19 డిసెం, 2012

46. అప్రమేయః, अप्रमेयः, Aprameyaḥ

ఓం అప్రమేయాయ నమః | ॐ अप्रमेयाय नमः | OM Aprameyāya namaḥ


ప్రమాతుం అర్హః - ప్రమేయః; ప్రమేయో న భవతి ఇతి అప్రమేయః. తన తత్త్వము వాస్తవరూపమున ఎరుగ బడుటకు యోగ్యము అగునది ప్రమేయము; అట్టిది కాకుండునది అప్రమేయము. ప్రమా అనగా వస్తు తత్త్వ యథార్థ జ్ఞానము - ఏది ఏదియో దానిని దానినిగా ఎరుగుట. అట్టి జ్ఞానమును పొందుటకు సాధనములు ప్రమాణములు. అట్టి ప్రమాణములచే యథార్థరూపము ఎరుగ శక్యమగునది ప్రమేయము; కానిది అప్రమేయము.

:: భగవద్గీత - విశ్వరూప సందర్శన యోగము ::
అర్జున ఉవాచ:
కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమన్తమ్ ।
పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమన్తా ద్దీప్తానలార్కద్యుతి మప్రమేయమ్ ॥ 17 ॥


అర్జునుడు పలికెను: మిమ్ము ఎల్లెడలను కిరీటముగలవారినిగను, గదను ధరించినవారినిగను, చక్రమును బూనినవారినిగను, కాంతిపుంజముగను, అంతటను ప్రకాశించువారినిగను, జ్వలించు అగ్ని, సూర్యులవంటి కాంతిగలవారినిగను, అపరిచ్ఛిన్నులుగను (పరిమితిలేని వారినిగను) చూచుచున్నాను.



Pramātuṃ arhaḥ - prameyaḥ; Prameyo na bhavati iti aprameyaḥ. One who is not measurable or understandable by any of the accepted means of knowledge like sense perception, inference etc. Even the scriptures cannot reveal Him directly. What the scriptures do is only to eliminate the appearance of the universe which stands in the way of intuiting Him. Or not being an object but only the ultimate witness or knower, He is outside the purview of all the means of knowledge, which can reveal only the things of the objective world. He is immeasurable by any means or knowledge.

Bhagavad Gīta - Chapter 11
Arjuna uvāca:
Kirīṭinaṃ gadinaṃ cakriṇaṃ ca tejorāśiṃ sarvato dīptimantam,
Paśyāmi tvāṃ durnirīkṣyaṃ samantā ddīptānalārkadyuti maprameyam.
(17)

Arjuna said: I see You as wearing a diadem, wielding a mace and holding a disc; a mass of brilliance glowing all around; difficult to look at from all sides, possessed of the radiance of the blazing fire and sun, and immeasurable.

अप्रमेयो हृषीकेशः पद्मनाभोऽमरप्रभुः ।
विश्वकर्मा मनुस्त्वष्टा स्थविष्ठस्थ्सविरोध्रुवः ॥ 6 ॥

అప్రమేయో హృషీకేశః పద్మనాభోఽమరప్రభుః ।
విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠస్థ్సవిరోధ్రువః ॥ 6 ॥

Aprameyo hr̥ṣīkeśaḥ padmanābho’maraprabhuḥ ।
Viśvakarmā manustvaṣṭā sthaviṣṭhasthsavirodhruvaḥ ॥ 6 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి