1 డిసెం, 2012

28. స్థాణుః, स्थाणुः, Sthāṇuḥ

ఓం స్థాణవే నమః | ॐ स्थाणवे नमः | OM Sthāṇave namaḥ


చలించనివాడు, స్థిరమైనవాడు, స్థిరుడగుట వలన 'స్థాణుః'. స్తంభముగా మొదలువలె నుండువాడు.

[ష్ఠా - గతినివృత్తౌ - ధాతువు; ష్ఠా - ను > స్థాణు.] 'తిష్ఠతి' - శాశ్వతుడై నిలిచియుండును.

:: భగవద్గీత - రాజవిద్యా రాజగుహ్య యోగము ::
గతిర్భర్తా ప్రభుస్సాక్షీ నివాసశ్శరణం సుహృత్ ।
ప్రభవః ప్రలయః స్థానం నిధానం బీజమవ్యయం ॥ 18 ॥


పరమలక్ష్యమును, భరించువాడును, ప్రభువును, సాక్షియు, ప్రాణుల నివాసమును, శరణమొందదగినవాడును, హితమొనర్చువాడును, సృష్టిస్థితిలయకర్తయు, నిక్షేపమును, నాశరహితమైన బీజమును నేనే అయియున్నాను.



One who is steady, immovable and changeless. The name is derived from the word Ṣṭhā - Tiṣṭhati, indicating firmness or steadiness.

Bhagavad Gīta - Chapter 9
Gatirbhartā prabhussākṣī nivāsaśśaraṇaṃ suhr̥t,
Prabhavaḥ pralayaḥ sthānaṃ nidhānaṃ bījamavyayaṃ.
(18)

I am the goal, the sustainer, the master, the witness, the abode, the refuge, and the most dear friend. I am the creation and the annihilation, the basis of everything, the resting place and the eternal seed.

सर्वश्शर्वश्शिवस्थाणुर्भूतादिर्निधिरव्ययः ।
सम्भवो भावनो भर्ता प्रभवः प्रभुरीश्वरः ॥ 4 ॥

సర్వశ్శర్వశ్శివస్థాణుర్భూతాదిర్నిధిరవ్యయః ।
సమ్భవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః ॥ 4 ॥

Sarvaśśarvaśśivasthāṇurbhūtādirnidhiravyayaḥ ।
Sambhavo bhāvano bhartā prabhavaḥ prabhurīśvaraḥ ॥ 4 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి