28 డిసెం, 2012

55. అగ్రాహ్యః, अग्राह्यः, Agrāhyaḥ

ఓం అగ్రాహ్యాయ నమః | ॐ अग्राह्याय नमः | OM Agrāhyāya namaḥ


కర్మేంద్రియైః న గృహ్యతే (గ్రహీతుం న శక్యతే) ఇతి వాక్కు మొదలైన కర్మేంద్రియములచే గ్రహింపబడడు లేదా గ్రహించ శక్యుడు కాడు. యతో వాచో నివర్తనే అప్రాప్య మనసా సహా (తై. 2-2) 'ఎవనిని చేర జాలక వాక్కు మొదలగు కర్మేంద్రియములు మనస్సుతో కూడ ఎవని నుండి వెనుకకు మరలు చున్నవో లేదా నిలిచిపోవుచున్నవో' అను శ్రుతి ఇట ప్రమాణము. ఇచ్చట మనస్సు అనుటతో మనస్సు అవలంబనముగా ప్రవర్తిల్లు జ్ఞానేంద్రియములన్నియు గ్రహించదగును. 'వాచః' అనుటతో యోగ్యములగు కర్మేంద్రియములన్నియు గ్రహించబడును. ఇట్లు పరమాత్ముడు ఇంద్రియములకును మనస్సునకును అగోచరుడు అని తెలుస్తున్నది.

:: కేనోపనిషత్ - ప్రథమ ఖండం ::
మం. శ్లో. ॥న తత్ర చక్షుర్గచ్ఛతి న వాగ్గచ్ఛతి నో మనః ।
న విద్మో న విజానీమో యథైతదనుశిష్యాత్ ॥ 3 ॥
అన్యదేవ తద్విదితాదథో అవిదితాదధి ।
ఇతిశుశ్రుమ పూర్వేషాం యే నస్తద్‌వ్యాచచక్షిరే ॥ 4 ॥

పరబ్రహ్మమును నేత్రములతో చూచుటకు వీలుకాదు; వాక్కుతో చెప్పుటకు వీలుకాదు. మనసుతో చింతించుటకు వీలుకాదు; అట్టి ఆత్మను బోధించుట ఎట్లు? మాకు తెలియదు. అది తెలియువాటికి, తెలియబడనివాటికి అతీతముగా నున్నది. మా గురుదేవులు ఈ రీతిగ చెప్పుచుండుట వినియుంటిమి.



Karmeṃdriyaiḥ na gr̥hyate (Grahītuṃ na śakyate) One who cannot be grasped by the organs of knowledge or conceived by the mind. To this effect there is the following śruti Yato vāco nivartane aprāpya manasā sahā (tai. 2-2) That without grasping which speech along with the mind turns back.

Kenopaniṣat - Chapter 1
Na tatra cakṣurgacchati na vāggacchati no manaḥ,
Na vidmo na vijānīmo yathaitadanuśiṣyāt.
(3)
Anyadeva tadviditādatho aviditādadhi,
Itiśuśruma pūrveṣāṃ ye nastadvyācacakṣire.
(4)

The eye does not go there, nor speech, nor mind. We do not know hence we are not aware of any process of instructing about it. 'That is surely different from the known; and again, It is above the unknown' such was the utterance we heard of the ancient (teachers) who explained It to us.

अग्राह्यश्शाश्वतः कृष्णो लोहिताक्षः प्रतर्दनः ।
प्रभूतः स्त्रिककुब्धाम पवित्रं मङ्गलं परम् ॥ 7 ॥

అగ్రాహ్యశ్శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః ।
ప్రభూతః స్త్రికకుబ్ధామ పవిత్రం మఙ్గళం పరమ్ ॥ 7 ॥

Agrāhyaśśāśvataḥ kr̥ṣṇo lohitākṣaḥ pratardanaḥ ।
Prabhūtaḥ strikakubdhāma pavitraṃ maṅgaḷaṃ param ॥ 7 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి