I am the form of the transcendental vibrations like oḿkāra and I am the Supreme Absolute Truth. These two forms of Mine - namely, the transcendental sound and the eternally blissful spiritual form of the Deity, are My eternal forms; they are not material.
ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्मविवर्धनः । |
ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः ॥ ७१ ॥ |
బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః । |
బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః ॥ 71 ॥ |
Brahmaṇyo brahmakr̥dbrahmā brahma brahmavivardhanaḥ, |
Brahmavidbrāhmaṇo brahmī brahmajño brāhmaṇapriyaḥ ॥ 71 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి