27 డిసెం, 2012

54. స్తవిరోధ్రువః, स्तविरोध्रुवः, Stavirodhruvaḥ

ఓం స్థవిరాయ ధ్రువాయ నమః | ॐ स्थविराय ध्रुवाय नमः | OM Sthavirāya dhruvāya namaḥ


స్థిరుడైన సనాతనుడు.

స్థవిరః సనాతనుడు. ప్ర విష్ణురస్తు తవసస్తవీయాన్త్వేషం హ్యస్య స్థవిరస్య నామ (ఋగ్వేదము 7.100.03) 'సనాతనమైన ఈతని నామము ఒక్కటియే ప్రసిద్ధమైనది' అనునది ప్రమాణము. లేదా 'స్థవిర' పదము ముదుసలితనమును, ముదుసలి వానిని తెలియజేయునందున విష్ణువు అనాది పురుషుడు కావున వృద్ధుడే అని తెలుస్తున్నది. స్థిరుడు కావున ధ్రువుడు. 'స్థవిరుడగు ధ్రువుడు' అని ఈ రెండును కలిసి ఒకే నామము. మొదటిది విశేషణము కాగా రెండవది విశేష్యము.



The ancient one who is eternal.

Sthavira The ancient One. Pra Viṣṇurastu tavasastavīyāntveṣaṃ hyasya sthavirasya nāma (R̥gveda 7.100.03) 'for celebrated is the only name of this ancient One' is the basis. Or 'Sthavira' also implies aging or aged one. Thus Viṣṇu is the ancient one who is immeasurably aged. Dhruvaḥ eternal or firm is the qualifier. It is taken as a single phrase, the name along with its qualification.

अप्रमेयो हृषीकेशः पद्मनाभोऽमरप्रभुः ।
विश्वकर्मा मनुस्त्वष्टा स्थविष्ठस्थ्सविरोध्रुवः ॥ 6 ॥

అప్రమేయో హృషీకేశః పద్మనాభోఽమరప్రభుః ।
విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠస్థ్సవిరోధ్రువః ॥ 6 ॥

Aprameyo hr̥ṣīkeśaḥ padmanābho’maraprabhuḥ ।
Viśvakarmā manustvaṣṭā sthaviṣṭhasthsavirodhruvaḥ ॥ 6 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి