20 డిసెం, 2012

47. హృషీకేశః, हृषीकेशः, Hr̥ṣīkeśaḥ

ఓం హృషీకేశాయ నమః | ॐ हृषीकेशाय नमः | OM Hr̥ṣīkeśāya namaḥ


హృషీకాణాం ఈశః ఇంద్రియములకు ఈశుడు. శరీరములందు క్షేత్రజ్ఞ (జీవ) రూపమున నుండి ఇంద్రియములను తమ తమ విషయములయందు ప్రవర్తిల్ల జేయువాడు. లేదా ఎవని ఇంద్రియములు అందరి జీవులకువలె తమ తమ విషయములందు ప్రవర్తిల్లక తన వశము నందుండునో అట్టి పరమాత్ముడు హృషీకేశుడు. లేదా సూర్య చంద్రులును కేశములుగా (కిరణములు) గల విష్ణువు హృషీకేశుడని చెప్పబడును.

సూర్య రశ్మిర్హరికేశాః పురస్తాత్ సూర్యుని కిరణము హరికి సంబంధించు కేశమే అను శ్రుతి వచనము ఇందులకు ప్రమాణము.

:: శ్రీమద్భాగవతము - 4వ స్కంధము - 24వ అధ్యాయము ::
నమో నమోऽనిరుద్ధాయ హృషీకేశేన్ద్రియాత్మనే
నమః పరమహంసాయ పూర్ణాయ నిభృతాత్మనే ॥ 36 ॥


అనిరుద్ధుడూ, ఇంద్రియములు వశమునందున్నట్టి హృషీకేశునకు పరి పరి విధముల వందనములు. స్థిరాత్ముడవూ, పరమహంసవూ, పూర్ణుడవు అయిన నీకు నమస్కారము.

:: మహాభారతము - శాంతిపర్వము - మోక్షధర్మపర్వము ::
నామ్నాం నిరుక్తం వక్ష్యామి శ్రృణుష్వైకాగ్రమానసః ।
సూర్య చంద్రమసౌ శశ్వక్తేశైర్మె అంశుసంజ్ఞితైః ।
బోధయంస్తాపయంశ్చైవ జగదుత్తిష్ఠతే పృథక్ ॥ 66 ॥


బోధనాత్తాపనాచ్చైవ జగతో హర్షణం భవేత్ ।
అగ్నీషోమకృతైరేభిః కర్మభిః పాణ్డునందన ।
హృషీకేశోఽహమీషానో వరదో లోకభావనః ॥ 67 ॥


పరమాత్ముడు కేశములను సంజ్ఞకలవియు తనకు సహజములును తనకు నేత్రములునగు కిరణములతో లోకమును మేలుకొలుపుచును, నిదురింపజేయుచును తన వేరు వేరు రూపములతో లోకమును తన స్థితియందు నిలుపుచుండును. ఇట్లు ఆతడుచేయు బోధన స్వాపనములచే (మేలు కొలుపుట, నిదురింపజేయుటలచే) లోకమునకు హర్షము కలుగును. అదియే భగవదంశములగు అగ్నీ షోములు జరుపు కార్యములు. వీని చేతనే పాండునందనా (ధర్మరాజా!) మహేశానుడును (సృష్టిస్థితిలయాది సర్వ కార్యకరణ సమర్థుడును) పై వ్యాపరములచే హృషీకేష నామము కలవాడును అగు విష్ణుడు వరదుడుగాను, లోకభావనుడుగాను నున్నాడు.



The master of the senses or He under whose control the senses subsist. Another meaning is He whose Keśa (hair) consisting of the rays of the Sun and the Moon gives Harṣa (joy) to the world.

The Śruti says Sūrya raśmirharikeśāḥ purastāt rays of the Sun are Harīkeśaḥ (the hair of Hari).

Śrīmad Bhāgavata - Canto 4 - Chapter 24
Namo namo'niruddhāya Hṛṣīkeśendriyātmane,
Namaḥ paramahaḿsāya pūrṇāya nibhṛtātmane.
(36)

Obeisances again and again to the One known as Aniruddha - who is the master of the senses and the mind. Obeisances unto the supreme perfect and complete One who is situated apart from this material creation.

Mahābhārata - Śāntiparva - Mokṣadharmaparva
Nāmnāṃ niruktaṃ vakṣyāmi śrr̥ṇuṣvaikāgramānasaḥ,
Sūrya caṃdramasau śaśvakteśairme aṃśusaṃjñitaiḥ,
Bodhayaṃstāpayaṃścaiva jagaduttiṣṭhate pr̥thak.
(66)

Bodhanāttāpanāccaiva jagato harṣaṇaṃ bhavet,
Agnīṣomakr̥tairebhiḥ karmabhiḥ pāṇḍunaṃdana,
Hr̥ṣīkeśo’hamīṣāno varado lokabhāvanaḥ.
(67)

It is said that Sūrya and (Sun) and Chandrama (Moon) are the eyes of Nārāyana. The rays of Sūrya constitute my eyes. Each of them, viz., the Sun and the Moon, invigorate and warm the universe respectively. And because of the Sun and the Moon thus warming and invigorating the universe, they have come to be regarded as the Harsha (joy) of the universe. It is in consequence of these acts of Agni and Shoma that uphold the universe that I have come to be called by the name of Hr̥ṣīkeśa, O son of Pāndu.

अप्रमेयो हृषीकेशः पद्मनाभोऽमरप्रभुः ।
विश्वकर्मा मनुस्त्वष्टा स्थविष्ठस्थ्सविरोध्रुवः ॥ 6 ॥

అప్రమేయో హృషీకేశః పద్మనాభోఽమరప్రభుః ।
విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠస్థ్సవిరోధ్రువః ॥ 6 ॥

Aprameyo hr̥ṣīkeśaḥ padmanābho’maraprabhuḥ ।
Viśvakarmā manustvaṣṭā sthaviṣṭhasthsavirodhruvaḥ ॥ 6 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి