24 డిసెం, 2013

416. ఋతుః, ऋतुः, R̥tuḥ

ఓం ఋతవే నమః | ॐ ऋतवे नमः | OM R̥tave namaḥ


కాలాత్మనర్తుశబ్దేన లక్ష్యత ఇత్యృతుర్హరిః

- గతి - ప్రాపణయోః అనగా నడుచుట - చేరుట - చేర్చుట అను ధాతువునుండి ఋచ్ఛతి అనగా ముందునకు సాగును అను అర్థములో 'ఋతుః' అను శబ్దము ఏర్పడును. రెండు చాంద్రమాన మాసములతో ఏర్పడు పరిమిత కాలమును వాడుకలో ఋతుః అనుచున్నాము. ఆ పదములకు లక్షణావృత్తిచే కాలము అను అర్థము చెప్పుకొన్నచో కాల రూపుడుగా పరమాత్ముడు ఋతు శబ్దమునకు అర్థముగా అగుచున్నాడు.



Kālātmanartuśabdena lakṣyata ityr̥turhariḥ / कालात्मनर्तुशब्देन लक्ष्यत इत्यृतुर्हरिः

From the root - gati - prāpaṇayoḥ meaning progress - arrive - deliver R̥cchati i.e., with a meaning of moving forward, the word 'R̥tuḥ' is formed. The confined period between two lunar months is termed as R̥tuḥ or season. Hence in His aspect of Time or One who is of the nature of Kāla (time), He is signified by the word R̥tu (season); so R̥tuḥ.

ऋतुस्सुदर्शनः कालः परमेष्ठी परिग्रहः ।
उग्रस्संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः ॥ ४५ ॥

ఋతుస్సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః ।
ఉగ్రస్సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః ॥ ౪౫ ॥

R̥tussudarśanaḥ kālaḥ parameṣṭhī parigrahaḥ ।
Ugrassaṃvatsaro dakṣo viśrāmo viśvadakṣiṇaḥ ॥ 45 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి