21 డిసెం, 2012

48. పద్మనాభః, पद्मनाभः, Padmanābhaḥ

ఓం పద్మనాభాయ నమః | ॐ पद्मनाभाय नमः | OM Padmanābhāya namaḥ


(సర్వజగత్కారణం) పద్మం నాభౌ యస్య సః సర్వజగత్కారణమగు పద్మము నాభియందు ఎవనికి కలదో అట్టివాడు.

:: పోతన భాగవతము - తృతీయ స్కందము, విదురమైత్రేయ సంవాదము ::
క.తన జఠరము లోపలఁ దాఁ, చిన లోక నికాయముల సృజించుటకును సా
ధనమగు సూక్ష్మార్థము మన, సున గని కాలానుగత రజోగుణ మంతన్‌.
సీ.పుట్టించెఁ దద్గుణంబునఁ బరమేశ్వరు నాభిదేశమునందు నలిననాళ
ముదయించె మఱి యప్పయోరుహ ముకుళంబు గర్మబోధితమైన కాలమందుఁ
దన తేజమునఁ బ్రవృద్దంబైన జలముచే జలజాప్తు గతిఁ బ్రకాశంబు నొందఁ
జేసి లోకాశ్రయస్థితి సర్వగుణ విభాసితగతి నొప్పు రాజీవమందు
తే.నిజకళా కలితాంశంబు నిలిపె, దానివలన నామ్నాయ మయుఁడును వరగుణుండు
నాత్మయోనియు నైన తోయజభవుండు, సరవిఁ జతురాననుండు నా జనన మయ్యె.

తన కడుపులో దాచుకొని వున్న సకల లోకాలను తిరిగి సృష్టించడానికి ఉపకరణమైన సూక్ష్మపదార్థాన్ని మనస్సులో భావించి, కాలానుగుణంగా రజోగుణాన్ని పుట్టించాడు.

ఆ విధంగా పుట్టించిన రజోగుణంవల్ల నారాయణుని నాభిలో నుండి మొగ్గతో కూడిన ఒక తామరతూడు జన్మించింది. సృష్టికార్యప్రభావితమైన కాలాన్ని అనుసరించి భగవంతుడు తన తేజస్సు చేత నీటినడుమ వృద్ధిపొందిన ఆ తామరమొగ్గను సూర్యునిలాగా వికసింపజేశాడు. లోకాలకు ఆశ్రయం ఇచ్చే స్థితినీ, సకలగుణాలతో ప్రకాశించే ప్రకృతినీ కలిగిఉన్న ఆ కమలంలో పరాత్పరుడు తన కళతోకూడిన అంశాన్ని ప్రసరింపజేశాడు. అప్పుడు ఆ పద్మంలో నుంచి సంపన్నుడూ, స్వయంభువుడూ, చతుర్ముఖుడూ అయిన బ్రహ్మదేవుడు ఉద్భవించాడు.



Padmaṃ nābhau yasya saḥ. He in whose nābhi (navel) the Padma (lotus), the source of the universe, stands.

Śrīmad Bhāgavata - Canto 3, Chapter 8
Tasyārthasūkṣmābhiniviṣṭadṛṣṭer antargato'rtho rajasā tanīyān,
Guṇena kālānugatena viddhaḥ sūṣyaṃstadābhidyata nābhideśāt.
(13)
Sa padmakośaḥ sahasodatiṣṭhat kālena karmapratibodhanena,
Svarociṣā tat salilaṃ viśālaṃ vidyotayann arka ivātmayoniḥ.
(14)

The subtle matter of creation, on which the Lord's attention was fixed, was agitated by Rajoguṇa - the material mode of passion and thus the subtle form of creation pierced through His Nābhi or abdomen. (13)

Piercing through, this sum total form of the fruitive activity of the living entities took the shape of the bud of a lotus flower generated from the personality of Viṣṇu, and by His supreme will, it illuminated everything, like the Sun and dried up the vast waters of devastation. (14)

अप्रमेयो हृषीकेशः पद्मनाभोऽमरप्रभुः ।
विश्वकर्मा मनुस्त्वष्टा स्थविष्ठस्थ्सविरोध्रुवः ॥ 6 ॥

అప్రమేయో హృషీకేశః పద్మనాభోఽమరప్రభుః ।
విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠస్థ్సవిరోధ్రువః ॥ 6 ॥

Aprameyo hr̥ṣīkeśaḥ padmanābho’maraprabhuḥ ।
Viśvakarmā manustvaṣṭā sthaviṣṭhasthsavirodhruvaḥ ॥ 6 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి