ఓం కున్దాయ నమః | ॐ कुन्दाय नमः | OM Kundāya namaḥ
కున్దాభ సున్దరాఙ్గత్వాత్ స్వచ్ఛస్ఫటిక నిర్మలః ।
కున్ద ఇత్యుచ్యతే విష్ణుః సద్య పాపవిమోచన ॥
కుం పృథ్వీం కశ్యపాయాదాదితి వా కున్ద ఉచ్యతే ।
కుం పృథ్వీం ద్యతి ఖణ్డయతీతి వా కున్ద ఉచ్యతే ॥
అథవాఽత్ర కుశబ్దేన లక్ష్యన్తే పృథివీశ్వరాః ।
తాన్ భార్గవో వ్యచ్ఛిదిత్యచ్యుతః కున్ద ఉచ్యతే ॥
మొల్లపూవును పోలినవాడు; మొల్ల పుష్పము (అడవి మల్లె) వలె సుందరమగు శరీరము కలవాడు; కుంద పుష్పము వలె స్వచ్ఛుడగువాడు.
లేదా పరశురామావతారమున భూమిని కశ్యపునకు ఇచ్చినవాడు. భృగు వంశజుడగు పరశురాముడు క్షత్రియులందరను పలు పర్యాయములు చంపినందున కలిగిన పాపమునుండి విశుద్ధి నందుటకై అశ్వమేధముతో యజించెను. మహాదక్షిణాయుక్తమగు ఆ మహాయజ్ఞమునందు ఆతడు ప్రీతియుక్తుడగుచు భూమిని మరీచి ప్రజాపతి పుత్రుడైన కశ్యపునకు దక్షిణగా ఇచ్చెను అను హరి వంశ వచనము ఇట ప్రమాణము.
లేదా 'భూమి' అను అర్థమును ఇచ్చు 'కు' అను పదమునకు లక్షణావృత్తిచే భూమిపతులు అను అర్థమును చెప్పికొన వలయును. అట్టి భూమి పతులను పరశురామావతారమున ఖండిచెను కనుక కుందః. ఈ విషయమున విష్ణు ధర్మోత్తరమునందు 'ఏ భార్గవోత్తముడు అనేక పర్యాయములు భూమిని క్షత్రియ రహితనుగా చేసెనో, ఎవడు కార్తవీర్యార్జునుని వేయి భుజములు అను అరణ్యమును ఛేదించెనో అట్టి హరి నాకు శుభవృద్ధిని కలిగించువాడుగా అగును గాక' అని చెప్పబడినది.
कुन्दाभ सुन्दराङ्गत्वात् स्वच्छस्फटिक निर्मलः ।
कुन्द इत्युच्यते विष्णुः सद्य पापविमोचन ॥
कुं पृथ्वीं कश्यपायादादिति वा कुन्द उच्यते ।
कुं पृथ्वीं द्यति खण्डयतीति वा कुन्द उच्यते ॥
अथवाऽत्र कुशब्देन लक्ष्यन्ते पृथिवीश्वराः ।
तान् भार्गवो व्यच्छिदित्यच्युतः कुन्द उच्यते ॥
Kundābha sundarāṅgatvāt svacchasphaṭika nirmalaḥ,
Kunda ityucyate viṣṇuḥ sadya pāpavimocana.
Kuṃ pr̥thvīṃ kaśyapāyādāditi vā kunda ucyate,
Kuṃ pr̥thvīṃ dyati khaṇḍayatīti vā kunda ucyate.
Athavā’tra kuśabdena lakṣyante pr̥thivīśvarāḥ,
Tān bhārgavo vyacchidityacyutaḥ kunda ucyate.
He who has handsome limbs like a kunda flower (jessamine). Being spotlessly white as a crystal, He is Kundaḥ.
He gave ku i.e., earth to Kāśyapa. The Harivaṃśa says - 'Bhr̥gu's son Paraśurāma performed Aśvamedha sacrifice to absolve himself of the sin of killing the Kṣatriya kings many times. In that sacrifice, he gladly made a great gift of earth to Kāśyapa.'
He who brings the earth under subjection. Or As the Viṣṇu dharmottara purāṇahas it: 'May that chief of the Bhārgava's who rid the earth of kṣatriyas and also cut off the forest of hands of Kārtavīrya increase my prosperity.'
कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनोऽनिलः । |
अमृतांशोऽमृतवपुस्सर्वज्ञस्सर्वतोमुखः ॥ ८७ ॥ |
కుముదః కున్దరః కున్దః పర్జన్యః పావనోఽనిలః । |
అమృతాంశోఽమృతవపుస్సర్వజ్ఞస్సర్వతోముఖః ॥ 87 ॥ |
Kumudaḥ kundaraḥ kundaḥ parjanyaḥ pāvano’nilaḥ, |
Amr̥tāṃśo’mr̥tavapussarvajñassarvatomukhaḥ ॥ 87 ॥ |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి