13 సెప్టెం, 2014

679. స్తవ్యః, स्तव्यः, Stavyaḥ

ఓం స్తవ్యాయ నమః | ॐ स्तव्याय नमः | OM Stavyāya namaḥ


కేశవః స్తూయతే సర్వైర్నస్తోతా కస్యవాఽపి సః ।
ఇతి స్తవ్య ఇతి ప్రోక్తో వేదవిద్యావిశారదైః ॥

కేశవుడు ఎల్లరిచే స్తుతించబడునుగానీ తాను ఎవ్వరిని స్తుతించువాడు కాదు కనుక వేదవిద్యా విశారదులు ఈతనిని స్తవ్యః అని కీర్తింతురు.

:: పోతన భాగవతము తృతీయ స్కంధము ::
సీ. వరుస విగ్రహ పారవశ్యంబునను జేసి రఘురామ కృష్ణ వరాహ నార
సింహాది మూర్తు లంచితలీల ధరియించి దుష్టనిగ్రహమును శిష్టపాల
నమును గావించుచు నయమున సద్దర్మ నిరత చిత్తులకు వర్ణింపఁ దగిన
చతురాత్మతత్త్వ విజ్ఞాన ప్రదుండవై వర్తింతు వనఘ! భవన్మహత్త్వ
తే. మజున కయినను వాక్రువ్వ నలది గాదు, నిగమ జాతంబు లయిన వర్ణింపలేవ
యెఱిఁగి సంస్తుతి సేయ నే నెంత దాన?, వినుత గుణశీల మాటలు వేయు నేల? (1033)

పరమాత్మ స్వరూపుడవైన నీవు అవతారముల మీద ముచ్చటపడి రఘురామచంద్రుడిగా, శ్రీ కృష్ణ ప్రభువుగా, వరాహస్వామిగా, నరసింహమూర్తిగా ఆకారములు ధరియించి దుష్ట శిక్షణం, శిష్ట రక్షణం చేస్తావు. ఉత్తమ ధర్మమునందు ప్రవృత్తమైన చిత్తము గల భక్తులకు జ్ఞానదృష్టిని ప్రసాదించుటకొరకై వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ వ్యూహాలను అవలంబించి ప్రవర్తిస్తావు. అనఘుడవు. అనంత కల్యాణ గుణ సంపన్నుడవు అయిన నీ మహత్త్వమును అభివర్ణించడము చతుర్ముఖునకు, చతుర్వేదులకు కూడ సాధ్యము కాదు; ఇకె నేనెంత? వెయ్యి మాటలు ఏల? నిన్ను తెలుసుకొని సన్నుతించడము నాకు శక్యము కాని పని. 



केशवः स्तूयते सर्वैर्नस्तोता कस्यवाऽपि सः ।
इति स्तव्य इति प्रोक्तो वेदविद्याविशारदैः ॥

Keśavaḥ stūyate sarvairnastotā kasyavā’pi saḥ,
Iti stavya iti prokto vedavidyāviśāradaiḥ.

He is praised by all; but no one is praised by Him.

स्तव्यस्स्तवप्रियस्स्तोत्रं स्तुतिः स्तोता रणप्रियः ।
पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः ॥ ७३ ॥

స్తవ్యస్స్తవప్రియస్స్తోత్రం స్తుతిః స్తోతా రణప్రియః ।
పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిరనామయః ॥ 73 ॥

Stavyasstavapriyasstotraṃ stutiḥ stotā raṇapriyaḥ,
Pūrṇaḥ pūrayitā puṇyaḥ puṇyakīrtiranāmayaḥ ॥ 73 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి