ఓం అనాదినిధనాయ నమః | ॐ अनादिनिधनाय नमः | OM Anādinidhanāya namaḥ
ఆదిశ్చ నిధనం చ - ఆదినిధనే. ఆది నిధనే యస్య న విద్యేతే సః అనాది నిధనః ఆదియు నిధనమును (జన్మము, నాశనము) ఎవనికి ఉండవో అతడు.
:: పోతన భాగవతము - మొదటి స్కందము (కుంతీదేవి శ్రీ కృష్ణుని స్తుతించుట) ::
మఱియు భక్తధనుండును, నివృత్తధర్మార్థకామ విషయుండును, రాగాదిరహితుండును, గైవల్యదాన సమర్థుండును, గాలరూపకుండును, నియామకుండును, నాద్యంతశూన్యుండును, విభుండును, సర్వసముండును, సకల భూతనిగ్రహానుగ్రహకారుండును నైన నిన్నుఁ దలంచి నమస్కరించెద నవధరింపుము.
నీవు భక్తులకు కొంగుబంగారానివి. దర్మార్థ సంబంధమైన వ్యామోహాన్ని తొలగించే వాడివి. ఆత్మారాముడివి. శాంతమూర్తివి. మోక్షప్రదాతవు. కాలస్వరూపుడివి, జగన్నియంతవు. ఆద్యంతాలు లేనివాడవు. సర్వేశ్వరుడవు. సర్వసముడవు. నిగ్రహానుగ్రహ సమర్థుడవు. నీ ప్రభావాన్ని భావించి చేసే నా నమస్కారాలు స్వీకరించు.
Ādiśca nidhanaṃ ca - ādinidhanē. ādi nidhanē yasya na vidyētē saḥ anādi nidhanaḥ. The one existence that has neither birth nor death.
Śrīmad Bhāgavatam - Canto 1, Chapter 8
Manye tvaṃ kālam īśānam anādi-nidhanaṃ vibhum,
Samaṃ carantaṃ sarvatra bhūtānāṃ yan mithaḥ kaliḥ. (28)
(Kuntīdevī praising Lord Kṛṣṇa) My Lord, I consider Your Lordship to be eternal time, the supreme controller, without beginning and end, the all-pervasive one. In showering Your mercy, You consider everyone to be equal. The dissensions between living beings are due to social intercourse.
स्वयम्भूश्शम्भुरादित्यः पुष्कराक्षो महास्वनः । |
अनादिनिधनो धाता विधाता धातुरुत्तमः ॥ 5 ॥ |
స్వయమ్భూశ్శమ్భురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః । |
అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమః ॥ 5 ॥ |
Svayambhūśśambhurādityaḥ puṣkarākṣo mahāsvanaḥ । |
Anādinidhano dhātā vidhātā dhāturuttamaḥ ॥ 5 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి