ఓం బ్రాహ్మణప్రియాయ నమః | ॐ ब्राह्मणप्रियाय नमः | OM Brāhmaṇapriyāya namaḥ
బ్రాహ్మణానాం ప్రియో విష్ణుర్బ్రాహ్మణా అస్య వా ప్రియాః ।
బ్రాహ్మణప్రియ ఇత్యుక్తో విష్ణుర్విబుధసత్తమైః ॥
తత్పురుష సమాసముగా చూచినట్లయితే బ్రాహ్మణులకు ఇష్టుడు అని అర్థము. బహువ్రీహి సమాసముగా చూచినట్లయిన ఎవనికి బ్రాహ్మణులు ప్రీతి పాత్రులో అట్టివాడు బ్రాహ్మణప్రియః.
దీకిని ఉపబలముగా భగవద్వచనము - ఘ్నన్తం శపన్తం పురుషం వదన్తం । యో బ్రాహ్మణం న ప్రణమేద్ యథాఽర్హం । స పాపకృద్ బ్రహ్మదావాగ్నిదగ్ధో । వధ్యశ్చ దణ్డశ్చ న చాఽస్మదీయః ॥ 'తనను చంపుచున్నవానిని, తిట్టుచున్నవానిని, తన విషయమున కఠిన వచనములు పలుకుచున్న వానిని ఐనను, బ్రాహ్మణుని ఆతని ఇతరములగు యోగ్యతల ననుసరించి తగిన విధమున నమస్కరించకుండునో అట్టి పాపకారి మనుజుడు బ్రహ్మ దావాగ్నిచే దహించబడువాడును, వధ్యుడును, దండ్యుడును అగును. అంతియకాదు - వాడు నావాడు కాడు' అని యున్నది.
మహాభారతమునందలి భీష్మవచనమున పరమాత్మునకు బ్రాహ్మణులయందుగల ప్రీతి నిరూపించడినది.
యం దేవం దేవకీ దేవీ వసుదేవాదజీజనత్ ।
భౌమస్య బ్రహ్మణో గుప్త్యై దీప్తమగ్నిమివారణిః ॥ 29 ॥
అరణి ప్రజ్వలించు అగ్నిని ప్రకటించినట్లు - భూలోకవర్తియగు బ్రాహ్మణ జాతిని, వేదములను మరియు యజ్ఞములను రక్షించుటకై దేవకీ దేవి వసుదేవుని వలన అట్టి దేవుని కనెను.
ब्राह्मणानां प्रियो विष्णुर्ब्राह्मणा अस्य वा प्रियाः ।
ब्राह्मणप्रिय इत्युक्तो विष्णुर्विबुधसत्तमैः ॥
Brāhmaṇānāṃ priyo viṣṇurbrāhmaṇā asya vā priyāḥ,
Brāhmaṇapriya ityukto viṣṇurvibudhasattamaiḥ.
Brāhmaṇapriyaḥ can be interpreted as 'the One who is dear to Brāhmaṇas' or 'the One to whom Brāhmaṇas are dear.'
The Lord said: घ्नन्तं शपन्तं पुरुषं वदन्तं । यो ब्राह्मणं न प्रणमेद् यथाऽर्हं । स पापकृद् ब्रह्मदावाग्निदग्धो । वध्यश्च दण्डश्च न चाऽस्मदीयः ॥ / Ghnantaṃ śapantaṃ puruṣaṃ vadantaṃ, Yo brāhmaṇaṃ na praṇamed yathā’rhaṃ, Sa pāpakr̥d brahmadāvāgnidagdho, Vadhyaśca daṇḍaśca na cā’smadīyaḥ. - One who does not duly respect a Brāhmaṇa as is proper, who kills, curses or speaks harshly to him, is a sinner burnt up by the forest fire of Brahma and must be put to death or otherwise punished; he doe not belong to Me.
:: श्रीमहाभारते शान्तिपर्वणि सप्तचत्वारिंशोऽध्यायः ::
यं देवं देवकी देवी वसुदेवादजीजनत् ।
भौमस्य ब्रह्मणो गुप्त्यै दीप्तमग्निमिवारणिः ॥ २९ ॥
Śrī Mahābhārata - Book 12, Chapter 47
Yaṃ devaṃ devakī devī vasudevādajījanat,
Bhaumasya brahmaṇo guptyai dīptamagnimivāraṇiḥ. 29.
That God whom the holy Devaki begot of Vasudeva like the radiant fire from araṇi wood for the protection of Brāhmaṇas, Vedas and yajñas on earth.
ब्रह्मण्यो ब्रह्मकृद्ब्रह्मा ब्रह्म ब्रह्मविवर्धनः । |
ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः ॥ ७१ ॥ |
బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః । |
బ్రహ్మవిద్బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః ॥ 71 ॥ |
Brahmaṇyo brahmakr̥dbrahmā brahma brahmavivardhanaḥ, |
Brahmavidbrāhmaṇo brahmī brahmajño brāhmaṇapriyaḥ ॥ 71 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి