ఓం దుర్ధరాయ నమః | ॐ दुर्धराय नमः | OM Durdharāya namaḥ
న శక్యాధారణా యస్య ప్రణిధానాదిషు ప్రభోః ।
సర్వోపాధివినిర్ముక్తస్యాథతస్య ప్రసాదతః ॥
జన్మాన్తర సహస్రేషు కైశ్చిద్దుఃఖే న ధార్యతే ।
హృదయే భావనాయోగాత్ తస్మాద్ విష్ణు స్స దుర్ధరః ॥
షట్సప్తతితమే శ్లోకే మఙ్గ్లార్థోఽథ శబ్దకః ।
దుర్ధరోఽపి ధ్రియేతైవ తదనుగ్రహకారణాత్ ॥
ధృతే రనన్తరం భక్తేష్వ పరాజితతా భవేత్ ।
ఇతి భోధయితుం వాఽథ శబ్దోఽత్రైవ ప్రయోజితః ॥
ఎంతటి శ్రమచే కూడ ధరించబడు శక్యుడు కాడు. ఎంతో శ్రమచే ధరించబడువాడు. రెండు అర్థములు.
సర్వ ఉపాధుల నుండియు వినిర్ముక్తుడుకావున ఆతనిని హృదయమున నిలిపి ధ్యానించుటయందు ఎంత శ్రమచే కూడ ధారణ చేయుట శక్యము కాదు. ఐనప్పటికీ, ఆ భగవానుని అనుగ్రహమువలన కొందరిచే మాత్రమే వారి వారి జన్మాంతర సహస్ర సంపాదిత భావనా యోగ బలము వలన ఎంతయో శ్రమతో హృదయమున ధరింపబడును.
క్లేశోఽధికతర స్తేషా మవ్యక్తాసక్తచేతసాం । అవ్యక్త హి గతిర్దుఃఖం దేహవద్బిరవాప్యతే ॥ (గీతా 12.5) అను భగవద్గీత వచనముననుసరించి అవ్యక్త రూపమగు గతిని అనగా అక్షరతత్త్వరూపగమ్యమును దేహవంతులు ఎంతయో దుఃఖముతో అనగా అధికశ్రమచే పొందుచున్నారు. కావున అక్షరోపాసన మందు ఆసక్తమగు చిత్తము కలవారికి కలుగు క్లేశము అధికతరము.
भूतावासो वासुदेवः सर्वासुनिलयोऽनलः । |
दर्पहा दर्पदोऽदृप्तो दुर्धरोऽथापराजितः ॥ ७६ ॥ |
భూతావాసో వాసుదేవః సర్వాసునిలయోఽనలః । |
దర్పహా దర్పదోఽదృప్తో దుర్ధరోఽథాపరాజితః ॥ 76 ॥ |
Bhūtāvāso vāsudevaḥ sarvāsunilayo’nalaḥ, |
Darpahā darpado’dr̥pto durdharo’thāparājitaḥ ॥ 76 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి