31 అక్టో, 2014

727. సవః, सवः, Savaḥ

ఓం సవాయ నమః | ॐ सवाय नमः | OM Savāya namaḥ

స సవోఽధ్వర ఈశానః సోమోయత్రాభిషూయతే సోమరసములయందు అభిషవణము అనగా పిండబడునట్టి యజ్ఞమునకు 'సవము' అని వ్యవహారము. అది శ్రీ విష్ణు రూపమే.

स सवोऽध्वर ईशानः सोमोयत्राभिषूयते / Sa savo’dhvara īśānaḥ somoyatrābhiṣūyate The Soma sacrifice called Savah in which the some is crushed. He who is in the form of Soma Yāga is Savaḥ.

एकोनैकस्सवः कः किं यत्तत्पदमनुत्तमम् ।
लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः ॥ ७८ ॥

ఏకోనైకస్సవః కః కిం యత్తత్పదమనుత్తమమ్ ।
లోకబన్ధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః ॥ 78 ॥

Ekonaikassavaḥ kaḥ kiṃ yattatpadamanuttamam,
Lokabandhurlokanātho mādhavo bhaktavatsalaḥ ॥ 78 ॥

30 అక్టో, 2014

726. నైకః, नैकः, Naikaḥ

ఓం నైకస్మై నమః | ॐ नैकस्मै नमः | OM Naikasmai namaḥ

మాయయా బహురూపత్త్వాన్నైక ఇత్యుచ్యతే హరిః ।
ఇన్ద్రో మాయాభిరిత్యాదిశ్రుతివాక్యానుసారతః ॥

ఒక్కడు కాని వాడు. మాయచే బహు రూపములు కలవాడు. 'ఇన్ద్రో మాయాభిః పురురూప ఈయతే' (బృహదారణ్యకోపనిషత్ 2.5.19) 'ఇంద్రుడు (పరమాత్మ) తన మాయలచే బహు రూపుడగు అనుభవ గోచరుడగుచున్నాడు' అను శ్రుతి వచనము ఇట ప్రమాణము.

मायया बहुरूपत्त्वान्नैक इत्युच्यते हरिः ।
इन्द्रो मायाभिरित्यादिश्रुतिवाक्यानुसारतः ॥

Māyayā bahurūpattvānnaika ityucyate hariḥ,
Indro māyābhirityādiśrutivākyānusārataḥ.

Not one only. As He is of many forms due to the action of māya vide the śruti 'इन्द्रो मायाभिः पुरुरूप ईयते / indro māyābhiḥ pururūpa īyate' (Br̥hadāraṇyakopaniṣat 2.5.19) meaning 'The Lord diversifies Himself in many forms by the forces of māya'.

एकोनैकस्सवः कः किं यत्तत्पदमनुत्तमम् ।
लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः ॥ ७८ ॥

ఏకోనైకస్సవః కః కిం యత్తత్పదమనుత్తమమ్ ।
లోకబన్ధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః ॥ 78 ॥

Ekonaikassavaḥ kaḥ kiṃ yattatpadamanuttamam,
Lokabandhurlokanātho mādhavo bhaktavatsalaḥ ॥ 78 ॥

29 అక్టో, 2014

725. ఏకః, एकः, Ekaḥ

ఓం ఏకైస్మై నమః | ॐ एकैस्मै नमः | OM Ekaismai namaḥ

సజాతీయవిజాతీయ స్వగతత్వావిభేదతః ।
పరమార్థత్వేనవినిర్ముక్తాదేక ఉచ్యతే ।
ఏకమేవాఽద్వితీయం బ్రహ్మేతి శ్రుతిసమీరణాత్ ॥

వాస్తవ పరమార్థ స్థితిలో పరమాత్ముడు సజాతీయ విజాతీయ స్వగత భేదములనుండి సంపూర్ణముగాను, మిక్కిలిగాను వినిర్ముక్తుడు కావున ఏకః. ఒకేయొకడు. ఏకమేవాఽద్వితీయమ్ (ఛాందోగ్యోపనిషత్ 6.2.1) 'పరమాత్మ తత్త్వము ఒక్కటియే; తనకు భిన్నముగా రెండవది మరి ఏదియు లేనిది' అను శ్రుతి వచనము ఇందు ప్రమాణము.

सजातीयविजातीय स्वगतत्वाविभेदतः ।
परमार्थत्वेनविनिर्मुक्तादेक उच्यते ।
एकमेवाऽद्वितीयं ब्रह्मेति श्रुतिसमीरणात् ॥

Sajātīyavijātīya svagatatvāvibhedataḥ,
Paramārthatvenavinirmuktādeka ucyate,
Ekamevā'dvitīyaṃ brahmeti śrutisamīraṇāt.

He is one (only) as in truth. He is bereft of any difference of like kind, of different kind or internal differences vide the śruti एकमेवाऽद्वितीयं / Ekamevā’dvitīyaṃ (Chāndogyopaniṣat 6.2.1) 'one only without a second'.

एकोनैकस्सवः कः किं यत्तत्पदमनुत्तमम् ।
लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः ॥ ७८ ॥

ఏకోనైకస్సవః కః కిం యత్తత్పదమనుత్తమమ్ ।
లోకబన్ధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః ॥ 78 ॥

Ekonaikassavaḥ kaḥ kiṃ yattatpadamanuttamam,
Lokabandhurlokanātho mādhavo bhaktavatsalaḥ ॥ 78 ॥

28 అక్టో, 2014

724. శతాననః, शताननः, Śatānanaḥ

ఓం శతాననాయ నమః | ॐ शताननाय नमः | OM Śatānanāya namaḥ

యతో విశ్వాదిమూర్తిత్వమత ఏవ శతాననః వందల ముఖములు కలవాడు. విశ్వము మొదలగు బహు విదబహు మూర్తులు కలవాడు కావుననే శతాననః.

यतो विश्वादिमूर्तित्वमत एव शताननः / Yato viśvādimūrtitvamata eva śatānanaḥ He who has hundreds of faces. As He is of universal form, He is Śatānanaḥ.

विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् ।
अनेकमूर्तिरव्यक्तश्शतमूर्तिश्शताननः ॥ ७७ ॥

విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ ।
అనేకమూర్తిరవ్యక్తశ్శతమూర్తిశ్శతాననః ॥ 77 ॥

Viśvamūrtirmahāmūrtirdīptamūrtiramūrtimān,
Anekamūrtiravyaktaśśatamūrtiśśatānanaḥ ॥ 77 ॥

27 అక్టో, 2014

723. శతమూర్తిః, शतमूर्तिः, Śatamūrtiḥ

ఓం శతమూర్తయే నమః | ॐ शतमूर्तये नमः | OM Śatamūrtaye namaḥ

నానా వికల్పజా విష్ణోర్మూర్తయస్సంవిదాకృతేః ।
సన్తీతిత్యయం శతమూర్తిరితి సఙ్కీర్త్యతే హరిః ॥

నానా వికల్పములచే కలిగిన, కలుగబోవు అనేక మూర్తులు శుద్ధానుభవరూపుడగు ఈతనికి కలవు కనుక ఆ విష్ణువు శతమూర్తిః.

नाना विकल्पजा विष्णोर्मूर्तयस्संविदाकृतेः ।
सन्तीतित्ययं शतमूर्तिरिति सङ्कीर्त्यते हरिः ॥

Nānā vikalpajā viṣṇormūrtayassaṃvidākr̥teḥ,
Santītityayaṃ śatamūrtiriti saṅkīrtyate hariḥ.

He whose form is pure consciousness has many forms created by His own thought.

विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् ।
अनेकमूर्तिरव्यक्तश्शतमूर्तिश्शताननः ॥ ७७ ॥

విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ ।
అనేకమూర్తిరవ్యక్తశ్శతమూర్తిశ్శతాననః ॥ 77 ॥

Viśvamūrtirmahāmūrtirdīptamūrtiramūrtimān,
Anekamūrtiravyaktaśśatamūrtiśśatānanaḥ ॥ 77 ॥

26 అక్టో, 2014

722. అవ్యక్తః, अव्यक्तः, Avyaktaḥ

ఓం అవ్యక్తాయ నమః | ॐ अव्यक्ताय नमः | OM Avyaktāya namaḥ

యద్యప్యనేకమూర్తిత్వమస్య విష్ణోస్తథాపి చ ।
అయమీదృశ ఏవేతి న వ్యక్తోఽవ్యక్త ఉచ్యతే ॥

పరమాత్ముడు అనేక మూర్తులు కలవాడే అయినను, ఇతడు ఇట్టివాడు అని తెలియదగినట్లు వ్యక్తత అనగా స్పష్టత నందువాడు కాదు కనుక అవ్యక్తః.

यद्यप्यनेकमूर्तित्वमस्य विष्णोस्तथापि च ।
अयमीदृश एवेति न व्यक्तोऽव्यक्त उच्यते ॥

Yadyapyanekamūrtitvamasya viṣṇostathāpi ca,
Ayamīdr̥śa eveti na vyakto’vyakta ucyate.

Though He has many forms, He is not identifiable as a being of particular form and hence He is Avyaktaḥ.

विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् ।
अनेकमूर्तिरव्यक्तश्शतमूर्तिश्शताननः ॥ ७७ ॥

విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ ।
అనేకమూర్తిరవ్యక్తశ్శతమూర్తిశ్శతాననః ॥ 77 ॥

Viśvamūrtirmahāmūrtirdīptamūrtiramūrtimān,
Anekamūrtiravyaktaśśatamūrtiśśatānanaḥ ॥ 77 ॥

25 అక్టో, 2014

721. అనేకమూర్తిః, अनेकमूर्तिः, Anekamūrtiḥ

ఓం అనేకమూర్తయే నమః | ॐ अनेकमूर्तये नमः | OM Anekamūrtaye namaḥ

స్వేచ్ఛాయాహ్యవతారేషు లోకానాముపకారిణీః ।
బహ్విర్మూర్తీర్భజత ఇత్యేతస్యానేమూరితా ॥

ఆయా అవతారములయందు తన ఇచ్ఛతోనే లోకములకు ఉపకారమొనర్చు బహుమూర్తుల నాశ్రయించువాడు కనుక అనేకములగు మూర్తులు ఈతనికి కలవు.

स्वेच्छायाह्यवतारेषु लोकानामुपकारिणीः ।
बह्विर्मूर्तीर्भजत इत्येतस्यानेमूरिता ॥

Svecchāyāhyavatāreṣu lokānāmupakāriṇīḥ,
Bahvirmūrtīrbhajata ityetasyānemūritā.

Since He assumed many forms of His own will in His many incarnations for helping the worlds, He is known as Anekamūrtiḥ.

विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् ।
अनेकमूर्तिरव्यक्तश्शतमूर्तिश्शताननः ॥ ७७ ॥

విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ ।
అనేకమూర్తిరవ్యక్తశ్శతమూర్తిశ్శతాననః ॥ 77 ॥

Viśvamūrtirmahāmūrtirdīptamūrtiramūrtimān,
Anekamūrtiravyaktaśśatamūrtiśśatānanaḥ ॥ 77 ॥

24 అక్టో, 2014

720. అమూర్తిమాన్, अमूर्तिमान्, Amūrtimān

ఓం అమూర్తిమతే నమః | ॐ अमूर्तिमते नमः | OM Amūrtimate namaḥ

కర్మనిబన్ధనామూర్తిర్విష్ణోస్య న విద్యతే ।
ఇతి విద్వద్భిరనన్తః ప్రోచ్యతేఽమూర్తిమానితి ॥

కర్మచే నిబంధించబడిన మూర్తి ఈతనిది కాదు. అందుకే అమూర్తిమాన్‍.

कर्मनिबन्धनामूर्तिर्विष्णोस्य न विद्यते ।
इति विद्वद्भिरनन्तः प्रोच्यतेऽमूर्तिमानिति ॥

Karmanibandhanāmūrtirviṣṇosya na vidyate,
Iti vidvadbhiranantaḥ procyate’mūrtimāniti.

Since His form is not determined by the bonds of karma, He is called Amūrtimān.

विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान्
अनेकमूर्तिरव्यक्तश्शतमूर्तिश्शताननः ॥ ७७ ॥

విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్
అనేకమూర్తిరవ్యక్తశ్శతమూర్తిశ్శతాననః ॥ 77 ॥

Viśvamūrtirmahāmūrtirdīptamūrtiramūrtimān,
Anekamūrtiravyaktaśśatamūrtiśśatānanaḥ ॥ 77 ॥

22 అక్టో, 2014

719. దీప్తమూర్తిః, दीप्तमूर्तिः, Dīptamūrtiḥ

ఓం దీప్తమూర్తయే నమః | ॐ दीप्तमूर्तये नमः | OM Dīptamūrtaye namaḥ

దీప్తా జ్ఞానమయీ మూర్తి రస్యేతి స్వేచ్ఛయా హరేః ।
గృహీతా తైజసీ మూర్తిర్దీప్తాఽస్యేత్యథవా హరిః ।
దీప్తమూర్తితి ప్రోక్తో వేదవిద్యావిశారదైః ॥

ప్రకాశించుచుండు జ్ఞానమయియగు మూర్తి ఎవనికి కలదో అట్టివాడు. లేదా ఎవరి ఆజ్ఞతోను పనిలేక తన ఇచ్ఛతో గ్రహించబడిన తైజస మూర్తి అనగా హిరణ్యగర్భ మూర్తి - దీప్తమగు, ప్రకాశించునది ఈతనికి కలదు. (సకల తైజసమూర్తుల సమష్టియే హిరణ్యగర్భమూర్తి.)

दीप्ता ज्ञानमयी मूर्ति रस्येति स्वेच्छया हरेः ।
गृहीता तैजसी मूर्तिर्दीप्ताऽस्येत्यथवा हरिः ।
दीप्तमूर्तिति प्रोक्तो वेदविद्याविशारदैः ॥

Dīptā jñānamayī mūrti rasyeti svecchayā hareḥ,
Gr̥hītā taijasī mūrtirdīptā’syetyathavā hariḥ,
Dīptamūrtiti prokto vedavidyāviśāradaiḥ.

Resplendent is the nature of His superior knowledge. Or since He assumed by His own free will - His bright and flowing form, He is Dīptamūrtiḥ.

विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् ।
अनेकमूर्तिरव्यक्तश्शतमूर्तिश्शताननः ॥ ७७ ॥

విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ ।
అనేకమూర్తిరవ్యక్తశ్శతమూర్తిశ్శతాననః ॥ 77 ॥

Viśvamūrtirmahāmūrtirdīptamūrtiramūrtimān,
Anekamūrtiravyaktaśśatamūrtiśśatānanaḥ ॥ 77 ॥

718. మహామూర్తిః, महामूर्तिः, Mahāmūrtiḥ

ఓం మహామూర్తయే నమః | ॐ महामूर्तये नमः | OM Mahāmūrtaye namaḥ

మహతీ మూర్తిరేతస్య శేష పర్యఙ్కశాయినః ।
ఇతి విష్ణుర్మహామూర్తిరితి సఙ్కీర్త్యతే బుధైః ॥

అపరిమిత శరీరుడైన అనంతుడు అనగా శేషుని తన పర్యంకముగా చేసికొని శయనించి యున్నందున ఈతని మూర్తి చాలా పెద్దదియే కదా!

महती मूर्तिरेतस्य शेष पर्यङ्कशायिनः ।
इति विष्णुर्महामूर्तिरिति सङ्कीर्त्यते बुधैः ॥

Mahatī mūrtiretasya śeṣa paryaṅkaśāyinaḥ,
Iti viṣṇurmahāmūrtiriti saṅkīrtyate budhaiḥ.

Since He lies on Ādiśeṣa for His bed - who is enormously big in size, He too is big in His form and that is why He is called Mahāmūrtiḥ.

विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् ।
अनेकमूर्तिरव्यक्तश्शतमूर्तिश्शताननः ॥ ७७ ॥

విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ ।
అనేకమూర్తిరవ్యక్తశ్శతమూర్తిశ్శతాననః ॥ 77 ॥

Viśvamūrtirmahāmūrtirdīptamūrtiramūrtimān,
Anekamūrtiravyaktaśśatamūrtiśśatānanaḥ ॥ 77 ॥

21 అక్టో, 2014

717. విశ్వమూర్తిః, विश्वमूर्तिः, Viśvamūrtiḥ

ఓం విశ్వమూర్తయే నమః | ॐ विश्वमूर्तये नमः | OM Viśvamūrtaye namaḥ

విశ్వమూర్తిర్హరేర్యస్య విశ్వమూర్తిస్స ఉచ్యతే పరమాత్ముడు సర్వాత్మకుడు, సర్వమును తానేయగువాడు కావున విశ్వము అంతయు ఈతని మూర్తియే.

विश्वमूर्तिर्हरेर्यस्य विश्वमूर्तिस्स उच्यते / Viśvamūrtirhareryasya viśvamūrtissa ucyate As He is all-pervading, the entire universe is His form - He is Viśvamūrtiḥ.

विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् ।
अनेकमूर्तिरव्यक्तश्शतमूर्तिश्शताननः ॥ ७७ ॥

విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ ।
అనేకమూర్తిరవ్యక్తశ్శతమూర్తిశ్శతాననః ॥ 77 ॥

Viśvamūrtirmahāmūrtirdīptamūrtiramūrtimān,
Anekamūrtiravyaktaśśatamūrtiśśatānanaḥ ॥ 77 ॥

20 అక్టో, 2014

716. అపరాజితః, अपराजितः, Aparājitaḥ

ఓం అపరాజితాయ నమః | ॐ अपराजिताय नमः | OM Aparājitāya namaḥ

అన్తరైశ్చాపి రాగాద్యైరపి బాహ్యైశ్చ శత్రుభిః ।
పరాజితోనహి దుష్టైరపరాజిత ఈశ్వరః ॥

ఆంతరములగు రాగాదిరూప శత్రువులచే కాని, బాహిరములగు దానవాదిశత్రువులచే కాని ఓడించబడనివాడు కనుక అపరాజితుడు.

अन्तरैश्चापि रागाद्यैरपि बाह्यैश्च शत्रुभिः ।
पराजितोनहि दुष्टैरपराजित ईश्वरः ॥

Antaraiścāpi rāgādyairapi bāhyaiśca śatrubhiḥ,
Parājitonahi duṣṭairaparājita īśvaraḥ.

Since He is never conquered by internal enemies like attachment etc., and by the external enemies like the asuras and others, He is Aparājitaḥ.

भूतावासो वासुदेवः सर्वासुनिलयोऽनलः ।
दर्पहा दर्पदोऽदृप्तो दुर्धरोऽथापराजितः ॥ ७६ ॥

భూతావాసో వాసుదేవః సర్వాసునిలయోఽనలః ।
దర్పహా దర్పదోఽదృప్తో దుర్ధరోఽథాపరాజితః ॥ 76 ॥

Bhūtāvāso vāsudevaḥ sarvāsunilayo’nalaḥ,
Darpahā darpado’dr̥pto durdharo’thāparājitaḥ ॥ 76 ॥

19 అక్టో, 2014

715. దుర్ధరః, दुर्धरः, Durdharaḥ

ఓం దుర్ధరాయ నమః | ॐ दुर्धराय नमः | OM Durdharāya namaḥ

న శక్యాధారణా యస్య ప్రణిధానాదిషు ప్రభోః ।
సర్వోపాధివినిర్ముక్తస్యాథతస్య ప్రసాదతః ॥
జన్మాన్తర సహస్రేషు కైశ్చిద్దుఃఖే న ధార్యతే ।
హృదయే భావనాయోగాత్ తస్మాద్ విష్ణు స్స దుర్ధరః ॥
షట్సప్తతితమే శ్లోకే మఙ్గ్లార్థోఽథ శబ్దకః ।
దుర్ధరోఽపి ధ్రియేతైవ తదనుగ్రహకారణాత్ ॥
ధృతే రనన్తరం భక్తేష్వ పరాజితతా భవేత్ ।
ఇతి భోధయితుం వాఽథ శబ్దోఽత్రైవ ప్రయోజితః ॥

ఎంతటి శ్రమచే కూడ ధరించబడు శక్యుడు కాడు. ఎంతో శ్రమచే ధరించబడువాడు. రెండు అర్థములు.

సర్వ ఉపాధుల నుండియు వినిర్ముక్తుడుకావున ఆతనిని హృదయమున నిలిపి ధ్యానించుటయందు ఎంత శ్రమచే కూడ ధారణ చేయుట శక్యము కాదు. ఐనప్పటికీ, ఆ భగవానుని అనుగ్రహమువలన కొందరిచే మాత్రమే వారి వారి జన్మాంతర సహస్ర సంపాదిత భావనా యోగ బలము వలన ఎంతయో శ్రమతో హృదయమున ధరింపబడును.

క్లేశోఽధికతర స్తేషా మవ్యక్తాసక్తచేతసాం । అవ్యక్త హి గతిర్దుఃఖం దేహవద్బిరవాప్యతే (గీతా 12.5) అను భగవద్గీత వచనముననుసరించి అవ్యక్త రూపమగు గతిని అనగా అక్షరతత్త్వరూపగమ్యమును దేహవంతులు ఎంతయో దుఃఖముతో అనగా అధికశ్రమచే పొందుచున్నారు. కావున అక్షరోపాసన మందు ఆసక్తమగు చిత్తము కలవారికి కలుగు క్లేశము అధికతరము.

भूतावासो वासुदेवः सर्वासुनिलयोऽनलः ।
दर्पहा दर्पदोऽदृप्तो दुर्धरोऽथापराजितः ॥ ७६ ॥

భూతావాసో వాసుదేవః సర్వాసునిలయోఽనలః ।
దర్పహా దర్పదోఽదృప్తో దుర్ధరోఽథాపరాజితః ॥ 76 ॥

Bhūtāvāso vāsudevaḥ sarvāsunilayo’nalaḥ,
Darpahā darpado’dr̥pto durdharo’thāparājitaḥ ॥ 76 ॥

18 అక్టో, 2014

714. దృప్తః, दृप्तः, Dr̥ptaḥ

ఓం దృప్తాయ నమః | ॐ दृप्ताय नमः | OM Dr̥ptāya namaḥ

స్వాత్మామృత రసాస్వాదాన్నిత్య ప్రముదితో హరిః ।
దృప్త ఇత్యుచ్యతే సద్భిర్వేద విద్యా విశారదైః ॥

తన స్వరూపము అను అమృత రసమును సదా పానము చేయుటచే ఎల్లప్పుడును మిక్కిలిగా ఆనందముతో మదించినుండువాడు కావున దృప్తః.

स्वात्मामृत रसास्वादान्नित्य प्रमुदितो हरिः ।
दृप्त इत्युच्यते सद्भिर्वेद विद्या विशारदैः ॥

Svātmāmr̥ta rasāsvādānnitya pramudito hariḥ,
Dr̥pta ityucyate sadbhirveda vidyā viśāradaiḥ.

By delighting in the nectar of His own ātma, He is always immensely blissful in a state of pride; hence He is Dr̥ptaḥ.

भूतावासो वासुदेवः सर्वासुनिलयोऽनलः ।
दर्पहा दर्पदोऽदृप्तो दुर्धरोऽथापराजितः ॥ ७६ ॥

భూతావాసో వాసుదేవః సర్వాసునిలయోఽనలః ।
దర్పహా దర్పదోఽదృప్తో దుర్ధరోఽథాపరాజితః ॥ 76 ॥

Bhūtāvāso vāsudevaḥ sarvāsunilayo’nalaḥ,
Darpahā darpado’dr̥pto durdharo’thāparājitaḥ ॥ 76 ॥

17 అక్టో, 2014

713. దర్పదః, दर्पदः, Darpadaḥ

ఓం దర్పదాయ నమః | ॐ दर्पदाय नमः | OM Darpadāya namaḥ

ధర్మస్య వర్తమానానాం వర్త్మని ప్రభురచ్యుతః ।
దర్పం దదాతీతి దర్పద ఇతి ప్రోచ్యతే బుధైః ॥

ధర్మమునకు అనుకూలమగు మార్గమునందు నడుచువారి దర్పమును ఖండించును అనగా తగ్గించును. వారిని అహంకారాది దోష రహితులనుగా చేయును.

धर्मस्य वर्तमानानां वर्त्मनि प्रभुरच्युतः ।
दर्पं ददातीति दर्पद इति प्रोच्यते बुधैः ॥

Dharmasya vartamānānāṃ vartmani prabhuracyutaḥ,
Darpaṃ dadātīti darpada iti procyate budhaiḥ.

He cuts the pride or brings down the pride of those who are on the righteous path. Lord makes those on the path of righteousness are free from blemishes like egotism etc.

भूतावासो वासुदेवः सर्वासुनिलयोऽनलः ।
दर्पहा दर्पदोऽदृप्तो दुर्धरोऽथापराजितः ॥ ७६ ॥

భూతావాసో వాసుదేవః సర్వాసునిలయోఽనలః ।
దర్పహా దర్పదోఽదృప్తో దుర్ధరోఽథాపరాజితః ॥ 76 ॥

Bhūtāvāso vāsudevaḥ sarvāsunilayo’nalaḥ,
Darpahā darpado’dr̥pto durdharo’thāparājitaḥ ॥ 76 ॥

16 అక్టో, 2014

712. దర్పహా, दर्पहा, Darpahā

ఓం దర్పఘ్నే నమః | ॐ दर्पघ्ने नमः | OM Darpaghne namaḥ

తిష్ఠతాం ధర్మవిరుద్ధే పథి దర్పం జనార్దనః ।
హన్తీతి శ్రీమహావిష్ణుర్దర్పహేత్యుచ్యతే బుధైః ॥

ధర్మ విరుద్ధ మార్గమున ఉండువారి దర్పమును, మదమును నశింపజేయువాడు జనార్దనుడు. అందుచేత శ్రీమహావిష్ణువునకు దర్పహా అను నామము కలదు.

तिष्ठतां धर्मविरुद्धे पथि दर्पं जनार्दनः ।
हन्तीति श्रीमहाविष्णुर्दर्पहेत्युच्यते बुधैः ॥

Tiṣṭhatāṃ dharmaviruddhe pathi darpaṃ janārdanaḥ,
Hantīti śrīmahāviṣṇurdarpahetyucyate budhaiḥ.

Lord Janārdana destroys the pride of those who tread the path opposed to righteousness and hence He is known by the name Darpahā.

भूतावासो वासुदेवः सर्वासुनिलयोऽनलः ।
दर्पहा दर्पदोऽदृप्तो दुर्धरोऽथापराजितः ॥ ७६ ॥

భూతావాసో వాసుదేవః సర్వాసునిలయోఽనలః ।
దర్పహా దర్పదోఽదృప్తో దుర్ధరోఽథాపరాజితః ॥ 76 ॥

Bhūtāvāso vāsudevaḥ sarvāsunilayo’nalaḥ,
Darpahā darpado’dr̥pto durdharo’thāparājitaḥ ॥ 76 ॥

15 అక్టో, 2014

711. అనలః, अनलः, Analaḥ

ఓం అనలాయ నమః | ॐ अनलाय नमः | OM Analāya namaḥ

అలం న విద్యతే యస్య పర్యాప్తిః శక్తిసమ్పదాం ।
స మహావిష్ణురనల ఇతి సఙ్కీర్త్యతే బుధైః ॥

అలం అనగా పర్యాప్తి; ఇంతతో ముగియును అను అవధి. అట్టి అవధి లేని వాడు అనలః. ఎవని శక్తులకును సంపదలకును అలం లేనివాడు అనలః. అపరిమిత శక్తులును సంపదలును కలవాడు.

अलं न विद्यते यस्य पर्याप्तिः शक्तिसम्पदां ।
स महाविष्णुरनल इति सङ्कीर्त्यते बुधैः ॥

Alaṃ na vidyate yasya paryāptiḥ śaktisampadāṃ,
Sa mahāviṣṇuranala iti saṅkīrtyate budhaiḥ.

Alaṃ signifies limit; Analaḥ means limitless. There is no limit or sufficiency to His power or wealth so He is Analaḥ.

भूतावासो वासुदेवः सर्वासुनिलयोऽनलः
दर्पहा दर्पदोऽदृप्तो दुर्धरोऽथापराजितः ॥ ७६ ॥

భూతావాసో వాసుదేవః సర్వాసునిలయోఽనలః
దర్పహా దర్పదోఽదృప్తో దుర్ధరోఽథాపరాజితః ॥ 76 ॥

Bhūtāvāso vāsudevaḥ sarvāsunilayo’nalaḥ,
Darpahā darpado’dr̥pto durdharo’thāparājitaḥ ॥ 76 ॥

14 అక్టో, 2014

710. సర్వాఽసునిలయః, सर्वाऽसुनिलयः, Sarvā'sunilayaḥ

ఓం సర్వాసునిలయాయ నమః | ॐ सर्वासुनिलयाय नमः | OM Sarvāsunilayāya namaḥ

సర్వ ఏవాసవః ప్రాణా నిలీయన్తే జనార్దనే ।
యస్మిన్ జీవాత్మకే స్థానే సర్వాసునిలయస్సహి ॥

 సర్వ ప్రాణములును జీవరూపమగు ఏ ఆశ్రయమునందు మిక్కిలిగా లయమును పొందియుండునో ఆతడు అనగా జీవుడు సర్వాఽసునిలయః అనబడును. ఇట్టి జీవుడును పరమాత్ముడే.

सर्व एवासवः प्राणा निलीयन्ते जनार्दने ।
यस्मिन् जीवात्मके स्थाने सर्वासुनिलयस्सहि ॥

Sarva evāsavaḥ prāṇā nilīyante janārdane,
Yasmin jīvātmake sthāne sarvāsunilayassahi.

He in whom all asus or prāṇas find their abode as the jīvātma is Sarvā'sunilayaḥ. He who appears as the jīva is also in essence of the paramātma.

भूतावासो वासुदेवः सर्वासुनिलयोऽनलः ।
दर्पहा दर्पदोऽदृप्तो दुर्धरोऽथापराजितः ॥ ७६ ॥

భూతావాసో వాసుదేవః సర్వాసునిలయోఽనలః ।
దర్పహా దర్పదోఽదృప్తో దుర్ధరోఽథాపరాజితః ॥ 76 ॥

Bhūtāvāso vāsudevaḥ sarvāsunilayo’nalaḥ,
Darpahā darpado’dr̥pto durdharo’thāparājitaḥ ॥ 76 ॥

13 అక్టో, 2014

709. వాసుదేవః, वासुदेवः, Vāsudevaḥ

ఓం వాసుదేవాయ నమః | ॐ वासुदेवाय नमः | OM Vāsudevāya namaḥ

ఇదం జగత్ వాసయత్యాచ్ఛాదయతి మాయయాయ ।
ఇతి వాసుస్సదేవోఽయం వాసుదేవ ఇతీర్యతే ॥
ఛాదయామి జగద్విశ్వం భూత్యా సూర్య ఇవాంశుభః ।
ఇతిహి శ్రీవ్యాసముని భగవద్వాక్య సంస్మృతేః ॥

తన మాయచే జీవులను వాసించును లేదా కప్పివేయునుగనుక వాసుః. అట్టివాడేయగు దేవుడు వాసుదేవుడు. మహాభారత శాంతి పర్వమునందలి 'నేను నా భూతిచే అనగా మాయచే సూర్యుడు తన కిరణములచేత వలె సర్వజగత్తును కప్పివేయుదును' అను భగవద్ వచనము ఇందులకు ప్రమాణము.

:: విష్ణు పురాణే షష్ఠాంశే పంచమోఽధ్యాయః :
భూతేషు వసతే సోఽన్తర్వసన్త్యత్ర చ తాని యత్ ।
ధాతా విధాతా జగతాం వాసుదేవస్తతః ప్రభుః ॥ 82 ॥

ప్రభువు సమస్త భూతములయందును వ్యాపించి, సర్వభూతములును తనయందే వసించియున్నవాడు. సంసార రచయితయు, రక్షకుడును అయి ఉన్నందున ఆ ప్రభువు వాసుదేవుడని పిలువబడుచున్నాడు.

:: శ్రీ మహాభారతే శాన్తిపర్వణి మోక్షధర్మపర్వణి ఏకోనచత్వారింశదధికత్రిశతతమోఽధ్యాయః ::
న దృష్యశ్చక్షుషా యోఽసౌ న స్పృష్యః స్పర్శనేన చ ।
న ఘ్రేయశ్చైవ గన్ధేన రసేన చ వివర్జితః ॥ 21 ॥
సత్త్వం రజస్తమశ్చైవ న గుణాస్తం భజన్తి వై ।
యశ్చ సర్వగతః సాక్షీ లోకస్యాత్మేతి కథ్యతే ॥ 22 ॥
భూతగ్రామశరీరేషు నశ్యత్సు న వినశ్యతి ।
అజో నిత్యః శాశ్వతశ్చ నిర్గుణో నిష్కలస్తథా ॥ 23 ॥
ద్విర్ద్వాదశేభ్యస్తత్త్వేభ్యః ఖ్యాతో యః పంచవింశకః ।
పురుషో నిష్క్రియశ్చైవ జ్ఞానదృష్యశ్చ కథ్యతే ॥ 24 ॥
యం ప్రవిశ్య భవన్తీహ ముక్తా వై ద్విజసత్తమా ।
స వాసుదేవో విజ్ఞేయః పరమాత్మా సనాతనః ॥ 25 ॥

ఏది నేత్రములులకు గోచరించదో, ఏది స్పర్శేంద్రియముచేత స్పృశించ శక్యము కాదో, ఏది ఘ్రాణేంద్రియము ద్వారా ఘ్రాణమునకు (ముక్కు, వాసన) దొరకదో, ఏది రసేంద్రియమునకు అందక అతీతముగనుండునో, దేనిపై సత్త్వ రజస్ తమస్సులనబడు త్రిగుణముల ప్రభావము ఉండదో, అది సర్వవ్యాపియో సాక్షియై ఉండి సంపూర్ణ జగత్తుయొక్క ఆత్మగా తెలియబడుచున్నది. అన్ని ప్రాణులు నశించినప్పటికి ఏదైతే తాను స్వయముగా నశ్వరము కాదో, ఏది 'అజన్మా,' 'నిత్యము,' 'సనాతనము,' 'నిర్గుణము,' 'నిష్కలంకము'గా చెప్పబడుచున్నదో, ఏది ఇరువదినాలుగు తత్త్వములకు అతీతమై ఇరువదిఐదవ తత్త్వముగా విఖ్యాతినొందినదో, ఏది నిష్క్రియమో, దేనిని పురుషుడు అని పిలిచెదరో, జ్ఞానమయ నేత్రములచేత మాత్రమే ఏది ఎరుంగ యోగ్యమై యుండునో, దేనియందు ప్రవేశించిన ద్విజులు ముక్తులౌదురో అదే సనాతన పరమాత్మ. దానినే వాసుదేవ నామముతో ఎరుంగవలయును.

332. వాసుదేవః, वासुदेवः, Vāsudevaḥ
695. వాసుదేవః, वासुदेवः, Vāsudevaḥ

इदं जगत् वासयत्याच्छादयति माययाय ।
इति वासुस्सदेवोऽयं वासुदेव इतीर्यते ॥
छादयामि जगद्विश्वं भूत्या सूर्य इवांशुभः ।
इतिहि श्रीव्यासमुनि भगवद्वाक्य संस्मृतेः ॥

Idaṃ jagat vāsayatyācchādayati māyayāya,
Iti vāsussadevo’yaṃ vāsudeva itīryate.
Chādayāmi jagadviśvaṃ bhūtyā sūrya ivāṃśubhaḥ,
Itihi śrīvyāsamuni bhagavadvākya saṃsmr̥teḥ.

He conceals or covers the worlds by māya therefore Vāsuḥ. He devaḥ, too and hence He is Vāsudevaḥ. 'I envelop the entire world as he sun by his rays' mentioned in Mahābhārata Śānti Parva can be a reference here.

:: विष्णु पुराणे षष्ठांशे पञ्चमोऽध्यायः :
भूतेषु वसते सोऽन्तर्वसन्त्यत्र च तानि यत् ।
धाता विधाता जगतां वासुदेवस्ततः प्रभुः ॥ ८२ ॥

Viṣṇu Purāṇa - Section 6, Chapter 5
Bhūteṣu vasate so’ntarvasantyatra ca tāni yat,
Dhātā vidhātā jagatāṃ vāsudevastataḥ prabhuḥ.
82.

The Lord is all pervading; He permeates all the elements and beings and all these are sheltered in Him. Since He is the creator and the protector of the worlds, the Lord is known as Vāsudevaḥ.

:: श्री महाभारते शान्तिपर्वणि मोक्षधर्मपर्वणि एकोनचत्वारिंशदधिकत्रिशततमोऽध्यायः ::
न दृष्यश्चक्षुषा योऽसौ न स्पृष्यः स्पर्शनेन च ।
न घ्रेयश्चैव गन्धेन रसेन च विवर्जितः ॥ २१ ॥
सत्त्वं रजस्तमश्चैव न गुणास्तं भजन्ति वै ।
यश्च सर्वगतः साक्षी लोकस्यात्मेति कथ्यते ॥ २२ ॥
भूतग्रामशरीरेषु नश्यत्सु न विनश्यति ।
अजो नित्यः शाश्वतश्च निर्गुणो निष्कलस्तथा ॥ २३ ॥
द्विर्द्वादशेभ्यस्तत्त्वेभ्यः ख्यातो यः पञ्चविंशकः ।
पुरुषो निष्क्रियश्चैव ज्ञानदृष्यश्च कथ्यते ॥ २४ ॥
यं प्रविश्य भवन्तीह मुक्ता वै द्विजसत्तमा ।
स वासुदेवो विज्ञेयः परमात्मा सनातनः ॥ २५ ॥

Śrī Mahābhārata  - Book XII, Chapter 339
Na dr̥ṣyaś cakṣuṣā yo’sau na spr̥ṣyaḥ sparśanena ca, 
Na ghreyaścaiva gandhena rasena ca vivarjitaḥ. 21.
Sattvaṃ rajastamaścaiva na guṇāstaṃ bhajanti vai, 
Yaśca sarvagataḥ sākṣī lokasyātmeti kathyate. 22.
Bhūtagrāmaśarīreṣu naśyatsu na vinaśyati, 
Ajo nityaḥ śāśvataśca nirguṇo niṣkalastathā. 23.
Dvirdvādaśebhyastattvebhyaḥ khyāto yaḥ paṃcaviṃśakaḥ, 
Puruṣo niṣkriyaścaiva jñānadr̥ṣyaśca kathyate. 24.
Yaṃ praviśya bhavantīha muktā vai dvijasattamā, 
Sa vāsudevo vijñeyaḥ paramātmā sanātanaḥ. 25.

That which cannot be seen with the eye, touched with the sense of touch, smelt with the sense of scent, and That is beyond the ken of the sense of taste; That which the three attributes of Sattwa, Rajas, and Tamas cannot touch; That which pervades all things and is the one Witness of the universe, and That which is described as the Soul of the entire universe; That which is not destroyed upon the destruction of the bodies of all created things; That which is unborn and unchangeable and eternal, That which is freed from all attributes, which is indivisible and the entirety; That which transcends twice the twelve topics of enquiry and is regarded as the Twenty-fifth, That which is known by the name of Purusha, Which is inactive, and Which is said to be apprehended by Knowledge alone; That into which the foremost of the regenerated persons enter and become emancipated; That which is the eternal Supreme Soul - know that it alone is known by the name of Vasudeva.

332. వాసుదేవః, वासुदेवः, Vāsudevaḥ
695. వాసుదేవః, वासुदेवः, Vāsudevaḥ

भूतावासो वासुदेवः सर्वासुनिलयोऽनलः ।
दर्पहा दर्पदोऽदृप्तो दुर्धरोऽथापराजितः ॥ ७६ ॥

భూతావాసో వాసుదేవః సర్వాసునిలయోఽనలః ।
దర్పహా దర్పదోఽదృప్తో దుర్ధరోఽథాపరాజితః ॥ 76 ॥

Bhūtāvāso vāsudevaḥ sarvāsunilayo’nalaḥ,
Darpahā darpado’dr̥pto durdharo’thāparājitaḥ ॥ 76 ॥

12 అక్టో, 2014

708. భూతావాసః, भूतावासः, Bhūtāvāsaḥ

ఓం భూతావాసాయ నమః | ॐ भूतावासाय नमः | OM Bhūtāvāsāya namaḥ

భూతాన్యత్రాభిముఖ్యేన వసన్తీతి జనార్దనః ।
భూతావాస ఇతి ప్రోక్తో వేదవిద్యావిశారదైః ॥
వసన్తి త్వ్యి భూతాని భూతావాస్తతో భవాన్ ।
ఇతి హరివంశే కృష్ణద్వైపాయనమునీరణాత్ ॥

సకల భూతములకును సమగ్రమైన నివాసస్థానము అయినవాడు. సకల భూతములును ఈతనియందు అభిముఖీ భావమున అనగా అతడే తమకు రక్షకుడు అను తాత్పర్యభావమున వసించుచుండును. 'వసన్తిత్వయి భూతాని భూతావాసస్తతో భవాన్‍' అను హరివంశ వచనము (3.88.53) - 'భూతములు నీయందు వసించును అందుచేతనే నీవు భూతావాసుడవు' ఇందులకు ప్రమాణము.

भूतान्यत्राभिमुख्येन वसन्तीति जनार्दनः ।
भूतावास इति प्रोक्तो वेदविद्याविशारदैः ॥
वसन्ति त्व्यि भूतानि भूतावास्ततो भवान् ।
इति हरिवंशे कृष्णद्वैपायनमुनीरणात् ॥

Bhūtānyatrābhimukhyena vasantīti janārdanaḥ,
Bhūtāvāsa iti prokto vedavidyāviśāradaiḥ.
Vasanti tvyi bhūtāni bhūtāvāstato bhavān,
Iti harivaṃśe kr̥ṣṇadvaipāyanamunīraṇāt.

All beings reside in Him. They reside in Him with an understanding that He is the One who sustains and protects them. In Harivaṃśa (3.88.53) it is mentioned that 'वसन्तित्वयि भूतानि भूतावासस्ततो भवान् / Vasantitvayi bhūtāni bhūtāvāsastato bhavān' meaning 'All beings live in you and therefore you are known as Bhūtāvāsaḥ.

भूतावासो वासुदेवः सर्वासुनिलयोऽनलः ।
दर्पहा दर्पदोऽदृप्तो दुर्धरोऽथापराजितः ॥ ७६ ॥

భూతావాసో వాసుదేవః సర్వాసునిలయోఽనలః ।
దర్పహా దర్పదోఽదృప్తో దుర్ధరోఽథాపరాజితః ॥ 76 ॥

Bhūtāvāso vāsudevaḥ sarvāsunilayo’nalaḥ,
Darpahā darpado’dr̥pto durdharo’thāparājitaḥ ॥ 76 ॥

11 అక్టో, 2014

707. సుయామునః, सुयामुनः, Suyāmunaḥ

ఓం సూయామునాయ నమః | ॐ सूयामुनाय नमः | OM Sūyāmunāya namaḥ

శోభనా యామునా యస్య యమునాతీరవాసినః ।
యశోదాదేవకీనన్ద వసుదేవాదయో హరిః ॥
పరివేష్టార ఇతి స సుయామున ఇతీర్యతే ।
యామునాః పరివేష్టారో గోపవేషధరా హరేః ॥
పద్మాసనాదయో యస్య శోభనాస్సన్తి హరేః ॥
పద్మాసనాదయో యస్య శోభనాస్సన్తి స ప్రభుః ।
సుయామున ఇతి ప్రోక్తః పురాణార్థ విశారదైః ॥

శోభనులు, మంచివారు అగు యామనులు, యామునా సంబంధులు, యమునా తీరస్థ దేశవాసులు అగు దేవకీవసుదేవనందయశోదాబలభద్రాదులు పరివేష్టించియుండువారుగా ఈతనికి కలరు. యమునాతీరవాసులు అనగా గోప జనులు. అనగా గోపరూపమును ధరించి భూమిపై అవతరించిన చతుర్ముఖ బ్రహ్మ మొదలగువారు. వారు ఎవనిని పరివేష్టించి యుందురో, అట్టివాడనియు అర్థము చెప్పవచ్చును.

शोभना यामुना यस्य यमुनातीरवासिनः ।
यशोदादेवकीनन्द वसुदेवादयो हरिः ॥
परिवेष्टार इति स सुयामुन इतीर्यते ।
यामुनाः परिवेष्टारो गोपवेषधरा हरेः ॥
पद्मासनादयो यस्य शोभनास्सन्ति हरेः ॥
पद्मासनादयो यस्य शोभनास्सन्ति स प्रभुः ।
सुयामुन इति प्रोक्तः पुराणार्थ विशारदैः ॥

Śobhanā yāmunā yasya yamunātīravāsinaḥ,
Yaśodādevakīnanda vasudevādayo hariḥ.
Pariveṣṭāra iti sa suyāmuna itīryate,
Yāmunāḥ pariveṣṭāro gopaveṣadharā hareḥ.
Padmāsanādayo yasya śobhanāssanti hareḥ.
Padmāsanādayo yasya śobhanāssanti sa prabhuḥ,
Suyāmuna iti proktaḥ purāṇārtha viśāradaiḥ.

Surrounded by the handsome yāmunas, those connected with or living on the banks of river yamuna like Devaki, Vasudeva, Nanda, Balabhadra, Subhadra and others; so Suyāmunaḥ.

Or in the garb of cowherds, He has Brahma and others on the banks of Yamuna who surround Him and hence He is Suyāmunaḥ.

सद्गतिस्सत्कृतिस्सत्ता सद्भूतिस्सत्परायणः ।
शूरसेनो यदुश्रेष्ठस्सन्निवासस्सुयामुनः ॥ ७५ ॥

సద్గతిస్సత్కృతిస్సత్తా సద్భూతిస్సత్పరాయణః ।
శూరసేనో యదుశ్రేష్ఠస్సన్నివాసస్సుయామునః ॥ 75 ॥

Sadgatissatkr̥tissattā sadbhūtissatparāyaṇaḥ,
Śūraseno yaduśreṣṭhassannivāsassuyāmunaḥ ॥ 75 ॥

10 అక్టో, 2014

706. సంనివాసః, संनिवासः, Saṃnivāsaḥ

ఓం సన్నివాసాయ నమః | ॐ सन्निवासाय नमः | OM Sannivāsāya namaḥ

యస్సతామాశ్రయో విష్ణుః సన్నివాస ఇతీర్యతే 'సత్‍' అనబడు తత్త్వజ్ఞులకు, విద్వాంసులకు ఆశ్రయముగనుక విష్ణువు సంనివాసః.

यस्सतामाश्रयो विष्णुः सन्निवास इतीर्यते / Yassatāmāśrayo viṣṇuḥ sannivāsa itīryate Since Lord Viṣṇu is the refuge of those who are sat i.e., the learned - He is called Saṃnivāsaḥ.

सद्गतिस्सत्कृतिस्सत्ता सद्भूतिस्सत्परायणः ।
शूरसेनो यदुश्रेष्ठस्सन्निवासस्सुयामुनः ॥ ७५ ॥

సద్గతిస్సత్కృతిస్సత్తా సద్భూతిస్సత్పరాయణః ।
శూరసేనో యదుశ్రేష్ఠస్సన్నివాసస్సుయామునః ॥ 75 ॥

Sadgatissatkr̥tissattā sadbhūtissatparāyaṇaḥ,
Śūraseno yaduśreṣṭhassannivāsassuyāmunaḥ ॥ 75 ॥

9 అక్టో, 2014

705. యదుశ్రేష్ఠః, यदुश्रेष्ठः, Yaduśreṣṭhaḥ

ఓం యదుశ్రేష్ఠాయ నమః | ॐ यदुश्रेष्ठाय नमः | OM Yaduśreṣṭhāya namaḥ

స యదూనాం ప్రధానత్వాద్యదుశ్రేష్ఠ ఇతీర్యతే యాదవులలో ముఖ్యుడు కనుక యదుశ్రేష్ఠః.

स यदूनां प्रधानत्वाद्यदुश्रेष्ठ इतीर्यते / Sa yadūnāṃ pradhānatvādyaduśreṣṭha itīryate Since is chief of Yadus, He is Yaduśreṣṭhaḥ.

सद्गतिस्सत्कृतिस्सत्ता सद्भूतिस्सत्परायणः ।
शूरसेनो यदुश्रेष्ठस्सन्निवासस्सुयामुनः ॥ ७५ ॥

సద్గతిస్సత్కృతిస్సత్తా సద్భూతిస్సత్పరాయణః ।vsns-705
శూరసేనో యదుశ్రేష్ఠస్సన్నివాసస్సుయామునః ॥ 75 ॥

Sadgatissatkr̥tissattā sadbhūtissatparāyaṇaḥ,
Śūraseno yaduśreṣṭhassannivāsassuyāmunaḥ ॥ 75 ॥

8 అక్టో, 2014

704. శూరసేనః, शूरसेनः, Śūrasenaḥ

ఓం శూరసేనాయ నమః | ॐ शूरसेनाय नमः | OM Śūrasenāya namaḥ

హనుమత్ ప్రముఖా శ్శౌర్యశాలినో యత్ర సైనికాః ।
సా శూరసేన యస్య స శూరసేన ఇతీర్యతే ॥

హనుమంతుడు మొదలగు శౌర్యశాలురైన సేనాప్రముఖులు ఏ సేనయందు కలరో అట్టి సేన శూరసేన. అట్టి శూరయగు సేన ఎవనికి కలదో అట్టివాడు శూరసేనః.

हनुमत् प्रमुखा श्शौर्यशालिनो यत्र सैनिकाः ।
सा शूरसेन यस्य स शूरसेन इतीर्यते ॥

Hanumat pramukhā śśauryaśālino yatra sainikāḥ,
Sā śūrasena yasya sa śūrasena itīryate. 

The army that has valiant commanders like Hanumān is called Śūrasena. He who has got such Śūrasenas is Śūrasenaḥ.

सद्गतिस्सत्कृतिस्सत्ता सद्भूतिस्सत्परायणः ।
शूरसेनो यदुश्रेष्ठस्सन्निवासस्सुयामुनः ॥ ७५ ॥

సద్గతిస్సత్కృతిస్సత్తా సద్భూతిస్సత్పరాయణః ।
శూరసేనో యదుశ్రేష్ఠస్సన్నివాసస్సుయామునః ॥ 75 ॥

Sadgatissatkr̥tissattā sadbhūtissatparāyaṇaḥ,
Śūraseno yaduśreṣṭhassannivāsassuyāmunaḥ ॥ 75 ॥

7 అక్టో, 2014

703. సత్పరాయణమ్, सत्परायणम्, Satparāyaṇam

ఓం సత్పరాయణాయ నమః | ॐ सत्परायणाय नमः | OM Satparāyaṇāya namaḥ

బ్రహ్మ ప్రకృష్టమయనమ్ సతాం తత్త్వవిదాం పరమ్ ।
ఇతి సత్పరాయణమిత్యుచ్యతే విదుషాం వరైః ॥

'సత్‍' అనబడువారికి, తత్త్వజ్ఞానము కలవారికి పరమమైన ఆయనము అనగా చాలా గొప్పది అయిన గమ్యము కావున 'సత్పరాయణమ్‍' అని పరమాత్ముడు చెప్పబడుచున్నాడు.

ब्रह्म प्रकृष्टमयनम् सतां तत्त्वविदां परम् ।
इति सत्परायणमित्युच्यते विदुषां वरैः ॥

Brahma prakr̥ṣṭamayanam satāṃ tattvavidāṃ param,
Iti satparāyaṇamityucyate viduṣāṃ varaiḥ.

He is the param āyanam i.e., the supreme resting place of those who are sat, the knowers of truth. Hence He is Satparāyaṇam.

सद्गतिस्सत्कृतिस्सत्ता सद्भूतिस्सत्परायणः
शूरसेनो यदुश्रेष्ठस्सन्निवासस्सुयामुनः ॥ ७५ ॥

సద్గతిస్సత్కృతిస్సత్తా సద్భూతిస్సత్పరాయణః
శూరసేనో యదుశ్రేష్ఠస్సన్నివాసస్సుయామునః ॥ 75 ॥

Sadgatissatkr̥tissattā sadbhūtissatparāyaṇaḥ,
Śūraseno yaduśreṣṭhassannivāsassuyāmunaḥ ॥ 75 ॥

6 అక్టో, 2014

702. సద్భూతిః, सद्भूतिः, Sadbhūtiḥ

ఓం సద్భూతయే నమః | ॐ सद्भूतये नमः | OM Sadbhūtaye namaḥ

సన్నేవ పరమాత్మా చిదాత్మ బోధాత్ స్వభాసనాత్ ।
సాదేవ తైవ సద్భూతిర్ నేతరేత్యుచ్యతే బుధైః ॥
ప్రతీతేర్బాధ్యమానత్వాన్నసన్నాప్యసదేవ సః ।
శ్రౌతోవా యౌక్తికో బాధః ప్రపఞ్చస్య వివక్షితః ॥

'సన్‍' అను 'భూతి' అనగా 'అనుభూతి' ఎవని విషయమున గోచరము అగునో అట్టి పరమాత్మ సద్భూతిః అనబడుచున్నాడు.

సత్తా అను నామపు నిర్వచనము 'సన్‍' అను అనుభూతియే పరమాత్మ కావున పరమాత్మ త్రికాలాఽబాధితమగు అనుభూతియే - ఎన్నడును ఏ విధముగను త్రోసివేయ వీలుకాని అనుభూతి రూపమునుండు చిత్తత్త్వమే తన రూపముగా కలవాడు అని తేలుచున్నది. అనగా ఉనికి నుండి విడదీయరాని ఎరుకయే పరమాత్ముని రూపము కావున పరమాత్ముని విషయమున 'సద్భూతిః' అను నామము వర్తించదగియున్నదని భావము.

सन्नेव परमात्मा चिदात्म बोधात् स्वभासनात् ।
सादेव तैव सद्भूतिर् नेतरेत्युच्यते बुधैः ॥
प्रतीतेर्बाध्यमानत्वान्नसन्नाप्यसदेव सः ।
श्रौतोवा यौक्तिको बाधः प्रपञ्चस्य विवक्षितः ॥

Sanneva paramātmā cidātma bodhāt svabhāsanāt,
Sādeva taiva sadbhūtir netaretyucyate budhaiḥ.
Pratīterbādhyamānatvānnasannāpyasadeva saḥ,
Śrautovā yauktiko bādhaḥ prapañcasya vivakṣitaḥ.

Sat is paramātmā of the nature of intelligence not being sublated and as it is shining, it is Sadbhūtiḥ. What is different from Sat i.e., Brahman, the world is not so as it appears and is sublated. As it appears, it is not asat or unreal; as it is sublated, it is not sat (Real). It is not sat nor is it asat.

सद्गतिस्सत्कृतिस्सत्ता सद्भूतिस्सत्परायणः ।
शूरसेनो यदुश्रेष्ठस्सन्निवासस्सुयामुनः ॥ ७५ ॥

సద్గతిస్సత్కృతిస్సత్తా సద్భూతిస్సత్పరాయణః ।
శూరసేనో యదుశ్రేష్ఠస్సన్నివాసస్సుయామునః ॥ 75 ॥

Sadgatissatkr̥tissattā sadbhūtissatparāyaṇaḥ,
Śūraseno yaduśreṣṭhassannivāsassuyāmunaḥ ॥ 75 ॥

5 అక్టో, 2014

701. సత్తా, सत्ता, Sattā

ఓం సత్తాయై నమః | ॐ सत्तायै नमः | OM Sattāyai namaḥ

సజాతీయ విజాతీయ స్వగతత్వైస్త్రిధాభిదా ।
అనుభూతి స్తద్రహితా సత్తా సా విష్ణు దేవతా ।
ఏకమేవ ద్వితీయమిత్యాది శ్రుతి సమీరణాత్ ॥

సజాతీయ, విజాతీయ స్వగత భేదములేని అనుభూతి సత్తా అనబడును. 'ఏకమే వాఽద్వితీయకమ్‍' ఛాందోగ్యోపనిషత్ 6.2.1 శ్రుతి వచన ప్రమాణ్యముచే బ్రహ్మము ఒక్కటియే; రెండవది తాను అగునది మరి యేదియును లేదు.

सजातीय विजातीय स्वगतत्वैस्त्रिधाभिदा ।
अनुभूति स्तद्रहिता सत्ता सा विष्णु देवता ।
एकमेव द्वितीयमित्यादि श्रुति समीरणात् ॥

Sajātīya vijātīya svagatatvaistridhābhidā,
Anubhūti stadrahitā sattā sā viṣṇu devatā,
Ekameva dvitīyamityādi śruti samīraṇāt.

The state of existence in which there is no difference of the same kind, of different kind or internal differences is sattā or pure existence. For the śruti (Chāndogyopaniṣat 6.2.1) says Reality i.e., Brahman is one only without a second.

सद्गतिस्सत्कृतिस्सत्ता सद्भूतिस्सत्परायणः ।
शूरसेनो यदुश्रेष्ठस्सन्निवासस्सुयामुनः ॥ ७५ ॥

సద్గతిస్సత్కృతిస్సత్తా సద్భూతిస్సత్పరాయణః ।
శూరసేనో యదుశ్రేష్ఠస్సన్నివాసస్సుయామునః ॥ 75 ॥

Sadgatissatkr̥tissattā sadbhūtissatparāyaṇaḥ,
Śūraseno yaduśreṣṭhassannivāsassuyāmunaḥ ॥ 75 ॥

4 అక్టో, 2014

700. సత్కృతిః, सत्कृतिः, Satkr̥tiḥ

ఓం సద్కృతయే నమః | ॐ सद्कृतये नमः | OM Sadkr̥taye namaḥ

సతీ కృతిర్జగద్రక్షా లక్షణాఽస్య యతస్తతః ।
సత్కృతిః ప్రోచ్యతే విష్ణుర్వేదికైస్తత్వదర్శిభిః ॥

పరమాత్ముడు జగద్రక్షణము అను మిగుల ఉత్కృష్టమైన కృతిని ఆచరించుచుండువాడు కనుక 'సత్కృతిః' - 'గొప్పపని కలవాడు.'

सती कृतिर्जगद्रक्षा लक्षणाऽस्य यतस्ततः ।
सत्कृतिः प्रोच्यते विष्णुर्वेदिकैस्तत्वदर्शिभिः ॥

Satī kr̥tirjagadrakṣā lakṣaṇā’sya yatastataḥ,
Satkr̥tiḥ procyate viṣṇurvedikaistatvadarśibhiḥ. 

The Lord's action of protecting the world is sat or good and hence He is called Satkr̥tiḥ.

सद्गतिस्सत्कृतिस्सत्ता सद्भूतिस्सत्परायणः ।
शूरसेनो यदुश्रेष्ठस्सन्निवासस्सुयामुनः ॥ ७५ ॥

సద్గతిస్సత్కృతిస్సత్తా సద్భూతిస్సత్పరాయణః ।
శూరసేనో యదుశ్రేష్ఠస్సన్నివాసస్సుయామునః ॥ 75 ॥

Sadgatissatkr̥tissattā sadbhūtissatparāyaṇaḥ,
Śūraseno yaduśreṣṭhassannivāsassuyāmunaḥ ॥ 75 ॥

3 అక్టో, 2014

699. సద్గతిః, सद्गतिः, Sadgatiḥ

ఓం సద్గతయే నమః | ॐ सद्गतये नमः | OM Sadgataye namaḥ

అస్తి బ్రహ్మేతి చేద్వేద సన్తమేనం తతో విదుః ।
ఇతి శ్రుతేర్బ్రహ్మాస్తితి యే విదుస్తైస్స ఆప్యతే ॥
ఇత్యథవా సముత్కృష్టాహ్యస్య బుద్ధిస్సతీ గతిః ।
ఇతివా సద్గతిరితి విష్ణుర్విద్వద్భిరుచ్యతే ॥

'బ్రహ్మ తత్త్వము ఉన్నది అను ఎరుక గలవాడు అగుచో అట్టివానిని ఉన్నవానినిగా - అనగా సత్ అను శబ్దముచే చెప్పబడదగిన వానినిగా తత్త్వవేత్తలు తలచుచున్నారు' అను తైత్తిరీయోపనిషత్ (2.6) శ్రుతి వచన ప్రమాణముచేత 'బ్రహ్మము ఉన్నది' అని నిశ్చితముగా ఎవరు ఎరుగుదురో వారు 'సత్‍' అనబడువారు. వారు ఆ పరమాత్మ తత్త్వము తాముగనే అగుట అను స్థితిని పొందెదరు. కావున పరమాత్మునకు 'సద్గతిః' అని వ్యవహారము.

లేదా గతి అనగా బుద్ధి. సత్ బుద్ధి కలవాడుగనుక ఆతండు సద్గతిః.

अस्ति ब्रह्मेति चेद्वेद सन्तमेनं ततो विदुः ।
इति श्रुतेर्ब्रह्मास्तिति ये विदुस्तैस्स आप्यते ॥
इत्यथवा समुत्कृष्टाह्यस्य बुद्धिस्सती गतिः ।
इतिवा सद्गतिरिति विष्णुर्विद्वद्भिरुच्यते ॥

Asti brahmeti cedveda santamenaṃ tato viduḥ,
Iti śruterbrahmāstiti ye vidustaissa āpyate.
Ityathavā samutkr̥ṣṭāhyasya buddhissatī gatiḥ,
Itivā sadgatiriti viṣṇurvidvadbhirucyate.

By the śruti 'If one knows that Brahman exists, he is known as sat - the existent' (Taittirīyopaniṣat 2.6). Those that realize that Brahman exists, they are those that are sat. The Lord is attained by them; So He is their goal - Sa.dgatiḥ

Or Gati also means buddhi or intellect. Since He has superior buddhi, He is called Sadgatiḥ.

सद्गतिस्सत्कृतिस्सत्ता सद्भूतिस्सत्परायणः ।
शूरसेनो यदुश्रेष्ठस्सन्निवासस्सुयामुनः ॥ ७५ ॥

సద్గతిస్సత్కృతిస్సత్తా సద్భూతిస్సత్పరాయణః ।
శూరసేనో యదుశ్రేష్ఠస్సన్నివాసస్సుయామునః ॥ 75 ॥

Sadgatissatkr̥tissattā sadbhūtissatparāyaṇaḥ,
Śūraseno yaduśreṣṭhassannivāsassuyāmunaḥ ॥ 75 ॥

2 అక్టో, 2014

698. హవిః, हविः, Haviḥ

ఓం హవిషే నమః | ॐ हविषे नमः | OM Haviṣe namaḥ

బ్రహ్మార్పణం బ్రహ్మహవిరితి గీతోక్తితో హవిః శ్రీమద్భగవద్గీతలో కల భగవద్వచనముచే యజ్ఞాదులయందు అర్పింపబడు హవిస్సు కూడా భగవద్రూపమే గనుక ఆ దేవదేవుడు హవిః.

:: శ్రీమద్భగవద్గీత జ్ఞాన యోగము ::
బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్ ।
బ్రహ్మైవ తేన గన్తవ్యం బ్రహ్మకర్మసమాధినా ॥ 24 ॥

యజ్ఞమునందలి హోమసాధనములు, హోమద్రవ్యములు, హోమాగ్ని, హోమము చేయువాడు, చేయబడు హోమము - అన్నియును బ్రహ్మస్వరూపములేయనెడి ఏకాగ్ర భావముతో ఆ యజ్ఞాది కర్మలను చేయు మనుజుడు బ్రహ్మమునే పొందగలడు.

ब्रह्मार्पणं ब्रह्महविरिति गीतोक्तितो हविः / Brahmārpaṇaṃ brahmahaviriti gītoktito haviḥ By the Lord's word in Śrīmad Bhagavad Gīta, Brahman is the offer and also the offering.

:: श्रीमद्भगवद्गीत ज्ञान योगमु ::
ब्रह्मार्पणं ब्रह्महविर्ब्रह्माग्नौ ब्रह्मणा हुतम् ।
ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिना ॥ २४ ॥

Śrīmad Bhagavad Gīta - Chapter 4
Brahmārpaṇaṃ brahmahavirbrahmāgnau brahmaṇā hutam,
Brahmaiva tena gantavyaṃ brahmakarmasamādhinā. 24.

The ladle is Brahman, the oblation is Brahman, the offering is poured by Brahman in the sacrificial fire of Brahman. Brahman alone is to be reached by him who has concentration on Brahman as the objective.

मनोजवस्तीर्थकरो वसुरेता वसुप्रदः ।
वसुप्रदो वासुदेवो वसुर्वसुमना हविः ॥ ७४ ॥

మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః ।
వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః ॥ 74 ॥

Manojavastīrthakaro vasuretā vasupradaḥ,
Vasuprado vāsudevo vasurvasumanā haviḥ ॥ 74 ॥

1 అక్టో, 2014

697. వసుమనాః, वसुमनाः, Vasumanāḥ

ఓం వసుమనసే నమః | ॐ वसुमनसे नमः | OM Vasumanase namaḥ

అవిశేషేణ సర్వేషు విషయేష్వస్య చక్రిణః ।
వసతీతి వసుప్రోక్తమ్ తాదృశం విద్యతే మనః ।
ఇతి విష్ణుర్వసుమనా ఇతి సఙ్కీర్త్యతే బుధైః ॥

సమానముగా ఒకే విధమున సర్వ భూతములయందును వసించును కావున వసుః. సర్వ భూతములయందును సమాన రూపమున వసించు మనస్సు ఈతనికి కలదుగనుక వసుమనాః.

अविशेषेण सर्वेषु विषयेष्वस्य चक्रिणः ।
वसतीति वसुप्रोक्तम् तादृशं विद्यते मनः ।
इति विष्णुर्वसुमना इति सङ्कीर्त्यते बुधैः ॥

Aviśeṣeṇa sarveṣu viṣayeṣvasya cakriṇaḥ,
Vasatīti vasuproktam tādr̥śaṃ vidyate manaḥ,
Iti viṣṇurvasumanā iti saṅkīrtyate budhaiḥ.

He resides uniformly in all beings i.e., vasu. His mind is of that nature and hence Vasumanāḥ.