2 డిసెం, 2012

29. భూతాదిః, भूतादिः, Bhūtādiḥ

ఓం భూతాదయే నమః | ॐ भूतादये नमः | OM Bhūtādaye namaḥ


భూతానాం ఆదిః (హేతుః) భూతములకు ఆదికారణము. ముందరి దివ్యనామము అయిన 'స్థాణుః' - ఆ దేవదేవుని స్థిరత్వమును సంకేతిస్తున్నది. ప్రళయకాలమున అట్టి స్థిరుడైన వానియందు సర్వమూ చేరుకుంటున్నది. ఎవనిలో సర్వమూ ఐక్యమునందినదో, ఆతండే సృష్టి ఆది యందు సమస్తమునకు ఆదికారణము అని ఈ 'భూతదిః' నామము తెలియజేయుచున్నదిగా అవగతము అవుతున్నది.

:: భగవద్గీత - రాజవిద్యా రాజగుహ్య యోగము ::
మహాత్మనస్తు మామ్ పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః ।
భజన్త్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయమ్ ॥ 13 ॥

ఓ అర్జునా! మహాత్ములైతే దైవీ ప్రకృతిని ఆశ్రయించినవారలై, నన్ను సమస్త ప్రాణులకును ఆదికారణునిగను, నాశరహితునిగను ఎఱింగి వేఱొకదానియందు మనస్సునుంచనివారలై నన్నే సేవించుచున్నారు.



Source of all elements or existing things. The previous divine name 'Sthāṇuḥ' let us understand that He is the One who is steady, immovable and changeless into whom everything merges into during dissolution. The One into whom everything retires, of course, has to be the originator or immutable source of all objects during creation, which is revealed by the divine name of 'Bhūtādiḥ'.

Bhagavad Gīta - Chapter 9
Mahātmanastu mām pārtha daivīṃ prakr̥timāśritāḥ,
Bhajantyananyamanaso jñātvā bhūtādimavyayam.
(13)

O son of Pr̥thā! The noble ones, being possessed of divine nature, surely adore Me with single-mindedness, knowing Me as the immutable source of all objects.

सर्वश्शर्वश्शिवस्थाणुर्भूतादिर्निधिरव्ययः ।
सम्भवो भावनो भर्ता प्रभवः प्रभुरीश्वरः ॥ 4 ॥

సర్వశ్శర్వశ్శివస్థాణుర్భూతాదిర్నిధిరవ్యయః ।
సమ్భవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః ॥ 4 ॥

Sarvaśśarvaśśivasthāṇurbhūtādirnidhiravyayaḥ ।
Sambhavo bhāvano bhartā prabhavaḥ prabhurīśvaraḥ ॥ 4 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి