11 జన, 2015

799. సర్వవిజ్జయీ, सर्वविज्जयी, Sarvavijjayī

ఓం సర్వవిజ్జయినే నమః | ॐ सर्वविज्जयिने नमः | OM Sarvavijjayine namaḥ


సర్వార్థ విషయం జ్ఞాన మసాస్తీతి స సర్వవిత్ ।
రాగాదీనాన్తరాన్ బాహ్యాన్ హిరణ్యాక్షాదికానరీన్ ॥
దుర్జయాన్ జేతు మప్యస్య శీలమస్తీత్యతో జయీ ।
జయీ చ సర్వవిచ్చాసా వుచ్యతే సర్వవిజ్జయీ ॥
జిదృక్షీత్యాది పాణిని వచనాదిని రుష్యతే ॥

ఈతడు సర్వ విదుడును, జయియును. సర్వమును, తెలియ వలసినదంతయును, ప్రతియొకదానిని ఎరుగువాడు. సర్వవిషయకమగు జ్ఞానమును ఈతనికి గలదు. లోనుండెడి అభ్యంతరములు అగు రాగాది ద్వేషము, కామ క్రోధాదికము మొదలగు శత్రువులను, బాహ్యులగు హిరణ్యాక్షాదులను - ఇట్లు రెండు విధములగు శత్రువులను జయించుట తన శీలముగా కలవాడు గావున 'జయీ'. ఇట్లు పరమాత్ముడు సర్వ విషయక జ్ఞానమును సమగ్రముగా కలిగిన వాడును, ఎన్నడును ఓటమిని ఎరుగని జయశీలుడును అను అర్థము ఈ నామమునకు ఏర్పడుచున్నది. ఈ రెండు శబ్దములును ఒకే నామముగా గ్రహింపదగినవి.



सर्वार्थ विषयं ज्ञान मसास्तीति स सर्ववित् ।
रागादीनान्तरान् बाह्यान् हिरण्याक्षादिकानरीन् ॥
दुर्जयान् जेतु मप्यस्य शीलमस्तीत्यतो जयी ।
जयी च सर्वविच्चासा वुच्यते सर्वविज्जयी ॥
जिदृक्षीत्यादि पाणिनि वचनादिनि रुष्यते ॥

Sarvārtha viṣayaṃ jñāna masāstīti sa sarvavit,
Rāgādīnāntarān bāhyān hiraṇyākṣādikānarīn.
Durjayān jetu mapyasya śīlamastītyato jayī,
Jayī ca sarvaviccāsā vucyate sarvavijjayī.
Jidr̥kṣītyādi pāṇini vacanādini ruṣyate.

In one Name, He being both Sarvavit and Jayī, He is Sarvavijjayī. Everything, what all can be known about, each and every aspect is known to Him. He has knowledge of everything hence Sarvavit. He has conquered the internal enemies like anger, greed etc., and also external adversaries like Hiraṇyākṣā and others, He is called Jayī.

उद्भवस्सुन्दरस्सुन्दो रत्ननाभस्सुलोचनः ।
अर्को वाजसनः शृङ्गी जयन्तः सर्वविज्जयी ॥ ८५ ॥

ఉద్భవస్సున్దరస్సున్దో రత్ననాభస్సులోచనః ।
అర్కో వాజసనః శృఙ్గీ జయన్తః సర్వవిజ్జయీ ॥ 85 ॥

Udbhavassundarassundo ratnanābhassulocanaḥ,
Arko vājasanaḥ śr̥ṅgī jayantaḥ sarvavijjayī ॥ 85 ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి