24 డిసెం, 2012

51. మనుః, मनुः, Manuḥ

ఓం మనవే నమః | ॐ मनवे नमः | OM Manave namaḥ


మనస్సు చేయు సంకల్పన వికల్పనాత్మక వ్యాపారము మననము. అట్టి మననము చేయు మూల తత్త్వముగా విష్ణువు 'మనుః' అనబడును. నాఽన్యోఽతోఽస్తి మన్తా (బృహదారణ్యకోపనిషత్‌, తృతీయాధ్యాయం, సప్తమ బ్రాహ్మణమ్‌) ఇతనికంటే ఇతరుడు మననము చేయువాడు ఎవరును లేడు అనునది ప్రమాణము. లేదా మంత్రమునకు 'మనుః' అనునది వ్యవహారము; అదియూ విష్ణురూపమే. లేదా చతుర్దశమనువులు అనబడు ప్రజాపతులలో ఏయొకడయినను మనుః - అతడును విష్ణుని రూపమే.

:: భగవద్గీత - విభూతి యోగము ::
మహర్షయస్సప్త పూర్వే చత్వారో మనవస్తథా
మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః ॥ 6 ॥


లోకమునందీ ప్రజలు యెవరియొక్క సంతతియైయున్నారో అట్టి పూర్వీకులైన సప్తమహర్షులును, సనకాదులైన నలుగురు దేవర్షులున్ను, మనువులు పదునలుగురున్ను, నా యొక్క భావము (దైవ భావము) గలవారై నా యొక్క మనస్సంకల్ప్ము వలననే పుట్టిరి.

:: భగవద్గీత - రాజవిద్యా రాజగుహ్య యోగము ::
అహం క్రతురహం యజ్ఞః స్వధాహమహమౌషధమ్ ।
మన్త్రోఽహమేవాజ్యమహమగ్నిరహం హుతమ్ ॥ 16 ॥


క్రతువును నేనే, యజ్ఞము నేనే, పితృదేవతలకిచ్చు అన్నము నేనే, ఔషధము నేనే, మంత్రము నేనే, అగ్ని నేనే, హోమకర్మమును నేనే అయియున్నాను.



He who thinks. Nā’nyo’to’sti mantā vide the Śruti Br̥hadāraṇyakopaniṣat 3.7.23, there is no thinker apart from Him. Or He is called Manu because He manifests in the form of Mantra. Or of Manu, the Prajāpati or the Patriarch.

Bhagavad Gīta - Chapter 10
Maharṣayassapta pūrve catvāro manavastathā,
Madbhāvā mānasā jātā yeṣāṃ loka imāḥ prajāḥ. (6)

The seven great sages as also the fourteen Manus of ancient days, of whom are these creatures in the world, had their thoughts fixed on Me, and they were born from My mind.

Bhagavad Gīta - Chapter 8
Ahaṃ kraturahaṃ yajñaḥ svadhāhamahamauṣadham,
mantro’hamevājyamahamagnirahaṃ hutam.
(16)

I am the Kratu (Vedic sacrifice), I am the Yajña (sacrifice as prescribed by Smr̥tis), I am the Svadhā (the food that is offered to the manes), I am the Aushadha (food that is eaten by all creatures or can also mean medicine for curing diseases), I am the Mantrā, I Myself am the Ājya (oblation), I am the Agniḥ (the fire into which oblation is poured) and I am the Hutam (the act of offering).

अप्रमेयो हृषीकेशः पद्मनाभोऽमरप्रभुः ।
विश्वकर्मा मनुस्त्वष्टा स्थविष्ठस्थ्सविरोध्रुवः ॥ 6 ॥

అప్రమేయో హృషీకేశః పద్మనాభోఽమరప్రభుః ।
విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠస్థ్సవిరోధ్రువః ॥ 6 ॥

Aprameyo hr̥ṣīkeśaḥ padmanābho’maraprabhuḥ ।
Viśvakarmā manustvaṣṭā sthaviṣṭhasthsavirodhruvaḥ ॥ 6 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి