ఓం కృష్ణాయ నమః | ॐ कृष्णाय नमः | OM Kr̥ṣṇāya namaḥ
సర్వం కరోతీతి కృష్ణః అన్నిటిని చేయువాడు. దైత్యాన్ కర్షతీతి వా దైత్యులను నలిపివేయువాడు. కృష్ణవర్ణ త్వాద్వా కృష్ణవర్ణుఁడు గనుక కృష్ణుడు.
:: మహాభారతం - ఉద్యోగ పర్వము, సనత్సుజాతము, 70 ::
కృషిర్భూ వాచకః శబ్దో ణశ్చ నిర్వృతి వాచకః ।
కృష్ణస్తద్భావయోగాచ్చ కృష్ణో భవతి శాశ్వతః ॥ 5 ॥
కృషిః అనునది 'భూ' అను అర్థమును తెలుపు శబ్దము. భూ = సత్తా కాలత్రయమునందును చెడని ఉనికి. ణః అను శబ్దము నిర్వృతిని అనగా ఆనందమును తెలుపును. విష్ణువు/కృష్ణుడు తనయందు ఈ రెండిటి (సత్తాఽఽనందముల) ఉనికికి కూడిక యగుటచే శాశ్వతుడగు ఆ పరమాత్మ 'కృష్ణః' అని భారతము చెబుతున్నది.
సచ్చిదానంద (సత్తా + జ్ఞానానంద) స్వరూపుడు. ఇచ్చట సత్తాఽఽనందములతో పాటు భగవల్లక్ష్ణముగా జ్ఞాననమును కూడా గ్రహించగా 'కృష్ణ' శబ్దము పరమాత్ముని సచ్చిదానందరూపత్వమును తెలుపుచున్నది. లేదా కృష్ణవర్ణరూపము కలవాడగుటచే 'కృష్ణః'.
:: మహాభారతం - శాంతి పర్వము, మోక్షధర్మ పర్వము, 342 ::
కృషామి మేదినీం పార్థ భూత్వా కార్‌ష్ణాయసో హలః ।
కృష్ణో వర్ణశ్చ మే యస్మాత్ తస్మాత్ కృష్ణోఽహ మర్జునా ॥ 79 ॥
'అర్జునా! మేను నల్లని ఇనుముతోనైన నాగటి కర్రుగా నై భూమిని దున్నెదను; నా దేహ వర్ణమును నల్లనిది. అందువల్లనే నేను కృష్ణుడను' అని శ్రీ మహాభారతమున కలదు. కృష్ణాఽయస్సు నల్లని ఇనుము.
:: పోతన భాగవతము - దశమ స్కందము, శ్రీకృష్ణావతార ఘట్టము ::
క. | సుతుఁ గనె దేవకి నడురే, యతి శుభగతిఁ దారలును గ్రహంబులు నుండున |
దితిసుత నిరాకరిష్ణున్, శ్రితవదనాలంకరిష్ణు జిష్ణున్ విష్ణున్. |
అటువంటి సమయంలో దేవకీదేవి అర్ధరాత్రివేళ విష్ణువును ప్రసవించింది. అతడు దైత్యులను శిక్షించేవాడు. అతణ్ణి ఆశ్రయించే వారి ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి. ఆ సమయంలో తారలు గ్రహాలు అత్యంత శుభమైన స్థానాల్లో ఉన్నాయి.
సీ. | జలధరదేహు నాజానుచతుర్భాహు సరసీరుహాక్షు విశాలవక్షుఁ |
జారుగదాశంఖచక్రపద్మవిలాసుఁ గంఠకౌస్తుభమణికాంతి భాసుఁ | |
గమనీయ కటిసూత్ర కంకణ కేయూరు శ్రీవత్సలాంఛనాంచిత విహారు | |
నురుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైదూర్యమణిగణ వరకిరీటు | |
తే. | బాలుఁ బూర్ణేందురుచిజాలు భక్తలోక, పాలు సుగణాలవాలుఁ గృపావిశాలుఁ |
జూచి తిలకించి పులకించి చోద్య మంది, యుబ్బి చెలరేఁగి వసుదేవుఁ డుత్సహించె. |
అప్పుడు వసుదేవుడు ఆ బాలుని తేరిపారచూచాడు. ఆ బాలుడు ఆయనకు దివ్యరూపంతో దర్శనమిచ్చాడు. ఆ పిల్లవాడు మేఘవర్ణ శరీరం కలిగి ఉన్నాడు. అతడి పొడవైన నాలుగు బాహువులలో గద, శంఖం, చక్రం, పద్మం వెలుగొందుతున్నాయి. తామరపువ్వు రేకులవంటి కన్నులు, విశాలమైన వక్షస్థలం కలవాని కంఠంలో కౌస్తుభరత్నం కాంతులు వెలుగొందుతున్నాయి. అందమైన మొలత్రాడు, కంకణాలు, బాహుపురులు, ధరించి ఉన్నాడు. శ్రీవత్సమనే పుట్టుమచ్చ వక్షఃస్థలం పైన మెరుస్తున్నది. చెవులకున్న కుండలాల కాంతితో నుదుటి ముంగురులు వెలుగుతున్నాయి. మణులు, వైదూర్యాలు పొదిగిన కిరీటం ధరించాడు.
Sarvaṃ karotīti Kr̥ṣṇaḥ The One who does everything. Daityān karṣatīti vā He who overpowers Daityās (evil doers). Kr̥ṣṇavarṇa tvādvā He is with dark complexion.
Mahābhārata - Udyoga parva, Sanatsujāta parva, 70
Kr̥ṣirbhū vācakaḥ śabdo ṇaśca nirvr̥ti vācakaḥ,
Kr̥ṣṇastadbhāvayogācca kr̥ṣṇo bhavati śāśvataḥ. (5)
He is called Kr̥ṣṇa because He unites in Himself what are implied by the two words 'Kr̥ṣ' which signifies existence and 'ṇa' which denotes 'eternal peace'.
Mahābhārata - Śānti parva, Mokṣadharma parva, 342
Kr̥ṣāmi medinīṃ pārtha bhūtvā kārˈṣṇāyaso halaḥ,
Kr̥ṣṇo varṇaśca me yasmāt tasmāt kr̥ṣṇo’ha marjunā. (5)
O Arjunā! I till the Earth, assuming the form of a large plowshare of black iron. And because my complexion is black, therefore am I called by the name of Kr̥ṣṇa.
Śrīmad Bhāgavata - Canto 10, Chapter 3
Tam adbhutaṃ bālakam ambujekṣaṇaṃ caturbhujaṃ śańkhagadādyudāyudham,
Śrīvatsalakṣmaṃ galaśobhikaustubhaṃ pītāmbaraṃ sāndrapayodasaubhagam. (9)
Mahārhavaidūryakirīṭakuṇḍalatviṣā pariṣvaktasahasrakuntalam,
Uddāmakāñcyańgadakańkaṇādibhir Virocamānaṃ vasudeva aikṣata. (10).
Vasudeva then saw the newborn child. The child then appeared to him in a wonderful form with lotuslike eyes and who bore in His four hands the four weapons Śańkha (Conch), Cakra (Disc), Gadā (Mace) and Padma (Lotus). On His chest was the mark of Śrīvatsa and on His neck the brilliant Kaustubha gem. Dressed in yellow, His body blackish like a dense cloud, His scattered hair fully grown, and His helmet and earrings sparkling uncommonly with the valuable gem Vaidūrya. He was decorated with a brilliant belt, armlets, bangles and other ornaments, appeared very wonderful.
अग्राह्यश्शाश्वतः कृष्णो लोहिताक्षः प्रतर्दनः । |
प्रभूतः स्त्रिककुब्धाम पवित्रं मङ्गलं परम् ॥ 7 ॥ |
అగ్రాహ్యశ్శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః । |
ప్రభూతః స్త్రికకుబ్ధామ పవిత్రం మఙ్గళం పరమ్ ॥ 7 ॥ |
Agrāhyaśśāśvataḥ kr̥ṣṇo lohitākṣaḥ pratardanaḥ । |
Prabhūtaḥ strikakubdhāma pavitraṃ maṅgaḷaṃ param ॥ 7 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి